Sunday, 3 July 2011

7b


ఎపుడయినా ఎవరినయినా ప్రేమించావా మన్నూ 

ఏం ఎకసెక్కాలా?

లేదు నిజంగానే అడుగుతున్నా చెప్పు.

ప్రాణం కంటే మిన్నగా ......నీకు తెలీదా?

తెలుసు. అయినా ఆ మాట చెప్పటంలో ఉన్న ఆనందం మళ్ళీ నీకు కలగాలని అగుతున్నా 

అవును ప్రేమించా.....ప్రాణం కంటే మిన్నగా లాటి డైలాగులు ఎలా పుడుతాయో స్వానభవమయెంతగా ప్రేమించా 

నిన్ను నువ్వు చంపుకోవాలన్నంత ఎపుడైనా అవమానం పొందావా ఆ ప్రేమలో 

అవతలి వ్యక్తిని చంపాలన్నంత కోపం కూడా వచ్చేంతగా అవమానం పొందా 

అయినా ఇప్పటికీ ప్రేమిస్తున్నావు అవునా?

చచ్చేవరకూ ప్రేమిస్తా. బయటకు నీలా అరవకపోవచ్చు కాని చచ్చెంతవరకూ ఆ భావన మనసులోనే ఉంటుంది. అయినా ఇలాటివి బయటకు చెప్పుకునేవి కావు. అసలు మన మనసులో భావం రెండో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రేమయినా కాని, కోపమయినా కాని, బాధయినా కాని....సమర్ధుడు ఆ భావాన్ని మనసులోంచి బయటకు కక్కనీదు. 

ఒకనాడు "ఎందుకు చెప్పవు? నాకు తెలియాల్సిందే. నువ్వు చెప్పేంతవరకూ ఇలా నీ వెంటపడుతూనే ఉంటా. నీ మనసులో ప్రతీదీ నాకు తెలియాల్సినదే" అన్న నువ్వు ఎలా మారిపోయావో నువ్వు గమనించకపోయి ఉండచ్చు. సరేలే అది అప్రస్తుతం. ఒకటి చెప్పు. నువ్వు ఇంతకుముందు అన్న మాటలన్నీ.....అదే అహం వదిలేస్తాము అంటున్న వాళ్ళు నిజంగానే ఆ ఎకాక్షరి జపించటానికి అర్హులా ....ఇలా అన్న్నవన్నీ......నిన్ను నువ్వు అనుకున్నవే కదూ? అలా నీ ప్రాణాన్ని నువ్వు క్షమించటం చేస్తున్నావు అన్న అనుభవం ఎదురయినప్పుడు నిన్ను నువ్వు అనుకున్న మాటలే కదూ అవి?

"......"

"సరే. నువ్వేం చెప్పద్దు. నేను చెపుతా విను. అవును నువ్వు ఒక మనిషికి దాసోహం అన్నావు. తప్పులు చేసిన ఆ మనిషికి నువ్వు శిక్ష విధించావు, నువ్వూ విధించుకున్నావే కాని ఆ మనిషిని అసహ్యించుకోలేకపోతున్నావు. సుధా చంద్రన్లా ప్రేమించి మోసం చేసిన వాడి మొహంపై డభాలున తలుపెసేసే తెగువ నీకు లేదని నిన్నునువ్వు కించపరుచుకుంటున్నావు. అది నీ బలహీనత అని నిన్ను నువ్వు కించపరచుకుంటున్నావు. కొంత కాలం అనుబంధానికి బానిసవైపోయావు అని నిన్ను నువ్వు తులనాడుకుంటున్నావు. 

నిజంగా నీ ఆలోచనలు నిజమా అనేది ఒక్కసారి ఆలోచించు.




ఒక మనిషిని అసహ్యించుకోవటమే బల నిరూపణా?

తప్పును అసహ్యించుకోవాలా తప్పు చేసిన వ్యక్తినా?

తప్పుకు శిక్ష విధించే నీ కర్తవ్యపాలన నువ్వు చేయకపోతే నీవు ఆక్షేపితురాలివి. 
కాని ధర్మమనే తండ్రి ఆజ్ఞ పాలించి తల్లి శిరసూడ్చిన పరశురాముడి సాటివి నీవని నిరూపించుకుని, ఆ తల్లి శరీరాన్ని పట్టుకు ఏడుస్తున్నావు అని ఎందుకు నీకు ఆక్షేపణ? తల్లిని పునర్జీవితను చేసే జమదగ్నులు లేవని తెలిసి నీ ధర్మాన్ని పాటించిన నీవు అసలు ఆ భార్గవ రాముడికంటే మిన్నేనేమో. అలాటి నిన్ను నువ్వు ఎందుకు నిందించుకుంటావు?

ఎందుకు సాటి మనిషిని అసహ్యించుకోవటమే బలిమి అయింది మనకు?




అసహ్యం లేకపోతె మనం జీవితాంతం ఆ ధర్మాన్ని పాటించలేము.

