ఈ కవితలను చదువుతుంటే కొన్ని సార్లు నాకు అనుమానమోచ్చేది నిషిగంధ గారు నిజంగా స్త్రీనేనా లేక స్త్రీలకే పెద్ద పీట వేస్తారు అన్న పేరున్న (నిజమేనా?) నేటి సమయంలో ఒక పురుషుడే ఇవన్నీ స్త్రీ కలం పేరుతొ రాస్తున్నాడా అని.
కావాలంటే మీరే చూడండి ఈ వర్ణనలు
• "వెండి కిరణం పెదవి అంచున చెదిరినట్టు".................స్నేహ మాధురి.... రెండవ పేరా, మొదటి లైను
• "కోనేట్లో స్నానమాడిన పిల్లగాలి గుడిమెట్లు ఎక్కి వచ్చి కొతూహలంగా చూస్తుంటే ఇంకా ప్రభు దర్శనం కాలేదని ఎలా చెప్పను?"...............................................నిరీక్షణ...............రెండవ పేరా మొత్తం
• నిద్రా దేవిని "ఊహా సుందరిగా" ……………………..కవిత మొత్తం
• నవ్వుతూ పలికరించే నడుమ్మీద పుట్టు మచ్చ ముఖం చాటేస్తే వాలు జడలోని ముద్ద మందారం ముభావంగా చూసింది ……………… అలిగితివా" లోని రెండవ పేరా
నాకయితే ఇందులో సరస శృంగారం పురుష దృక్పదంలో కనపడుతోంది. మొదటి ఉదాహరణే తీసుకోండి ......."చెదరి జారినా కుంకుమ రేఖలు పెదవుల పైబడి మెరుస్తు ఉంటే" అన్న సినీ కవి వర్ణన గుర్తుకు చేయదూ?
నడుమ్మీద పుట్టుమచ్చలూ, వాలు జడలూ, ముద్ద మందారాలు మగ వారిని దోచినంతగా ఆడ వారిని దోచవు కదా........ అంటూ లాజిక్కులు, లా ట్ర్రిక్కులు కూపీ లాగ సాగింది మనసు.
పైగా పిల్ల గాలి కోనేట్లో స్నానమాడి వస్తే మనసుకు కన్నెపిల్లలా కనపడి "ఇంకా దేవి దర్శనం కాలా" అని కదా చెప్పే ఆనవాయతి అని మనసు తనను తాను సమర్ధించుకో చూసింది.

కానీ............
కవితలన్నీ పరికిస్తే ఎంత స్త్రీత్వము పరిచయమయిందనీ!!!!! చూడండి అవి కూడా
• అతని జ్ఞాపకాల "మల్లెల మాల కట్టాలనే" ఆలోచనా ......."ఏకాంత వేళ"
• పొద్దుటే "పవిత్ర స్నానాల, పూజా వేళయిందనే" ఆత్రాలు,
తెల్లటి నంది వర్ధనానికి రంగులద్దమని రంగ వల్లులను అర్థనలు...."నంది వర్ధనాలు"
• పెళ్లి మండపంలో వీడ్కోలు పల్కేటప్పుడు పడే వేదన పరిచయాలు......."నానీ గాడు"
భావుకత నిండిన ఆలోచనలు, అనుభూతులను నగలుగా వర్ణనలు....."నగల పెట్టె"
• "మల్లెలా కనకాంబరాలా" అంటూ మధన పడటాలు,
"నిన్ను చూస్తూనే గడపను దాచేసేవి చీర కుచ్చుళ్ళు" చమత్కారాలు........"తొలి స్పర్శ"
"పట్టు పరికిణీ అంచులకి చుట్టుకున్న మట్టి గీతను" గమనించే చూపులు......"ఉయ్యాల"
ఇలా అంతర్లీనంగా స్త్రీత్వాన్ని చాటేవే ఎక్కువగా కనపడ్డాయి కవితలలో. మాతృత్వంలాటి బహాట స్త్రీత్వ చిహ్నాలు అయిన "బంగారు తల్లి" లాటివి ఒకటో రెండో అయినా మొత్తం కవితల నిండా స్త్రీత్వమే.
ఇక్కడ చెప్పని ఇంకో అతి ముఖ్యమయిన కారణం "అతను".......................కవితలన్నీ దాదాపుగా "అతని సహచర్యానికై" తపన చెందేవే....అందుకే నా మగ పక్షపాత బుద్దిని పక్కన పెట్టేసి ....ఇవి "స్త్రీ లిఖితమే" అని ఒప్పేసుకుంటున్నా.
ఇంత సుత్తేసానా,
సరే శృంగార రసం ఉందని అనిపించిందా మొదట చదవగానే....."ఏదీ చూడని" అని పరికించి చదవసాగాను. చూద్దును కదా అష్ట విధ శృంగార నాయికల్లో అయిదు మంది కనిపించేసారండి ఇందులో.....చూడండి
కవితల్లో చాలా మటుకు మనకు పరిచయమయ్యేది "విరహోత్కంఠిత"
"అతను" లేని వేళ నాయిక ఒంటరితనాన్ని తెలుపుతూ రాసినవే కవితలన్నీ. దీనిపై సహచర్యం అన్నడి ముచ్చటించుకున్నప్పుడు ఇంకా విపులంగా చెప్తాను. మొత్తానికి నిషిగారి ప్రథమ కథా నాయిక "విరహోత్కంఠిత" అన్నది వివాదం లేని అంశము. దీనికి ఉదాహరణలు అక్కరలేదు....అన్నీ అవే.
రెండవ నాయిక "వాసక సజ్జిక"
అతనికై, అతని రాకకై, సింగారిత అవటానికి నాయిక పడే పాట్లు చూడండి...... ఎంతగా సాక్షాత్కరించిందో ఈ నాయిక.
మల్లెలా? కనకాంబరాలా?? నిర్ణయాలు తీసుకోవటం కష్టమే సుమా .......అంటూ "తొలి స్పర్శలో"

