"మీరు వేరే గిటారిస్టును వెతుక్కోండి సార్" అంటున్న స్నేహ తానకు తందాన అన్నట్టుగా "అంతేకాదు ఇంకో ఫ్లూటిస్టును కూడా" అంటున్న వెంకట్ను చూసి మానేజర్కి నవ్వాగలేదు. కాని స్నేహ మొహంలో ఉన్న సీరియస్నెస్ని పసిగట్టి "ఏమయ్యిందమ్మా? ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుంటున్నావు..ఏమయ్యిందో చెపితే సర్దటానికేగా నేనున్నది" అంటూ సముదాయించబోయిన ఆయన వెనకే వస్తున్న లత "అలాగే లీడ్ సింగర్ను కూడా" అనటంతో అవాక్కయ్యాడు.
బ్యాండ్లో ఓనర్ డ్రమ్మిస్ట్. ఆయన కాకుండా బ్యాండ్ పెట్టిన గత అయిదేళ్లగా ఉన్న సీనియర్ ఆర్టిస్టు లత. నెమ్మదస్తురాలు. ఆలొచనాపరురాలు. ఆమె కూడా అదే అంటోందంటే నిజంగా ఏదో పెద్ద సమస్యే అని పసిగట్టిన మానేజర్ "అసలు సంగతేంటి లతా? ఎందుకీ నిర్ణయాలు?" అన్నాడు.
"ఆయన మీకు కన్నకొడుకులాటి వారు, పైగా ఈ బ్యాండు ఓనరు. కాబట్టి ఆయనకు చెప్పటానికి మీరు ఇబ్బంది పడతారని మీ దాకా రాకూడదనే అనుకున్నాము సర్. మా ప్రయత్నాలు మేము చేసాము సమస్య పరిష్కరించాలని. కాని ఇప్పుడింక మాకెవరికీ ఓపిక లేదు. మేమందరం వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాము" స్థిరంగా లత గొంతు.
"పెద్ద వాడిని మీరు నాకిచ్చే గౌరవం ఇదేనా? నా ప్రయత్నం నేను చెయ్యటానికి అవకాశం కూడా ఇవ్వకుందానే కన్న తల్లిలాంటి బ్యాండ్ విడిచి వెళ్దామని ఎలా అనుకుంటున్నారు?" చిన్నగా ఆయన కంఠంలో కంపన.
"మీరు కొత్తగా ఏం చెస్తారు సర్? ఆయనకు తన తప్పు తెలియకపోతే కదా మీరు చెప్పి ఒప్పించటానికి. మేము చెప్పిన ప్రతి సారీ "నిజమే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. నా డ్రంస్ ఒకటే కాదు బ్యాండ్ అంటే మిగితా అన్నీ, అందరూ ముఖ్యమే. కావల్సినవన్నీ తగుపాళ్ళలో పడితేనే అది విందు భొజనమవుతుంది, ఏ ఒక్కటీ ఎక్కువైనా అది చెత్త కుప్పమీద చేరాల్సిందే" అని తన తప్పు ఒప్పుకుంటారు. కాని మళ్ళీ మరుసటి షోలో షరా మామూలే. ఫ్లూట్ సోలో ఇంటర్లూడ్ అని తెలుసు, అసలు ఆ ఇంటర్లూడ్ సజెస్ట్ చేసిందీ ఆయనే మొదట్లో. అయినా సరే నా ఫ్లూట్ను మించి పోయేలా తన డ్రం స్టిక్స్ తాళం అసంధర్భంగా...ఎలా భరించమంటారు? మేమూ కళాకారులమేగా? మాకవమానం అనిపించదా?" తన మన్స్తత్వాన్ని మించి మాటాడుతున్న వెంకట్ ముగించక ముందే
"ఆయన కావాల్సని చేస్తున్నరనట్లేదు. నిజమే ఆ సంగీతంలో ముణిగిపోతారాయన. తనను తాను ఆపుకోలేరు. ఆయనకు తెలీకుందానే ఆయన వేళ్ళు డ్రం స్టిక్సును నర్తింప చేస్తాయి. అది మేమూ ఒప్పుకుంటాము. కాని ఇలా ఎన్నాళ్ళనీ? మాకాయనలాగ ఈ బ్యాండొక కాలక్షేపం కాదు. మాకు తిండి పెట్టే తల్లి. మా కెరీర్లన్నీ ఈ బ్యాండు మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన డ్రంస్ ఘోషలో మా నైపుణ్యం ఎవరికి తెలుస్తుంది? అనంత గోదారిలా ఘోషించే ఆ నాదంలో మా ఫ్లూట్లూ గిటార్లూ పిల్లకాలువలై పొతుంటే మమ్మల్ని పట్టించుకునే నాధుడెవ్వడు?" తమ జీవనాధారం పోతుందన్న ఆక్రోషం స్నేహ గొంతులో.
"సరే. నాకొక్క అవకాశమివ్వండి. ఇంకో నెల తరవాత కదా మన మరుసటి పొరగ్రాం. ఆ రోజు నేనతన్ని ఆపలేక పోతే ఇక మీ ఇష్టం. మీ ప్రయత్నాలకూ, నిర్ణయాలకూ నేనడ్డు రాను వెళ్ళండి" అన్న మానేజర్ మాటలకు సరేనంటూ వెళ్ళిపోయారు స్నేహా వెంకట్లు. వెళ్ళిపోబోతున్న లత ఆయన సైగ చేయటంతో అక్కడే కూర్చుండిపోయింది.
"ఏమ్మా లతా నీకు బయటి బ్యాండ్స్ నుంచి మంచి ఆఫర్సు, సినిమాళ్ళో చాన్సులు వస్తున్నాయత నిజమేనా?"
"మీ దగ్గర దాపరికమేమి లేదు సర్. అవును చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి వస్తున్నాయి పెద్ద పెద్ద బ్యాండ్స్ నుంచి. కాని ఇవాళ నేను వెళ్ళిపోతానన్నది అందుకు కాదు. ఆయన నా కెరీర్ ప్రొగ్రెస్కి ఎప్పుడూ అడ్డవనివ్వలేదు మన ప్రోగ్రాంస్ను. నా సినిమా సాంగ్స్ రికార్డింగ్స్కు అడ్డు కాకుండా కో ఆర్డినేట్ చేస్తారు మన ప్రోగ్రాంస్ అన్నీ. ఆ విషయంలో నో కంప్లైంట్స్...... " ఇంకా ఏదో సంజాయిషీ ఇవ్వబోతున్న లతను ఆపి "నువ్వొక సాయం చెయ్యాలమ్మ మన బ్యాండ్ బ్రతకాలంతే. వెంటనే ఒక మంచి ఆఫర్ను, వేరే బ్యాండ్ వాళ్లది, ఆంగీకరించి మన బ్యాండ్ నుంచి వెళ్ళిపో" అన్నారాయన.
"సార్..." అటున్న లతను ఆపి "తప్పదమ్మా. ఈ బ్యాండ్ను బ్రతికించటానికి నేను చేసే చివరి ప్రయత్నానికి నీ స్థానం ఖాళీ అవ్వాల్సిందే తప్పదు" అన్న మానేజర్ మీద నమ్మకంతో "అలానే సర్. ఇప్పుడే రిజైన్ చేస్తాను" అని వణికే చేతులతో రాజీనామా రాసిచ్చి కన్నీళ్లనాపుకుంటూ వెళ్ళిపోయిన లతను చూసి నిట్టూర్చారాయన.
మూడు రోజుల తరవాత
మొదలయిన రిహార్సిల్సో విషయం తెలుస్కున్న స్నేహ వెంకట్లు "లీడ్ సింగర్ లేకుండా ఎలా రిహార్సిల్స్ చెయ్యటం" అని వాపోతుంతే మానేజర్ "మనం ఇలా ఇంత ముందు చేసిన సంగతి మరిచిపోవద్దు. తప్పదు.మీరు ముగ్గురూ మీ మీ కో-ఆర్డినేషన్, టైమింగ్స్అవీ ప్రాక్తీస్ చేసుకోండి. లీడ్ సింగర్ను నేను సెలక్ట్ చేసేసాను. తన చేత మన మ్యూసిక్ ఆల్బంలోని మ్యూసిక్తో సింక్రనైస్ చేస్తూ రిహార్సిల్స్ చెయ్యించే భాద్యత నాది. మీరు అడిగినది జరగాలంటే, ఈ బ్యాండ్ ఇంకొన్ని రోజులు బ్రతాకాలంటే మీరిది చెయ్యక తప్పదు" అని కొంచం కఠినంగానే పలికిన మానేజర్ను చూసి అతను ఒక కనుబొమ్మను పైకెత్తి చూడటం తప్ప ఇంకేమి చెయ్యకపోవతంతో "ఓనర్కు లేని బాధ మాకెందుకు? అలాగే చేస్తాం. ప్రోగ్రాంలో మా మీద రాళ్ళు పడకుండా చూసుకునే భాధ్యత మీదే" అని ఉక్రోషంగా అంటున్న వారిద్దరినీ చూసి చిన్నగా నవ్వుకున్నారాయన.
ప్రోగ్రాం రోజు.
