Monday, 2 February 2009

మంచు కురిసే వేళలో............1

"ఈ వెండి మేఘమాలనే
నా పట్టుపరుపు సాయనే"
తాకూడా విన్నాడేమో దేముడు!

పుడమి పడుచు పరచిన
సోయగాలకు ముగ్ధుడై
పరుపు పరుచుకోమని
దూది పోస్తున్నాడు కిందికి.........
మబ్బులను మంచుగా చేసి
దూది పోస్తున్నాడు కిందికి.......
ఎంతైనా ఆయనా మగాడే కదా!!


"ఆ... ఆ.... ఏమిటా పని?
పాపం లలన!
తట్టుకోగలదా చలికి?
ఉండు చలి కాస్తాను."
సమయమిదేనంటూ జవ్వనిని
వెచ్చని సందిట చేర్చ జూసే
సూర్యుడు...ఆకతాయి పిల్లగాడు!!!


మెటికలు విరిస్తూ
ఉరుములురుముతూ
"నేనుండగానే?"
అంటూ కసిరె
మొయిలు హొయలు బోతూ
అసూయన ఆడది!!!!


మగనాలిని చూస్తూ
దొరికిన భర్తలా,
చప్పున మొహం చాటేసె రవి,
నిమిషముండని ఆవేశంలా .........


మంచు వాన - భాను రేఖ
మబ్బు తునక - పుడమి బాల
విలాసాలు చూస్తుంటే
చిత్రంగా లేదు నాకు!

1 comment:

  1. అంతా బావుంది కానీ సినిమా పాటతో ఆరంభించడం వల్ల ఫీల్ కాస్త తగ్గిందనిపించింది :-)

    ReplyDelete