Saturday, 28 January 2012

తెలుగు అంతరించి పోతోందట :)

నిన్ను సంక్రాంతి సంబరాలు జరుపుకుందామని మా ప్రెస్టన్ తెలుగు జన సంఘం కార్యక్రమానికి వెళితే ఎవరో పెద్దాయన చెపుతున్నరీ మాట.

వికీని అడిగితే దాదాపు ఏడు ట్లమంది నాలుక మీద ఆడుతున్న భాష అని చెపుతోంది......ఆయన్నే అడిగితే వివరాలు పంపిస్తానన్నారు....ఆయన్నే అడిగితే నేను మొన్ననే చదివానండీ మీకూ పంపిస్తాను ఆ ప్రమాణం దాని ప్రకారమే అంతరించిపోతున్న ముప్పై భాషల్లోఅ మనదొకట....చూడాలి ఏ ప్రమాణం ఫ్రకారం "అంతరించి"పోతోందో "మన" తెలుగు.

ఆలోచిస్తే మార్పును మనం అంతం అనుకుంటున్నాము అని తప్ప నాకైతే ఇంకో వివరణ దొరకటం లేదు. ఇంతకుముందెపుడో చర్చల్లో అంతం కాదిది పరిణామ క్రమం మాత్రమే అంటూ కవిత్రయం నాటి లిపికీ ఇప్పటి "మన" తెలుగు లిపికీ ఉన్న తేడాను చూడండి సార్ అంటే "ఇవన్నీ .....కబుర్లు" అని కొట్టిపడేసారు.

సరే ఈ సారి ఇంకొంచం లొతుగా అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తాను మన తెలుగుకు తెగులెలా పడుతోందో .............

ఱ, ళ ల ఉపయోగం తగ్గటాన్ని బట్టా మనం అనుకుంటున్న అంతం?
బాలు గారు కూడా షివానీ షర్వానీ ......అంటూ ఎత్తుకుంటే నాకూ బాధగానే ఊంటుంది....కాని అది చావా? ప్రజాతంత్రానికి ఉన్న కొద్దిపాటి సైడ్ ఎఫెక్ఖ్ట్స్ ఇవి. తప్పదు మరి :)

"మంచి" సాహిత్యం లేదన్నదా భాషకు పాడె సిధ్ధం చేసుకోటానికి కారణం?
రాజరికాలు పోయిన రోజే మనం excellence expect చెయ్యటం మరిచిపోయుండాలే .

ఇది చూడండి
http://en.wikipedia.org/wiki/Vedic_Sanskrit
మన భాషలన్నిటికీ మాతృకని మనం నమ్మే సంస్కృతానికీ తప్పలేదీ మార్పులూ చేర్పులూ పరిణామాలు....ఇక అంతమెక్కడిది? అస్సౌల్త్ సంస్కృతము అంటేనే సంస్కరింపబడినది అని అర్థం. ప్రాకృత భాషను సంస్కరించారో ఇంకోదాన్నే సంస్కరించారో కాని ఎదో ఒకటి అయితే సంస్కరింపబడింది. మరింకెందుకు మనకు బాధ? చిన్నప్పడు హఫీజ్ కొట్లో కొనుక్కుని ఎగిరేసిన గాలిపతంగాల సుఖము ఈనాటివారికి లేదే అన్నది మన బాధ వారిది కాదే. అలాగే భాష మార్పును మనం చావనుకుంటాము. ఆ బాధ మనది....కాని భాషకు చావేమిటి? అసలు భాషెందుకు బ్రతికుండాలి? అలా చిరాయువుగా మన తాతల భాషలు బ్రతికేసుంటే ఇప్పుడు చనిపోతావుందోచ్ అని మనం వాపోతున్న మన భాషలు పుట్టేవా? మరి మనం రేపటి భాషల భౄణ హత్యలు చెయ్యటమెందుకు?

Sunday, 22 January 2012

Beauty lies in..........

కొద్దిగా చిన్నప్పటి మొటిమల ఆనవాళ్ళు
అయినా.....
కళ్ళల్లో...? ఆ.......చెయ్యలేను అని కాదు చెయ్యను అనుకుని మాత్రమే సుమా అంటూ!
కదూ?
పిడికిలి బిగింపు లేదు, మాట తడపాటు లేదు, గొంతు గాద్గమవలేదు!
అవసరమా అని సూటిగా నిక్కచ్చిగా అడిగే హృదయ కవటాలు.

చేస్తున్న మంచిని బహాటంగా చెప్పటం బాకా కొట్టుకోవటమేమో కదా అన్న అనుమానం పడనిది అమాయకత్వమా? భూషణమైన లౌక్యం ఫక్కుమంది. పసితనమా? విఙ్ఞత చిరునవ్వుతో కాదంది. నిర్వచనమెందుకు ఆనందించక అంటూ ఓ మొటిక్కాయ కూడా......

