Tuesday, 10 February 2009

ఎంత తాపత్రయం?



శ్రావ్యమైన పాట వింటే గొంతు కలపాలని
అందమైన చిత్రం చూస్తె రంగులేయాలని

మంచు కురిస్తే పట్టి బంధించాలని
ఆనంద సమయాన్ని అలాగే నిలిపేయాలని

జీవితమంతా అదే పరుగు....

అశాశ్వతమైన జీవితంలో
ప్రతిదీ శాశ్వతం చేసుకోవాలని!

2 comments:

  1. బావుంది మీ కవిత. ఈ పరుగు లేకపోతే జీవితమే ఉండదేమో, అశాశ్వతంగానైనా.

    ReplyDelete