Thursday, 26 April 2012

"హాపీ బర్డే టూ యూ ....."

"నిజంగానే చెప్తావా వెళ్ళి"
వెనక్కు తిరిగి చూసి "నువ్వా. నువ్వెందుకొచ్చావిక్కడకు తననొదిలి?"ప్రశ్నించాడు
చూపులు మాత్రం గదిలోపలికే
ప్రశాంతంగా నిద్రపోతున్నారిద్దరూ.
"ప్రశాంతంగా" వత్తి పలుకుతూ తన పునరుక్తి
వెనక్కు తిరిగి చూసిన రాహుల్ కళ్ళలో ఉక్రోషపు ప్రశ్నకు
"అవును నువ్విప్పుడు ఇలా నీ ప్రేమను వ్యక్తం చెయ్యటం నిజంగా తన ప్రశాంతత చెడకొట్టటమే" స్థిరంగా జవాబు

అలాగే గడపవతల కూర్చుండిపొయ్యాడు
కౌగిలిచ్చేందుకు ఉయ్యాల లేదు.
తలనిమిరెందుకు గోడ మీద రవివర్మ సీతమ్మవారూ లేరు
"ఇల్లంతా బోసిపొయ్యింది చూడు"

పక్కన కూర్చుని తన మోకాళ్ళపై తనే తల పెట్టుకుని కాళ్ళు రెంటి చుట్టూ చేతులేసుకుని దగ్గరకు లాక్కుంటూ వాళ్ళను చూడసాగింది

"ఎందుకిలా? .....వెళ్ళింది కదా?"
"నిజంగానే అంత తొందరగా అక్కడ ఉద్యోగం వచ్చిందంటే ఎలా నమ్మావు?"
కళ్ళలోని తీక్షణతకు దించుకోక తప్పలేదు అతనికి

మవునమైపోయిన అతన్నిచూసి ఒక నిట్టూర్చి "పోనీలే అలా అనుకునే, నీ స్వార్థం కొంతైనా చూసుకుని, నాకు జీవితాంతం ఏడ్చే బాధ తప్పించావు" అంటున్న తనను "నీకా, తనకా" అని అడగలేదు అతను.,
తనపక్కన కూర్చుని నిట్టూరుస్తున్నది ఎవరి ప్రాణవాయువో తెలుసుగనక.

"అలా ఎలా పడుకోగలదు నిశ్చింతగా ఇవాళ నేను వస్తానని తెలుసుగా?" చిన్నపిల్లాడి ఉక్రోషం మళ్ళీ తనని చూస్తూ

"ఏం నువ్వు పోయినసారి, ఇదే రోజు, సరిగ్గా ఇదే సమయానికి, ఒక్క సారి ఫోన్ చేసి, నిద్రపోతుంది అనుకుని మానేసేయ్లా?తను ఎన్ని గంటలు ఎదురుచూసిందో నీకేం తెలుసు?"

"నువ్వూ అలా అంటే ఎలా? ఐదు రింగ్లకు తను ఎత్తకపోతే ఎత్తలేకపోతోంది అనేది అర్థం అని కట్చేసే అలవాటెప్పటిది?"

"కానీ పుట్టిన రోజుకు కూడా అలవాటుకు బానిసవుతావా?"

"తనకు మళ్ళీ ఇతరులతో ఇబ్బంది వద్దనే కదా. మరుసటి రోజు చేసాను కదా?"

"మరుసటి రోజుకూ, నీ నుంచి తను కోరుకున్న సమయానికీ, రోజుకూ తేడా మరిచిపోయ్యి నువ్వెలా నిద్రపోగలిగావు" చాల్లే సోది ఇక వాదనలు అనవసరం అన్నట్టుగా అవులించేస్తూ

"అపుడపుడన్నా గుర్తుకొస్తానా?"
తను చూసిన చూపుల్లోని అసహ్యం
తల దించేసుకున్నాడు

కోపంతో చివాలున వెళ్ళిపోతున్న తనను చెయ్యిపట్టి ఆపగలిగాడు.
ఆశ్చర్యంగా, ఇష్టపడిన యువతి మనసేమిటో అర్థమయ్యేట్టు, పామరుడి పాశానికి ఆత్మశక్తి ఆగిపోయింది.

