నేనేదో టపాలో "సగటు మనిషి ప్రతి వారిలో నాయిక, నాయకులను చూడాలి అలా చోపెట్టే నవలలూ, సినిమాలూ రావాలి" అన్నదానికి ప్రతిఫలమా అన్నట్టుగా అనిపించింది షాపింగ్ మాల్ సినిమా చూసిన తరవాత. Almost missed this movie because of an Idiotic review which said this movie was about glorification of sadness and the review even had the temerity to suggest that we people get kicks out of glorifying the sadness. Wish I remember where I read that review so that I could name and shame the website.
కథ
నాన్న చిన్నప్పుడు "హేవిటో ఈ మధ్య అన్నీ ...సినిమాలూ, సిరియళ్ళూ అన్నీ .....ప్రేమ గురించే, ఇంకేం లేనట్టూ" అంటే "లవ్ కాక ఇంకేం ఉంది నాన్నాప్రపంచంలో" అన్న నా అప్పటి పిచ్చిమాటలు గుర్తు వచ్చాయి "గొప్పగా ఉంది కాని మళ్ళీ లవ్ స్టోరీనెగా" అని బుద్ది చప్పరించేస్తూ కథను విశ్లేషించటం మొదలెడితే. మొత్తం టీనేజ్ లవ్ స్టోరీనే. పెద్దగా చెప్పుకోటానికేమి లేదు.
కథనం
కథ నడిచిన తీరు, దర్సకత్వం చాలా నచ్చాయి నాకు. ఈ మధ్య వస్తున్న టీనేజ్ లవ్ స్టోరీస్ అంటే నాకు చాలా కోపం. వాటికి భిన్నంగా ఉంది అనిపించింది. బాక్డ్రాప్ ఒక షాపింగ్ మాల్ అవటం కథకుడి నేటి సామాజిక దార్శనికతకు నిదర్శనం అనిపించింది..
ఏ రచనలైనా ఆ కాలం సామాజికతకు దర్పణాలు అవ్వాలన్నది నా అభిమతం.
"కొత్త బంగారు లోకం " చూస్తున్నంత సేపు నాకు ఎందుకో అనీజీగా అనిపించేది. ప్రతీ సినిమాలో ఇలా చిన్న పిల్లలకు ఈ ప్రేమ గొడవలేంటి అన్న చిరాకులో నాయిక నాయకుల ప్రేమను అంత తొందరగా ఆమోదించలేకపోయాను. అక్కడ పిల్లల మధ్య ఉన్నది ఆకర్షనంకురార్పణగా సాగిన ప్రేమే....... ఈ చిత్రం లోనూ అదే. కాని ఇక్కడ ఎందుకో వీరి ప్రేమ నాకు ఆమోదయోగ్యమయ్యింది. సినిమా తారను చూస్తూ మొహావేసభరితుడై నాయకుడు నాయికను పక్కకు తీసుకెళ్ళి ముద్దు పెట్టుకోచూసినా నాకు అభ్యంతరం అనిపించలేదు. ఎందుకా అని తరిచితే నాకు అనిపించింది ఒకటే ఇక్కడ నాయికా నాయికలు "పిల్లలు కాదు" అన్న విషయం.
I thought this movie was somewhat in the vain of "Happy Days" where there was maturity in dealing with even attraction.
ఏదో చర్చలో ఒకసారి "ఇంటి పెద్దరికం ఎవరు తీసుకోవాలి" అంటే "భాద్యతలు మోసే వాళ్ళే" అని సమాధానమిచ్చింది. నాకా సమాధానానికి అభ్యంతరాలు కనపడలేదు. ఆ సమాధానాన్వయమే ఇక్కడ నాకు తోచింది వారు పిల్లలు కాదనటానికి.
