బయట రెండించుల మంచు.
నిన్న రాత్రిది!
రహస్యంగా రాత్రంతా
స్వర్గంలో మగ్గంపై
నేచిన తోలిరేయి చీరలా
అందంగా, మందంగా.........
మేకప్పార్టిస్టు ఎంత కష్టపడ్డాడో.
బయటంతా స్వచ్చంగా అందంగా ఉంది
అలంకరణలో కనపడని
మొటిమలలా......
ఇంటి చుట్టూ కనపడని
మానవ చాయలు.
మేడపైని గవాక్షంలోంచి
గదిలోకి మల్లెలు చల్లుతూ
ఉనికిని చాటే ఆకతాయి పిల్లాడిలా,
ఆడుకుంటున్నాడు దేవుడు!
పైనుంచి మంచు కురిపిస్తూ.
"పో, పొ"మ్మని మనసు తొందర పెడుతున్నా
బిడియంతో అడుగు కదపని
నవ వధువులా ఊగిసలాడే
కావ్య కన్నియ, నా మది గది వాకిటనే.
ఒక్క ఉదుటున అక్కున చేర్చాలని ఉన్నా....
మర్యాద కాదని మిన్నకున్న వాడిలా
చేష్టలుడిగి ఆస్వాదిస్తున్నా,
ఎందుకా అని ఆలోచిస్తున్నా........
టక్కున తట్టింది సమాధానం
ఇవాళ సోమవారం,
ఉదయం పదకొండు సమయం,
గుర్తుకొచ్చింది ఉద్యోగం.
కోరి చేరిన దానిని
ప్రియంగా కౌగిట బిగించే వేళ
గుర్తుకొచ్చిన పెళ్లాంలా....
అప్రియంగా గుర్తుకొచ్చింది ఉద్యోగం.
"ఆ..అది సరిగ్గా ఉంటే నాకెందుకీ గతి"
సమాధాన పరుచుకునే "పురుషుడి"లా
"బయట మంచెక్కువగా ఉంది, కారు పోదు"
అనుకుంటూ మొదలెట్టా నా రాతలు ఇలా.
ఎందుకో అప్రయత్నంగా
"అలవాటునూ, అస్వతంత్రతనూ ......."
వాక్యం గుర్తొచ్చింది!
చాల బాగుంది.
ReplyDeleteబాబాగారు,
ReplyDeleteపర్లేదండి...పాపం తనేం అనుకోదు...మంచిది :-)
సత్యా
థాంక్స్
"రహస్యంగా రాత్రంతా
ReplyDeleteస్వర్గంలో మగ్గంపై
నేచిన తోలిరేయి చీరలా"
agree with Baba gaaru.. Wonderful comparison!