నలతలకు కలత పడక నడపటం పొలతులకానవాయితేనంటూ......

కించిత్ కూడా లజ్జపడక,
ఎవరికి కావాల్సినది వారు.......

వీడ్కోలుగా పాతటానికి మైలురాయి.........ఎక్కడో దాపెట్టి చేతులూపుకుంటూ వచ్చినా,
ఆనవాయతీనెందుకు మరచిపోవటమంటూ
స్వతంత్ర్యంగా తనది చెసుకుంది.

Thursday, 19 January 2012

ఒట్టి కుండను కదూ




చెమ్మగిల్లి ముద్దముద్దయి
నిరాకృతమయే నిశిలోనే
నేను విస్ఫష్టం

పొద్దు పొడిస్తే చాలు
వేల రూపదాతలు
చుట్టూ మూగి
నా మంచికే అంటూ

పలుచన చెసి
వేళ్ళు దోపి మరీ
పెద్ద కవాటం పెట్టి
వారిచ్చగా మలచుకుని
నా బలిమికేనంటూ
కచ్చగా కాల్చి

ఆనందిస్తారు.

నమ్మ్మబుధ్ధవనిదేమంటే
ప్రతీ పొద్దుకీ
మళ్ళీ ముద్దవుతొందేనని
శంకెవరికీ రాకపోవటం.

ఒట్టి కుండను కదూ...........










Pic from http://upload.wikimedia.org/wikipedia/commons/2/2f/Makingpottery.jpg

Friday, 13 January 2012

?

చూపుల ఆరడి
ఆత్రపడే తడి
బారెడు విసుర్లు
మూరెడు ముచ్చట్లు
సిగ్గుల మొగ్గలూ
వేడి నిట్టూర్పులూ
?

Wednesday, 11 January 2012

ఏనుగూ దోమా మొ వారి కథా కమామీషు

"అలీ గిరాకీలు ఖతమా ఇలా ఖాళీగా కూర్చున్నావు?"హస్కీ గొంతుతో అడిగింది దోమ ఉరఫ్ అనిత.

"ఎందుకు తల్లీ వాళ్ళమ్మ చాల్లేదనా నువ్వూ మొదలెట్టావు" అన్నాడు ఏనుగు.
ఏనుగు దోమని ముద్దుగా తల్లీ అనే పిలుస్తాడు చాలా సార్లు..... పెళ్ళామయినా సరే.

"మీ గోల ఆపుతార వాడెదో సీరియస్గానే ఆలొచిస్తున్నాడు" అలీని వెనకేసుకొచ్చింది రూప.

"ఏమయింది అలీ?" టై విప్పుతూ అడిగాడు ఆనంద్.

"ఈల్లెప్పుడైనా ఆటోల గమ్మున కూర్సోడం మీరు  సూసిన్రా? " అలీ ఎదురు ప్రశ్న రాధా,రాంలను చూపుతూ.

"ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మేమేం చేసాము ఇప్పుడు"? రాం వాపోయాడు

"నా గురించి నువ్వేం వకాల్తా పుచ్చుకోక్కర్లేదు నన్ను నేను....." యధావిధిగా రాధ గొణుగుడు.
మరి లేకపోతే తను ఫాకల్టీగా జాయిన్ అయిన రోజే ఫైనల్ ఎగ్జాం ఫైల్ అవడానికి ఎన్ని గుండెలుండాలి మరి రాంకి? అలగమంటే అలగదా మరి?

"ఈ వయసులోని ఏ జంటయినా ఏం చేస్తారలీ ఆటోలో .......వాదులాడుకోవటమో ప్రేమ కబుర్లు చెప్పుకోవటమో తప్పితే" నవ్వుతూ ఆనంద్ సమాధనం.

"కదన్నా? గిప్పుడే దించ్చొచ్చిన పోరీ పోరడు మాత్రం బుర్ర తినేసిన్రు భై. అందుకే రిలాక్స్ అవుదామని వచ్చినా" అలీ సమాధానం.

"అలీ రిలాక్స్ అవుతున్నది మధ్యాహ్నం పన్నెండునుంచి...అలీ భాషలో "ఇప్పుడే" అంటే అర్థం నాలుగు గంటలనమాట..హోంవర్క్ చేసిపెట్టమంటె "ఇప్పుడే వస్తా" అంటాదు రాడు ఇదన్నమాట అందులోతిరకాసు" రూప బాక్ గురించి ఆనంద్ కామెంట్ బయటకి వెళ్ళగక్కినప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడాలేదు సమంతాలో. అదే గడుసుతనం మూడేళ్ళు దాటినా.

"ఏం చేసారెమిటి? ఆనంద్ అనుకున్నట్టు కాళ్ళూ అవీ కంపేర్ చేసుకుంటున్నారా నీ ఆటోలో కూర్చుని?" ఏనుగు ప్రశ్న.