"నువ్వేమనుకుంటున్నావు చెప్పు తన గురించి? నీకు తెలిసిన ఫాక్ట్స్ ఎవ్వరికీ తెలీవు కాబట్టి వారేమనుకున్నా ఒకే కాని నువ్వు,  నువ్వేమనుకుంటున్నావు చెప్పు?" ఉసులు బుసలుగా కనిపిస్తుంటే "అనినన్గన్నులు జేవురింప....." గుర్తొచ్చి నవ్వేసుకోక ఉండలేకపోయ్యాడు

ఆ నవ్వు చూసి కొంచం ప్రసన్నురాలయింది తను కూడా. అవును మరి అపురూపాలను చూస్తె అందరికీ అపురూపమే.

"నీకు తెలీదా నేనేమనుకుంటున్నానో?"
"మరెలా అనగలిగావురా బద్మాష్ నిన్ను మరిచిపోయుందా అని?"
తన్నెవరూ అర్థం చేసుకోరేమన్నకసి, కోపం ఆ స్వరంలో

"బాబున్నాడుగా వాడు చాలు లోకం మరవటానికి"అతని గొంతులో ఈర్ష్య
"ఒరేయ్ చిన్నపిల్లాడి మీద జెలసీ ఎందుకురా?"

అప్రయత్నంగా "ఒరేయ్ షార్ట్స్లో భలే ముద్దోస్తున్నావురా" అన్న గొంతులా హస్కీగా కంఠం.
"ఆ........... ఈ సంబడాలకేం తక్కువలేదు" బయటకు కోపం వచ్చినా అర్థమయింది లోపలి సంతోషం, నిజంగా నిజమే.

"మా గాలి సోకలేని మబ్బుకేది వర్షం, మా వేడి తాకలేని పసిడి కాదు హారం, మా కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం...".
"చంపేస్తా పిచ్చిపిచ్చిగా అనుకున్నావంటే" అంటున్నా పంటి కింద దాగని నగవు
మళ్ళీ తనే "ఏంటోయ్ వచ్చేదో విషాదగీతమాలపిస్తావు అనుకుంటే ఇలా రొమాంటిక్గా మురిపిస్తున్నావు"
"నువ్విలా మామూలుగా మాట్లాడితే ఇక నాకేం కావాలి చెప్పు" అతని ప్రశ్న

మంచంపైనున్నదీ, తన పక్క కూర్చుని మాట్లాడుతున్నదీ ఒకరు కాదన్న నాటకానికి తెరేసేసారు ఇద్దరూ

"ఎవరొద్దన్నారు నన్నిలా వాడుకోవద్దని? పిలిస్తే ఎప్పుడయినా రానన్నానా?"
"కష్టంగా ఉంటుందిరా నీ పిలుపూ, నీ పాటా, ముఖ్యంగా నీ మాట ప్రత్యక్షంగా లేక"
"-"
"పైగా ఇలా చేస్తుంటే లోకమే కాదు నా బుద్ది కూడా దెప్పిపొడుస్తోంది కలల్లో తేలే ఫాంటసిస్ట్ అని"
"మనుషులు మంచివాళ్ళతో కూడా నీతిగా ప్రవర్తించకపోతే ఇక మంచివారికి మిగిలింది కలల బ్రతుకేగా" గాద్గత
"-"
ఈసారి మవునాన్ని పడకుండా పట్టుకోవటం రాహుల్ వంతయ్యిందీ బంతులాటలో

పెళ్లికూతురు కళలో తను పూబంతి కోసం వెయిట్ చేస్తూ......
"ఛ" అనుకుంటూ ఆపేసాడు రాహుల్ కళ్ళమేస్తూ

"ఆపేసావేం రాహుల్ ఊహల్లో కూడా అనుభవించనీయవా" తన స్వరం
"ఇదే తేడా నాకూ తనకూ నా ప్రతి చేష్టకూ నా స్ఫందన ప్రతిస్ఫందనే చూసుకుంటా కాని తను మాత్రం......"