తెర వెనకాల ఎవరి వాయిద్యాలను వారు ట్యూన్ చేసుకుంటూ బిజీగా ఉన్నా లీడ్ సింగర్ మైక్ ముందు ఎవరూ లేకపోవటంతో వెంకట్ స్నేహ ఇద్దరూ మొహా మొహాలు చూసుకున్నారు. ఇంతలో అనౌన్సర్ తమ బ్యాండ్ను తెర ముందు నుండి పరిచయం చెయ్యటం మొదలెట్తతంతో తమ బ్యాండ్ సిగ్నేచర్ ట్యూన్ వాయించటంలో నిమగ్నమయిన వారిద్దరూ మానేజర్ తేసుకొస్తున్న అమ్మాయిని చూసి ఖంగు తిన్నారు.
ఎంతో సాదా సీదాగా మామూలు కాటన్ సారీ కట్టుకుని మైక్ ముందు నిల్చుంటున్న ఆ అమ్మాయిని చూసిన గుర్తు లేదు వారిద్దరికీ. తమ బ్యాండ్ ఎంత కొత్త వాళ్ళకు చాన్స్ ఇచ్చే బ్యాండ్గా పేరుపొందినా ఇలా ఇంతవరకు అసలు ముక్కూ మొహం తెలియని అమ్మాయినీ, అదీ చూడ్డానికి బావున్నా బ్యాండ్ లీడ్ సింగర్ అనిపించుకునేంత బాడీ స్త్రక్చర్లేని ఆ అమ్మాయిని తీసుకొచ్చిన మానేజర్పై కోపం పీకల వరకూ వచ్చిందిద్దరికీ. అతనేమో ఎప్పటిలా కళ్ళు మూసుకుని తన డ్రంస్టిక్స్ తో చిన్నగా తాళం వేసుకుంటున్నాడు లోకాన్ని మరిచి.
ఇంతలో చిన్నగా రాగం ఎత్తుకుందా అమ్మాయి. అప్పటివరకు కళ్ళు మూసుకు ఎదో లోకంలో ఉన్న అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసాడు విస్మయంగా ఆ అమ్మాయిని మొదటిసారి. అతని చేతి వేళ్ళు కూడా తాళం సంగతి మరిచిపోయాయి. అమ్మయేమో వీరెవరినీ పట్టించుకోకుండా పల్లవిలోకెళ్ళీపోయింది సుతారంగా. అంత సునాయాసంగా గమకాల్లోంచి సాహిత్యంలోకి ఆమె ఇచ్చిన ఎంట్రెన్స్ చూసి "ఫర్లేదే" అనుకున్నారిద్దరూ.
మామూలుగా అయితే ఇప్పటికి తమను మించిపోయే డ్రంస్, పాపను లాలిస్తూ జోల పాడుతూ, స్వరం ఎక్కువైతే ఎక్కడ నిద్రా భంగమవుతుందో అనీ, తక్కువైతే జోలెక్కడపోయిందని బిడ్డెక్కడ బెంగపడి ఉలిక్కిపడుతుందో అనీ, అటూ ఇటూ ఆ ఊగిసలాటలో సరైన స్థాయి సమన్వయానికి తంటాలు పడే తల్లిలా, అతని డ్రంస్ పాటపాపను లాలిస్తుంటే నిశ్చేష్టులయిపోయారు. ఇన్నాళ్ళూ తమను గమనించి కూడా పట్టించుకోకుందా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపొయే ఆకతాయి టీనేజి కుర్రాడిలా ప్రవర్తించిన ఆ డ్రంస్, ఇవాళ మంద్రంగా నెమ్మదిగా... బీచిలో "నీకంటే నేనే ముందూ" అంటూ ఆకతాయిగా పరిగెడుతున్న తన స్త్రీని అపురూపంగా చూస్తూ.. మౌనంగా, ఎంతో జాగ్రత్తగా, ఆమె పాదాల ముద్రల్లో ఆమె వెనకాల తను అడుగులేస్తూనే ప్రేమ చాటటంలో మాత్రం తానే ముందని చాటే పురుషుడిలా ఆమె గీతంతో అనుగమిస్తున్న అతని డ్రంస్ విని విస్మయం చెందారు.
అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన విషయం షో విజయవంతంగా ముగిసిన తరవాత జరిగింది. మర్యాద పూర్వకంగా తనను తాను అందరికీ పరిచయం చేసుకున్న ఆ అమ్మాయి బ్యాండ్ ఓనరూ,కో ఆర్టిస్టూ అయిన అతన్ని నామమాత్రంగా అయినా కలవకుండా, పరిచయం చేసుకోకుందా ఒక్క చూపు మాత్రం చూసి వెళ్ళిపోవటం చూసిన వాళ్ళు, అతను తన కార్ ఎక్కీ, ఆ అమ్మాయి ఎవరి స్కూటర్పైనో వెళ్ళిపోగానే మానేజర్ని కార్నర్ చేసారు.