"అలాటివాటిల్లో ఆనంద్ చెప్పినట్టు మనం ఎప్పుడో అమెరికా లెవెల్ అని మా ఆటోగాళ్ళకందరికీ ఎరకె అన్నా అందులో పరేషానేముంది మాకు? ఎనక్కూర్చుని ధర్మం, గురువూ, పరస్పర విరుధ్ధమైన సత్యాలు అంటూ ఒకటే బుఱ్ఱ తినేసిన్రనుకో. పైగా గా మాటలకు అడ్డని నా స్టీరియో బంద్ చెయ్మన్నరు." ఉక్రోషంగా అలీ.

"అసలేమయింది అలీ ఏం మాత్లాడుకున్నారు? మొత్తం చెప్పు"

"గుర్తున్నంతవరకూ చెప్తా వినండి. ఇద్దరూ ముప్పై అయిదూ ఆరెళ్ళ వాళ్ళే మరీ .........."

ఫటక్ ఫటక్మంటూ నెత్తి మీద మూడు జెల్లకాయలెందుకో పడ్డాయో అర్థంకాలా అలీకి.
"మాలాంటి జంట అన్నావ్  నాకు ముప్పై అయిదేళ్ళా?" గుఱ్ఱుగా చూసింది రాధ.
"నాకూ ఇరవయ్యేడే" రూప సమాధానం.
"లోపల ఉన్న దోమకీ అంత లేవు" ప్రేమగా లొపలకు చూసి స్నేహితుడిని కొట్టినందుకు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు  ఏనుగు.

"థూ నీయమ్మ....." అంటూ వెళ్ళిపోబోతున్న అలీని "ఏమయింది అలీ చెపుతున్నాడా వాళ్ళేం మాట్లాడుకున్నారో?" అడిగింది అప్పుడే బయటకి వచ్చిన అనిత  దోమ.

అందరివైపూ గుఱ్ఱుగా  చూస్తూ " మధ్య వయసు వాళ్ళే అనితా ముప్పై ఆరేళ్ళ వాళ్ళు సత్యాలు పరస్పర విరుధ్ధమైనవి ఉంటాయి అలాటప్పుడు ఏది పాటించతగ్గ సత్యం? అని మాట్లాడుకున్నారు అనితా" పాఠం వప్పచెప్పేసాడు అలీ.

"ట్రూత్ ఈజ్ యూనివెర్సల్ అనికదా అంటారు మళ్ళీ పరస్పర విర్ద్దమైన సత్యాలెంటి"? పటేల్ ప్రశ్న.

"ఆమే అదే అడిగింది."అలీ

"అతనేమన్నాడు" రాధ

"లేదు సత్యాలెప్పుడూ మన సంస్కారల ప్రకారం ఉంటాయి" అన్నాడు  స్మస్కారం అంటే మంచీతనం కదా ...అందరికీ ఒకే మంచితనం ఉంటుంది కదా ...మంచివాళ్ళందరికీ ఒకే సత్యం ఉండదా" ఆన్న చోట మొదలయ్యింది తల తిరగడం"అన్నాడు అలీ

"హిందూ ధర్మం ప్రకారం సంస్కారం అంటే మన బుధ్ధికి ఉన్న అలవాట్లు అనుకోవచ్చు అలీ. పునర్జన్మ...అదే మళ్ళీ పుట్టట్టం లాటివి నమ్మే హిందువులు వెనక జన్మ అలవాట్లూ ఈ జన్మలో కూడా ఉంటాయి అని నమ్ముతారు. పునర్జన్మ మోక్షం నమ్మని హిందువులు ఈ జన్మలో మన చిన్నప్పటి అనుభవాలూ పరిస్థితులను బట్టి మన బుధ్ధికుండే అలవాట్లను సంస్కారం అని నమ్ముతారు. వాడుకలో మాత్రం మూల అర్థం నుంచి వేరయి సంస్కారం అంటే మంచి అలవాట్లని మాత్రమే నిలిచిపోయింది." రూప వివరణ.

"అంటే ఒకొక్కరి అలవాట్లని బట్టి సత్యాలు మారుతుంటాయని అంటున్నాడా అతను?"  రాధ ఆక్షేపణ.

"నిజమే కదా రాధా. ఉదాహరణకు రూపను తీసుకో. బాపనమ్మ కాకపోయొనా తన సంస్కారం ప్రకారం జంతు హింస తప్పు, అందుకే తను వెజిటెరియన్. ఆనందూ జంతు హింస ఇష్టపడడు కాని తన సంస్కారం ప్రకారం ప్రపంచం మొత్తం జనభా వెజ్జే తింటే ఇక వెజ్జీస్కి ఫుడ్డేది? పైగా ఆహారం కోసం మాంస భక్షణ ప్రకృతి ధర్మమే కదా. కాబట్టి ఇక్కడ సంస్కారం/అలవాట్లూ/వ్యక్తిత్వం/ పేరేదైనా కాని ఆ వ్యక్తి నమ్మకాలను బట్టే కదా అతనికి తెలిసిన సత్యం....దీన్నే తెల్ల దొరలు Frame of reference or wearing coloured glasses అనీ అంటారు....." ఆనంద్ వివరణ.

