Monday, 30 June 2008

దైవమంటే నిరసన ఎందుకు మిత్రమా?

దైవమంటే నిరసన ఎందుకు మిత్రమా?
తెలుసు మతమంటే మత్తన్నాడని లెనిన్
తెలుసు వాటి దురాచారాలేన్నెనో అనిన్
అసలు మతము అంటే ఏమిటి?

రాతి విగ్రహం, బాబాలు-బైరాగులు,
గుడీ గోపురం, ఆచార వ్యవహారాలు
ఇవన్నీ దైవము, మతము అని అంటావు
వాటి వలన వచ్చే నష్టాలు చెప్పబోతావు

కానీ మిత్రమా,క్షణమాలోచించు-
నిజంగా అవేనా దైవం, మతం అంటే?

కావా అవి కేవలం వారి వారి "నమ్మకాల" స్వరూపాలు?
శిలా విగ్రహమే దైవమని నమ్మేరు
కొందరు బాబాలే యుగ పురుషులంటారు
అలాగే ఆచారాలు, వ్యవహారాలూను!!!

దైవమంటే "రాముడని", "అల్లా" అని, "జీసస్" ఆస్తికులు
కాదు "విధి" అనీ, "ఫేట్" అనీ నాస్తికులు
కాదు కాదు "విజ్ఞానమే" అని ఇంకొందరు
అసలే కాదు "సత్ప్రవర్తనమే" అని మరెందరో

ఎవరేమన్నా ---అవి వారి వారి
"నమ్మకపు ప్రతి-రూపాలే" కదా.

నీకు కాదా "లెనిన్" దైవం, "ఎరుపుదనం" మతం
"ఇజాలు" అన్నీ మతాలేనే తరచి చూడ.
లేదా మరి "ఎరుపులో" తప్పు?
రైలు బండ్ల, ఎకస్చెంజిల ధ్వంసం చూడ......

మతాలన్నీ- దైవాలన్నీ "మన"షుల కల్పనలే కదా
మనిషి మనిషిలో తప్పులున్నవి-
మరి ఆతని సృష్టిలో తప్పులుండవా?


మన చేతిలో లేని పుట్టుక వలన వచ్చె-అనుభవాలు
అవి తెచ్చెనమ్మకాలు
నమ్మకాలాయే-మతాలు
అవి సాధించే వారే-దైవాలు

మనిషి మనిషి పుట్టుక వేరు కదా
అందుకే వివిధ దైవాలు-మతాలు
నీ మతం-దైవం నీది
నా మతం-దైవం నాకొదిలేయి

ఓపికున్న మతాన్ని సరి చేయి
లేదన్న ఒదిలేయి భాయీ.


చిన్న వివరణ- ఈ టపా ఒక ఆర్కుట్ కవితల గుంపులో ఒక "ఎర్ర" మితృడు కొన్ని సార్లు దైవము అంటే నిరసనగా రాయటము చూసి దానికి జవాబుగా రాసినది.

ద్వైతం -అద్వైతం, కులం-శాఖ, నీ మతం-నా మతం, ఆస్తికుడు-నాస్తికుడు, కర్మ యోగి-భక్తీ యోగి, marxcist-leninist ఇలా అందరూ ఎన్నో రకాలుగా వేరే వారి మతాన్ని నిరసిస్తున్నారు--

"మతం అనేది నమ్మకం/మార్గం, దైవం అనేవాడు మార్గ దర్శకుడు" ఈ సూత్రాన్ని నెమరు వేసుకుంటూ చేసిన ప్రయత్నమే ఇది. (కొద్దిగా "ఎరుపును" ఎక్కువ target చేసినట్టు నాకే అనిపిస్తోంది నిజానికి :-)

2 comments:

  1. veeri laa kavitallo spandana cheyalenu kaani.. typical hyderabdi style lo oka

    "Wah...Wah!!" esesukondi.. mee kaata lO :-)

    ReplyDelete
  2. "నీ మతం-దైవం నీది
    నా మతం-దైవం నాకొదిలేయి".

    చాలా బాగా చెప్పారు.

    ReplyDelete