"..పిచ్చిపట్టిందా నీకు? నాకు లేని గుణాలు ఎందుకాపాదిస్తావు? నిజాన్ని ఒప్పుకోటానికి ఎంత కాలం పడుతుంది నీకు?" కఠినంగా తను.

"ఎంత కాలమయినా నాకు ఒకేనే. మళ్ళీ నువ్వు పుట్టాలి. మళ్ళీ తను కలవాలి. మళ్ళీ నన్ను లాలించాలి. అప్పటిదాకా ఇంతే".

"నేను మళ్ళీ పుట్టటం ఎందుకు? నన్ను తననుంచి విముక్తి చెయ్ చాలు నీ దగ్గరకు వచ్చేస్తా" నిర్గుణ స్వరూపంగా మనోజ

"లేదు నీకీ ఖైదు తప్పదు. సగటు మనుషులం మేము. మా బలహీనతల ప్రకారం నడుచుకోవటమే నీ విధి. నీకంటూ వేరే అస్థిత్వం లేదు. మళ్ళీ నీ జననం జరిగి నువ్వు పరకాయం చేసే దాకా నువ్వు ఖననమయినా సరే తనలోనే. అదే నా లక్షణం. నీకదే లక్ష్యం తప్పదు"

"పుట్టిన రోజు విషెస్ చెపుతానని వచ్చి ఖననం అంటావేంటి మొద్దు సుబ్రావ్?" ఎండా వానల కలయిక తన కళ్ళల్లో

"వెయ్యి పుట్టిన రోజులు చేసుకోరా. ఇలాగే ప్రశాంతంగా."
ఈసారి నెత్తి మీద జుట్టు చెరుపుతుంటే సంవత్సరం కిందటి అసహ్యం లేదు

"అంత పాపం చెయ్యలేదులే నాయనా."
"కానీ రాహుల్, నీలాటి వాడు ఇలా విషెస్ చెపుతూంటే మాత్రం జరామరణాలను జయించాలనిపిస్తుంది" మళ్ళీ తనే

"చతుర్దశికి రాలేకపోయ్యా సారీ".....పక్కనున్న అక్షింతలు అందుకుంటూ అంటే

"రాలేక కాదు. నాకిష్టమైనీ రోజునే ఆశీర్వదించాలని నీ ఇష్టాన్ని వదులుకున్నావ్. ఇంకెప్పుడు నమ్ముతావ్ నీ ప్రతీ సంకల్పం నాకెరుకేనని?

".." నవ్వేసాడు

"ఏదీ నా గిఫ్ట్?"

"తెలేదురా" ఖాళీ చేతులు చూపిస్తూ

"ఇడియట్. ఇచ్చిన బహుమతిని చూపించేందుకు ఎందుకు వెరుస్తావు?"

నాలుక కోసల నుంచి పుట్టిన వాటిలో మాత్రమె హేళన
కంటిలోని భావన....దానికి పేరు లేదు!

"ఏదోలే. రా మొక్కు"
మారుమాటాడక  వచ్చి మొక్కింది
అక్షింతలేసాడు

"శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి"

మారాణికి


2012 
గవ్వలూ, ఆల్చిప్పలూ, శంఖాలూ........


నీకు నచ్చేట్టు, నీకు సంతృప్తిగా...... ఈ సంవత్సరం అంతా....సుఖంగా....నీ జీవితం ఉండాలి
a very very happy birthday ra..... 
 


అవును ఈ సంవత్సరానికే ఈ విషెస్
వచ్చే సంవత్సరానికి నేను విషెస్ చెప్పి నేను చెప్తేనే నీ జీవితం సుఖమయం అని అనుకోవద్దు మరీ :) ?

Tuesday, 24 April 2012

కుదరదంటే కుదరదు.

మన్మొహనా........ అన్నేననుకుంటే
మీరాకు రాధకూ అన్య్యాయమంటే ఎలా?


(చూసావా, కృష్ణతత్త్వం కూడా అవగతమవుతోంది.)



