Friday, 30 November 2012

:0

ప్రవృత్తి అని ఎంతో గొప్పగా నన్ను నేను పరిచయం చేసుకునే వాడిని భావుకుడనంటూ. ప్ర+వృత్తి అంతే విశేషమైన వృత్తి అంటే చాలా వృత్తులలో ఒకటి కాపోతే కొంచం గొప్పది మాత్రమే అన్న విషయం అర్థం అయేసరికి ఒసూరుమనిపించింది. అందులోనూ వృత్తులు అనే వాటికి ఆధ్యాత్మిక అర్థం తెలిసే సరికి ఇంకానూ. మన మనసుకు ఉన్న వివిధ వృత్తులు/పనులు అంటూ వివరణ చదివే సరికి.

ఈ మధ్య ఇంకోటి అర్థమయి బాధపెడుతోంది. మనం ఏది చేసినా మన మన ఉపాదులను బట్టే చేస్తాము.....అంటే మన గొప్పతనమంతా ఆక్సిడెంట్ ఆఫ్ బర్త్ వలనో, మనం పుట్టి పెరిగిన వాతావరణాల వలన కలిగిన ప్రేరణల కారణాల వలనో మనకు వచ్చినవే అని అర్థం అయ్యేసరికి అసలు ఎంత నిరుత్సాహమనిపిస్తుందో.

ఇవన్నీ రాస్తుంటే గురువుగారు "నేనెవరు" అన్నది ఆలొచించుకో అన్న మాట ఇంకా పొడిచింది. సత్య శోధన అంటూ ఓ గొప్పలు చెప్పుకున్నందుకు, ఏదో మహాత్ములను చూసి మనమూ వాతలు పెట్టుకున్నామనుకుందామనుకున్నదుకూ.....ఊ, మంచి శాస్తే.

మొత్తానికి అర్థం అవుతున్నది ఏమిటంటే, ఇక్కడ ఏమేమొ జరిగితే బాధ, కోపం, ఫ్రస్టేషన్ సతాయిస్తున్నది ఎవరిని? బయట ఆటో వాడితోనూ, ఇంట్లో సభ్యులతోనూ ఎలా ప్రవర్తించాలి? నాకున్న రాగ ధ్వేషాల బట్టి ప్రవర్తించాలా? లేకుంటే ధర్మం ప్రకారం సమాజ శ్రేయస్సు కోసమే ప్రవర్తించాలా? వీటిని, ఈ భాధ్యతలను ఏకతాటిపై నడిపే సమ్యమనం .....ఎప్పటికొచ్చేనో? అబ్బ!

ధర్మో రక్షతి రక్షితః అనే వారు ఆ రక్షితః స్టేజి వచ్చేసరికి మనం ఎంతగా వైయుక్తికంగా క్షతులమవుతామో చెప్పరెందుకు?

ఇంకోటి ధర్మమే కాదు, దేనికైనా సరే ఒట్టి ఙ్ఞానమే కాదు అనుష్ఠానం కూద




Wednesday, 21 November 2012

"God"- Religion of an Aethist - 1

"I don't have proof"

"or actually is it that you don't want to see proof"

"There is no proof is what I believe"

"There is no room for beliefs in your science right? i.e empirical sciences?"

"But your proof for god says that I have to believe in him first and then concentrate on him and meditate for years and then also you don't guarantee any result in my life time...so how can I believe such a thing? what Kind of proof is that?"

"And even then you beleive, very implicitly, from your tender ages, that there are somethings called atoms, molecules, electrons protons etc"

"yes because if I look at the experiments and repeat them I will find proof"

"so why don't you do the same with the experiments called for finding god?"

"may take life time you say"

"actually, it may take life times. But anyway....yes it may tike that much longer. How long does it take you to prove electron's existence?"

"may be few days......"

" I dare say life time even for that......you first have to convert sand into glass, then convert that into a lens, then find metal to make a mould of a microscope, then put in the lens, then make sure that the lens is grounded to the degree needed to see the electrons etc etc etc.....will take you a life time I dare you to prove me wrong"


"that's cheating. Why will I try it all on my own. I will instead by an electron microscope"

"even if I agree to that you will take a life time to earn yourself, the money needed to do that, all on your own, without the foundations of anything that you have inherited from family friends etc"

"why should I do such a foolish thing? I will take other's help"

"but why do you not do that for finding god? why do you forsake the foundation laid by your family and friends (rishish and culture etc)? why do you do such a foolish thing only when trying to proove god?"

"But........"

"or else you can say the government has proved that instead of you proving or some other people have proved it.......Just because in proving god there is no commercialisation yet, there is no superspecialised people who will keep each step in proving the way to god ready for you Just to be used, without any personal effort, just like you find an electron microscope or other lab equipment needed to prove electrons, just because the nature of this discovery means that you have to do all these steps yourselves and hence don't undertake the journey at all, just because you don't take the joureny at all you don't find proof and hence in short, because of your short falls you don't even undertake experiments needed to prove god, so instead of saying I don't know, you say there is no proof......IS THAT GOOD ENOUGH FOR YOUR OWN SCIENTIFIC REASONING?"

"but how can I undertake such experiments at such colossal loss of personal things, if there is no guarantee that the path/guru who guides me, are not cheats?"

"so you say the so called science has never cheated you?...shal I give examples?....."

"no need. But, but......."

"There you go.......neeLLU namulutunnaavu. Though empirical science is not the only sceince that is the biggest cult now and you are all their followers. You equate sceince with empiricism or proof and forsake rest of all. Ok Agreed. but when asked to repeat the experiments i.e the sadhana needed to prove god, then you don't do that and say instead no proof"

"But will that not be a self fulfilling conditioning of mind to such an extent that I will see a hallucination or delusion of a god appearing before me after this so called Tapas needed?"

"what do you think your sceince is? is it not a delusion in one sense? is it not a hallucination in another sense? If god's appearence after sadhana is a delusion/hallucination why not hte picture of an electron or proton or a neutron. Will that not be a self fulfilling delusion/hallucination?'

"oh.....but who will do all that kind of sadhana?"

"nice tactic change of track But let me deal with it. Yes, who will do it? Just like all other fields, only those who seek, will finally, discover the "truth" whatever that may be"

"yes, it is all so relative is it not this world, these believes, these proofs.....Is there any absolutes at all that we can anchor ourselves to? Everything seems to be nailed to the frames of references, which appear to be individualistic and hence can not be called absolutes"

"yes, there is a constancy i.e death. But you fly away from contemplating that."

"don't talk about death....I hate it"

"no, you rather are scared of the only universal truth but ok let me shy away from it as per your wish......for now atleast"



Wednesday, 14 November 2012

మారాకు వేసిన జీవితం ...A comment

For the post http://paravallu.blogspot.co.uk/2012/10/blog-post.html
Thanks to kottapALi gaaru.
Disclaimer:- I have noticed that comments/criticism are as much a reflection of one's own understanding and skill as that of a reflection of an author. In this I also found myself to be wanting in a lot of things. But the unbiased exposure of these thoughts do help a lot in the personal growth and hence my decision to kelikifying whatever comes to my mind, in that order. Makes self reflection a lot easier. Thanks.

వ్యాఖ్య రాయకుండా ఉండలేకపోయాను.

రేవతి గయ్యాళవవలసిన అవసరం కూడా లేదేమో సుశీలకు రమేష్కు అనుబంధం ఏర్పదటానికి. పైగా అభిరుచులకు మనం ఎంత ప్రాణమిస్తామో అవి పోగొట్టుకునేదాకా తెలీదేమో.

కాని "నీకు మంచి అని తోచిందే చేసేయ్......."తో ఏకీభవించలేకపోతున్నాను. అవును దేశ కాలమాన పరిస్థితులను “బట్టే” "ధర్మము" అవుతే మీరు చెప్పింది నిజమే. అసలిక్కద "ధర్మము లేదా సమాజిక మంచి ప్రస్తావన అవసరమా" అని ప్రశ్నించింది మనసు ఎప్పుడో మెహెర్గారు "కలం కలలు"లో "మొరాలిటీలెస్" కథను మెచ్చుకున్న వ్యాఖ్య గుర్తొచ్చి. కాని సుశీల పాత్ర ఆద్యంతం చిన్న పిల్లాడికి కూడ తన "ధర్మాన్ని" బోధించింది కాబట్టి ఇక్కడ ధర్మ ప్రస్తావన సబబే అనిపించింది. పైగా ఇతివృత్తం కూడ అదే కాబట్టి కూడా.................
ఒక సంవత్స్రమయింది "మనం ధర్మాన్ని పాటించాలి అనుకుంటే ప్రామాణికంగా చెప్పబడిన దాన్నే ఆలంబనగా తీసుకోవాలి కాని మన మన అన్వయాలు కాదు" అని ఒకరు నాతో చెప్పి. (వేదాలనూ లేదా గురువూలనూ ఉదహరిస్తూ). సుశీల తను పెద్ద "సత్య/ధర్మపరురాలు" అన్న "పెద్దంతనంతో" సాగిన ఈ కధలో నిజంగా తనకు ఉన్న కొంచం పెద్ద ఉపాధి అంతా తనకున్న భావుకత/రసికత/స్ఫందనాత్వమేనేమో.

ఈనాటి మన వ్యక్తిత్వానికి/వైయుక్తికానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే సమాజంలో ఇది ఒప్పుకోబడుతున్నది నిజమే కాని ఆ ఒప్పుకోలులో "మందాలొచనలు" (మాబ్ మెంటాలిటీ)మాత్రమే కనిపిస్తుంది ఇంకొంచం లోతుగా తరిస్తే. “నేను ఒక వ్యక్తి గురించే పట్టించుకుంటాను సమాజం గురించి నాకు పట్టదు అనే” ధోరణి ఉన్నవారు నిజంగా సమాజాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారా అంటే ...ప్చ్…. వారిలో నిజాయితీ లేదు అనే అనిపిస్తుంది.
రమేష్ ఊర్లో ఎక్కడాలేని మేడ కట్టించగలిగిన స్థోమత కలవాడు కాబట్టీ, ఆ స్థోమతకు సమాజం విలువిస్తుంది కాబట్టే ఈ "తిరుగుబాటుదారులు" :) బ్రతికిపోతారేమో....నిజంగా సమాజాన్ని వారు వెలేసో (ధైర్యముంటే) లేదా సమాజం వారిని వెలేయటమో జరిగితే అన్నలుగా మారటమో మురికికూపాల్లో మగ్గిపోవటమే నే కదా వారి గతి? అప్పుడు నిజంగా సుశీలత్త చేయి అంది పుచ్చుకోవాలన్న భావన ఏర్పడుతుందా?

ఈనాటి జాలపు త్రిశంకు సమాజంలో నన్ను భయపెట్టే తీరు కూడా ఇదే.....నాకు సంగీతం ఇష్టమని ఒకరితో, సాహిత్యమిష్టమని ఒకరితో, ఇలా నా అభిరుచులకు నా సమయాన్నంతా ఇలా బయటివారితో వెచ్చించి ఈ త్రిశంకు సంసారాల్లో నేను గడిపేస్తే "నా" సంసారానికి నేను కేటాయించేదేమిటి? సర్దుకుపోవటం నేర్చుకునేదెక్కదా? నేర్పించేదెక్కదా? ఇక నేను నా సంసారంలో నిక్షిప్తం చేసే నా పూనిక ఏమిటి?...................చాలా ఆందోళన పెట్టే విషయంగా కనపడుతుంది నాకిది. అలాగే సుశీల తన అభిరుచులు అన్న భావుకతకు ఎంత బానిసయిపోయిందంటే ఒక సమాజాన్ని మొత్తం తను వేస్తున్న అడుగులు.......................................................................................లేదు నా ఆలొచనలలో నాకే లొత్తతనం కనిపిస్తోంది. భర్త ఇలా ఉన్నడు లేదంటే నేనలా ఉండే దానినే కాదు అన్న తన వాదనను నిజమే అని తీసుకోవాల్సిందే. So, I must agree that she had sufficient enough grounds to part ways with husband . But There is some uncomfortableness in this still......inspite of the clear cut grounds in my mind....ఇది అని చెప్పలేని భావమేదో మిగిలిపోతోంది.....ఆలొచించుకోవాలి నేనే.

"మా ఇద్దరి మధ్యా ఏ కల్మషం లేని స్నేహం ఏర్పడింది" అన్న వాక్యం. "కల్మషం" అంటే "ప్రేమ"? అన్న అనుబంధమా? లేక అభిరుచులు కలసిన అవతలి వ్యక్తి మీద "కోరికా"? ఏమో. నేను పనిగట్టుకు చదవకుండా వదిలేసిన చలానికి ఆపాదింపబడిన మాటలు ఏవో గుర్తొచ్చాయి "ప్రేమ ఎలా వస్తుందోయ్......పెదాల కలయికా, తొడల పెనవేతా లేని ప్రేమ ....అదేం ప్రేమొయ్" అన్న ఆ వాక్యం, పురూరవలో ఊర్వశి ఆతన్ని చూసి నవ్వే నవూ గుర్తొస్తాయి నాకు ఎప్పుడూ ఈ "కల్మషం లేని స్నేహం" స్త్రీ పురుష సంబంధాన్ని నిర్వచిస్తే అదేదో గొప్పగా. "కల్మషమట కల్మషం!!!!!" ఇదే నేను అనే మాబ్ మెంటాలిటీ అంటే.....సరే వదిలేద్దం. తనే "కల్మషం" అని ఒప్పుకున్నది ఒక్క రోజుతో ఎలా ఒప్పుగా మారిపోయిందో నాకయితే అర్థం కాదు. One of my friends has the following quote and how true it is ……..Watch your thought for they become actions, watch your actions for they become habits, watch your habits for they become your personality…..అంటూ......ఆలోచనల్లేని పనులు, పైగా ఇలాటి తిరుగుబాటుతనం పనులు అంత తొందరగా, సులువుగా జరగవు. గొంతు ఎండుకుపోతుంది...ఉచ్చ వచ్చేస్తుంది..... మనం "కల్మషం" అనుకున్న పనులు మనం బుధ్ధితో ఎంతగా మనం మనను ఓదార్చుకున్నా. ఆ బుధ్ధి మనసుల పెనుగులాట, ఆ మనసు ఆంబిగ్యుటీ ఎక్కడా సుశీలలో చిత్రింపబదకపోవటం అన్నది పాత్రీకరణలోని చిన్న వెలితి. And without that seed of preparedeness in thoughts atleast, to be with the soulmate, even if in an extramarital way, there is no way suSeela would have so “easily” and “calmly” justified her actions. And hence I have to smile at this pre conventional thinking of people who say “platonic love” or "కల్మషం లేని స్నేహం".