అబద్ధం. ఒక మనిషి మనకు దగ్గరవటం ఎన్నో కారణాల వల్ల అవ్వొచ్చు. వారి నుంచి విడివడటం ఒకటో రెండో కారణాల వల్లే....కాపోతే "అతిపెద్ద, క్షమించరాని....కారణాల వల్ల" అనిపించటం జరిగినపుడే ఈ పీకులాట. అలా ఆ ప్రాపంచిక కారణాల వల్ల భౌతికంగా దూరం చేసుకున్న మనిషిని మన మనసులోంచి దూరం చేసుకోలేకపోవటం పిరికితనం ఎందుకయింది? నీ మనసులో మూర్తిగా ప్రతిష్టించుకున్న మనిషి మామూలు మనిషి అని నిరూపించుకున్నప్పుడు ఆ మూర్తి గిరాటువేయబడాలా? నీ ప్రవర్తన సమాజానికి చేటు కానంత వరకు నీ మనసులో ఎవరిని ఎందుకు ఉంచుకోవాలో తీసేయాలో తెలిపే హక్కు    సమాజానికి లేదు.

ఒక మనిషి ఇష్టం అని అనుకోటానికీ, ఆ ఇష్టాన్ని మనసులో నిలుపుకోటానికి నీ మనసుకు కూడా నువ్వు వివరణ ఇచ్చుకోనక్కరలేదు కదా?




"మనసు కాదు బుద్ది అనాలేమో" అంటున్న తన వదనంలో వికసించిన సంతోషం కళ్ళలోని విషాద వీచికలను తరిమేస్తుంటే.....మబ్బుకొంగు నుంచి తప్పుకున్న సూర్యుని  చందంగా.....ఎంత ఆహ్లాదమనిపించిందో.

"కాదు కాదు మనసుకే నువ్వు వివరణలు ఇచ్చుకుంటున్నది."

"అదేంటి బుద్ది ఎప్పుడూ సమాజ కట్టుబాట్లలోనే కదా నడిచేది. తప్పొప్పుల తరాజు పట్టే షరాబు మన అంతః కరణాలలో బుద్దేగా. మనసేప్పుడూ ఇంద్రియానుసరిణే కదా "నాకు నచ్చింది, నాకు కావాలి" అని అంటున్నది ఇక్కడ మనసో, అహమో అవాలి కాని బుద్దేలా అయింది మొద్దు సుబ్రావ్?" 

చిన్న పిల్లాడిని చూసి స్వచ్చంగా నవ్వేస్తున్న తనను చూసి ఎంత కాలం అయింది? ఆ నవ్వెంత బావుందో.....

ఎంతో చెప్పనా? "గలగలమని నవ్వవే సొగసు కరిగిపోతుందీ చిలిపికళ్ళు మూయకే చీకటి పడిపోతుంది" అని నీ చేత పాడించే అంత బావుంది కదూ?

వద్దులే అమ్మాయ్. మళ్ళీ నా క్లాస్మేట్ ఆ అమ్మాయిలా నువ్వూ "గ్రాండ్ ఫాదర్ సెస్ మై సన్ బీ కేర్ఫుల్" అంటూ అర్థం వచ్చే ఇంకో పాటేత్తుకుందామనా? అవసరంలేదులే.

అయినా తగిన శాస్తేలె అబ్బాయికి....నీకు ఇష్టమయిన పాట నువ్వు పాడె హక్కు నీకుంది...కాని దాన్ని this is dedicated to the smiling beauties of the class అని డేడికేట్ చేస్తే భామలు ఊరుకుంటారా? పైగా పిక్నిక్లో అందరి ముందూ? పైగా మెడికోలు? 

But a memorable incident, was it not. But anyway lets not digress
లేదురా మన్నూ నువ్వు ఇక్కడ చెపుతున్నది తప్పనుకుంటా. ఇప్పుడు నీ ఆ మనిషిని కోరుకునేది నీ మనసు కాదు బుద్దేనేమో. 
నీలో మునుపటి ఆవేశం లేదు. ఆ మనిషి సామీప్యంలో, సమక్షంలో ఆకర్షణకు లొంగిపోతున్నావు అన్న సమస్యే లేదు ఇంద్రియాలు నిన్ను బంధించేసాయి అనటానికి. నచ్చిన మనిషి జ్ఞాపకాలు మిగిలున్నాయు. వాటిని తరాజులో బేరీజు వేసుకున్నావు. అయినా నీకు ఆ మనిషే నీడగా నడవాలని ఉంది. ఆ మనిషి అడుగులో అడువవ్వాలని ఉండి. ఆ మనిషి మారితే అక్కున చేర్చుకోవాలని ఉంది. ఇక్కడ ఇవన్నీ చేస్తున్నది నీ బుద్దే కాని మనసు కాదు కదా? 

