Thursday, 23 July 2009

పులేట!

దొరాన
తప్పని పులేట
కూడా ఒక్కరే నీమం
నీ జత గూడె
ఏటక్కావాల్సిన మెకం
నే తెస్తానన్నా
ఎడమ కన్నుంది
ఎనకే లేదన్నా
నీకొదిలేస్తుండా
నువ్గాయాలంటా
సమంగా సగం కాదులే
ఏట నే మొదలెడుతా
పులే గనక బడితే
సమంగా గోర్లు
సగం పంచిస్తా
బల్లెం నాది
ఈట నాది
గురి నాది
దెబ్బ నాది
ఎడమ కాదు
ఎనక సాయం నీవుంటే
ఎన్నైనా ఏసేస్తా
నమ్మబలికి
ఏట మొదలెడితే..........


పదడుగులు పడగానే
సీకటి సిక్కనాయే
బెబ్బులి గాండ్రింపు
ఒల్లంతా బెదురాయే
ఎన్కున్నావని
ముందుకేల్తాంటే
ఈపేమో సలాయే
కాయాల్సిన నీ ఊసే
సుంతైనా లేదాయే

సగం పానం
అనుకున్న
నీ జాడే లేదాయే
భయంతోనే
ఆ సగం సచ్చేపాయే
ఏటేమైందో
ఈటేమైందో
సూటేమైందో
సేటైపాయె
మెడనేలాడాల్సిన గోరు
మెడనేడాల్సే సావాయే
దొరే కలనున్నాడో
మరేమనుకున్నాడో
ఈటెట్లేగిసిందో
పులెట్లా సచ్చిందో
దొరకె ఎరుకాయే
దొరదే సలవాయే

సర్మం పీకితి
గోర్లన్నీ పెరికితి
ఆకేదో తెచ్చి
పసురేదో పిండితి
కట్టూనట్లా సూస్తా
నేనస్తా ఉంటె
సిన్నెలు సిందిస్తూ
వన్నెలు పిండేస్తూ
కాపేసిన నీవస్తివి
నా సగం మరవద్దని
నీవంటుంటే
సూస్తా నేనట్టా సూస్తుంటి
పుల్దెబ్బెందుకే నీవుండగ.

Wednesday, 22 July 2009

ఈ పాట తెలుసా? మీ దగ్గర ఉందా?

"బండెల్లి పోతోందే సేల్లెలా, బతుకు బండెల్లి పోతోందే సేల్లలా........................"

రైల్లో బిచ్చగాళ్ళు అడుక్కుంటూ పాడే పాట (నేనింతవరకు ఇది అంకురం సినిమాలోది అనే అనుకుంటున్నాను, నిజమో కాదో తెలీదు) ఎవరి దగరైనా ఉందా? కనీసం పాట సాహిత్యమైనా ఉందా? ఉంటే నాకు లింక్ లేదా ఫైల్ మెయిల్ చేసి పుణ్యం కట్టుకోరూ ప్లీస్.

Tuesday, 21 July 2009

కాలవాహినిలో కలిసిపోతా!

బొట్టు బొట్టుగా చెపుతూ
వినలేదని అలిగి పోయింది
పోయిందేదో పొతే పొయేది
ఙ్ఞాపకమై మళ్ళీ వచ్చింది
నాలోనే తిష్టేసి
హృదయాన్నే కార్చేసింది
కారింది పారింది
ఉధృతమై అతి పొంగై
రేపెక్కడ ముంపౌతుందోనని
భయమెంతో రేపింది

సుదీర్ఘ పయనాలు
తెలియని మలుపులూ
నిజాలు తెలిపి
మరీ తన్నుకు పొయింది
కనుగానని తీరాలు
అఘొర చరాలు
అపద్దమంటూనే
బలి చేసేసింది

ఇంతా చేసి మజిలీలోనే
ఇదే నీ రాతంటూ
ఇటింక తోడొద్దంటూ
చేయి విడవబొయింది.

మొకాళ్ళపై మోకరించా
వీడొద్దని దేవురించా.

అర్థం కాదా తనకు
నే వెనుకకు వెళ్ళాలని
తన ముందు ప్రయాణంలో
నా గతమెంతో పెనేసుకుందని.

