పూర్ణానురాగ సారము
ఆర్ణవమైమెరుగుగాయ యహవమున యసం
పూర్ణాహికాలకూటము
కీర్ణాదితమౌ పిపీల కీలికలందున్
పాహియనుట కర్ణేంద్రియ
మేహెయనుట దుస్సహమ్మౌటయు పాటే
సాహో సాకేతీ యరి
సాహో పిపీలకమదియు సరి మరి కాదే
అమ్మా నీకిది తగునా? గమ్యానికి చేరిన నీవు మార్గమధ్యులనుపెక్షించ తగునే?
పూర్ణానికీ అసంపూర్ణానికీ మైలురాళ్ళ అంతరం తప్ప ఇంకేముందమ్మా?
పథనిర్దేశ మాత్రము చేతనే నీ సరిగాదె ఆ పిపీలికము?
కృషిఫలము చేతనే కృషి మూల్యము నిర్ణయించుట ఏపాటి ధర్మము తల్లీ?
No comments:
Post a Comment