(from 123rf.com)
Customer is King (queen as well)!!!
"అయితే ఏమయింది? నా భార్య కొత్త కొత్త మాడల్ ఫోన్ కొనాలనుకుంటే తప్పేముంది? అందులో తనకు ఆనందం వస్తే తప్పేముంది? మేమిద్దరం ఆ వస్తువులను ఖరీదు చేయగలిగిన స్తోమత కలిగున్నంతవరకు అందులో తప్పేముంది?"
పరిచయస్థుని ప్రశ్న.
ఏమి చెప్పాలో తెలీలేదు.
బుద్ధికి తట్టనివి ఎన్నో మనసుకు ముందే అర్థమయిపోతుంటాయి అన్నదొక్కటే మళ్ళీ అనుభవమయింది
ఎందుకు తప్పనిపించిందో ఇప్పటికీ చెప్పలేను
కాని తప్పే అని మాత్రం చాలా బలంగా అనిపించింది
***
(from shop.pagalaguy.com)
ఎంబీయే మార్కెటింగ్ మాడ్యూల్లో ఏం గుర్తుందో లేదో కాని ఈ కింది పరిశోధనా ఫలితాలు మాత్రం నిలిచిపోయాయి
New to the world products (10%)
New Product lines (20%)
Additions to existing product lines(26%)
Repositionings (7%)
Improvement in existing products(26%)
Cost improvements(11%)
(Booz, Allen, Hamilton Inc's research)
వినియోగదారులకు "నూతనమైన" అని అమ్మే వస్తువులలో "నవ్యత" తెలుసుకొనేందుకు చేసిన రీసెర్చ్ ప్రకారం "నిజ్జంగా" కొత్త వస్తువులు పది శాతం మాత్రమె అట.
మిగితా వాటిలో
ధర తగ్గింపులూ
(from kotaku.com)
(ఒక మొబైల్ కంపెనీ వాడు నేను కాంట్రాక్ట్ రద్దు చేసుకునే నోటీస్ ఇస్తే నెలకు పదిహేను పౌండ్ల ధరను నెలకు అయిదు పౌండ్లకు తగ్గిస్తే రెండు సంవత్సరాలు రెండు కాంట్రాక్ట్లను కొనసాగించటంలో ఎంత నా "అవసరం" ఉందొ?)
ఉన్నవాటినే కొంచం మెరుగుపరచటం
( from maximumpc.com)
విండోస్ వాడు చేసిన విస్టా(vista), ఎక్స్పీ (XP) ఇంకా విండౌస్ సెవెన్ (windows 7) వెర్షన్స్లో ఇంటి వాడకందారునయిన (Home user) నేను ఇంతవరకూ ఎట్టి తేడాలు నేను వాడలేదు...తేడాలు ఉన్దిండవు అనటం లేదు...నేను వాడలేదు...& I consider myself as a very profligate user of internet and computers
మా సైకియాట్రీలో సిటలోప్రాం(Citalopram) అనే ఒక డిప్రెషన్ మందు ఉంది. దాన్ని తయారు చేసే కంపెనీ దాని పేటెంట్ అయిపోయే సమయానికి చిన్నపాటి మార్పులు (ఇంకొంచం శుద్ది) చేసి ఎస్సిటలోప్రాం (Escitalopram) అన్న పేరుతొ మళ్ళీ పేటెంట్ చట్రంలోకి వచ్చి, "మరింత మెరుగైన మందు" అని డబ్బాలు కొడుతూ డబ్బులు దండుకుంటోంది.
సామ్సంగ్ గలాక్సీకి దాని రెండో వర్షన్కూ ఉన్న తేడాలు నిజంగా అంత డబ్బులు పోసి ఉన్న ఫోన్ను మార్చాల్సినంతవా?