భయానకానల జ్వాలంతపిస్తా
ఆవిరైపోతా పైకెగిరిపోతా
అపుడే కదా ఆ భాగ్యం
ప్రేమ స్పర్శల సౌభాగ్యం
చిరుగాలికి వణికిపోతూ
చిరు చినుకుగ రివ్వుమంటూ
పుంఖల బొట్ల సరినౌతా

అపడి తప్పుకు బామాల్తా
ఏమో ఎవరికి తెలుసు
వెనక్కుపోతేనన్నా గతమొస్తుందేమో
నాటి తప్పును సరిదిద్దే గతుంటుందేమో!

నీలో ఉందా పత్రహరితం?


మబ్బెనకాలేదో ఉందని
ఎక్కడికా గుడ్డి పయనం?
చుట్టున్నది గమనిస్తే
గ్రహణ కాదా ఆ సారం?

వేడిమొకటే కన్నావా
మలమల మాడటం ఖాయం
సారాన్నీ పిండావో
కరతలామలకం బ్రహ్మజ్ఞానం

ఇలన్ఫల పుష్పాదుల మరో రూపు
ప్రతి మనిషిలో సూరీడున్నాడు
ప్రతీ కిరణం పిండే గుణం
నీలో ఉందా పత్రహరితం?

పృధ్వీగారి మంచి చిత్రానికి నా అక్షర తర్జుమా.

Thursday, 16 July 2009

"శ్రీ కాకుళేశ్వర మహా క్షేత్రే ......"

వేటూరి గారు కథలు కూడా రాస్తారా అని అనుకుంటూ చదివిన కథ ఇది. కథ వేటూరి గారిది అని తెలీకుంటే "తన భాషా పాండిత్యమంతా చూపెట్టుకోటానికి చాలా శ్రమ పడ్డాడు రచయిత" అన్నది బిడియపడకుండా రాసేసే వాడినేమో..ఇపుడు కొంచం బిడియంగానే రాస్తున్నా.

వాక్యం రసాత్మకం కావచ్చు కాని ప్రతి వాక్యం రసాత్మకం చేయాలనుకుంటే ఆ కథలోని రసాస్వాదన చాలా తగ్గుతుందనేది ఈ కథ చూసాక తెలిసింది. ప్రతి వాక్యాన్ని ఒక పాట చేయాలన్నది వేటూరి గారి సంకల్పితమో అసంకల్పితమో తెలియదు కాని ప్రతీ వాక్యంలో లయనూ, శబ్దాలంకారాన్ని గుప్పించేయటంతో చివరికి అది ఉట్టి హోరుగానే మిగిలిపోయింది, నాలాటి సాధారణ పాఠకుడికి.
చివరికి నా మట్టి బుర్రకు అర్థమయ్యిందేమిట్రా అంటే శ్రీకాకుళంలో స్థానికంగా వాడుబడిలో ఉండే ఒక నానుడికి ఉన్న మూడు తరాల చరిత్రను క్లుప్తంగా చెప్పే కథ ఇది. నాకైతే "ప్చ్ నచ్చలేదు" అనే అనిపించింది. మరి మీకేలాగనిపిస్తుందో, ఓపికుంటే చదవండి.

Sunday, 12 July 2009

నేనొక సాధారణ పాఠకుణ్ణి

నేనొక సాధారణ పాఠకుడిని అంటూనే వ్యాస రచయిత కవితలో గోచరమయే నవవిధ పాకాలనూ సోదాహరణంగా వివరించిన వ్యాసమిది....నాకయితే అంతుపట్ట లేదు ఈ పాకాలు...అర్థమయిందొక్కటే....."కవితలో రసాస్వాదనకు పెక్కు ఙ్ఞాపకాలు అవసరం" అని...... మిగితా వారికి ఉపయుక్తమౌతుందని ఇక్కడ ఇస్తున్నాను, వ్యాస రచయిత వేలూరి వెంకటేశ్వరరావుగారికి, ఈమాట వారికీ కృతఙ్ఞతలతో

నేనొక సాధారణ పాఠకుణ్ణి

భరించ లేని వేదన

అబ్బా, సమ్మెట పోటులింత దెబ్బా!