"అమ్మాయిలు ఒప్పుకుంటార భై ఎదైనా మగాడు చెపితే?...
ఆమే ఒప్పుకోలా....
ఆమె అంటది సత్యమొకటే ఉంటది కానీ అన్ని సంగతులూ తెలిసిన కొందరు పెద్దమనుషులకే అది ఎరుక. అందుకే అది ఎరుకైన పెద్దమనుషులు ఏది సెప్తే అది యినాలి అంటది.
ఏకలవ్యునికి అస్త్ర శస్త్ర ఇద్యల్లో అస్త్ర ఇద్య దొంగసాటుగా బాపనాయన నుంచి నేర్సుకుందట.
దొంగసాటుగ నెర్సుకున్న శస్త్ర ఇద్య లోకకళ్యాణం కోసమే వాడాలి అసుమొంటిగాల్లకే అది నేర్పాలి అని ఆ ఇద్యలు నేర్పే గురువుల రూల్సట. అందుకే లోకకల్యానం కోసమే ఉపయోగించే వ్యక్తిత్వం ఏకలవ్యునికి లేదనే నేర్పించక పంపిస్తే అది దొంగసాటుగ నేర్చేసుకున్నాడనే గురువు బొటన ఏలు గురు దక్సిన కింద కోరి ఆ ఇద్య పనికి రాకుండా సేసిందట.....మరివన్న్నీ తెలిసిన గురువు దగ్గరే మనం సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో నేర్చుకొవాలట....అప్పుడైతే పరస్పర విరుధ్ధమైన సత్యాలు ఉంటాయి లాటి అనుమానాలు ఉండవట......అని అమ్మాయి చెప్పింది" అలీ

"అమ్మాయి ఖచ్చితంగా బాపన్ పిల్లే అయి ఉంటుంది. బాపనోడు ఆ ద్రోణుడు చేసిన తప్పులను ఇలా సమర్ధించేసుకుంటుంటారు..." రాం ప్రతిపాదన.

"అచ్చు ఆతనిదే మాటన్నడు భై...నువ్విప్పుడన్న మాటలు వివరణా వింటే ఇంకో జాతిలో పుట్టిన వారు దాన్ని ఇలాగె అర్థం  చేసుకుంటరు...కాబట్టే సెపుతున్నా సత్యం అనేది సంస్కారం బట్టి ఉంటది.....అందుకే ధర్మాచరణలో పరస్పర విరుధ్ధమైన సత్యాలు కనపడినప్పుడు ఏం చెయ్యాలి, ఏ సత్యాన్ని పాటించాలి అన్న సమస్యొస్తుంది అన్నడు భై" అలీ

"ఆమేమనింది?"

"లేదు...అలా పరస్పర విరుధ్ధమైన సత్యాలు ఒకరి మనసులో తోస్తే అది ఆంబిగ్యుటీ నిదర్సనం." అంది ఆంబిగ్యుటీ అంతే ఏంది భై" అన్నాడు ఆలి.

"అటూ ఇటూ మనసు ఊగిసలాడటం" క్లుప్తంగా వివరణ మామ్మ నుంచి.
అప్పటివరకూ మామ్మ వింటోందని వారికి తెలీనే తెలీదు.

"నిజమే కద అలీ. వేరు వేరు వ్యక్తుల్లో పరస్పర విరుధ్ధ సత్యాలు ఉండొచ్చేమో కాని ఒకే వ్యక్తిలో అలా ఉందంటె he does not have the courage of the conviction అనే కదా అర్థం...ఒక విషయంపై పూర్తి విశ్వాసం ఉండకపోవటమో లేదా విశ్వాసమున్నా ఆ సత్యాన్ని పాటించే సమర్ధత లేకపోవటమో అనే కద అర్థం ఆ ఊగిసలాట ఉంటె" ఆనంద్ వివరణ.

.............................................."చల్ నీ....." మామ్మను చూసి.నాలుక్కొరికేసుకున్నాడు అలీ. "ఆళ్ళేమో ధర్మ సత్యం సంస్కారం అని సావగొట్టిర్రు ఈడకొస్తే conviction, ambiguity అని మీరు..... నే పోతున్నా" వెళ్ళిపోతున్న అలీ ఆటోలొంచి "మున్నీ బద్నాం హుయీ రె దార్లింగ్ తేరే లియే......." ఊరంతా వినపడేట్టు.

