Thursday, 9 July 2009

వాక్యం రసాత్మకం కావ్యం

వాక్యం రసాత్మకం కావ్యం
వాక్యం రసాత్మకం కావ్యం -- రెండో భాగం
వాక్యం రసాత్మకం కావ్యం -- మూడో భాగం
వాక్యం రసాత్మకం కావ్యం లో నాలుగో భాగం
Since the blog saalabhanjikalu has been made private, i think, these links are not working but all the foru parts can be seen here at the blog daarla kavitalu.

అసలు ఊరికే ఈ వ్యాసాల లన్కెలిచ్చి నా అభిమానం చూపుదామనుకున్నాను, కాని నా కవితల్లో అస్సలు వ్యాఖ్యానాలు రాకుండా పోయింది, నేనెంతో అభిమానించేది అయిన ఒక కవితను (అదే లెండి ఒకే కవితా వస్తువును మూడు విధాలుగా రాసా) మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దామన్న దురాశతో ఆ వ్యాసాన్ని ఈ చిన్న పరిచయంతో, స్వకవితా సోదాహరణగా నాకు అర్ధమయింది అని చెపుతూ మీ ముందుకు తెస్తున్నా:-)

రామకృష్ణా బీచిలో ప్రభంద కవి ముక్కు తిమ్మననూ, భావకవి కృష్ణశాస్త్రిగారినీ, నేటి కవి అనుభూతి వాడకవీశేషేంద్ర శర్మగారినీ సాక్షాత్కరించి, సాయం సమయం, సాగర తీరం, సౌందర్య దర్శనం చేయించి, ఆ ముగ్గురి రససృష్టి ద్వారా తెలుగు కవితలోని ప్రభంద, భావ, అనుభూతి కవితా యుగాలను మనకు సోదాహరణగా వివరించే వ్యాసమిది.

మహదేవన్ గారి స్వరమాధురిలో మునిగి తేలుతూ నేనెప్పుడు "నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ ........" అన్న పాట సాహిత్యాన్నీ పట్టించుకోలేదు...పట్టించుకోలేదు అనే కంటే అర్థం కాక వదిలేసాననటం నిజమేమో. ఈ వ్యాసంలో తోట, పాట, కుటీరం, రంగవల్లి, నది, నావ, పక్షులు....." వీటికి వ్యాసకర్త aనుభూతి కవిత్వాన్ని అన్వయించిన తీరెంత బాగుందని...నాకు చెప్పటానికి మాటలు రావు,ఇక మీరు అనుభవించి చూడాల్సిందే.

ఇదంతా చూసిన తరవాత చెప్పానుగా....నా కవితనోకదాన్ని పునః పరిచయం చేస్తానని...అది మన భాష/మాట అనేది ఎలా బయటపడుతుంది అన్న దానిని gఊర్చి నా శ్రీమతితో మాట్లాడుతూ (mఆటలాడుతూ కాదులెండి...నేనే పాపం తనకు సుత్తేస్తూ) వచ్చిన ప్రేరణతో రాసిన ఈ కవిత, అనుభూతి కవిత అనొచ్చేమో...ఎందుకంటే ఇది ఎందుకు ఎలా జరుగుతోంది అనే దాన్ని చెపుతోంది కదా? అది కింద ఐస్తున్నాను...మీరేమంటారు? .....ఏదో ఒకటి అనుకునే ఉంటారు ....అనుకుని కూడా వ్యాఖ్య రాయకపోయారో...మీ బ్లాగు వారం రోజులు అతిధి రహితంగా ఉండు గాక ...ఇది నా శాపం, ఆ ఏమనుకుంటున్నారో!!


Ballet of Speech
జీవనాదానికి తాళం వేసే
ఉసురులకే కొత్త జీవం పోసి
మాంసఖండాలే వెదురు బద్దలుగ
పోరంబోకు గాలిని వేణుగానం చేసి
చీల్చి చెండాడే దంతాలు
నైజం మరచి సాయం చేయగ
అధరువులనెరిగినధరములు
కొత్త దరువుల భాగ్యం కూర్చగ
అంగిటకు ముంగిట
కంఠమే నేపథ్యమీయగ
చపల జిహ్వయే స్థిరత నేర్చి
మెలికలు తిరిగే నాట్యం చేసి
మనసున కలిగే భావ హేలకు
ముచ్చట గొలిపే అభినయ భాగ్యం
సంఘజీవిత పునాది వేసే
భాషను కూర్చీ, రాతను మార్చిన
మనిషీ .......ఓ మనిషీ
నీ జన్మ అమోఘమోయి.

Oh! the very life
breathing a perfect beat
rising from the depths of gullet
squeezing through fleshy reeds
changing their usual route
supported by the fiersome teeth
lithesome tongue teaching it a step or two
a strange bounce in its steps
from the tough palet's kinship
out of the bellows called lips
forming the very life of human society
It is the ballet of speech.

గొంతుకిచ్చిన నేపథ్యంలో
మాంస వేణువుసురులూదగ
అంగిట ముంగిట దంతాధరముల
పక్క వాద్యముల సాయములోన
భావహేలకు భాష్యం చెపుతూ
నాలిక చేసే అభినయమే
మాటంటాం మనం.

ఈ మాటల విన్యాస కేళిలో చిత్రాలెన్నో
ఒక్కో భంగిమకూ నిర్దుష్ట నామం అక్షర రూపం
అనంత ముద్రమాలికలకు పదమంటూ స్ఫష్ట భావం
ముద్రమాలికల చిత్రమేలనం వాక్యం
ఏమి చెప్పేది ఎలా చెప్పేది
మానవ మేధెలా తిప్పితే
అలా ఆడే తోలుబోమ్మలా
ఎన్నో హోయలోలికించే
నృత్య ప్రదర్శననే భాషంటాం మనం.

No comments:

Post a Comment