"ఒక కల్పిత పాత్రను సజీవమూర్తిగా స్వీకరించి విశ్లేషించ ప్రయత్నించటం ఎంత వరకూ సమంజసం? ఈ ప్రక్రియలో నువ్వు చూస్తున్నది ఒక స్త్రీ మూర్తినా లేక పురుష సూత్రధారి కనుసన్నలలో ప్రాణం పోసుకున్న ఓ స్త్రీ చాయా రూపమా?" అంటూ చొప్ప దంటు ప్రశ్నలు వేస్తున్న ఆత్మారాముడిని రెండు పీకి అవతల పారేశాను. ప్రతి జీవితం గతానుభావానుగుణ గతి ధారిణే అయినపుడు ప్రతి జీవితమూ ఆ అనుభవమనే సూత్రదారుని చేతిలో కీలుబోమ్మే కదా? అలాటప్పుడు రెంటికీ తేడా ఏమిటో నాకు తెలీలేదు. Also, for the moment, I do not wish to step back, for, that longitudinal view does really hurt with its truthful radiance. I am content with being a myopic puppet on the grand stage, blissfully playing out its part.
ఫిలాసఫీలాపి అసలు విషయానికొస్తే ఇన్నేళ్ళ తరవాత, ఇన్ని కడవల అశ్రుతర్పణం తరవాత ఇవేళ అనిపించింది "ఈ సినిమా ఇంత హిట్ ఎలా అయ్యిందా అబ్బా" అని. సినిమా రివ్యూ కాదురోయ్ అని గురుడు జెల్లకాయ కొడితే కాని గాడిలో పడలేదు ఆలోచనలు.
"మాధవి గురించి రాయాల్సినంత ఏముంది అని మెదడు మొదట చప్పరించేసిన మాట నిజం. పెళ్ళాడిన వాడు ఆస్తుల కోసం వదిలేస్తే బాధ పడుతూ కూర్చుంది, ప్రేమించిన వాడు దానం చేస్తే మారు మాటాడక వెళ్ళిపోయింది, మనసులో ఇంకొకరిని పెట్టుకుని ఇంకొకరితో ఎలా ఉండగాలిగిందో, ఎలా సంసారం చేసిందో మహా తల్లి" అన్నవే ఆలోచనలు. నాయిక అంటే శృంగార నాయిక లక్షణాలే తప్పితే ఇంకే లక్షణాలూ చెప్పని సంస్కృతి ఫలాలం కదా మరి.
కొంచం వళ్ళు దగ్గర పెట్టుకుని పరికిస్తే నాకు మాధవిలో మొదట కనిపించింది అమ్మతనం, ఆ తరవాత స్త్రీత్వం.
"అయితే అమ్మ మనసు కనిపెట్టటం మొదలెట్టారన మాట" అంటూ తన వాడిని ప్రస్నిస్తూ "ఇపుడిపుడే ఇతరుల మనసును చదవగలుగుతున్నాను" అని వాడిచేత అనిపించగలిగిన అమ్మతనం. అ ఆ లు దిద్దించే అమ్మతనం. అన్నీ తనకు కావాల్సినవి అనే కోణం నుంచె చూసే Ego-centric పాపడికి ఇతరులలో కూడా మనసు ఉంది వారికీ ఆశలూ కోర్కెలూ ఉంటాయి అన్న "Theory of Mind" బోధించే అమ్మతనం.
ఈ అమ్మతనం ఒడి పండుతేనే స్త్రీకి అబ్బే గుణమని అనుకోవటం పోరాపాటేనేమో. May be its all in the Venutian air? లేకుంటే తన కొడుకు ఫోటోల్లోటివే అయినా తన కోసం ఒక్కటి అడగటాన్ని లేకితనంగా అభిసంసిస్తారని బిడియపడిన తల్లికి ఆ "భంగిమా......" ఫోటోల కంటే తన కళ్ళెదుట కొడుకు తాను ఇంతకాలం వ్యవసాయించిన పంటనూర్పుతుంటే తీసిన ఫోటోలు ఎక్కువ ఆనందం కలిగిస్తాయని మాధవికెలా తట్టింది?
"రేపు మా నాన్న ఆబ్ధికం. నువ్వేం పెట్టించనక్కరలా......." అంటూ రెక్కలిచ్చిన సత్తాతో ఎగిరిపోతానంటున్న తన సంతానాన్ని తన అవసరం ఎక్కువ ఉన్న ఇంకో బిడ్డడి కోసం త్యాగం చేయటం, లోకం అభిశంసనకు వెరవకపోవటం ఎన్ని సంసారాల్లో, ఎందరు తల్లుల్లో చూడము మనం?
"నాకూ చప్పట్లు కొట్టించుకోవాలని ఉందే" అంటూ జీవితేచ్చ కోసం మధనపడే తన బిడ్డడు ఆ కరతాళాల మధ్య భారతమాడాలని మాధవి పడ్డ తపన ప్రసవ వేదననే గుర్తు చేసింది నాకయితే.
ధీరలలిత, ధీరశాంతాలు పుణికి పుచ్చుకున్న నాయిక మాధవి. మాధవి లలిత, శాంతాలకు ఉదాహరణలు అవసరం లేదనే అనుకుంటాను. ధీరమంటే "క్లేశాన్ని సహించటం " అట. మాధవికంటే దీశాలెవరు ఈ నాటకంలో? అసలు ఈ విషయంలోనే నాకు స్త్రీ పురుషుడి కంటే ఎప్పుడూ బలవంతురాలే అనిపించేది. సహనం నిజమైన బలిమేనేమో. తానె చేసుకున్నా తనకన్యాయం జరిగిందని ఎలుగెత్తి ఏడిచే బాలూలను ఎంత మందిని చూడం మనం. ఇతరులు తనకన్యాయం చేసినా కిమ్మనక సహించే మాధవిలకు కొడువెం మన దేశంలో? క్లేశాన్ని ఓర్వలేక జీవితాన్ని తాగుడుకు తాకట్టు పెట్టి, అనన్యమైన కళకు తీరని అన్యాయం చేసిన నాయకుడొక వైపు అదే క్లేశాన్ని జీవితంలో రెందోసారనుభవిస్తూ కూడా ఆ జీవితాన్ని కాడి తప్పనివ్వని మాధవొక వైపు. ఇక చెప్పేదేముంది?
ఒకోక్కప్పుడనిపిస్తుంది................ఇలా సహనాన్ని పల్లకీకెత్తి ఊరేగించేది కూడా పురుషాదిపత్యమేనేమో అని.
"ఆ, ఇలా ప్రేమించిన వాడిని అలా మరిచిపోయి వేరే వాడితో కులకటం అదేమంత బలిమి కాదు" అంటారా?
ఒకసారి ప్రేమించి చూడండి.
ఆ ప్రేమను భాధ్యతకో, అదే ప్రేమ కోసమో బలివ్వండి.....................
అయినా మనకవన్నీ ఎక్కడ అనుభావమవుతాయి లెండి. ప్రేమంటే కోరుకోవటం, కావాలనుకోవటం తప్ప ఇంకే చాయా గురుతుకు రానంతగా మారిపోతున్న సమాజపు మనుషులం మనం. మిగితావన్నీ పిరికితనంగా అభివర్ణించే కౌరవులం.
తన విషయంలో, తన అభిమతం పట్టించుకోకుండా, తన విధిని రాస్తున్న వ్యక్తి జ్ఞాపకాన్నీ, తన ఆశనూ చిరునవ్వుతోనే జడ నుంచి వేరు చెయ్యటం, అలాటి వ్యక్తి ఆఖరు కోర్కెగా అప్పటికి పరాయి అయిపోయిన వాడి సరస నుంచుని మరీ దర్సనమివ్వటం మాధవిలోని స్త్రీకే చెల్లింది.
నిజంగా ఇలాటి మనుషులు, ఇప్పటి సమాజంలో ఉంటారా అని అనుమానమా?
కాగడా అవసరం లేదు మనసెట్టి వెతకండి.
ఎంతో దూరం పోనక్కరలేదు.
నాది గ్యారంటీ!
ఎక్కడో చినుకులా రాలి, చివరికి మీ సంగమంలో సాగరుని చూసుకునే మీ మాధవి మీకూ కనిపించకపోదు.
No comments:
Post a Comment