నా దగ్గరకోచ్చేసరికే ఎందుకిలా చేస్తావు?
ఎందుకిలా హద్దులు మీరుతావు?
ఎందుకిలా మంకు పట్టు నీకు?
ఎవరన్నారు ఇక్కడ నువ్వు ముఖ్యమని?
నీలో ప్రతిష్టించుకున్న నా స్వప్నం ముఖ్యం.
కలల్లో బ్రతకటం పలాయనవాదమేమో?
ఎప్పటిదో మెయిలు రాయిని గుర్తు చేసుకుంటూ బతికేయటమంత గొంగడితనముందా?
స్వాప్నికుడికీ(నీ దృష్టిలో పలాయనవాడికీ) దార్శనీకుడికీ తేడా తెలిపేది గమ్యం లభ్యమయిన ఆ ఒక్క క్షణమే అయితే కష్టమే. పలాయనవాది కలల్లో ఆనందముండదు, స్ఫష్టత ఉండదు. నువ్వింత స్ఫష్టంగా ఆనందపెడుతుంటే....
అచలమైన ప్రతీది గొంగడేనంటే ఎలా? స్థిరతకూ జడత్వానికీ తేడా కొలిచే త్రాసుల్లో, విలువల్లోనే కదా?
పిచ్చోడికీ స్ఫష్టంగా కనపడతాయి, వినపడతాయి ... నువ్వంటావే ఏమిటవి? ఆ హాలూసినేషన్స్
పిచ్చి, పలాయనవాదం, చేతగానితనం.......ఇంకేన్నయినా పెట్టు కుచ్చుటోపీలు
నాకు తెలిసిందొకటే. తపస్సు ఫలించింది. జీవితంలో ఒక భాగం పరిపూర్ణమయింది.
తపానికి మెచ్చి వరమిచ్చిన దేవిని కలకాలం స్వంతం చేసుకోవాలనుకునే రావణుడిని కాను
వరదానం జరిగిందని లగ్నం చేసుకున్న మనసును మరల్చుకోనూ లేను.
మిగిలిందేమిటి నీకు? క్షణకాలపు ఆసరాను వరమూ గిరమూ అంటూ పిచ్చి కాకపొతే
నీకు తెలీనిదా ఆ క్షణకాలపు అమరత్వం?
వాస్తవాన్ని జీర్ణించుకోలేని భీరువ్వి.
నిజమే. పక్కన సువర్ణ ప్రతిమనుంచుకోవటం ఈనాడు జరిగుంటే ఆయన కూడా పిరికివాడే మరి.
ఉపమానాల మసిపూసుకుంటే మారేడుపండులోని లొత్తతనం......
పరిపూర్ణతకూ, పరాకాష్టకూ సాక్షీభూతాన్ని ఇంకోసారి కల్మషమన్నావంటే చెప్పుచ్చుకు కొడతా.
Excellent sir..
ReplyDelete