పట్టుకోకల ధగధగలు మధ్య
మత్తుపోకడల తావి కుప్పగ
ప్రౌఢయందమూయలూగ
మనసిదేమి మనసిడదేమి
విరిచేడె ఏ సంజాత
మే సంయోగ మీ విరిపూత
మే సంయోగ మీ విరిపూత
అంకురార్పణ మధురంబెట్టిది
సంరక్షణ పాసమెట్టిది
బుగ్గపుణికిన రవిరాగము
ఏ విధమాయెనో సన్నాయి గానము
నిశికిరీటుని ధగధగలలాడిన దాగుడుమూతలు
నారీకేళపత్ర సాక్షిగనేవిధమయ్యేనక్షింతలు
కట్లత్త కాట్లనోచి స్థిరముగ
మలయాచల మామ మోయ
పుట్టినింటి పునుగు కట్నమున
ఏ లగ్గమాయే పాణిగ్రహణము
మానసంబేమధువనముల
రాధన్బోల కురియ మురళీరవము
దీటుగ మవునమే రీతినాడే భరతము
తొలిరేయి వరమసమశరుని తాళమే జాతము
అని నను తొలుచు మనము
హోయలకోడిన ధర్మజు కాదు
కురూపియందూ రాదంగాంచిన
నల్లనయ్యనచ్చు పోలుతనము
ఏ శిలీముఖ గాయమీ వ్రణము
ఏ కుబ్జ చిన్నతనమీ ప్రమాణము
ఏ జ్ఞాపిక కేసిన ముసుగు ఈ కనరు
యటంచూ రుద్రాక్షల్దిప్పు నీ జంగము
కొబ్బరాకుల చాటు చంద్రలేఖ
పత్ర ప్రౌఢల తుహినంపు మొటిమ
తుదకు గృహములోని పల్లికమైనా
ఏ జన్మయోగమైనేమి ఆ యాగము కాన.
చిన్నప్పటి నుంచీ గోడమీది బల్లంటే నాకెంతో అసూయ. సగర్వంగా స్ఫూర్థికారికి సమర్పణం.
On a serious note, how I love to know the context of some of the poems that I read.
On a serious note, how I love to know the context of some of the poems that I read.
chala baga rasaru .
ReplyDeleteవినాయక చవితి శుభాకాంక్షలు.
saavirahe gaaru,
ReplyDeleteThanks