మోక్షం అంటే అత్యున్నతమ సంతోషమయ స్థితిని చేరుకోవటమట....మా వీరూ నిర్వచనం. మతమంటే పాపపుణ్యాలు, మంత్ర తంత్రాలు, దశావతారాలు వంటి సూపర్ నాచురల్ (ప్రాకృత్యేతర?) విషయాలు కావు మన నమ్మకమే మతము అని నమ్మే నాలాటి సూడో ఆస్తికులకు/త్రిశంకు ఆ/నాస్తికులకు నచ్చే సిద్ధాంతమే ఇది కాబట్టి ఆమోదించేసా. ఆ స్థితిని మనకు కలిగించే మార్గమే (యోగించేదే) యోగ అన్వయించుకున్నాను. ఇంతకుముందు వేరొక టపాలో చెప్పినట్లు వీరూ ప్రకారం భక్తి యోగం రాజ, జ్ఞాన,కర్మ యోగాలతో సరి సమానమయిన మార్గమే అయినా కొంచం "తక్కువ సమాన"మట
At first glance it was right and I accepted it straight away.
ఏమో
ఈ మధ్య ఈ ప్రతిపాదనలో కొంచం పస తక్కువ అనిపిస్తోంది.
భక్తియోగం అనుభూతి ప్రాతిపదిక మీద నిలబడి ఉంది కాబట్టి, అసలయిన/అత్యున్నతమయిన ఆనందం పొందాలంటే ఏ రకమయిన రాగబంధాలూ ఉండకూడదు కాబట్టి, ఎంతో సాధన చేస్తేనే కాని ఆ రాగ ఛత్రం ఉంచి తప్పించుకోలేము కాబట్టి ఈ మార్గం "తక్కువ సమానమట"
భక్తి ఒక అనుభవం లేదా మానసికానుభూతి లేదా ఒక రాసాస్వాదనా స్థితి అనుకుని అది పొందటం/ఉండటం/కలగటం అన్న దాని మీద ఆ సాధన ఆధార పడుంది కాబట్టి అది లేకపోతె/కలగపోతే/ఉండకపోతే సంతోషానికి వ్యతిరేకమయిన భావం అంటే విషాదం కలగటానికి అవకాశం ఉంది కాబట్టి "తక్కువ సమాన"మట.
కాని
అనుభూతికి/రాసాస్వాదనకు శోధనాశక్తి, సత్యాన్వేషణా జోడిస్తే ఏ జ్ఞాన,కర్మ,రాజ మార్గాలకు తక్కువ?
అసలు మోక్ష సాధన అన్న గమ్యాపేక్షా అవసరం లేదనుకుంటాను. మన మతాన్ని(నమ్మికను)....అది రాసాస్వాదనలోనే అవనీయండి, భగవదనన్వేషణలోనే కానీయండి.....ఏదయినా సరే....నిజాయితీగా, ప్రతీక్షణం, బేరీజు వేసుకుంటూ, పుటం పట్టుకుంటూ వెళితే అదే పరపపద సోపానమవుతుందేమో.
ఏ ఒక్క మార్గమూ తక్కువ/ఎక్కువ సమానాలు కావేమో.
వ్యక్తిగత సామర్ధ్యాలకనుగుణంగా, మన శక్త్యానుసారంగా అనుసరించతగవిగా నిర్మించబడ్డవేమో ఈ వివిధాలు.

No comments:
Post a Comment