"నేటి యువత" నిట్టూరుస్తున్న మామ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుని చెప్పింది రూప "ఈ దేశ భవితకు నేటి యువతనుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మామ్మా. మీలాటిపెద్దలు ఇలాటి వాళ్ళ పై పై నిరాశక్తతను మాత్రమే చూదక నిద్రాణంగా ఉన్న తమ ఉనికీ చాటే ఆ ఆసక్తికి సందర్భోచిత ప్రోత్సాహ ప్రాణవాయువుని ఇస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ వివేకానందుడు కోరుకున్న భారతీయుడు ఎందుకు కాడో చూద్దాం" అంటున్న తనను చూస్తూ గర్వంగా మూగవాడయిపోయాడు ఆనంద్.

Characters ali, anita, samanta, anand, rupa, radha, ram........all blatantly plagiarised from the telugu movie Anand...o manchi coffe lanti cinema........Thanks to the movie team for the inspiration.

Thursday, 5 January 2012

కల్మషం

నా దగ్గరకోచ్చేసరికే ఎందుకిలా చేస్తావు?
ఎందుకిలా హద్దులు మీరుతావు?
ఎందుకిలా మంకు పట్టు నీకు?

ఎవరన్నారు ఇక్కడ నువ్వు ముఖ్యమని?
నీలో ప్రతిష్టించుకున్న నా స్వప్నం ముఖ్యం.

కలల్లో బ్రతకటం పలాయనవాదమేమో?
ఎప్పటిదో మెయిలు రాయిని గుర్తు చేసుకుంటూ బతికేయటమంత గొంగడితనముందా? 

స్వాప్నికుడికీ(నీ దృష్టిలో పలాయనవాడికీ) దార్శనీకుడికీ తేడా తెలిపేది గమ్యం లభ్యమయిన ఆ ఒక్క క్షణమే అయితే కష్టమే. పలాయనవాది కలల్లో ఆనందముండదు, స్ఫష్టత ఉండదు. నువ్వింత స్ఫష్టంగా ఆనందపెడుతుంటే.... 
అచలమైన ప్రతీది గొంగడేనంటే ఎలా? స్థిరతకూ జడత్వానికీ తేడా కొలిచే త్రాసుల్లో, విలువల్లోనే కదా?

పిచ్చోడికీ స్ఫష్టంగా కనపడతాయి, వినపడతాయి ... నువ్వంటావే ఏమిటవి? ఆ హాలూసినేషన్స్ 

పిచ్చి, పలాయనవాదం, చేతగానితనం.......ఇంకేన్నయినా పెట్టు కుచ్చుటోపీలు
నాకు తెలిసిందొకటే. తపస్సు ఫలించింది. జీవితంలో ఒక భాగం పరిపూర్ణమయింది.
తపానికి మెచ్చి వరమిచ్చిన దేవిని కలకాలం స్వంతం చేసుకోవాలనుకునే రావణుడిని కాను 
వరదానం జరిగిందని లగ్నం చేసుకున్న మనసును మరల్చుకోనూ లేను.

మిగిలిందేమిటి నీకు? క్షణకాలపు ఆసరాను వరమూ గిరమూ అంటూ పిచ్చి కాకపొతే 

నీకు తెలీనిదా ఆ క్షణకాలపు అమరత్వం?

వాస్తవాన్ని జీర్ణించుకోలేని భీరువ్వి.

నిజమే. పక్కన సువర్ణ ప్రతిమనుంచుకోవటం ఈనాడు జరిగుంటే ఆయన కూడా పిరికివాడే మరి. 

ఉపమానాల మసిపూసుకుంటే మారేడుపండులోని లొత్తతనం......

పరిపూర్ణతకూ, పరాకాష్టకూ సాక్షీభూతాన్ని ఇంకోసారి కల్మషమన్నావంటే చెప్పుచ్చుకు కొడతా. 




 

Monday, 2 January 2012

చరిత్రహీనులంగా మరి.


"దొంగను కదూ"
"అవును నిజమే" 
పూబాల సమాధానం.
తలదించుకున్న భ్రమరం
నిజంగానే అపరాదే. 
బృంగాంఘ్రాలంకృత 
"భవిత
ఎక్కడో ఎప్పుడో 
అయినా నా ప్రతిబింబాలు"
విరిచేడె గర్వంగా తలిచె. 

***

నువ్వు నిలవాలంటే 
నేను?
ఎందుకిలా!!!

***

కారణమేమంటే ఏం చెప్పను?
అవును, నా కౌగిలి జగత్ప్రసిద్ధమే.
గుడ్డితనంలోనూ వినాశనమూ అవగతమే 
అయినా, అదే నా అస్థిత్వం, అంతే!!!

***

"అలా చెయ్యొద్దు"
ఎంతరిచినా వినదెందుకు?
పగలబడె దర్పణం
"నీ బింబమే"!
కటుసత్యం.

