నిన్నెంతగా కోరుకుంటానో
అంతగా వదులోతానికీ సిధ్ధమే.
అణూ సమత్వమూ త్రివిక్రమణమూ
రెండూ ఎలా సాధ్యం నీతో?
చల్లని చిరునవ్వుగా
ఎడారి పెనుతుఫానుగా
ఎలా మారగలవలా?
ఒకటి ఖచ్చితం
మనసు ఇలా శ్వసిస్తున్న వరకే!
నీతో బతుకొద్దు
నీ చాయతోనైనా సరే
నేను జీవించాలి.
బతుకూ జీవితానికీ
పొలిమేరవు నీవైనా సరే
బలవ్వాల్సిందే.
గతిలేనితనం!
నిజమే.
ఒంటరితనపు కోరలు
నిజమే.
వర్షమొక్కటి పొనీ
నువ్విప్పటికే గొప్ప
ఖితాబులిప్పించిన జనాల కోసం
వర్షమొక్కటి పొనీ
పర్లేదులే
వెర్రిగొంతుకనిచ్చి మ్రోస్తున్నాము
పర్లేదులే
వర్షమొక్కటిపొనీ.
No comments:
Post a Comment