"ఆలోచించకు ....ఆలోచిస్తే నీ “తెలివి” బయట పడుతుంది కాని నీ “అసలు నైజం” కాదు. టక్కున సమాధానం చెప్పాలి" అన్నది తను. ఆలోచించకుండా చెప్పటం మొదలెట్టాను "ది గాడ్ డెలూషన్” చదవటం మొదలెడుతున్నాను....ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే కాబట్టి అసలు నా అభిప్రాయాలు ఏమిటి అని నన్ను నేను ప్రశ్నించుకోవటం ఇది అంతే".
"నువ్వు ఇది తిక్క ప్రశ్న అని ఎందుకు అన్నావో నాకు అర్థం కాలేదు" తిరిగి నేనే అన్నాను. "అదేంటి? దేవుడు అంటే అందరికీ తెలుసు కదా...మతాన్ని బట్టి దేవుడు.....రాముడు, కృష్ణుడు, యేసు, అల్లా....ఇలా రక రకాలుగా.....అందరికీ తెలిసినదే కదా దేవుడు అంటే...ఇదేదో పెద్ద విషయం అయినట్టు నువ్వు .... " నవ్వుకుంటూ చెప్పుకు పోతున్న తనను మధ్యలో కట్ చేస్తూ "వేళాకోళాలు ఆడకు....నువ్వు చెప్పినవి దేవుళ్ళ పేర్లు....... నేను ఆలోచిస్తున్నది అసలు దేవుడు అంటే ఏమిటి అని......"
"అహహ పేద్ద ఫిలాసఫర్ అండీ......పేద్ద పేద్ద వాళ్ళకే అర్థమవలేదు నీకేం అర్థమవుతుంది?" కొంచం హేళన వినిపించింది మనోజ గొంతులో. స్థిరంగా చెప్పాను "ఏదో ఎవరికో చెప్పాలని కాదు....నాకు నేను అర్థమవ్వాలని....పైగా పూజకు కూర్చుంటే చాలు "చిత్త సుద్ధి లేని శివ పూజలేలరా " అని ఎవరో అవహేళన చేస్తున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి నాకు నేను అర్థమవ్వాల్సిందే. అందుకే ఈ ప్రయత్నాలన్నీ"
"సరే, నేను ఆ మాట నమ్మానే అనుకో. మరి ఒక చోట కూర్చొని ఆలోచించొచ్చు కదా, ఇలా బ్లాగుల మీద రాయాల్సిన అవసరం?" తిరిగి ప్రశ్నించింది. "నీకు తెలిసి అడుగుతున్నావో, పరీక్షించటానికి అడుగుతున్నావో అర్థం కావట్లేదు.......నేను దేవుడు, మతం అన్న దాని గురించి ఇంతకు ముందు ఇంటర్నెట్లో చర్చించటం వలన ఎంతో కొంత మార్పు వచ్చింది, మంచే జరిగింది అని నువ్వు వొప్పుకొని తీరాలి. అలాగే ఈ టపా వలన కూడా ఇంకొంచం చర్చ జరగోచ్చేమో .... ఎవరికి తెలుసు? " “అలాగే.... ఎస్..... నువ్వు అనుకుంటున్నట్టు అందరూ మేచ్చుకొంటారు అని కూడా బ్లాగులో పెడుతాను...నిజమే" అంటూ ముగించాను.
నిమిషం పాటు మవునమేలింది రాజ్యం. తరవాత ధృడంగా పలికింది మనోజ స్వరం "నాకూ ప్రతి సారి నీకు ఇలా గుర్తుచేయటం...అదే.... నువ్వు మెప్పుదల కోసం రాస్తున్నావని చెప్పటం కొంచం కష్టంగానే ఉంది....కానీ తప్పదు....గుర్తుందా నీకు, బ్లాగింగు చేయటం మొదలెట్టిన కొత్తలో నువ్వు, అందరూ నీ టపా చదవాలని, వ్యాఖ్యలు రాయాలని ఎదురు చూసేవాడివో, రాయకపోతే బాధ, రాస్తే సంతోష పడటం చేసేవాడివో....దానివలన “రాయటానికే” రాసిన రచనలు కూడా ఉన్నాయి కదా .....స్ఫందన లేకపోయినా.....అలాటి పరిస్థితికి మళ్ళీ నువ్వు పోకూడదు అనే ఈ ప్రయత్నమంతా......" అని. కొంచం సేపటి తరువాత మళ్ళీ తనే చెప్పింది "సరే నేను చేయాల్సిన పని అయిపొయింది. ఇక ఇక్కడ నీ పని మాత్రమె ఉంది...దేవుడిపై నీ అభిప్రాయాన్ని తర్కాన్ని చర్చిస్తున్నావు కాబట్టి నేను ఇంక ఇక్కడ అనవసరం...వెళ్తున్నాను...బై" అని చెప్పి తను వెళ్ళిపోయింది.
ఇక మిగిలింది నేనొక్కడినే. "మై ఔర్ మేరీ తన్హాయీ......" అంటూ కథలు చెప్పకుండా చెప్పాల్సినది సూటిగా చెప్పాలి అని నన్ను నేను హెచ్చరించుకుంటూ వెళ్ళు కీబోర్డు మీద కదపసాగాను.
రెండవ భాగం ఇక్కడ.
ఇదే విషయంలో ప్రదీప్ గారు ఇంకో కోణంలో రాసిన టపా ఇక్కడ
నా టపా గురించి ప్రస్తావించినందుకు ధన్యవాధములు.
ReplyDelete