***

"ఎలా మరి నువ్వు?"
తప్పదు, చరిత్రహీనులంగా మరి!!!  

****

Sunday, 1 January 2012

This page is in Hindi, would you like to translate it?


బుద్ది పోరాపాటయి yes అన్న మీట నొక్కాను.
Hats off google sirji, maan gaye aapko.


Rafi: hmmm ..., o ...
Your bindiya ray

Hi Ray income
Your bindiya Ray \ - 2

Hi Ray income
Lata: sajan bindis your sleep will take

Rafi: Hi Ray income
Your bindiya ray

Rafi: are your forehead like this, like the moon star
Zia therefore often, such as a Angara
Are your forehead just
Lata: sajan sleep ...
Sajan replaced by replaced by replaced by sleep

My bindis

Rafi: Hi Ray income

Your bob ray
Hi Ray income
Your bob ray
Lata: Chain will not take Tumka sajan
Hi my earrings Ray Ray income

Liana: You are my jewel balam, Tose Sjke Dolun
Naina you to wander, I do not speak so
You are my jewel balam
Rafi: So then what is said is said is said
Your Kangana
Creeper: Hi Ray income
My Kangana Ray
Said Ray now missing or your angana
Rafi: Hi Ray income
Tera Kangna Ray

Rafi: Sjnia you have come, since my wishes
When you are trotting out, kahe khanke hai my vein vein
You are here Sjnia
Lata: sajan now
Sajan now Cutena Cutena Cutena
Your Angna
Rafi: Hi Ray income

Tera Kangna Ray
Lata: sajan now Cutena your angana
Hi Ray income

Your angana ray


ఇందులో అర్థం కానిది ఎవరికన్నా ఉంటె అసలయిన పాట ఇక్క చూడొచ్చు
http://lyricsindia.net/songs/show/25

మీకు ఇష్టమయిన వాళ్ళున్నారా? లేట్ అవకముందే వారికి చెప్పేయండి ఆ సంగతి.

నీకివి తెలీవు అనుకుంటూంటే ఒక సత్యం తెలిసొచ్చింది. మనం మన ప్రేమనూ, ఇష్టాన్నీ దాచుకుంటాం...కోపాన్నీ అసహ్యాన్నీ మాత్రం బహు బాగా వ్యక్తం చేసేస్తాం. ఎందుకో? క్షణం ఆగకుండా నాకు ఇష్టమయిన వాళ్ళకూ, నచ్చిన వాళ్ళకూ ఫోన్లు చేసి మాట్లాడేసా. ఆ ఇద్దరూ అబ్బాయిలు అని కూడా చూసుకోకుండా నాకు మీరు ఇష్టమయిన వాళ్ళూ అని చెప్పేసా. అందులో ఒకబ్బాయి నీకు తెలుసు కూడా, నువ్వంటే చాలా ఇష్టపడతాడు. నేను చెయ్యలేని పని వాడు చేసి చూపెట్టాడు చిన్నప్పుడే కూడా....వెధవ మీ ఇంటికి వచ్చి పలకరించాడట అని తెలిసినపుడు ఎంత జెలసీ అనిపించిందో. వాడికి నీ మరణం గురించి చెప్పలా......అలాగే ఉండనీ నీ జ్ఞాపకాలు....మృదుమధురంగా....ఎందుకీ వార్త చెప్పటం అనిపించింది.

ఇలా నీ మరణం తరవాత, అదీ నిన్ను చివరిసారి చూసిన ఇరవయ్యేళ్ళ తరవాత.....ఇలా నీ జ్ఞాపకాలు నెమరువేసుకోవటం ...నీకు చేరుతుందని కాదు. పునర్జన్మల మీదా, ఆత్మల మీదా నాకు నమ్మకం లేదు. బ్రతికున్న మాకు ఈ జ్ఞాపకాలు కొంచం బాధ తగ్గిస్తాయేమో. రేప్పొద్దున్న నన్నూ ఇలా ఎవరయినా నెవరు వేసుకుంటారు అన్న ఆశ .....మరణమంటే ఉన్న భయాన్ని కొంచమన్నా పోగోడుతుందన్న ఆశ.

త్రిక సంధి సూత్రమూ
ఆంగ్లము కలిపి రాత
వంకాయ కూర, అల్లం వేసినది
అందమైన చెవి తెమ్మకు బంగారు జూకాలో ఒంటి ముత్యమూ ....నీవి ఎన్ని అందమైన జ్ఞాపకాలో తెలుసా నాకు?