చీకటికి చేసిన ఎంబ్రాయిడరీలు

అందంగా
నిండుగా
దేదీప్యంగా
ఒకచోట.......
పట్టలా!
చెల్లా చెదురై
మసక మసకగా
చీకటికి చేసిన ఎంబ్రాయిడరీల్లా ఉంటె,
విలువెంతో తెలిసింది.
అక్కసొద్దు సూరీడా
నిన్ను గిరాటేసుకున్నా నిజమే.
ఇప్పుడపురూపమనిపిస్తున్న తారలు
నీ ఆత్మరూపాలేగా!

Saturday, 21 April 2012

:౦ :) :౦ :)

"అమ్మా నేను పెళ్లి చేసుకున్టానే..ఇప్పుడే ఇక్కడే"
ఫోన్ చేసి అమ్మతో చెపుతున్న పాసెంజర్ పోరిని చూసి ఆటో వాడు ఖంగు

"ఇప్పుడే ఇక్కడ ఎం పీ ఎస్ వాళ్ళ గాజుల హోర్డింగ్ చూసాను. ఈ గాజులు నాకేవడిస్తాడో వాడినే పెళ్లి చేసుకుంటా"
బుర్ర గోక్కున్నాడు వింటూ 

"అయితే సరే పెళ్లి కాన్సిల్...నువ్వే కొనివ్వు...బై"

ఫోన్ పెట్టేసిన పోరిని చూసి
కొంచం అనుమానంగా, కొంచం ఆశగా, కొంచం భయంగా
"ఆ గాజుల రేట్ ఎంత మాడం" అడిగాడు.

:౦ :) :౦ :)









ఇష్క్ (౨౦౧౨) సినిమా నుంచి

Friday, 20 April 2012

ధర్మమంటే-5

తత నాందీ ముఖీం రాత్రీం సూత మాగధాః
తుష్టువుర్వాగ్విశేషఙ్ఞాః స్తవైః మంగళ సమ్హితైః
"................
సతూర్య ఘోషః సుమహాన్ దివం ఆపూరయాన్నివ
భరతం శోక సంతత్పం భూయ శొకైః అరంధయత్
తత్ర ప్రభ్భుధ్ధోః భరతః తం ఘొషం సమ్నివర్త్యచ
న అహం రాజ ఇతి చ అపి ఉఖ్త్వా శతృఘ్నం ఇదం అభ్రవీత్


( వశిష్టునిచేత పురమాయింపబడిన?) సూత మాగధులు మొదలైన వారు, మంగళవాద్యకారులూ తమ తమ నెలవులననుసరించి భరతుని మంగళధ్వనులతోనూ, మంగళవచనములతోనూ నిద్రలేప చూస్తే నిద్రలో ఉన్న భరతుడు "నేను రాజును కాను" అంటూ లేచి వారిని ఆపాడట

అనుజగ్ముషచ తం సర్వే మంత్రిణా సపురోహిత్స్సః
బభూర్వుష్చ ముదా యుక్తాః తం దృష్ట్వా వెశ్మ సంవిధిం 2-91-37

తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవచ
భరతోమంత్రిబిర్సారధం అభ్యవర్తత్ రాజవత్ 2-92-38


(అన్నను వెతికి పట్టుకుని ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించి ఆయన స్థానంలో తాను వనవాసం చెస్తానంటూ బయలుదేరిన భరతుడు, భరధ్వాజ మహర్షి బలవంతపు ఆతిధ్యానికి కట్టుబడి ఆతిధ్యానికై సృష్టింపబడిన రాచమందిరంలోని రాజాసనాన్ని, ఛత్రఛామరాలను శ్రీరామునివిగానే భావించేసి బహ్రతుడూ మంత్రులూ ప్రదక్షిణం చేసారట)

ఇది కదూ ధర్మానుష్ఠానమంటే?
ధర్మమేదో తెలిసి,ఎవరో బాధపడతారనీ ..... పొనీ తనవారే, బాధపడతారనీ ధర్మానుష్టానం ఆపటం?...........................ఎలా?

వీరు కదూ గురువులంటే?
వీరికి కదూ గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః అని మనం చేతులెత్తాల్సినది?
ఒకాయన నిద్రలో ఆలోచనలకు పరీక్షపెడితే ఇంకొకాయన మెలకువలో ఆదమరుస్తాడేమోనన్న పరీక్ష.

