Saturday, 28 November 2009

రేపటి సాంత్వనాలెన్నున్నా........



ఎక్కడ మొదలయ్యిందో తెలీదు
ఎటువైపుకో ఎందుకో..ఊహూ..అదీ తెలీదు
పయనం మాత్రం బాగా పరిచయం
ముందుకు సాగుతున్నా సారధ్యం తనది కాదని

చుట్టూ పచ్చని చెట్టూ చేమా
మెరుస్తున్న ఊహల మేనా...క్షణ కాలం.
పక్కనె గిలగిలమంటున్న చీమ
కల తల తుంచిన కటు కరవాలం!

ఎక్కడిదో ఓ మెరుపు, అందమైన రూపు
రంగులన్నీ కోకన చుట్టి
అలా అలా ఊరిస్తూ,తేలి వస్తూ
పయనంలో తోడొచ్చింది.

పిచ్చి మనసూరుకుంటుందా
నచ్చిందనేసుకోకుండ, కోరుకుంది కూడా.
ముందు వెనుకలాలొచిస్తే
మనసెందుకవుద్దీ, పిచ్చెలా కుదురుద్దీ

రంగు రంగుల కోకల్లో
చిలకల్లే దగ్గరికొచ్చి
ఊసులు చెప్పి, చేరువయ్యి
అయ్యీ చెంత చేరలేనంది

అదేమిటంటే
జతగాడితో కలిసెళుతూ
మోయగల పొగరేదంది.
నీరుగార్చేసింది!!!

సిత్రం సూసారా
మునుపు సినుకు సూపదే
నేటి సిలక మాటదే
"భరించ" లేవంటూ గేలే.

గొంగళీ తనేనని తెలిసినా
ఇప్పటికీ గౌరవమదే
సర్వం కోల్పోతూ కూడా
మైనిండా తన ఊసులే

తప్పెవరిది?
కరిగే వ్యక్తిత్వానిదా
రంగులాశ పడ్డ మనసుదా
ఆటబొమ్మ చేసిన విధిదా

ఎవరిదైతేనేం?
రేపటి సాంత్వనాలెన్నుంటేనేం?
నేటి ప్రాయోపవేశంలో
కరిగి చెరిగిన అస్థిత్వం
చుట్టూ నల్లటి సిరాయే.

ఎన్ని భావాలు రాశుంచుకున్నా
చిత్తుకాగితప్పడవ విలువింతే.








Pics from and belong to

http://www.nearfamous.com/Images/NearFamousWebImagesOptimized/StockImages/AlfalfaButterflySunrise.jpg

and

http://abhishekibm.files.wordpress.com/2008/12/pab26111.jpg

respectively

2 comments:

  1. స్వాంతనాలు సరికాదు.
    సాంత్వనాలు సరైనది.

    ReplyDelete
  2. ఆయ్ బాబొయ్ తప్పయ్పోనాదండీ :-) సరిచేసాను తాడేపల్లిగారు. నెనర్లు.

    ReplyDelete