"....అంతే కాదు నీ గురించి ఇంకా చాలా తెలుసు. సిగరెట్ కాల్చటం కూడా తెలీని వేస్ట్ గాడివి, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం అటు తిప్పుకుంటావు, అమ్మాయిలు అస్సలు అర్థం కారు నీకు. నీకున్నదంతా, నీ ఆఖరు రూపాయి కూడా ఇతరులకు ఇచ్చేస్తావు, కొంచం జాలి ఎక్కువే" అంటూ ఈనాటి తెలుగింటి ఆడపడుచు తెలుపలేదు మనసూ అంటూనే "గోదాట్లో" కడిగేస్తోంది పరువు.
ఇంతవరకు "నామీద అంత నమ్మకమేంటి నీకు? అయినా నాగురించి ఏం తెలుసని అలా సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర" అని అడగలేదు కాని దగ్గరైన స్త్రీలు మాత్రం అలా డైరెక్ట్ గా కాక సుతిమెత్తగానే నాకు క్లాసు తీసుకున్న సందర్భాలయితే తప్పక ఉన్నాయి.
"పలుగురితో తిరిగే షోకిల్లా తానయినా తన గుండెల్లో నాకో కిల్లా కట్టాలి" అంటున్న పాట మంద్రంగా కారులో వినపడుతుంటే నా ప్రాణస్నేహితుడు తనను వదిలి వెళిపోతున్న ప్రేయసి గురించి చెపుతూ "నేనో పదిహేను మంది ఆడాళ్ళతో తిరగాలటరా. అప్పుడు కాని తను నాకు సరితూగదట. I don't deserve your bachelorship అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయిందిరా నా తల్లి" అంటూ చెప్పిన సందర్భం నా ఊహాజనితం కాదు.
"I want to make love to you" అంటూ ఏం మాయ చేసావే అనుకునేలా మతిపోగోట్టిన ప్రేయసికి సూటిగా చెప్పగలిగిన హీరోని ఊరికే అలా చూసి ఆ కథానాయిక వెళ్ళిపోవటం లాటివి కథల్లోనే జరుగుతాయనుకుంటే "ఎందుకు తప్పు. నువ్వు స్త్రీవి నేను మగాడిని. నాకు నువ్వు కావాలి, నీకా ప్రేమ కావాలి. తప్పేముంది" అని వెంటపడి వారంలో మగనాలిని ముద్దుపెట్టుకుని, నెలలో హద్దులన్నీ చేరిపేయించగల వాళ్ళను "I was not and will not be able say no to anything he does . I think that is the magic he has. ఆ పొగరే మగతనమేమో" అని వెనకేసుకొస్తున్న పడతులూ తారసపడ్డారు.
ఎందుకిలా దిగజారింది స్త్రీ?
చిన్నప్పుడు చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలూ, అన్నీ హీరో ఆంటే కంట్రోల్ ఉన్న వాడు, నిజాయితీపరుడూ, వ్యాసాన రహితుడూ అన్నదే చెప్పాయి కాని నేటి సంఘంలో కంట్రోలోదిలేసి పొగరు చూపించే వాడే మగాడు, వ్యసనపరుడే మగాడు, జారుడే అనుభవస్తుడు, సుఖమిచ్చేవాడు స్త్రీ దృష్టిలో.
ఎందుకిలా మారింది స్త్రీ?
న స్త్రీ స్వాతంత్రమర్హతి అన్నాడని మనువుని రీసైకిల్ బిన్లో Empty చేస్తే ఒకే కాని తను కూడా ఇల్లా Empty అవటం........ప్చ్ నచ్చట్లా.
మగాడెప్పుడూ భ్రష్టుడే అనుకుంటూ స్త్రీలో వస్తున్న మార్పు మీదే కాన్సంట్రేట్ చేసాను దీంట్లో. సో "మీ మగాళ్ళూ చేస్తున్నారుగా" అన్న మాట నిజమయినా అప్రస్తుతమే అనుకుంటా.
No comments:
Post a Comment