"నువ్వు కష్టపడి కష్టపడి
సుఖపడటం మర్చిపోయావోయి"
దగ్గర వారి కితాబు.
"నిజమేనా?" అనుమానమొచ్చింది......
"ఏమో?"-
అయినా అయ్యుండొచ్చు!
లేకుంటే ఎందుకీ అశాంతి?
ఆరోగ్యం- బ్రహ్మాండం
డబ్బు దస్కం- బానే ఉంది,
ఉద్యోగం- మంచి సద్యోగం,
అయినా ఎందుకీ అశాంతి?
తనకు నేను, నాకు తను
మరి "మాకు" ఎవరు?
ఇది కారణమేమో!
సముద్రాలావల అయిన వారందరూ
బాధ పడటం మినహా
వారి బాధలు మాకేమి పట్టేను?
ఇది కూడా కారణమేమో!
ఇవన్నీ కావు- మనసు కేక
"ఆనందానికై పితుకులాటం
ఇదే నిత్య కార్యం, కలాపం
గమ్యం లేని పయనం
బ్రతుకే మరి శూన్యం".
మనసు అరిచింది.
నిజమేనేమో ......
పొద్దున్న లేచింది మొదలు
"పాటలు, సినిమాలు
నచ్చిన భోజనం,మెచ్చిన బట్ట
స్నేహితులు, హాబీలు .........."
క్షణం క్షణం సంతోషానికే అంకితం.
విసుగొస్తోంది........
అమితానందం కూడా
బాధా హేతువని తెలిసి
నవ్వొస్తోంది.
కాకపోతే......
ఇంకోటి కూడా తోస్తూంది,
"మనిషి అసలు సుఖపడ లేడేమో" అని.
ఉన్న దానితో తృప్తి పడక, ఎపుడూ
దూరపు కూండలు నునువనుకొనే మనిషి
"నిజంగా సుఖపడతాడు" అనేది
ఒట్టి కల్ల మాత్రమె అనిపిస్తోంది.
Sunday, 7 September 2008
సంతోషంలో అశాంతి
Labels:
5. వచన కవితలు,
ప్రవాసాంద్రీయం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment