Saturday, 24 March 2012

Yes, yes, yes....am in love!!!

Love is Blind
Love has no season....it doesn't need even a reason
అన్న "జూనియర్" మాటలు గుర్తుకొస్తాయి.

ఎందుకింత చిన్నతనంగా అనిపిస్తుందో అర్థం కాదు.
నేను సైతం నేను సైతమంటూ అంగీకరించకుండా
ఏమిటీ అర్ధ రాత్రి "నోరు నొక్కుకుని" అంటూ అర్థం పర్థం లేని ఆలొచనలు.

పర్యవసనాలు.
ఏమైతెనేం?
ఫలించిన నిరీక్షణ.
వరం కోసమేడుస్తావేమోయ్
తపస్సు నచ్చిందిగా.

కన్నీళ్ళు.
వస్తేనేం?
మోహంలొనూ, "అసలైన ప్రేమలోనూ" (!), బాధలోనూ, పిరికితనంలోనూ
అన్నిటిలోనూ అదే కన్నీళ్ళు
మరి నీదేదో సరిగ్గా తూకం వేసే గీటురాయి
నువ్వొక్కడివేగా.

అయినా,
బాధేస్తుంది.
అయితే?

మగాడివి కావంటారా?
మగాడంటే...ఈ సమాజపు లెక్క.
"అదున్న వాడు" ఇలా ఉండాలని.
అలా లేకపోతే......
లెక్క తప్పిందెందుకో ఎక్కడో
ఆలోచించూ.

అనవసరమైన రూల్సంటావా
మానిపారేయిష్టం లేపోతే.
ఊహూ అది కుదరదు!
పయనమయి మార్గాయాసమంటావేవోయ్.

అర్థమవుతోందా?

"నీ" జీవితపు క్షణ కాలపు చిత్రం తీయవొయ్
ఇప్పుడు చెప్పందులో
"నీ" దెంతో?
కూర్చున్న కుర్చీ
తొడుక్కున్న లాగూ
పెట్టుకున్న చలువాలూ
నల్లని మేఘం
మెరుపు జరీ
దోబూచులాడే సూర్యుడు
అందరినుంచీ అణు క్షణాల అప్పు
వెరసి "నీ" క్షణపు భండాగారం.

క్షణం పూర్తిగా నీ ది కాదు
మరికివన్నిటిపై నీ ముద్రెంత?

అర్థమయిందా
కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కధాచన అంటే?

నీవు పని చేస్తూనే పోవాలి ఆ పని ఫలం పై ఆశలు పెట్టుకోవద్దు
అవన్నీ నాకొదిలెయ్ అని ఓ బులుగు కుర్రాడు నిన్నాఙ్ఞాపించటం లేదు.

ఒక్క క్షణం నీ శాసనంలో లేని నీ జీవితంలో
వచ్చే ఆటుపోటు ఘటనలు నీ వలనే అని మూర్ఖపోకూ అన్న నీ జీవిత సత్యం,
తరచి చూస్తే స్వానుభవంగా నీకందిన ఈ సత్యం,
సూత్రీకరించాడంతే నీ బుజ్జి గణపయ్య.

ఒక్క క్షణం నీ అధీనంలో ఉండదు.
కాకతాళీయమనూ, దేవుడనూ
ఇంకేదొ నీ జీవితాన్ని శాసిస్తోందన్న నిజం
ఖరాఖండీగా చెపుతున్నడు తనలో ఆ సార్వభౌమాన్ని నింపుకుని

నీ క్షణం మొత్తం నీది కానప్పుడు మిగితావారూ అంతేగా
తోలుబొమ్మలు వెక్కిరించాయని, హాని చేసాయని వగుస్తున్నావా!!!!
హన్నా.

ఇప్పుడు చెప్పు
మిగితావారి విలువలొద్దు
నీ విలువల్లో చెప్పు.
ఈ సత్యాలు, పరిచయాలు, అనుభవాలు, స్నేహాలు, ఆత్మీయతలూ
ఎక్కడనుంచొచ్చాయో చెప్పు?
వీటిలువెంతో నువు చెప్పు.
ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో నాతి చరత్వం,
జరగటం లేదా చెప్పు.

ఇంకా సిగ్గు పడతావేంరా ఈ ప్రేమలో?
దిక్కులు పిక్కటిల్లవేం నీ సంతోషంలో?
నేను సైతం నేను సైతమంటూ నీ ఆత్మ ఘోషలో...

No comments:

Post a Comment