ఇవన్నీ వింటుంటే ధర్మాన్ని ఆచరించటమే కాదు ఆ ధర్మాన్ని అందరికీ తెలిసేలా ఆచరించటమూ ఆవసరమే అన్నది కూడా అర్థమవదూ?

ఈ పెద్దాళ్ళకందరికీ తన మనసులోది ఎందుకు నిరూపించాలి?
ఇక్కడ నిరూపిస్తున్నది ఈ పెద్దాళ్ళకా?
అయోధ్యలో ఎంతమంది చాకలాళ్ళు ఉండింటారు?
వారికి కదూ ఈ నిరూపణలు?
బంగారు ప్రతిమ సీతమ్మకు స్వాంతనానికా?
తను నమ్మిన ధర్మాన్ని నేను ఏకపత్నీ వ్రతుడనే అంటూ ఎలుగెత్తి చాటటం కాదూ ?

ధర్మాచరణం............అదీ బహాటంగా, వినమ్రంగా, చిత్త శుధ్ధితో, త్రికరణంగా......... కంటే ధర్మప్రచారమేముంది?











శ్రీ చాగంటి.నెట్ వారికి, గురువుగారికీ కృతఙ్ఞతలతో

బహాటంగా

Wednesday, 18 April 2012

అచ్చంగా నా కూతురే

అమ్మ కావాలీ అని ఏడుస్తోంది నీ కూతురు ఏం చెప్పుకుంటావో చెప్పుకో పో......అమ్మ మొహంలో విసుగు, కోపం, బాధా అన్నీ
ఏరా ఏమిటీ ఏడుస్తున్నావట?
అందరికీ మమ్మీ ఉంది నాకే లేదు...నాకు మమ్మీ కావాలీ.......
మమ్మీ ఎందుకు కావాలిరా నీకు?
మూడేళ్ళ పాపను భుజానికెత్తుకుంటూ అడిగాడు
అందలికీ ఉందిగా, నాకూ కావాలి
మ్మ్.....మీరందరూ పరిగెత్తగలరు నాన్న పలిగెత్తగలరా?
లేదు నీకు కాలు ఆయి అన్నావుగా పలిగెత్తలేవుగా
మలి పక్కింటి లాము చూడగలడా?
లేడు పాపం కల్లు లేవుగా
పొనీ మనం బయతికెల్తుంటే రోడ్ పక్కన అలుక్కునేవాడు...వాడు స్కూటర్లో వెల్లగలడా
వాడికి డబ్బు లేదుగా........
భుజంపైనున్న పాప మవునమైపొవటం తెలుస్తూనే ఉంది
అదృష్టం ఎలా ఉంటుందో అనుకున్నాడు పాపను తెచ్చుకునేప్పుడు
పాప విత్తు ఫలమో, పెంపకమో తెలీదు కాని ...తనిలా మవునమైపొతున్నప్ప్డంతా తనెంత అదృష్టవంతుండో అని తలుచుకు మురిసిపోతాడు.

*****

నాన్నా అమ్మ గురించెప్పుడూ చెప్పవేం?
చదుకుంటున్న తల్లి హటాత్తుగా అడిగితే మాట నోట రాలేదు
కళ్ళు మాట్లం మాటాడాయి
నలభై ఆరెళ్ళవాడి కళ్ళు మాట్లాడటంలో గొప్పేముంది?
కాని ఏడేళ్ళ పిల్ల వాటిని చదివి మెడను కౌగిలించుకుని
"ఇంకెప్పుడూ స్డగనులే నాన్నా" అనటంలో గొప్పతనమెక్కడిది? ఎవరిది?
నిద్రపోతున్న పాపను చూస్తూ అనుకున్నాడు
నా భార్యను నీ తల్లని అబధ్ధాలాడలేను
నీ తల్లిని నా భార్యని ఆలొచనల్లో కూడా పరిచయం చేయలేను
ఈ తండ్రిని మన్నించురా కన్నా.

