కొద్దిగా చిన్నప్పటి మొటిమల ఆనవాళ్ళు
అయినా.....
కళ్ళల్లో...? ఆ.......చెయ్యలేను అని కాదు చెయ్యను అనుకుని మాత్రమే సుమా అంటూ!
కదూ?
పిడికిలి బిగింపు లేదు, మాట తడపాటు లేదు, గొంతు గాద్గమవలేదు!
అవసరమా అని సూటిగా నిక్కచ్చిగా అడిగే హృదయ కవటాలు.
చేస్తున్న మంచిని బహాటంగా చెప్పటం బాకా కొట్టుకోవటమేమో కదా అన్న అనుమానం పడనిది అమాయకత్వమా? భూషణమైన లౌక్యం ఫక్కుమంది. పసితనమా? విఙ్ఞత చిరునవ్వుతో కాదంది. నిర్వచనమెందుకు ఆనందించక అంటూ ఓ మొటిక్కాయ కూడా......
నలతలకు కలత పడక నడపటం పొలతులకానవాయితేనంటూ......
కించిత్ కూడా లజ్జపడక,
ఎవరికి కావాల్సినది వారు.......
వీడ్కోలుగా పాతటానికి మైలురాయి.........ఎక్కడో దాపెట్టి చేతులూపుకుంటూ వచ్చినా,
ఆనవాయతీనెందుకు మరచిపోవటమంటూ
స్వతంత్ర్యంగా తనది చెసుకుంది.
4 comments:
ఒక్కోసారి మొదటిసారే అర్ధమైపోతాయా.. ఇంకొన్నిసార్లైతే ఆరేడుసార్లు చదివినా... ఉ.హూ.. అసలు ఎక్కవు!! అయినా, అస్పష్టంగానైనా నీ భావాల్ని చూడగలగటం బావుంటుంది.. glad you are back and sorry, I'm late :))
నీకర్థమవనిది అర్థమే.....భావం అందే ఉంటుంది.
కొన్ని ఎవరికీ అర్థమవ్వాలని ఉండదు అయినా రాయకుండా ఉండళేను :)
అక్కడ భావం అవగతమైతే చాలు, ప్రతిపదార్థాలూ, సందర్భమూ మొ అన్నీ అప్రస్తుతాలే నిషి.
భాషగా విడదీసి అర్థాలు కాదు, భావాన్ని దాని లోతుని వెదకటం బావుంటుంది మీ రచనల్లో.
ఉష గారు,
ఒకప్పుడు అనుకునే వాడిని, కొన్ని రచనలు చదివి..ఆ రసోద్భవ వేళను ప్రేక్షీకరించటానికి గోడ మీద బల్లినవ్వటానికి కూడా వెనుకాడనూ అని....కాని అర్థాలూ, సందర్భాలూ వదిలేసి భావం పట్టటంలో ఉన్న ఆనందం అలాటి సవాళ్ళు నేనూ పాఠకులకు విసరటం అలవాటయిన తరవాత రచయిత ఉద్దేశ్యాన్ని గౌరవించటం తెలిసింది.....భావానికీ అర్థానికీ ఇంకొంచం తేడా తెలిసింది. ముఖ్యంగా నిషి, మీ లాటి వాళ్ళ స్ఫందన ఫర్లేదు రచయితగా మన ఎంపికలోని ఔచిత్యాన్ని ఆదరించేవారున్నారు అని అనిపిస్తుంది. అలాటి గౌరవం పాఠకులుగా మనమూ ఇతర రచయతలకూ ఇవ్వాలీ అనేది అర్థమయ్యింది.
ధన్యవాదాలండి.
Post a Comment