ఆరో తరగతిలో త్రిక సంధి సూత్రాన్ని చెప్పమంటే క్లాసు మొత్తం చెప్పలేకపోవటం, చివరికి నువ్వూ నేనూ మాత్రం ఏక కాలంలో ఆ సూత్రాన్ని అరవటం (నిజంగా అరవటమే చేసాం కదా ఆ రోజు?) నీ మొదటి జ్ఞాపకం నాకు. నాకు ఎంతో ఇష్టమయిన వారికి ఇష్టమయిన ఒక వాక్యం ఉంది ...."Turn Ons:- Intelligence"....అని. ఆ వాక్యం సరిగ్గా సరిపోతుందేమో ఆరోజున నేను పొందిన అనుభవానికి. అబ్బ పెద్దయ్యాక వెతుక్కుని వచ్చి మరీ...........అన్న ఆలోచనలు వచ్చేంత.


అదే రోజు మధ్యాహ్నం భోజన విరామంలో.....ఇంగ్లీషు అక్షరాల్లో కొన్ని కలిపి రాయటం కష్టం అని నేనంటే....లేదే సులువే అని నువ్వు ఎలా రాయాలో చూపించటం.

మొదటిసారిగా.....ఇంతవరకూ కూడా...ఎవ్వరి ఇంగిలీ తినని నేను...నువ్విచ్చిన వంకాయ కూరన్నం రుచి చూడటం. ఘాటుకు పొలమారి నీళ్ళు తాగుతూ ఏంటిది ఇంత కారం అంటే.....అల్లం అని నువ్వు నవ్వటం.

అదే రోజునా? నాకు తెలీదు. విరామ సమయం తరవాత పీరియడ్ అని మాత్రం గుర్తు. మన తెలుగు క్లాసులో. గుర్తున్న్నారా నీకా తెలుగు టీచర్? అచ్చు స్వాతి ముత్యంలో రాధికలా ఉండేవారు కదూ. నాకిప్పటికీ రాధిక అంటే అందుకే ఇష్టం. ఎప్పటిలా పద్యంలో ప్రతి పదాన్నీ మేడం విడిగా చెప్పటం దాన్ని అర్థం తెల్సిన వారు పైకి అరవటం ..షరా మామూలుగా జరుగుతున్నప్పుడు....."ద్వారం" అన్న పదాన్ని "గారం" గా విని "గారాబం" అని నేనంటే మొత్తం క్లాసు నవ్వినా నీ నవ్వే గుర్తు.

నువ్వు మొదటిసారి కళ్ళద్దాలు పెట్టుకున్న రోజు నీకు గుర్తుందో లేదు కాని నాకు గుర్తే. తెల్లటి నీకు నల్లటి కళ్ళద్దాలు. అస్సలు బాలా అని ఎంతగా అనిపించిందో.

నేను నెలరోజులు వంట్లో బాలేక బడికి రాలేకపొతే ఇంటికి వచ్చి మరీ "What does a Giant wheel do raghoo?" అని క్లాస్ ప్రాజెక్ట్ గురించి నన్ను నువ్వడుగుతూ ఉంటె ఆటోమేటిక్గా సమాదానమయితే వచ్చేసింది కాని "ఈ మాత్రం నీకు తెలీక కాదు నన్నెందుకు అడుగుతున్నావు" అన్న అనుమానం ఆనందం కూడా నీకు తెలీదు.

మన స్కూల్ మీ స్కూల్ అయిపోయి నేను వేరే వెళ్ళాక ఒక రోజు మీ ఇంటి సందులో ఎవరో నీలాటి అమ్మాయే వస్తూ ఉంటె రోడ్డవతల ఉన్న నేను నాతో నడుస్తున్న స్నేహితుడికి కూడా చెప్పకుండా రోడ్డు దాటేయటం, అది నువ్వు కాదు అని తెలిసిన తరవాత హోష్  రావటం....

నువ్వు సెయింట్ ఆన్స్లో చేరావని తెలిసి బస్ స్టాప్లో ప్రతీ రోజు ఎనిమిదిన్నరకు ఉండటం...నా బస్ ఎనిమిదీ నలభైకేలే ...సో నీకోసమేం కాదులే :)

జీవితంలో నేను ఫాలో అయిన మొదటి అమ్మాయివి కూడా నువ్వే. ఒక్కసారే అనుకో.  113E లో అక్షరం మార్చేసి 113M బస్ ఎక్కేసిన రోజు....నీకు నేను కనిపించాననే అనుమానం. నీకు రెండు సీట్స్ వెనకాల కూర్చున్న నాకు నీ చెవి తెమ్మ ఎండలో మెరవటం, తెల్లని కాలి వేళ్ళ మీద గోళ్ల రంగు (రంగేదో గుర్తు లేదు) .....నా ఇప్పటి ఫేవరిట్ అయిన ఒంటి ముత్యపు జూకా నీ జ్ఞాపకంగా నాకీనాటికీ ఇష్టమే తెలుసా.