నువ్వే పోరాపడుతున్నావేమో. ఇక్కడ అన్ని బెరీజులూ వేసి బుద్ది మనిషిని దూరం చేసి తన పని తాను చేసేసింది. కాని మనసు మాత్రం అలవాటయిన మత్తు పానీయాన్ని వదలలేని బానిసలా అదే మనిషిని కోరుకుంటోంది. అందుకే నాకు ఆ మనసంటే అంత అసహ్యం. అందుకే నాకు ఈ ఐక్యమవటాలూ....ఈ అహాన్ని వాడులుకోవటాలూ అంటే అంత అసహ్యం, అపనమ్మకం.




మ్....మండోదరి మహా పతివ్రత అంటారు నమ్మవచ్చా?

అదేంటి హటాత్తుగా ఇతిహాసాల్లో పడ్డావు. సరేలే. అవును మండోదరి జగమేన్నిన పతివ్రతల జాబితాలో లేకపోయినా ఆమె పతివ్రతే అంటారు నిజమే. 

రావణబ్రహ్మ లాటి దుర్మార్గుడికి ప్రేమించబడే అర్హత ఎక్కడుంది?
అయినా ప్రేమించిన తను పతివ్రతా ఎలా అయ్యింది?

తప్పు ఉపమానం. ఇక్కడ మనం మాట్లాడుతున్నది మన వ్యక్తిత్వాన్ని, మన్నూ కించపరిచిన మన వారి గురించి.

అవునా? పరాయి ఆడదాన్ని ఎత్తుకొచ్చి బలవంతం చేయటం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటం కాదా?

ఆనాటి సామాజికపరంగా కాదు.

అయితే వ్యక్తిత్వం అనేది సమాజ దృక్పద దర్పణమా?

అవునేమో. ఒకనాడు భర్త కోరితే వేశ్య దగ్గరకు స్వయంగా మోసుకెళ్ళిన స్త్రీ కూడా పరమ పతివ్రత. మరీనాడు అలా చెల్లదుగా?

అయితే సామాజిక దృక్కోణంపై మనం ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అన్నది ఆధారపడిందా?

కాదు. అవును.
ఎవరిని ప్రేమించాలి, ప్రేమించకూడదు అన్నది సమాజం నిర్వచిస్తుంది 
కాని ఎవరిని ప్రేమిస్తాము, ప్రేమిస్తూనే ఉంటాము అన్నది మన మనసే నిర్వచిస్తుంది 

వెరీ గుడ్. దొరికావు పిల్లా. అవును కదా? నిర్వచనాలు సమాజం చేసినా తన పని తాను చేసుకుపోఏదే మనసు.
ఇక్కడ నీకింత మానసిక ఆందోళన దేనికో తెలుసా? సమాజం నిర్వచనాలను నువ్వు అధిగమిస్తున్నావు అని.
ధర్మం నమ్మే నువ్వు ఇలా చేస్తే ధర్మాతిక్రమణ జరుగుతుంది అని జంకుతున్నావు 
The distress that you experience is nothing but the valid self examination every wise man does go through when crossing the boundaries set be the society. This is called post conceptual stage of thinking. సిద్ధాంతాల ప్రకారం (సామాజిక కట్టుబాట్ల ప్రకారం ) ఆలోచించే మనిషి కొంచం ఎదిగితే వచ్చేదే ఈ post conceptual stage of thinking. ఇక్కడ నువ్వు సామాజిక కట్టుబాట్లను గుడ్డిగా నమ్మక ప్రతీ సిద్ధాంతానికీ ఎక్సేప్షన్లనేవి (మినహాయింపులు...హమ్మయ్య) ఉంటాయి అన్నది స్వానుభవంగా అవగాహనలోకి వచ్చినా ఇది నీ స్వార్థానికి సంబంధించినది కాబట్టి ఎక్కడ ఉత్తి ఆకర్షణలో పడికొట్టుకుపోతున్నావో అని నిన్ను నువ్వు అగ్నిపరీక్షకు గురిచెయ్యటమే ఈ నీ అలజడి. నీకు నీ నడవడిక మీద, నీ ఆలోచనల మీదా పట్టు పెరిగిన కొద్దీ నీకు ఈ అలజడి తగ్గుతుంది. It is nothing but the process of building up your courage of conviction.

But how can I differentiate this from the blind foolish steadfastness of a stubborn person, being taken along the tides of emotion? he might be feeling the same way that he is not wrong and that he is able to analyse and declare himself free of guilt.


That's the responsibility that comes with post conceptual thinking. 
With the cup of Hamlock in your hand,
With the guards withdrawing discreetly away,
you have no other company than those of your thoughts
You are the one and only who can decide if you drink the Hamlock or repent and recant.
Its down to you, period.
Remember, the Damocles sword hangs only on the king's head. 


ఆలోచిస్తే, ఆలోచనలు ఉంటె..... జీవితం ఇంత వంటరిని చేస్తుంది అనుకోలేదు రఘూ.

చేతిలో చెయ్యి వేసి అన్నాను 
"ఒంటరివెక్కడయ్యావు? 
నీ గుండెలో దాగున్న ప్రేమ ఉంది 
చేతిలో చెయ్యి వేసి నడిపించే నీ వారున్నారు 
ఇంకా ఒంటరివా?"

7a  6 5 4 3  2  1 

No comments:

Post a Comment