Sunday, 13 December 2009

మళ్ళీ గుర్తురాకు పో.




నీ ఫోటోలు.... మదిలో లేనివి గదిలో ఎందుకని....ఖాళీ చేస్తున్నా.
నీ చిహ్నాలన్నీ తుడిచేస్తున్నా-నువ్విక చాయామాత్రంగా కూడా గుర్తు రాకూడదని.

అప్రయత్నంగా చెంప తడిసింది.

ఇంకా నీ విషయంలో కన్నీళ్లున్నాయాంటే చాలా ఆశ్చర్యంగా ఉంది...
నేను చీమూ నెత్తురు ఉన్న మనిషినేనా అన్న అనుమానమూ కలిగింది.

అదో...మళ్ళీ కలుస్తానని అపోహలు పెంచుకోవద్దు.

ఈ కన్నీళ్ళు ......మన బంధాన్ని నిలపటానికి విఫల ప్రయత్నం చేసి,"ప్రయత్నలోపమేమాత్రం లేదు మిత్రమా అయినా ఫలితం మాత్రం శూన్యం. నువ్వు చేస్తున్నది సబబే. ఇక మా గుర్తులు నీకు విషతుల్యాలే... అందుకో మా చివరి వీడ్కోలు" అంటూ రాలిపోతున్న ఆ నా అమూల్య క్షణాలకు .....గడ్డు సమయాల్లో నా తోడున్న ఆ కామ్రేడ్లకు...సాంఘిక న్యాయమంటూ నువ్వు బలి తీసుకున్న ఆ అసంఖ్యాక అమాయక వీరులకు....
నా లాల్ సలాం ఈ రక్తాశ్రువులు. నీ కోసం కావు.

2 comments:

  1. good show..
    modatlo priyuraali kosam anukunna :)

    chivariki verity ending ichcharu..


    www.tholiadugu.blogspot.com

    ReplyDelete