Monday, 4 May 2009

1. చలం, ఈ పాపం నీదేలే!

"పదండి ముందుకు పదండి తోసుకు" అన్నా
"పొలాలనన్నీ హలాల దున్ని" అన్నా
"నేను సైతం నేను సైతం" అన్నా
నే మెచ్చింది శబ్దానందమే
అర్థావేశం గగుర్పొడిపే గతం శూన్యమే ఇప్పటి వరకు.

"కారులో షికారుకెళ్ళే........"
చిన్నది సిగ్గుపడే కవిత
అతని మార్కే అనందరూ పొరబడితే
కొంచం అర్థమయిందతని పవరు

"మహా ప్రస్థానమంతా కమ్యూనిజం కంపే"
మెచ్చుకుంటూనే చీదరించిన
బ్లాగ్మిత్రుని వ్యాఖ్య గాయపరిచింది
అనుభూతించటానికి అర్థమక్కరలేదన్న సిరివెన్నెలర్థమవుతూ

బ్లాగ్మిత్రిణి అంకిత పద్యం పరిచయం చేస్తే
జాలంలో శ్రీశ్రీని "కనుక్కున్నా........"
మహాప్రస్థానపు ఉడుకు పరుగులు లేవని
మిగితా వాటిని అక్కడే వదిలి కదిలిపోయా!

విశాలాంధ్ర ఎగ్జిబిషన్లో
కృష్ణ శాస్త్రి, గురజాడ,
బంగారి మామ, జాషువా
వెతికి మరీ తీసుకుంటుంటే

జయంతోత్సవాలకనుకుంటా పేర్చబడ్డ
అనంతం, ఖడ్గసృష్టి కనబడుతున్నా
ఈ సంవత్సరం కవిత్వం పైనే నా దృష్టని
సర్దిచెప్పుకుని మహాప్రస్థానంతో సరిపుచ్చుకున్నా

డెక్కన్ చార్జర్స్ చార్జింగ్ లేక చితికిలపడుతుంటే
చైతన్యం వస్తుందని మహాప్రస్థానం చేబడితే
యోగ్యతా పత్రమిస్తూ చలం చేసిన చీత్కారం
మనసు చివుక్కుమనిపించింది...ఆలోచింప చేసింది!

అయినా నాకు తెలుసు
నా ఈ ఆవేశం క్షణికమని-
కార్యరూపం అనంతాలవతలని
అయితేనేం? ......................

పతితుల, బాధితుల
బాధా సర్పద్రష్టుల
నాలాటి బెడ్ రూం బూర్జువాలు
ఆలోచించటమే గొప్ప కదా!

అయినా చలం నీకిది న్యాయమా?
తనని చదవాలని తెరిస్తే
మీకు కవిత్వం కావాలా?..పాత గోరీల చూడమంటూ
ముందుకు సాగకుండా చేసావ్.....ఈ పాపం నీదేలే!

5 comments:

  1. "కారులో షికారుకెళ్ళే........"
    చిన్నది సిగ్గుపడే కవిత
    అతని మార్కే అనందరూ పొరబడితే
    కొంచం అర్థమయిందతని పవరు

    adi sri sri paata kaadaa? anyway kavita baagundi.

    ReplyDelete
  2. "కారులో షికారుకెళ్ళే........"
    చిన్నది సిగ్గుపడే కవిత
    అతని మార్కే అనందరూ పొరబడితే
    కొంచం అర్థమయిందతని పవరు

    adi sri sri paata kaadaa? anyway kavita baagundi.naaku chalam kuudaa ishtamea adi vearea vishayam.

    ReplyDelete
  3. "కారులో షికారుకెళ్ళే........"
    చిన్నది సిగ్గుపడే కవిత
    అతని మార్కే అనందరూ పొరబడితే
    కొంచం అర్థమయిందతని పవరు

    adi sri sri paata kaadaa? anyway kavita baagundi.naaku chalam kuudaa ishtamea adi vearea vishayam.

    ReplyDelete
  4. amma baaboi! porapaatu jarigindi naa valla! naaku radio loe alaagea vinna gurtu. anyway, thank U:)

    ReplyDelete