"ఏం మాయ చేసారు? ఎవరా అమ్మాయి? వారిద్దరికీ ముందే పరిచయం ఉన్న సంగతర్థమయింది. కాని అస్సలు పలకరించుకోకపోవటమేమిటి? How does she have that effect of stopping him in his tracks and bringing him down to earth?" అంటూ లక్ష ప్రశ్నలు వేయసాగారు.
"మీకు కావాల్సిందేమిటి మన షోలు సరిగ్గా నడవటం. ఆమె ఎవరూ ఏమిటీ అన్న పరిచయాలను ఆమె తనను చేసుకున్నంత వరకే పరిమితం చేద్దాం." అంటున్న మానేజఋ మాటలకు అడ్డు తగిలిన వెంకట్ "మీరు చెప్పకపోతే మేము తెలుసుకోలేమా...."అని ఇంకా ఏదో అనబోయాడు.
తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్న మానేజర్ ఒక్కసారి ఆగి వెనక్కు చూసి "మనకు కావాల్సింది అతని విజృంబణ తగ్గి అతను మనతొ ఉన్న కొద్ది సేపైనా మనకణుగుణంగా నడవటం. మహా సాగరంలా ఎగసిపడే అతని సంగీతంలో మీరు చూసింది అతని విజృంబణా మీకు తగిలుతున్న దెబ్బలు మాత్రమే. కాని అసలు విషయమేమిటో తెలుసా? ఆ విజృంబణంతా మన లోకాన్నుంచి పారిపోవాలని అతను పెడుతున్న పరుగు మాత్రమే. అతి వేగమైన పరుగు. ఆ పరుగులోని అలసటలో, ఆ అలసటనుంచి పుట్టిన గుండె మ్రోతలో తన అస్థిత్వాన్నీ, తన సర్వస్వాన్నీ మరచిపోవాలని అతను చేస్తున్న వృధా ప్రయాసది.
ఏది ఏమైనా కాని అతని హోరునూ తీవ్రతను అడ్డుకోమన్నారు. అతన్ని మన లోకంలో పడేయమన్నారు. అతనికది ఎంత గుండె కొతైనా సమిష్టి ఉన్నతి కోసం ఆ జోరుకు ఆనకట్ట వేయాల్సొచ్చింది. అతని జోరునాపగలిగే ఆనకట్టను తెచ్చాను. అతను తగ్గాడు. ఇహ లోకంలోకి వచ్చాడు. ఇక మీకు ఇబ్బందులేమీ ఉండవు. మీక్కావాల్సిందంతే.
అంతకు మించి ఈ హోరుకీ, అతని పరుగుకూ, ఆ ఆనకట్టకూ ఉన్న సంబంధమేమిటి. ఆమెకంతటి బలమెక్కడిదీ అన్న అనవసర విషయాల జోలికి పోయారా....నేను పూర్వాశ్రమంలో కరడు కట్టిన పోలీసోణ్ణి అన్న సంగతి గుర్తు చేసుకోవాల్సొస్తుంది ఆ అగత్యం రానీకండి" అని కఠినంగా చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నారాయన.
"వారిద్దరూ మాటల్లో పలుకరించుకోకపోవటమే చూసారు మిగితా వారు కాని కలిసిన వారి చూపుల్లో, ఆ తరవాత వారి ప్రవర్తనలో జరిగిన అనంత సంభాషణ ఎవ్వరూ గుర్తించలేదేం" బాధగా మూలిగిందాయన మనసు.
"బావున్నావా?" అంటూ అతని పలకరింపు చూపు..
"నువ్వు?" ఎప్పటిలా సూటిగా సమాధానం చెప్పక తిరిగి ప్రశ్నించిన ఆమే చూపు...
సమాధానం చెప్పలేక విసురుగా డ్రంస్ నుంచి లేచి వెళ్ళిపోయి ధడాలుమని కారేసుకు వెళ్ళిపోయిన అతని భాధా..
అతని బాధను చూసీ ఏమీ చెయ్యలేక నిశ్శహాయంగా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిముషం కృంగిపోయిన ఆమె భుజాలు...
మరు నిముషం తన కర్తవయం గుర్తుకొచ్చి శిల అయిపోయి కదిలిపోయిన ఆమె జడత్వంలోని కర్తవ్యపాలనా ధర్మనిరతా...
స్కూటర్పై వెళ్ళిపోతూ అతనెల్ళ్ళిపోయిన దిశగా చూస్తున్నప్పటి కనుకొలకల్లోనుంచి జారిన చిన్న చినుకు చెపుతున్న ఆమె ప్రేమతత్వం...
"ఇవన్నీ వారిద్దరి సంగతి తెలిసినందుకేనా నాకు అర్థమయింది లేక పోలీసోడిని కర్కశుడినీ అని చెప్పుకున్నా నాకూ ఏ మూలో మనసింకా మిగిలుందా" అనుకుంటూ సాగిపోయారాయన.

No comments:
Post a Comment