"అలీ గిరాకీలు ఖతమా ఇలా ఖాళీగా కూర్చున్నావు?"హస్కీ గొంతుతో అడిగింది దోమ ఉరఫ్ అనిత.
"ఎందుకు తల్లీ వాళ్ళమ్మ చాల్లేదనా నువ్వూ మొదలెట్టావు" అన్నాడు ఏనుగు.
ఏనుగు దోమని ముద్దుగా తల్లీ అనే పిలుస్తాడు చాలా సార్లు..... పెళ్ళామయినా సరే.
"మీ గోల ఆపుతార వాడెదో సీరియస్గానే ఆలొచిస్తున్నాడు" అలీని వెనకేసుకొచ్చింది రూప.
"ఏమయింది అలీ?" టై విప్పుతూ అడిగాడు ఆనంద్.
"ఈల్లెప్పుడైనా ఆటోల గమ్మున కూర్సోడం మీరు సూసిన్రా? " అలీ ఎదురు ప్రశ్న రాధా,రాంలను చూపుతూ.
"ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు మేమేం చేసాము ఇప్పుడు"? రాం వాపోయాడు
"నా గురించి నువ్వేం వకాల్తా పుచ్చుకోక్కర్లేదు నన్ను నేను....." యధావిధిగా రాధ గొణుగుడు.
మరి లేకపోతే తను ఫాకల్టీగా జాయిన్ అయిన రోజే ఫైనల్ ఎగ్జాం ఫైల్ అవడానికి ఎన్ని గుండెలుండాలి మరి రాంకి? అలగమంటే అలగదా మరి?
"ఈ వయసులోని ఏ జంటయినా ఏం చేస్తారలీ ఆటోలో .......వాదులాడుకోవటమో ప్రేమ కబుర్లు చెప్పుకోవటమో తప్పితే" నవ్వుతూ ఆనంద్ సమాధనం.
"కదన్నా? గిప్పుడే దించ్చొచ్చిన పోరీ పోరడు మాత్రం బుర్ర తినేసిన్రు భై. అందుకే రిలాక్స్ అవుదామని వచ్చినా" అలీ సమాధానం.
"అలీ రిలాక్స్ అవుతున్నది మధ్యాహ్నం పన్నెండునుంచి...అలీ భాషలో "ఇప్పుడే" అంటే అర్థం నాలుగు గంటలనమాట..హోంవర్క్ చేసిపెట్టమంటె "ఇప్పుడే వస్తా" అంటాదు రాడు ఇదన్నమాట అందులోతిరకాసు" రూప బాక్ గురించి ఆనంద్ కామెంట్ బయటకి వెళ్ళగక్కినప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడాలేదు సమంతాలో. అదే గడుసుతనం మూడేళ్ళు దాటినా.
"ఏం చేసారెమిటి? ఆనంద్ అనుకున్నట్టు కాళ్ళూ అవీ కంపేర్ చేసుకుంటున్నారా నీ ఆటోలో కూర్చుని?" ఏనుగు ప్రశ్న.
"అలాటివాటిల్లో ఆనంద్ చెప్పినట్టు మనం ఎప్పుడో అమెరికా లెవెల్ అని మా ఆటోగాళ్ళకందరికీ ఎరకె అన్నా అందులో పరేషానేముంది మాకు? ఎనక్కూర్చుని ధర్మం, గురువూ, పరస్పర విరుధ్ధమైన సత్యాలు అంటూ ఒకటే బుఱ్ఱ తినేసిన్రనుకో. పైగా గా మాటలకు అడ్డని నా స్టీరియో బంద్ చెయ్మన్నరు." ఉక్రోషంగా అలీ.
"అసలేమయింది అలీ ఏం మాత్లాడుకున్నారు? మొత్తం చెప్పు"
"గుర్తున్నంతవరకూ చెప్తా వినండి. ఇద్దరూ ముప్పై అయిదూ ఆరెళ్ళ వాళ్ళే మరీ .........."
ఫటక్ ఫటక్మంటూ నెత్తి మీద మూడు జెల్లకాయలెందుకో పడ్డాయో అర్థంకాలా అలీకి.
"మాలాంటి జంట అన్నావ్ నాకు ముప్పై అయిదేళ్ళా?" గుఱ్ఱుగా చూసింది రాధ.
"నాకూ ఇరవయ్యేడే" రూప సమాధానం.
"లోపల ఉన్న దోమకీ అంత లేవు" ప్రేమగా లొపలకు చూసి స్నేహితుడిని కొట్టినందుకు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ఏనుగు.
"థూ నీయమ్మ....." అంటూ వెళ్ళిపోబోతున్న అలీని "ఏమయింది అలీ చెపుతున్నాడా వాళ్ళేం మాట్లాడుకున్నారో?" అడిగింది అప్పుడే బయటకి వచ్చిన అనిత దోమ.
అందరివైపూ గుఱ్ఱుగా చూస్తూ " మధ్య వయసు వాళ్ళే అనితా ముప్పై ఆరేళ్ళ వాళ్ళు సత్యాలు పరస్పర విరుధ్ధమైనవి ఉంటాయి అలాటప్పుడు ఏది పాటించతగ్గ సత్యం? అని మాట్లాడుకున్నారు అనితా" పాఠం వప్పచెప్పేసాడు అలీ.
"ట్రూత్ ఈజ్ యూనివెర్సల్ అనికదా అంటారు మళ్ళీ పరస్పర విర్ద్దమైన సత్యాలెంటి"? పటేల్ ప్రశ్న.
"ఆమే అదే అడిగింది."అలీ
"అతనేమన్నాడు" రాధ
"లేదు సత్యాలెప్పుడూ మన సంస్కారల ప్రకారం ఉంటాయి" అన్నాడు స్మస్కారం అంటే మంచీతనం కదా ...అందరికీ ఒకే మంచితనం ఉంటుంది కదా ...మంచివాళ్ళందరికీ ఒకే సత్యం ఉండదా" ఆన్న చోట మొదలయ్యింది తల తిరగడం"అన్నాడు అలీ
"హిందూ ధర్మం ప్రకారం సంస్కారం అంటే మన బుధ్ధికి ఉన్న అలవాట్లు అనుకోవచ్చు అలీ. పునర్జన్మ...అదే మళ్ళీ పుట్టట్టం లాటివి నమ్మే హిందువులు వెనక జన్మ అలవాట్లూ ఈ జన్మలో కూడా ఉంటాయి అని నమ్ముతారు. పునర్జన్మ మోక్షం నమ్మని హిందువులు ఈ జన్మలో మన చిన్నప్పటి అనుభవాలూ పరిస్థితులను బట్టి మన బుధ్ధికుండే అలవాట్లను సంస్కారం అని నమ్ముతారు. వాడుకలో మాత్రం మూల అర్థం నుంచి వేరయి సంస్కారం అంటే మంచి అలవాట్లని మాత్రమే నిలిచిపోయింది." రూప వివరణ.
"అంటే ఒకొక్కరి అలవాట్లని బట్టి సత్యాలు మారుతుంటాయని అంటున్నాడా అతను?" రాధ ఆక్షేపణ.
"నిజమే కదా రాధా. ఉదాహరణకు రూపను తీసుకో. బాపనమ్మ కాకపోయొనా తన సంస్కారం ప్రకారం జంతు హింస తప్పు, అందుకే తను వెజిటెరియన్. ఆనందూ జంతు హింస ఇష్టపడడు కాని తన సంస్కారం ప్రకారం ప్రపంచం మొత్తం జనభా వెజ్జే తింటే ఇక వెజ్జీస్కి ఫుడ్డేది? పైగా ఆహారం కోసం మాంస భక్షణ ప్రకృతి ధర్మమే కదా. కాబట్టి ఇక్కడ సంస్కారం/అలవాట్లూ/వ్యక్తిత్వం/ పేరేదైనా కాని ఆ వ్యక్తి నమ్మకాలను బట్టే కదా అతనికి తెలిసిన సత్యం....దీన్నే తెల్ల దొరలు Frame of reference or wearing coloured glasses అనీ అంటారు....." ఆనంద్ వివరణ.
"అమ్మాయిలు ఒప్పుకుంటార భై ఎదైనా మగాడు చెపితే?...
ఆమే ఒప్పుకోలా....
ఆమె అంటది సత్యమొకటే ఉంటది కానీ అన్ని సంగతులూ తెలిసిన కొందరు పెద్దమనుషులకే అది ఎరుక. అందుకే అది ఎరుకైన పెద్దమనుషులు ఏది సెప్తే అది యినాలి అంటది.
ఏకలవ్యునికి అస్త్ర శస్త్ర ఇద్యల్లో అస్త్ర ఇద్య దొంగసాటుగా బాపనాయన నుంచి నేర్సుకుందట.
దొంగసాటుగ నెర్సుకున్న శస్త్ర ఇద్య లోకకళ్యాణం కోసమే వాడాలి అసుమొంటిగాల్లకే అది నేర్పాలి అని ఆ ఇద్యలు నేర్పే గురువుల రూల్సట. అందుకే లోకకల్యానం కోసమే ఉపయోగించే వ్యక్తిత్వం ఏకలవ్యునికి లేదనే నేర్పించక పంపిస్తే అది దొంగసాటుగ నేర్చేసుకున్నాడనే గురువు బొటన ఏలు గురు దక్సిన కింద కోరి ఆ ఇద్య పనికి రాకుండా సేసిందట.....మరివన్న్నీ తెలిసిన గురువు దగ్గరే మనం సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో నేర్చుకొవాలట....అప్పుడైతే పరస్పర విరుధ్ధమైన సత్యాలు ఉంటాయి లాటి అనుమానాలు ఉండవట......అని అమ్మాయి చెప్పింది" అలీ
"అమ్మాయి ఖచ్చితంగా బాపన్ పిల్లే అయి ఉంటుంది. బాపనోడు ఆ ద్రోణుడు చేసిన తప్పులను ఇలా సమర్ధించేసుకుంటుంటారు..." రాం ప్రతిపాదన.
"అచ్చు ఆతనిదే మాటన్నడు భై...నువ్విప్పుడన్న మాటలు వివరణా వింటే ఇంకో జాతిలో పుట్టిన వారు దాన్ని ఇలాగె అర్థం చేసుకుంటరు...కాబట్టే సెపుతున్నా సత్యం అనేది సంస్కారం బట్టి ఉంటది.....అందుకే ధర్మాచరణలో పరస్పర విరుధ్ధమైన సత్యాలు కనపడినప్పుడు ఏం చెయ్యాలి, ఏ సత్యాన్ని పాటించాలి అన్న సమస్యొస్తుంది అన్నడు భై" అలీ
"ఆమేమనింది?"
"లేదు...అలా పరస్పర విరుధ్ధమైన సత్యాలు ఒకరి మనసులో తోస్తే అది ఆంబిగ్యుటీ నిదర్సనం." అంది ఆంబిగ్యుటీ అంతే ఏంది భై" అన్నాడు ఆలి.
"అటూ ఇటూ మనసు ఊగిసలాడటం" క్లుప్తంగా వివరణ మామ్మ నుంచి.
అప్పటివరకూ మామ్మ వింటోందని వారికి తెలీనే తెలీదు.
"నిజమే కద అలీ. వేరు వేరు వ్యక్తుల్లో పరస్పర విరుధ్ధ సత్యాలు ఉండొచ్చేమో కాని ఒకే వ్యక్తిలో అలా ఉందంటె he does not have the courage of the conviction అనే కదా అర్థం...ఒక విషయంపై పూర్తి విశ్వాసం ఉండకపోవటమో లేదా విశ్వాసమున్నా ఆ సత్యాన్ని పాటించే సమర్ధత లేకపోవటమో అనే కద అర్థం ఆ ఊగిసలాట ఉంటె" ఆనంద్ వివరణ.
.............................................."చల్ నీ....." మామ్మను చూసి.నాలుక్కొరికేసుకున్నాడు అలీ. "ఆళ్ళేమో ధర్మ సత్యం సంస్కారం అని సావగొట్టిర్రు ఈడకొస్తే conviction, ambiguity అని మీరు..... నే పోతున్నా" వెళ్ళిపోతున్న అలీ ఆటోలొంచి "మున్నీ బద్నాం హుయీ రె దార్లింగ్ తేరే లియే......." ఊరంతా వినపడేట్టు.
"నేటి యువత" నిట్టూరుస్తున్న మామ్మ ముందు మోకాళ్ళ మీద కూర్చుని చెప్పింది రూప "ఈ దేశ భవితకు నేటి యువతనుంచి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మామ్మా. మీలాటిపెద్దలు ఇలాటి వాళ్ళ పై పై నిరాశక్తతను మాత్రమే చూదక నిద్రాణంగా ఉన్న తమ ఉనికీ చాటే ఆ ఆసక్తికి సందర్భోచిత ప్రోత్సాహ ప్రాణవాయువుని ఇస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ వివేకానందుడు కోరుకున్న భారతీయుడు ఎందుకు కాడో చూద్దాం" అంటున్న తనను చూస్తూ గర్వంగా మూగవాడయిపోయాడు ఆనంద్.
Characters ali, anita, samanta, anand, rupa, radha, ram........all blatantly plagiarised from the telugu movie Anand...o manchi coffe lanti cinema........Thanks to the movie team for the inspiration.

No comments:
Post a Comment