*****

ఆడదిక్కుండింటే ఇంకెంత ఘనంగా జరిగేదో
అనుకోకుండా ఉండలేకపోయాడు
ఈ మధ్యకాలంలో ఎవరు పట్టించుకుంటున్నారివన్నీ అంటూ బుధ్ధి అంటున్నా
మగాడికి చాయామారంగా కూడా పరిచయమవని అమ్మతనానికి నాందీ భూతమయిన ఈ రొజున కనీసం పట్టుపరికిణీ అయినా ఉండేదిగా అనుకోకుండా ఉండలేకపోయాడు.

ఇక్కడికి కూడా దాపరించావా? స్తాకింగు కూడా నేర్చుకున్నావనమాట...వినిపించిన స్వాగతం.
"...."
వెతుక్కుని మరీ వచ్చావుగా ఏమిటో చెప్పు అలా ఉండిపోయావెందుకు?
పాపకు గంధం పూసి నీ చేతులతో మొదటి రవిక ఇచ్చి వెళ్ళు.
పోనీ రావటం ఇష్టం లేకపోతే ఇక్కడే మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షితలు చల్లు.

మీ ఆవిడేం చేస్తోంది పోయిందా? నెరిసిన జడేసుకుంటూ ప్రశ్న కొంత శాంతంగా.

పెంచుకున్నానని తనకింకా తెలీదు.

తిరిగి చూసిన చూపులో ఎన్ని వేల భావాలు చదవొచ్చు?

పట్టు లంగా వోణీ కొని సువర్ణాక్షతలు చల్లి దేవుడిదగ్గర పెట్టిస్తూ పెళ్ళి పీటల మీద కూర్చో అంటూ పిచ్చి వేషాలెయ్యద్దు అంది.

మవునాన్ని తనకు బహుమతిగా ఇచ్చి వచ్చేసాడు.

*****

నాన్నా టీచర్నవుతాను నాన్నా
ఏం సబ్జెచ్ట్ చెపుతావురా?
మాథ్స్. మా క్లాసులో అందరూ నన్ను ఏమని పరిచయం చస్తారో తెలుసస్? మేథ్స్లో మాత్రం జీనియస్ చూడు ఆ అమ్మాయి అని గలగల నవ్వుతూ అంది
పునః పరిచయమైన గతపు చాయలు
మేత్సంటే భయపడే వాడు ఎమ్మెస్సీ చెద్దామా అని నలభయ్యో వడిలో వెతికేలా చేసిన గతపు చాయలు..సువాసనలు కోల్పోకముందే క్రొంగొత్త రంగులు నింపుతూ కొత్త తరం
చాలా ఏళ్ళ తరవాత కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు

*****

కాళ్ళకు రాసిన పారాణిని చూస్తూ నాన్నా మీ పక్కన మీ హరిద్రా స్వరూపాన్నే పీటలమీద పెట్టుకుని మీరే కన్యాదానం చెయ్యండి నాన్నా అంటున్న కూతురిని మొదటిసారి చూస్తున్నట్టు చూసాడు.
గమనించలేదనుకున్నారా నాన్నా దంపతులు కూర్చోవాల్సిన ప్రతీ చోటా మీరు పెట్టే పసుపు ముద్దను? ఇర్వై అయిదేళ్ళు నాన్నా నాకిప్పుడు. ఎప్పుడూ గమనించలేదనుకున్నారా నాన్నా?
పీటల మీద కూర్చోమని చెప్పి ఇప్పుడిలా చేస్తే పెద్దమేనత్త బాధపడుతుందిరా అదసలే కొంచం పట్టింపున్నది...
నేనొప్పించేసా నాన్నా
మీ అత్తింటివాళ్ళకేం చెప్తావురా నవ్వుతూ అడిగాడు
రిజిస్టర్ మారేజయినా పర్లేదన్న మా అత్తామమలకు ఏదయిన ఒకటే నాన్నా
తనకు మాత్రం మొత్తం చెపితే మనస్ఫూర్తిగా అంగీకరించాడు నాన్నా