ఇంటి భాద్యత నిర్వర్తించటానికి "అవును వాడు పైన చెయ్యి వేసి నొక్కితే ఊరికే నిలబడిపోయాను. ఏం చెయ్యమంటావు కిరోసిన్ పోసుకుని కాల్చుకోమంటావా?" అంటూ సగటుతనంలోనే తన పెద్దరికం చూపిన నాయిక నా మటుకు నాకు స్త్రీనే, అమ్మాయి కాదు. "వాడిని అర్థం చేసుకోలేక చచ్చిపోయిన అదీ, ఈనాడు నన్ను అనుమానించిన నువ్వూ ఇద్దరూ వేస్టే....." అంటూ నాయికను ఈసడింపుగా కడిగేసిన నాయకుడు నాకయితే పురుషుడే కాని అబ్బాయి కాదు. పెద్దమనిషయ్య్యేది చాప మీద ఎక్కినప్పుడు కాదు, ఏ వయసులో అయినా సరే "నా కంటే నావారు ఎక్కువ కదా, వారి గూర్చి కూడా ఆలోచించాలి కదా" అనుకుంటూ తమను తాము ఒక్క క్షణం అయినా సరే, నియంత్రించుకోగల అలవాటు వచ్చిన క్షణం ఆ మనిషికి పెద్దతనం వచ్చినట్టే.
ఇంటి భాద్యత నిర్వర్తించటానికి "అవును వాడు పైన చెయ్యి వేసి నొక్కితే ఊరికే నిలబడిపోయాను. ఏం చెయ్యమంటావు కిరోసిన్ పోసుకుని కాల్చుకోమంటావా?" అంటూ సగటుతనంలోనే తన పెద్దరికం చూపిన నాయిక నా మటుకు నాకు స్త్రీనే, అమ్మాయి కాదు. "వాడిని అర్థం చేసుకోలేక చచ్చిపోయిన అదీ, ఈనాడు నన్ను అనుమానించిన నువ్వూ ఇద్దరూ వేస్టే....." అంటూ నాయికను ఈసడింపుగా కడిగేసిన నాయకుడు నాకయితే పురుషుడే కాని అబ్బాయి కాదు. పెద్దమనిషయ్య్యేది చాప మీద ఎక్కినప్పుడు కాదు, ఏ వయసులో అయినా సరే "నా కంటే నావారు ఎక్కువ కదా, వారి గూర్చి కూడా ఆలోచించాలి కదా" అనుకుంటూ తమను తాము ఒక్క క్షణం అయినా సరే, నియంత్రించుకోగల అలవాటు వచ్చిన క్షణం ఆ మనిషికి పెద్దతనం వచ్చినట్టే.
మీరే చెప్పండి...... సినీ నటిని .చూసి మోహపడుతున్నాను అని తెలుస్కుని, అది తప్పని, తలచి తన దాన్ని పక్క గదికి రప్పించుకుని "తన మొహం తన స్త్రీ చెంతనే" అంటూ తెలిపే ఆ సన్నివేశం పెళ్ళికాని ఆ యువ నాయకుని ఔన్నత్యాన్ని తెలిపిందనే అనిపించింది కాని కామకుడు అని కాదు. May be I am too optimistic in my interpretation but I prefer to think that this interpretation sits well with overall characterisation of the hero than the sick interpretation that he just was trying to get physical with whom he can, stimulated by the heroine. "రాణి చెంతనుండ చెలికత్తెలేలనే........" అంటూ ఒక్క వాక్యంలో సగటుతనానికి మొహావేశపు యోగంలో కవిత్వం అబ్బటం తెగ నచ్చేసింది నాకు.
అంతే కాక తనవాడు తనను ప్రేమించటం కంటిన్యూ చెయ్యటం వాడికి నష్టం తెస్తుందేమో అని ఆలోచించటం చేసాడని తెలిసిన ఆ చిన్నది వాడిని వేరేస్తేమబాధ పడినవాడు వార్డెన్ నుండి తనను దాచిన తనను కడిగేస్తూ "ఇప్పుడిలా నన్నేదుకు దాచావో అప్పుడు నేనూ అందుకే ఆలోచించాను. రెండు కుటుంబాలు పస్తులు పడుకున్తాఎమో అని ఆలోచించటం తప్పా? ఊ మహారాణి, మిస్ ఇండియా దిగి వచ్చిందండీ దీని గురించి ప్రేమలో ఏమన్నా కష్టాలోస్తాయేమో అని ఆలోచిస్తేనే పిరికివాడు అనేస్తుంది...." అంటూ అనటంలో ఉన్న పరిణితి ఈనాడు ఎంతమంది పెద్దవాళ్ళలో కనపడుతుంది?
"ప్రేమను, మొహాన్నీ, ఆకర్షణ బహిరితివృత్తాలయినా అంతర్లీనంగా భాద్యత మోసే బోయీ శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపెట్టే మంచి చిత్రిక ఈ చిత్రం" అనిపించింది. In the whole film I never had the feeling that this was about glorification of poeverty, of unhappyness, of injustices. It felt like a beautiful narration of the wonderful tapestry of life, in all its hual glory, including the blacks and greys, barring no tones.
Subtelity
ఇది నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఈ చిత్రంలో. అక్కినేని వారు ఎప్పుడూ మొట్టుకునేట్టు సినిమా ఒక వ్యాపారం అన్నది మరవకుండా ఒక కళాఖండికగా తన సామాజిక స్ప్రుహైక భాద్యతను వీడకుండా చిత్రం చేసిన tightrope walking was very subtle, I felt. There were no harsh lectures about morality but no reel or turn of events was left un-utilised for slapping the current society for its hypocrisies. హయగ్రీవ మంత్రాన్ని పటించే కుటుంబం రజస్వల అయిన తన చెల్లెలిని ఇంటివెనకాల కుక్క గది పక్కన అలాటి గదిలోనే మూలన ఉంచటం చూసి నాయిక, ఆ కుటుంబం పెద్దమనిషి పండగకు ఇవ్వ చూసిన యాభైని ఏ ఎమోషన్ లేకుండా "వద్దమ్మా" అంటూ తిరస్కరించటం ఎంత మెత్తని చెప్పో అనుభవించిన వారికి తెలుస్తుంది.
ఒక ఫాన్ హీరోయిన్ను "అక్క" అంటూ (నాయకుని స్నేహితుని చేత) సంబోదింప చేయటం అంత సటిలిటీ నాకీ మధ్య కాలంలో ఇంకోటి కనపడలేదు. పగలంతా వళ్ళు హూనం చేసుకునే ఒక పల్లెటూరు "బైతు" చేత ఆ "అక్క" అన్న సంబోధనలో ఎలాటి వెటకారం చూపెట్టకుండా అమాయకత్వం చూపెట్టటంలో దర్శకుడు, రచయిత ఎంతో చెప్పారనిపిస్తుంది. ఆ "ఎంతో" అన్నది కళను కళగా అభిమానించండి అన్న సందేశమో లేక ప్రతి హీరోయిన్నూ సొల్లు కార్చుకుంటూ నేటి సమాజంపై ద్వన్యుక్తంగా వేసిన వ్యంగ్య బానమో లేక ఇలా కూడా ఇంకా మనుషులున్నారు ఇదే ఒప్పు అని చూపుతూ తన ఆప్టిమిసాన్ని చూపటమో లేక "కహా గయే ఐసే లోగ్" అంటున్న మౌనాక్రోశమో ........ ఎంతో ఉంది అని మాత్రం అనిపించింది,
తారాగణం.
నాయికా నాయికల పెర్లేంటో చూడలేదు, గుర్తుంచుకోవాలి అని అనిపించలేదు కాని చాలా బాగా చేసారు అనిపించింది. Weather it was restrained action or ameturism I don't know but it was very natural. NO dramatics or histrionics anywhere.
విలువలు
ఏ మాత్రం సామాజిక భాద్యతను మరిచిపోకుండా వ్యాపారాన్ని చేసుకున్న ఈ చిత్రమంటే నాకు ఎనలేని గౌరవమేర్పడింది. చివరిగా ప్రేక్షకులను, వారి అభిరుచులను గౌరవిన్చిటంలో పెద్దపీట వేసింది. ఎలా అంటారా? At the end of the movie, I did not end up shamed, disrobed to my basicest animal self by a shameless banquet of female flesh. చూపిన ఒక ఫాంటసీ పాట కూడా చాలా సింపుల్గా తీసారు అనిపించింది. And most importantly, artfully, seamlessly weaved into the context.

No comments:
Post a Comment