నలుగురికి పంచుకుంటే
నీ బరువెంత దిగిందో కాని
మోసే మా బొయీలకే తెలుసు
పల్లకించు నీ భావాల బరువేమిటో

భరించ లేని వేదన
ముందుకు కదలనీక బంధిస్తే
ఆ వేదనెంతావేదనో
తెలిసీ కట్టిపడేసిన
నువ్వెంత మాంత్రికుడివైనా
బహు స్వార్థివీ సుమా!

తెలుగు కవిత - ప్రస్తుత పరిస్థితి


శీర్షిక ప్రకారం తెలుగు కవిత యొక్క నేటి స్థితి గురించి రాసిన వ్యాసమే అయినా, కవిత-కావ్యం యొక్క లక్షణాలను నేటి ఔత్సాహిక కవులకు పరిచయం చేయటమే లక్షంగా పెట్టుకున్నారు వ్యాసకర్త కారణం బాల సుబ్రహ్మణ్య పిళ్ళైగారు అనిపించింది.

క్లుప్తత, ధారణా యోగ్యత,భావ పుష్టి, లోకవృత్త పరిజ్ఞానం, విశేషోక్తి, శబ్దసౌష్టవం, ప్రసన్నత మొదలగు వాటి గురించి సోదాహరణంగా చర్చించిన ఈ వ్యాసం "మంచి కవి/కవయిత్రి" అనిపించుకోవాలనుకునే వారికి తప్పనిసరి చదివిడి అని నా అభిప్రాయం.

ఈ వ్యాస కర్తకూ, ఆదరించిన "అటా" వారికీ, ప్రచురించిన "ఈ మాట" వారికీ అందరికీ కృతజ్ఞతాభివందనాలు.

తెలుగు కవిత - ప్రస్తుత పరిస్థితి

Friday, 10 July 2009

పరిచయమవసరమా?

ఒకోసారి పిచ్చెక్కుతుంది నీ గురించి
తెలియాల్సినదెంతో ఉందనిపించి
నా జీవితం చాలేనా అనీ అనిపిస్తుంది
ప్రశ్నిస్తూ జవాబిస్తావు
తెలుసకునేం చేస్తావంటూ
అస్వాదిస్తానన్నసమాధానానికి నీ నవ్వు
స్వరూపాలు భేదాలు నిర్వచనాలు
తెలీకుండా అనుభవించలేవా అంటూ
చిన్న మాటతో జ్ఞానోదయం చేస్తూ.......
అయినా, ఉదయం సంధ్యల వృత్తమాగదు కదా
ఎపుడూ వస్తూనే ఉంటుందా అనుమానం.

Thursday, 9 July 2009

వాక్యం రసాత్మకం కావ్యం

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం రసాత్మకం కావ్యం -- రెండో భాగం
వాక్యం రసాత్మకం కావ్యం -- మూడో భాగం
వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం
Since the blog saalabhanjikalu has been made private, i think, these links are not working but all the foru parts can be seen here at the blog daarla kavitalu.

అసలు ఊరికే ఈ వ్యాసాల లన్కెలిచ్చి నా అభిమానం చూపుదామనుకున్నాను, కాని నా కవితల్లో అస్సలు వ్యాఖ్యానాలు రాకుండా పోయింది, నేనెంతో అభిమానించేది అయిన ఒక కవితను (అదే లెండి ఒకే కవితా వస్తువును మూడు విధాలుగా రాసా) మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దామన్న దురాశతో ఆ వ్యాసాన్ని ఈ చిన్న పరిచయంతో, స్వకవితా సోదాహరణగా నాకు అర్ధమయింది అని చెపుతూ మీ ముందుకు తెస్తున్నా:-)

రామకృష్ణా బీచిలో ప్రభంద కవి ముక్కు తిమ్మననూ, భావకవి కృష్ణశాస్త్రిగారినీ, నేటి కవి అనుభూతి వాడకవీశేషేంద్ర శర్మగారినీ సాక్షాత్కరించి, సాయం సమయం, సాగర తీరం, సౌందర్య దర్శనం చేయించి, ఆ ముగ్గురి రససృష్టి ద్వారా తెలుగు కవితలోని ప్రభంద, భావ, అనుభూతి కవితా యుగాలను మనకు సోదాహరణగా వివరించే వ్యాసమిది.