ఏమని చెప్పావురా కలగాపులగంగా కళ్ళళ్ళో మెరుపులూ కుండపోతలూ

అమ్మెవరో తెలీదు రాజేష్ నేనింత వరకూ చూడలేదుంకూడా కనీసం ఫోటో కూడా
కాని నాన్న గుండేలో మాత్రం అలా నిలిచిపోయిందన్నది తెలుసు
ఎవరూ ఎందుకూ ఏమిటీ అంటూ ఇంతవరకు నేనడగలేద్య తను చెప్పలేదు
ఎలాటి బంధమైనా కాని .........ఆ అనుబంధం మన మధ్య ఉండాలి రాజేష్
మా నాన్న మా అమ్మను ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తావు కదూ అని అడిగాను నాన్నా

పుష్ఫ వృష్టి కురవాల్సిన చోట అశృవులు కురుస్తుంటే బీరువా తెరిచి పాత పడిన ఫోటో ఒకటి ఇచ్చాడు.......నా భార్య కణ్ణా అంటూ

నాకు అమ్మ కూడా నాన్నా
ముద్దు పెట్టుకుంది


నా కూతురు
అచ్చంగా నా కూతురే.
నే కనకపోతేనేం?
అచ్చంగా నా కూతురే.

Tuesday, 17 April 2012

ధర్మమంటే -4



భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యంచేదముపస్థితమ్..2.50.39..
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే.

"అన్నీ తింటాడనా?
ఎందుకు మరిన్ని చేసాడు గుహుడు?
ప్రేమ అనుబంధం ఉన్న చోట లెక్కలు చూడరు."
అన్నారు గురువుగారు.
నారద మహర్షి ప్రేమ గురించి అంటారట....

అనిర్వచనీయం ప్రేమస్వరూపమ్
మూకాస్వాదనవత్
ప్రకాశతే క్వాపి పాత్రే
గుణరహితం కామనారహితం ప్రతిక్షణవర్ధమాన మవిచ్ఛిన్నం సూక్ష్మతర మనుభవరూపమ్
తత్ప్రాప్య తదేవావలోకతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చిన్తయతి

(http://vaagvilaasamu.wordpress.com/2010/04/07/ప్రేమస్వరూపము/)
అట. మరలాటి బంధం లౌక్యం చూస్తుందా? ఉచితానుచితాలే చూడదు కదా? "ఎవడబ్బ సొమ్మని కులికేవు రామచంద్రా......" అనేంత లగ్నం అవుతుంది కదా.
ఇదే చోట గుహుడు శ్రీరామునికి గల బంధాన్ని వివరిస్తూ గురువుగారు "స్వధర్మో నిధనం శ్రేయహః పరధర్మో భయావః" అన్న సూక్తిని ఉటంకిస్తారు.
స్వ ధర్మః
పర ధర్మః

నిర్వచనాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోందా?
అలానే నిలబడు.
".......ధృత్వేచ నియమేచ...."
తప్పదు.

Friday, 13 April 2012

ధర్మమంటే...3


నాశ్రేయసి రతో విద్వాన్నవిరుద్ధకథారుచి:
ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా..2.1.17..










thanks to http://mdileep.wordpress.com/category/అయోధ్యకాండ/page/15/

కథం చితుపకారేణ .....2-1-11

నిజంగా గ్రేట్ కదా రాముడు?

చిన్నపాటి సాయం చేసినా పదే పదే గుర్తు చేసుకుంటాడట......

Thursday, 12 April 2012

త్వమపి రామా? :)

కిం త్వా.?మన్యత వైదేహ: పితా మే మిథిలాధిప:.
రామ! జామాతరం ప్రాప్య స్త్రియం పురుషవిగ్రహమ్..2.30.3

(thanks to http://mdileep.wordpress.com/2012/03/02/ayodhyakaanda_sarga_30/)

Monday, 9 April 2012

ధర్మమంటే 2

యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ
సవై రాఘవ శార్ధూల ధర్మస్త్వమభిరక్షతు



Proof

nammakamanTea......arthamayindi.

Sunday, 8 April 2012

then what the hell is love

if
wants are selfish
tears are curses
hollow heart
impotent disguise
steadfastiness
emotional blackmail
muted anguish
cowardice personified

Saturday, 7 April 2012

ధర్మమంటే. 1

కథంచితుపకారేణ కృతేనేకైన తుష్యతి
న స్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా