నీకివి తెలీవు అనుకుంటూంటే ఒక సత్యం తెలిసొచ్చింది. మనం మన ప్రేమనూ, ఇష్టాన్నీ దాచుకుంటాం...కోపాన్నీ అసహ్యాన్నీ మాత్రం బహు బాగా వ్యక్తం చేసేస్తాం. ఎందుకో? క్షణం ఆగకుండా నాకు ఇష్టమయిన వాళ్ళకూ, నచ్చిన వాళ్ళకూ ఫోన్లు చేసి మాట్లాడేసా. ఆ ఇద్దరూ అబ్బాయిలు అని కూడా చూసుకోకుండా నాకు మీరు ఇష్టమయిన వాళ్ళూ అని చెప్పేసా. అందులో ఒకబ్బాయి నీకు తెలుసు కూడా, నువ్వంటే చాలా ఇష్టపడతాడు. నేను చెయ్యలేని పని వాడు చేసి చూపెట్టాడు చిన్నప్పుడే కూడా....వెధవ మీ ఇంటికి వచ్చి పలకరించాడట అని తెలిసినపుడు ఎంత జెలసీ అనిపించిందో. వాడికి నీ మరణం గురించి చెప్పలా......అలాగే ఉండనీ నీ జ్ఞాపకాలు....మృదుమధురంగా....ఎందుకీ వార్త చెప్పటం అనిపించింది.
ఇలా నీ మరణం తరవాత, అదీ నిన్ను చివరిసారి చూసిన ఇరవయ్యేళ్ళ తరవాత.....ఇలా నీ జ్ఞాపకాలు నెమరువేసుకోవటం ...నీకు చేరుతుందని కాదు. పునర్జన్మల మీదా, ఆత్మల మీదా నాకు నమ్మకం లేదు. బ్రతికున్న మాకు ఈ జ్ఞాపకాలు కొంచం బాధ తగ్గిస్తాయేమో. రేప్పొద్దున్న నన్నూ ఇలా ఎవరయినా నెవరు వేసుకుంటారు అన్న ఆశ .....మరణమంటే ఉన్న భయాన్ని కొంచమన్నా పోగోడుతుందన్న ఆశ.
త్రిక సంధి సూత్రమూ
ఆంగ్లము కలిపి రాత
వంకాయ కూర, అల్లం వేసినది
అందమైన చెవి తెమ్మకు బంగారు జూకాలో ఒంటి ముత్యమూ ....నీవి ఎన్ని అందమైన జ్ఞాపకాలో తెలుసా నాకు?
ఆరో తరగతిలో త్రిక సంధి సూత్రాన్ని చెప్పమంటే క్లాసు మొత్తం చెప్పలేకపోవటం, చివరికి నువ్వూ నేనూ మాత్రం ఏక కాలంలో ఆ సూత్రాన్ని అరవటం (నిజంగా అరవటమే చేసాం కదా ఆ రోజు?) నీ మొదటి జ్ఞాపకం నాకు. నాకు ఎంతో ఇష్టమయిన వారికి ఇష్టమయిన ఒక వాక్యం ఉంది ...."Turn Ons:- Intelligence"....అని. ఆ వాక్యం సరిగ్గా సరిపోతుందేమో ఆరోజున నేను పొందిన అనుభవానికి. అబ్బ పెద్దయ్యాక వెతుక్కుని వచ్చి మరీ...........అన్న ఆలోచనలు వచ్చేంత.
అదే రోజు మధ్యాహ్నం భోజన విరామంలో.....ఇంగ్లీషు అక్షరాల్లో కొన్ని కలిపి రాయటం కష్టం అని నేనంటే....లేదే సులువే అని నువ్వు ఎలా రాయాలో చూపించటం.
మొదటిసారిగా.....ఇంతవరకూ కూడా...ఎవ్వరి ఇంగిలీ తినని నేను...నువ్విచ్చిన వంకాయ కూరన్నం రుచి చూడటం. ఘాటుకు పొలమారి నీళ్ళు తాగుతూ ఏంటిది ఇంత కారం అంటే.....అల్లం అని నువ్వు నవ్వటం.
అదే రోజునా? నాకు తెలీదు. విరామ సమయం తరవాత పీరియడ్ అని మాత్రం గుర్తు. మన తెలుగు క్లాసులో. గుర్తున్న్నారా నీకా తెలుగు టీచర్? అచ్చు స్వాతి ముత్యంలో రాధికలా ఉండేవారు కదూ. నాకిప్పటికీ రాధిక అంటే అందుకే ఇష్టం. ఎప్పటిలా పద్యంలో ప్రతి పదాన్నీ మేడం విడిగా చెప్పటం దాన్ని అర్థం తెల్సిన వారు పైకి అరవటం ..షరా మామూలుగా జరుగుతున్నప్పుడు....."ద్వారం" అన్న పదాన్ని "గారం" గా విని "గారాబం" అని నేనంటే మొత్తం క్లాసు నవ్వినా నీ నవ్వే గుర్తు.
నువ్వు మొదటిసారి కళ్ళద్దాలు పెట్టుకున్న రోజు నీకు గుర్తుందో లేదు కాని నాకు గుర్తే. తెల్లటి నీకు నల్లటి కళ్ళద్దాలు. అస్సలు బాలా అని ఎంతగా అనిపించిందో.
నేను నెలరోజులు వంట్లో బాలేక బడికి రాలేకపొతే ఇంటికి వచ్చి మరీ "What does a Giant wheel do raghoo?" అని క్లాస్ ప్రాజెక్ట్ గురించి నన్ను నువ్వడుగుతూ ఉంటె ఆటోమేటిక్గా సమాదానమయితే వచ్చేసింది కాని "ఈ మాత్రం నీకు తెలీక కాదు నన్నెందుకు అడుగుతున్నావు" అన్న అనుమానం ఆనందం కూడా నీకు తెలీదు.
మన స్కూల్ మీ స్కూల్ అయిపోయి నేను వేరే వెళ్ళాక ఒక రోజు మీ ఇంటి సందులో ఎవరో నీలాటి అమ్మాయే వస్తూ ఉంటె రోడ్డవతల ఉన్న నేను నాతో నడుస్తున్న స్నేహితుడికి కూడా చెప్పకుండా రోడ్డు దాటేయటం, అది నువ్వు కాదు అని తెలిసిన తరవాత హోష్ రావటం....
నువ్వు సెయింట్ ఆన్స్లో చేరావని తెలిసి బస్ స్టాప్లో ప్రతీ రోజు ఎనిమిదిన్నరకు ఉండటం...నా బస్ ఎనిమిదీ నలభైకేలే ...సో నీకోసమేం కాదులే :)
జీవితంలో నేను ఫాలో అయిన మొదటి అమ్మాయివి కూడా నువ్వే. ఒక్కసారే అనుకో. 113E లో అక్షరం మార్చేసి 113M బస్ ఎక్కేసిన రోజు....నీకు నేను కనిపించాననే అనుమానం. నీకు రెండు సీట్స్ వెనకాల కూర్చున్న నాకు నీ చెవి తెమ్మ ఎండలో మెరవటం, తెల్లని కాలి వేళ్ళ మీద గోళ్ల రంగు (రంగేదో గుర్తు లేదు) .....నా ఇప్పటి ఫేవరిట్ అయిన ఒంటి ముత్యపు జూకా నీ జ్ఞాపకంగా నాకీనాటికీ ఇష్టమే తెలుసా.
నీ ఇంటికి వాడు వచ్చు మరీ పలకరించాడు అని నేను విన్న రోజు.....ఎంత కోపం వచ్చిందో....వాడి మీద. చాలా గుంభనం వాడు. ఇద్దరం ఇప్పటికీ నీ గురించి ఎప్పుడూ ఎత్తలా. కాని వాడికీ నువ్వంటే ఇష్టమని క్లాస్ మొత్తం తెలుసుగా.
నువ్వు స్కూల్ వదిలి ఆంధ్రా వెళ్ళిపోతున్నావు అని తెలిసిన రోజుటి బాధ.
నీ విడి ఫోటో లేదు కాని నీ ఫోటో కోసం సంపాదించుకున్న మీ టెన్త్ క్లాస్ ఫోటో ఇప్పటికీ నా దగ్గర భద్రం.
నా స్నేహితురాలి ఇంటి ముందే నీ ఇల్లు. ఎన్ని సార్లు వచ్చానో ఆ ఇంటికి అయినా తనను నీ గురించి అడగటమే కాని నీ ఇంటికి వచ్చి పలకరించే సాహసం చెయ్యలేకపొయ్యా.
మీ అక్క నువ్వూ ఇద్దరూ ఒకేలా ఉండటం, ఒకసారి వినాయక మంటపం ముందు ఏదో ప్రోగ్రామ్కు వచ్చిన నా చెల్లెలిని "పప్పీ ఇలా రా" అని పిలిస్తే మీ అక్క తిరిగి చూసి "నన్ను పిలిచారా/వా" అని అడగటం, నీ పోలికలు అచ్చు గుద్దినట్టు ఉండటంతో మీ అక్క అని పోల్చుకోవటం నీకు తెలుసా? నీ ముద్దు పేరు తెలీదు కాని మీ అక్క ముద్దు పేరు తెలుసు :)
నువ్వు మన క్లాస్మేట్ వరలక్ష్మి పెళ్ళికి వెళ్ళి అక్కడ భోజనం చెయ్యకుండా వచ్చేసావట కదా. మన క్లాస్మేట్స్ అది చాలా కాలం చెప్పుకునే వాళ్ళులె ".....కు ఎంత పోగరో తెలుసా........" అంటూ. ఎడిన్ బరోలో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళి వర్షంలో స్నేహితుడి ఇంట్లో చిక్కుకుపోయిన నాలుగు రోజుల్లో భోజనానికి నేను పడ్డ ఇబ్బందులు అనుభవం అయిన రోజు నిజంగా అర్థమయ్యావు అనిపించింది. బ్రాహ్మణులం...ఉల్లిపాయ కూడా అలవాటు లేదు అని చెప్పావు. బిర్యానీలు అవి తిని రాలేక వచ్చేసుంటావు అనుకున్నా. అలవాటు లేక వచ్చేసావో అవమానం చేసే వచ్చావో?
డాక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్న రోజుల్లో తెలిసింది నువ్వు లావు అయ్యావనీ ఏదో ఆరోగ్య సమస్యలనీ. డాక్టర్ని అవుతున్నాను, నేను బాగు చేస్తాను నిన్ను. నువ్వు నీ భర్తతో కలిసి నాకు పేషెంట్గా వస్తావు నేను నిన్ను బాగు చేస్తాను లాటి కలలు కనటం "ఛీ వెధవా నువ్వు డాక్టర్ అయి తనకు మళ్ళీ పరిచయం అవటానికి తన ఈ అనారోగ్యం అన్నేళ్ళు ఉండాలా" అని నన్ను తిట్టుకున్నా సందర్భాలు ఎన్నో.
తెల్లటి పంజాబీ డ్రెస్లో ఆకుపచ్చని చున్నీ వేసుకున్న జ్ఞాపకంగా ఉన్న నువ్వు ఇలా కీర్తిశేషురాలిగా చివరి పరిచయమవుతావు అనుకోలేదు. ఎంబీబీఎస్లో నా క్లాస్మేట్ చికిత్స లేని కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ కూడా పథాలజీలో డిస్టింక్షన్ తెచ్చుకుంది అని తన మరణంతో నాకు పరిచయమైన క్లాస్మేట్ గురించి ఇతరులు చెపితే ఎలా ఉండగలరా అలా అని అనుకున్నాను. మూడు రోజుల ముందు నీ స్నేహితురాలికి, మన క్లాస్మేట్కి ఫోన్ చేసి "ఇదే చివరి కాలే" అని చెప్పావట. ఇవన్నీ సినిమాలంటావా? కళ జీవితానుగామి అనటానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి?
అయినా నాకు నువ్వు ఇలా గుర్తువైపోవటం నచ్చటం లేదు.
అందుకే రాహుల్కి నీ విషయం నేనయితే చెప్పను.
నీ బాబు ఎక్కడో ఉన్నాడట ఆంధ్రాలో.
చల్లగా ఉండాలి నీ చిన్నారి.
Hope I always remember to let others know that I like them, whoever they might be.

No comments:
Post a Comment