మహదేవన్ గారి స్వరమాధురిలో మునిగి తేలుతూ నేనెప్పుడు "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ ........" అన్న పాట సాహిత్యాన్నీ పట్టించుకోలేదు...పట్టించుకోలేదు అనే కంటే అర్థం కాక వదిలేసాననటం నిజమేమో. ఈ వ్యాసంలో తోట, పాట, కుటీరం, రంగవల్లి, నది, నావ, పక్షులు....." వీటికి వ్యాసకర్త aనుభూతి కవిత్వాన్ని అన్వయించిన తీరెంత బాగుందని...నాకు చెప్పటానికి మాటలు రావు,ఇక మీరు అనుభవించి చూడాల్సిందే.

ఇదంతా చూసిన తరవాత చెప్పానుగా....నా కవితనోకదాన్ని పునః పరిచయం చేస్తానని...అది మన భాష/మాట అనేది ఎలా బయటపడుతుంది అన్న దానిని gఊర్చి నా శ్రీమతితో మాట్లాడుతూ (mఆటలాడుతూ కాదులెండి...నేనే పాపం తనకు సుత్తేస్తూ) వచ్చిన ప్రేరణతో రాసిన ఈ కవిత, అనుభూతి కవిత అనొచ్చేమో...ఎందుకంటే ఇది ఎందుకు ఎలా జరుగుతోంది అనే దాన్ని చెపుతోంది కదా? అది కింద ఐస్తున్నాను...మీరేమంటారు? .....ఏదో ఒకటి అనుకునే ఉంటారు ....అనుకుని కూడా వ్యాఖ్య రాయకపోయారో...మీ బ్లాగు వారం రోజులు అతిధి రహితంగా ఉండు గాక ...ఇది నా శాపం, ఆ ఏమనుకుంటున్నారో!!


Ballet of Speech
జీవనాదానికి తాళం వేసే
ఉసురులకే కొత్త జీవం పోసి
మాంసఖండాలే వెదురు బద్దలుగ
పోరంబోకు గాలిని వేణుగానం చేసి
చీల్చి చెండాడే దంతాలు
నైజం మరచి సాయం చేయగ
అధరువులనెరిగినధరములు
కొత్త దరువుల భాగ్యం కూర్చగ
అంగిటకు ముంగిట
కంఠమే నేపథ్యమీయగ
చపల జిహ్వయే స్థిరత నేర్చి
మెలికలు తిరిగే నాట్యం చేసి
మనసున కలిగే భావ హేలకు
ముచ్చట గొలిపే అభినయ భాగ్యం
సంఘజీవిత పునాది వేసే
భాషను కూర్చీ, రాతను మార్చిన
మనిషీ .......ఓ మనిషీ
నీ జన్మ అమోఘమోయి.

Oh! the very life
breathing a perfect beat
rising from the depths of gullet
squeezing through fleshy reeds
changing their usual route
supported by the fiersome teeth
lithesome tongue teaching it a step or two
a strange bounce in its steps
from the tough palet's kinship
out of the bellows called lips
forming the very life of human society
It is the ballet of speech.

గొంతుకిచ్చిన నేపథ్యంలో
మాంస వేణువుసురులూదగ
అంగిట ముంగిట దంతాధరముల
పక్క వాద్యముల సాయములోన
భావహేలకు భాష్యం చెపుతూ
నాలిక చేసే అభినయమే
మాటంటాం మనం.

ఈ మాటల విన్యాస కేళిలో చిత్రాలెన్నో
ఒక్కో భంగిమకూ నిర్దుష్ట నామం అక్షర రూపం
అనంత ముద్రమాలికలకు పదమంటూ స్ఫష్ట భావం
ముద్రమాలికల చిత్రమేలనం వాక్యం
ఏమి చెప్పేది ఎలా చెప్పేది
మానవ మేధెలా తిప్పితే
అలా ఆడే తోలుబోమ్మలా
ఎన్నో హోయలోలికించే
నృత్య ప్రదర్శననే భాషంటాం మనం.

