కొద్దిగా చిన్నప్పటి మొటిమల ఆనవాళ్ళు
అయినా.....
కళ్ళల్లో...? ఆ.......చెయ్యలేను అని కాదు చెయ్యను అనుకుని మాత్రమే సుమా అంటూ!
కదూ?
పిడికిలి బిగింపు లేదు, మాట తడపాటు లేదు, గొంతు గాద్గమవలేదు!
అవసరమా అని సూటిగా నిక్కచ్చిగా అడిగే హృదయ కవటాలు.
చేస్తున్న మంచిని బహాటంగా చెప్పటం బాకా కొట్టుకోవటమేమో కదా అన్న అనుమానం పడనిది అమాయకత్వమా? భూషణమైన లౌక్యం ఫక్కుమంది. పసితనమా? విఙ్ఞత చిరునవ్వుతో కాదంది. నిర్వచనమెందుకు ఆనందించక అంటూ ఓ మొటిక్కాయ కూడా......
నలతలకు కలత పడక నడపటం పొలతులకానవాయితేనంటూ......
కించిత్ కూడా లజ్జపడక,
ఎవరికి కావాల్సినది వారు.......
వీడ్కోలుగా పాతటానికి మైలురాయి.........ఎక్కడో దాపెట్టి చేతులూపుకుంటూ వచ్చినా,
ఆనవాయతీనెందుకు మరచిపోవటమంటూ
స్వతంత్ర్యంగా తనది చెసుకుంది.
భాషగా విడదీసి అర్థాలు కాదు, భావాన్ని దాని లోతుని వెదకటం బావుంటుంది మీ రచనల్లో.
ReplyDelete