నీ ఇంటికి వాడు వచ్చు మరీ పలకరించాడు అని నేను విన్న రోజు.....ఎంత కోపం వచ్చిందో....వాడి మీద. చాలా గుంభనం వాడు. ఇద్దరం ఇప్పటికీ నీ గురించి ఎప్పుడూ ఎత్తలా. కాని వాడికీ నువ్వంటే ఇష్టమని క్లాస్ మొత్తం తెలుసుగా.

నువ్వు స్కూల్ వదిలి ఆంధ్రా వెళ్ళిపోతున్నావు అని తెలిసిన రోజుటి బాధ.
నీ విడి ఫోటో లేదు కాని నీ ఫోటో కోసం సంపాదించుకున్న మీ టెన్త్ క్లాస్ ఫోటో ఇప్పటికీ నా దగ్గర భద్రం. 

 నా స్నేహితురాలి ఇంటి ముందే నీ ఇల్లు. ఎన్ని సార్లు వచ్చానో ఆ ఇంటికి అయినా తనను నీ గురించి అడగటమే కాని నీ ఇంటికి వచ్చి పలకరించే సాహసం చెయ్యలేకపొయ్యా.

మీ అక్క నువ్వూ ఇద్దరూ ఒకేలా ఉండటం, ఒకసారి వినాయక మంటపం ముందు ఏదో ప్రోగ్రామ్కు వచ్చిన నా చెల్లెలిని "పప్పీ ఇలా రా" అని పిలిస్తే మీ అక్క తిరిగి చూసి "నన్ను పిలిచారా/వా" అని అడగటం, నీ పోలికలు అచ్చు గుద్దినట్టు ఉండటంతో మీ అక్క అని పోల్చుకోవటం నీకు తెలుసా? నీ ముద్దు పేరు తెలీదు కాని మీ అక్క ముద్దు పేరు తెలుసు :)


నువ్వు మన క్లాస్మేట్ వరలక్ష్మి పెళ్ళికి వెళ్ళి అక్కడ భోజనం చెయ్యకుండా వచ్చేసావట కదా. మన క్లాస్మేట్స్ అది చాలా కాలం చెప్పుకునే వాళ్ళులె ".....కు ఎంత పోగరో తెలుసా........" అంటూ. ఎడిన్ బరోలో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళి వర్షంలో  స్నేహితుడి ఇంట్లో చిక్కుకుపోయిన నాలుగు రోజుల్లో భోజనానికి నేను పడ్డ ఇబ్బందులు అనుభవం అయిన రోజు నిజంగా అర్థమయ్యావు అనిపించింది. బ్రాహ్మణులం...ఉల్లిపాయ కూడా అలవాటు లేదు అని చెప్పావు. బిర్యానీలు అవి తిని రాలేక వచ్చేసుంటావు అనుకున్నా. అలవాటు లేక వచ్చేసావో అవమానం చేసే వచ్చావో?

డాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో తెలిసింది నువ్వు లావు అయ్యావనీ ఏదో ఆరోగ్య సమస్యలనీ. డాక్టర్ని అవుతున్నాను, నేను బాగు చేస్తాను నిన్ను. నువ్వు నీ భర్తతో కలిసి నాకు పేషెంట్గా వస్తావు నేను నిన్ను బాగు చేస్తాను లాటి కలలు కనటం "ఛీ వెధవా నువ్వు డాక్టర్ అయి తనకు మళ్ళీ పరిచయం అవటానికి తన ఈ అనారోగ్యం అన్నేళ్ళు ఉండాలా" అని నన్ను తిట్టుకున్నా సందర్భాలు ఎన్నో.

తెల్లటి పంజాబీ డ్రెస్లో ఆకుపచ్చని చున్నీ వేసుకున్న జ్ఞాపకంగా ఉన్న నువ్వు ఇలా కీర్తిశేషురాలిగా చివరి పరిచయమవుతావు అనుకోలేదు. ఎంబీబీఎస్లో నా క్లాస్మేట్ చికిత్స లేని కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కూడా పథాలజీలో డిస్టింక్షన్ తెచ్చుకుంది అని తన మరణంతో నాకు పరిచయమైన క్లాస్మేట్ గురించి ఇతరులు చెపితే ఎలా ఉండగలరా అలా అని అనుకున్నాను. మూడు రోజుల ముందు నీ స్నేహితురాలికి, మన క్లాస్మేట్కి ఫోన్ చేసి "ఇదే చివరి కాలే" అని చెప్పావట. ఇవన్నీ సినిమాలంటావా? కళ జీవితానుగామి అనటానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి?

అయినా నాకు నువ్వు ఇలా గుర్తువైపోవటం నచ్చటం లేదు.
అందుకే రాహుల్కి నీ విషయం నేనయితే చెప్పను.

నీ బాబు ఎక్కడో ఉన్నాడట ఆంధ్రాలో.
చల్లగా ఉండాలి నీ చిన్నారి.


 Hope I always remember to let others know that I like them, whoever they might be.