Friday, 3 July 2009

అలవాటునూ అస్వతంత్రతనూ వదిలితే?


క్లినిక్ బయట అడుగేసానో లేదో
సూదులు గుచ్చుతున్నట్టయి చూస్తే
ఏముంది? పనిలేని వరుణ్స్ బాబాయ్
మూడ్రొజుల చెమట కంపు పొవాలన్నట్టు
ధారగా నీళ్ళోసుకుంటున్నాడు.....నెల తప్పినోడు

విసుక్కుంటూ కారు దగ్గరకు లగెత్తుతుంటే
తిలకేమో మదిలో వెక్కిరించటం మొదలెట్టాడు
"అలవాటునూ అస్వతంత్రతనూ కావిలించుకుని..."
వేళపాళా చూడని ఈ ఇంగ్లండు వానలా

కారు తాళమేమో తిరగక మొరాయించింది
పైన పడుతున్న చినుకుల తాళానికి
నాట్యం చేయకుండా మనసును ఆపే నువ్వు
నానాపాటేకర్వే అంది....అమ్మో,గడుసు ముండది.

సరే పోయేదేముంది...."దునియా బనానే వాలే
క్యా తెరె మన్ మె సమాయీ" అనుకుంటూ
కళ్ళు మూసుకున్నా, అలా ఆ చిటపటల రాగంలో
ఎపుడేమయ్యానో,ఎటు కొట్టుకు పొయానో ఎవరికెరుక

వెయ్యి కళ్ళూ కుట్టినట్టున్నాయి
బ్రదర్ ఇంద్రులవారికి ఈర్ష్యతో
చమక్కుమని మెరుపులు మెరుస్తూ
ఢమాల్మని ఉరుములు ఉరుముతూ
తన అసహనాన్ని తెలిపాడు
అంత పోటుగాడివా అన్నట్టు

నవ్వుకున్నా! బ్రదర్ ఊరికే ఆవేశపడకు
అనుకున్నా, మా శాస్త్రి గారన్నట్టు
నీ మెరుపులు నా చెలి చిరుచిరు నగవులే
నీ ఉరుములు తా నడిచే సరిసరి నటనలే

తస్సా దియ్యా, ఇంకోదాన్ని తనముందు పొగిడ్తే
దేవతలైనా సరే అడాళ్లే అని నిరూపిస్తూ
కురుస్తున్న గంగమ్మ నా కళ్ళు మూసేసింది
విండ్ స్క్రీన్ని వెండి జలతారు వెనక దాచేసింది

చిటపట చినుకులు హుషారైన దరువేస్తుంటే
చలేమో కావలించుకుని సాంబా మొదలెట్టింది
దీనవ్వ దీనికే ఇంత మత్తెక్కింది...ఝడుసుకున్నా
మా హైదరాబాద్ తీన్మారెస్తే ఏం చేసేదోనని

ఇంతలో ఫక్కున నవ్వు వినిపించింది చూద్దును కదా
ఎవరా అని, ఇంకెవరూ సర్వాంతర్యామి నా అంతరాత్మ
క్లాసు పిలగాడు గిదేందిరా గింత తూలుతున్నాడియాలా
యాసలొ నా ధ్యాసంతా చెడగొట్టింది, సన్నాసిలా

కారులో సాగిపోతున్న నన్ను చూసి
ధీనమైన గంగమ్మనూ, కారు వేడిలో ఓడిన చలమ్మకూ
కన్ను కొట్టిన మబ్బయ్య ప్రోత్సాహంతో
కారు వేగంగా పోనిచ్చా వాన మడుగు నీళ్ళలో
కవాతుగా నిల్చుని ఒకో కాలు పైకెత్తి
పిచికారి కొట్టిన కుక్కల పటాలం ధారల్లా
విరజిమ్మింది మడుగులోని నీరంతా,
విరగబడింది నా మనసెంతో సంతోషంగా.


A naughty response to an unseasonal rain today with thunderstorms here after 2-3 days of sweltering heat.