మాబ్ మెంటాలిటీకి ఇంకో నిదర్శనం ఈ "మేనరికాల" గురించి మనం చెప్పే సైంటిఫిక్ రీజనింగ్.(సూడో అని రాద్దామనిపించీ ఆగిపోయా :) నిజమే ఇన్ బ్రీడింగ్ వలన జన్యు సమస్యలు ఎక్కువవుతాయి నిజమే. కాని వ్యాఖ్యాతల్లో ఒకరు అవుట్ బ్రీడింగ్లో సోదాహరణంగా వివరించిన ఇబ్బందులే కాక ఇన్ బ్రీడింగ్లో చాలా మంచి కూడా ఉంది. కాపోతే ఆ మంచులు ఈనాటి మాబ్ మెంటాలిటీ సూడో సైంటిఫిక్ మెంటాలిటీ వప్పుకోదు. రాహుల్ గాంధీ (లేక చంద్రబాబు కొడుకో/జగనన్న తమ్ముడో/లేదా కీసీ ఆరన్న కూతురో మీ కండువా ఏ రంగయితే ఆ రంగు వారసుడు/రాలు ఉదరహించుకోండి) నిజంగా మంచి పాలకుడు కాగలిగిన అవకాసం ఉన్న వాడా లేక నేనా? తరతరాలుగా వణికం చేస్తున్న కుటుంబంలో వాడు నిజంగా వ్యాపారవేత్త అవగలడా నేనా? మనషులను నడిపించి పనిచేయించుకోగలిగే సామర్ధ్యం రెడ్డిగార్లకుంటుందా ఇంకెవరికయినానా? మూడు నాలుగు తరాలుగా బోధన చేసే కుటుంబంలోని నాకు మంచి టీచర్ను అవగలిగిన అవకాసం ఉందా ఆ ఇన్ బ్రీడింగ్ లేని ఇంకొకరికా? ఎమ్మెస్సమ్మ నిజంగా అంత మాణిక్యమయ్యేదా ఇంకో కుటుంబంలో పుట్టుంటే? నిజంగా ఎవరైనా మనం తరిచామా ఈ ప్రమాణాలను? తరచి ఇన్ బ్రీడింగ్లోని ఆ ఇబ్బందులూ, ఈ మంచితనాలు చూసుకుంటే ఏవి త్రాసులో తులసాకు అవుతాయో మనం తరిచామా? ఎవరో చెప్పారు ఇన్ బ్రీడింగ్ తప్పని మనం మేనరికాలు మానేద్దాం. మాధవ కుటుంబంలోక్ స్మార్థ పిల్లను తెచ్చుకుని ఉల్లీ, వెల్లుల్లీ ఇటు వదలలేక ఒకరూ అటు మింగలేక ఒకరూ.....ప్చ్ భలే ఉంటుంది లెండి ఆ మజా. :) Please don’t start giving me examples of people without lineage coming of age and becoming great in many things……ofcourse it is 100% possible that a fresh NTR can defeat 41 years old congress in 8 months. But they are flashes in pan when we take the longitudinal view of time or the cross sectional view of whole population …..and then see if lineage helps or not……in general terms and not exceptional terms….if we are honest with ourselves.

కథ గురించి మెచ్చుకోలు ఏ విషయం రాయకుందా బాదేస్తున్నానా అనిపించింది. బలవంతపు మెచ్చుకోళ్ళు రావు. కథ చదువుతున్నంత సేపూ ఆప్యాయంగా అనిపించింది. ఇది మాత్రం నిజం.