హారాలు, గాజులు, లోలాకులు, వడ్రాణం...కలల రవ్వలద్ది .... అచ్చంగా నీ కోసమే......అంటూ,
అన్నీ ధరించి ఆకస్మిక వైభవాన్ని నీకు పరిచయం చేస్తే.......అంటూ "నగల పెట్టెలో"
మూడవ నాయిక "కలహాంతరిత"
"అలిగితివా" లోని వస్తువంతా ఇదే.
చూడండి పాపం రాయబారానికి వచ్చిన "మల్లెలూ మరువం" పూజా పీఠానికి బలి అయిపోయాయి.
"నీవు లేని క్షణాన" లో మాత్రం...... నాయిక బేలయి తనను తాను ఎలా నిందిన్చుకొంతోందో.......
"ఊహా సుందరిలో" హృదయ పారిజాత దడిలో (సంకేత స్థలమా?) వచ్చిన ఆ స్వప్న సుందరి "నీకోసమే వచ్చాను" అంటూ బాహాటంగా చెప్పటం, పెదవులు బిగించి, చిలిపిగా నవ్వుతూ, మరో అడుగు ముందుకు వేసి మరింత చేరువగా రావటం.....అంత చొరవ చూపటం .....అభిసారిక వంతేగా.
చివరికి అదే "ఊహా సుందరి"లో "నాలో మేల్కొన్న వివేకాన్ని ఉక్రోషంగా చూస్తూ అప్పటికి నన్ను విడిచి వెళ్లిపోయింది " అంటూ మనకు "ఖండిత"ను కూడా పరిచయం చేసారు. నిజమేగా .......వివేకమనే సవతికి ప్రాధాన్యత ఇచ్చే పతి ఉన్న ప్రతి సతీ ఖండితే కదా :-)
ఇలా స్త్రీ పురుష ద్రుక్పదాలలో సరస వర్ణనలు, శృంగార నాయికా పరిచయాలు ఉన్నా ఈ కవితలు శృంగార రస భరితాలని అంటే మనసుకు ఎందుకో నచ్చట్లేదు..........కారణం ప్రప్రధమంగా ఉన్న ఒంటరితనమేమో. అయినా "సహచర్యానికి" మించిన శృంగారం ఏముంటుందీ" అంటూ మనసు మూలిగింది. పైన "మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో" అంటూ ఇంటర్నెట్ రేడియోలో పాట మొదలయింది....సహచర్యానికీ -శృంగారానికీ ఉన్న అవినాభావ సంబంధం నిర్వచించటానికా అన్నట్టు. నా భార్య నిద్ర లేచినట్టుంది, నేను ఇంక వెళ్తానండి.

ఈ కవితల్లో శృంగారం ఉందొ లేదో మీరు నిర్ణయించుకోండి.......నాకు మాత్రం Jeffrey Archer రాసిన Quiver Full of Arrows కథా సంపుటిలోని "The Old Love " కథ గుర్తుకు వస్తోంది.....భమిడిపాటి గారి "మీ సంబంధం మాకు నచ్చలేదు" కథ కూడా......శృంగారమంటే "సహచర్యమే" అన్నది రుజువు చేస్తూ.
మిగితావి తరువాయి భాగంలో
మిగితావి తరువాయి భాగంలో
"If this is true in someone's life, they need to work on it. This kind of feeling will make a person very depressed and has the potential to take away few years of his/her life."
ReplyDeleteI feel this is true about Nishigandha. Should be suffering from loneliness or lack of...