Tuesday, 30 March 2010

ఒక్క చుక్క ఒలకలా .....ఒట్టు!


జ్ఞాపకమేదో అలలా
కంటిపాప ప్రసవ వేదన.
పాపం!

నిర్ణయానికి తలవంచి
కన్నీటి పాపకు
వడ్ల గింజల
అన్నప్రాసన!

మాతృత్వం, కడుపుశోకం
ఏక కాలంలో
నవమాసాలూ
లిప్తమాత్రంలో!

No comments:

Post a Comment