ఉన్నవాటికే కొత్త ఉపయోగాలు కనిపెట్టటం
(from fonehome.co.uk)
urinary incontinence (మూత్ర విసర్జన మీద నియంత్రణ ఉండకపోవటం) అనే వ్యాధిలో వాడే ఒక మందును డిప్రెషన్ లో కూడా పనికొస్తుంది అని చెప్పి ఇంకో పేటెంట్ తెచ్చుకోవటం
Psychosis లో (సైకోసిస్) ఇచ్చే మందులకు manic depression లో కూడా పని చేస్తాయి అని ఇంకో లైసెన్స్ తీసుకోవటం.
ఉన్న వస్తుసముదాయానికే ఇంకొన్ని చేర్చటం
నా జీవితంలో ఉదాహరణ చప్పున గుర్తు రావటం లేదు
(from crunchbase.com)
నిజ్జంగా కొత్త వస్తువులు చాలా తక్కువట.
అయినా ఎందుకు అలా ఆ వస్తువులను మనం కొంటూనే పోతున్నాం? ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాం?
(from nerdapproved.com)
(from moblog.net)
పొద్దున ఏదో చదువుతుంటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది అనిపించింది
a. needs and wants differentiation
(from tiki.oneworld.net)
అవసరాలకూ కోరికలకూ తేడా తెలియకపోవటం...కోరికలను అవసరాలు అనుకోవటం
b. autonomy of functional drive from motivation
(from personalbrandingblog.com)
మనం చేసే పనులకు అవసరమైన ఉత్తేజం(drive..సరైన అనువాదమేనా) స్ఫూర్తి (motivation) నుంచి వస్తుందట.
functional drive is usually dependant on the motivation,apparently. But as we keep on acting on our drives(ie. behaving as our impulses/drives want us to) the drive becomes the motivation, even when the original motivation no longer exists.......మనం ఒక పని చేస్తూ చేస్తూ ఉంటె, ఆ పని మనకు ఇష్టమయితే, ఆ పనికి మానను ఏది పురికోలిపిందో ఆ స్ఫూర్తి ఆగిపోయినా ఆ పని చేయటమే స్ఫూర్తి అయిపోతుందట.
(from windedwords.blogspot.com)
రసాస్వాదన ఇష్టమయిన వాడు తన రససిద్ధిని తెలపటానికి కవితలు రాయటం మొదలెట్టి, కవితలు రాయటం అనే గాడిలో పడిపోయి కవితలు రాయటం కోసం రాసాస్వాదనను వెతుక్కోవటం, కవిని-కవితలు రాయాలి కదా అని రాయటం లాటిదనమాట.
(from hyderabadspider.com)
అవసరాల కోసం వినియోగదారులం అవటం (మూడు నెలలకోసారి కుటుంబమంతా కలిసి అంబర్ పేట శ్రీరమణ థియేటర్లో సినిమా చూడటం) నుంచి వినియోగించటమే ఒక అవసరం అవటం అనమాట (ప్రతి నెల ఒక సినిమా, ప్రతి వారాంతం ఏదో ఒక షాపింగ్ చేయకపోతే ఎలాగో ఉండటం అనమాట)
అయితే
(pic from thecaptainsmemos.com)
వరకట్న పిశాచి కోరాల నుండి ఒకట్రెండు తరాల్లోనే ఎంతోమంది పుత్తడిబొమ్మలను తప్పించిన ఆర్ధిక స్వాతంత్ర్యం ఇలాటి వినియోగాదారత్వం లేకుంటే సాధ్యమేనా? May be this is but a little price to pay for the security afforded to half of the population by this necessary evil called consumerism?
ఏమో?
నాకు తెలీదు.
సరే అట్టే తీరిక లేదు నాకు.
వెళ్ళి హెచ్ డీ టీవీ అని కొత్తదేదో వచ్చిందట ..అది తీసుకురావాలి
ఎక్కడో ఒక పడతి దాస్య శృంఖలాలు తెంచాలి కదా.
ఉంటాను మరి.