Tuesday, 13 November 2012

దీపావళి

పొద్దుటి నుంచి పెదాల మీద చిరునవ్వు
హ్యాపీ దీవాలి రఘూ

Monday, 12 November 2012

माननी पड़ेगी

 
ईमान तो नहीं 
लेकिन थोड़ी सी
हां ज़रुर थोड़ी सी 
पहचान तो बेचदी  साकी 
 

Monday, 5 November 2012

An Enchanting Evening @ Wembley---- Part 2

మన్ మౌజీలు
ప్రతి పార్టీలోనూ ఇలాటి వారొకరు ఉండి తీరుతారు. వీళ్ళను చూస్తే జాలిపడాలో, అసహ్యించుకోవాలో, నవ్వేసుకోవాలో తెలీదు. అసలు నిన్న మాత్రం మొదట ఎంజాయ్ చేసాము, తరవాత తాగున్నాడురొయ్ అని నవ్వుకున్నాము, తరవాత ఎక్కువైంది అని బాధపడ్డాము చివరికి వీడినెవరైనా తీసుకెళ్లిపోతే బావుండు అనుకునేంత దాకా వచ్చాడు. కాని అతను మాత్రం ఫుల్ "ఎంజాయ్" చేసాడు. అల్జీమెర్స్ డిమెన్షియా పేషెంత్స్ గురించి "ప్లెసెంట్లీ డిమెంటెడ్" అంటాము ఎందుకంటే వారికి ఏం జరిగినా ఏమీ గుర్తుండదు. తాగి ఇలా పార్టీల్లో మన్ మౌజీలయే వారికి ఇదోక వరమేమో. పైగా "లోగ్ కహ్తే హై మై షరాబీ హూ" అంటూ తనను తాను సమర్దించుకునే తెలివితేటలూ వాడూనూ....  



సునీతా మీనన్
మ్ .....ఎవరో ఫేమస్ సింగర్లానె ఉంది ఈ సింగర్...ఇప్పుడు గూగులమ్మనడిగితే బానే పేరున్నమ్మాయే అని చెప్పింది. ఎమో నిన్నకు ముందు నాకయితే పరిచయం లేదు. చక్కని ముఖ వర్చస్సు. మంచి స్వరం. విట్నీ హ్యొస్టన్ పాట ఒకటదేదో, ఇదో ఇలాటిదేనో ఇదేనో తెలీదు ఒక అరబిక్ పాట పాడిందీమె. మిగితావన్నీ  హిందీ పాటలే. మన్ మౌజీ గాడికి మొదట అభిమానమనుకుని ఒక పాటను "ఇది మీకోసం" అన్న పాపానికి తనూ, మిగితా మేల్ సింగర్సూ పడ్డ బాధ....ప్చ్....goes with the territory I think. But enjoyed her singing a lot ....more later.




డాక్టర్ సేతూ వారియర్
ఈయన ఓపికకు మెచ్చుకోవాలి. ముజీ భాయ్  తాగి స్టేజీ మీదకు వచ్చి అల్లరి చేసినా చివరికి చేతిలోని మైక్ లాక్కుని "మేరీ సప్నోన్ కీ రాణీ........" పాట  ముగింపు తానిచ్చినా , ఎంత తాగున్నాడో  ఘాటంతా వచ్చేట్టు మోహంలో మొహం పెట్టి ఇబ్బంది పెట్టినా మోహంలో చిరునవ్వు చెరగలేదు. మలయాళీ డాక్టర్ బాబుకు ఎంత ఓపికో (చిన్న పిల్లల డాక్టర్ అదీ పీడియాట్రిక్స్లో  ఇంకేదో సూపర్ స్పెశలైసేషన్ కూడా చేసాడా యే మరి). మంచి గాత్రం. 





రాజేష్ రమన్
బుద్దుగా ముద్దుగా ఉన్నాడు. మంచి స్వరం  ఒక  చోట మాత్రం అందుకోలేకపోయాడు ...ఏమి అందుకోలేకపోయాడో నాకు తెలీదు కాని ఎదో సరిగ్గా లేదు అని  మాత్రం అర్థమయింది.
ఓపిక కొంచం తక్కువ అనుకుంటా అబ్బాయిగారికి మౌజీ భాయ్ ఎక్కువగా ఇబ్బంది పెట్టింది సునీతా మీనన్ ను అయినా ఎక్కువగా భావప్రకటన చేసింది ఈయనగారు :) ఇంకొంచం అనుభవం రావాలేమో ప్రజ(అదే ఈకాలంలోని రాజు)లను భరించాలంటే.
రైబో రాగా





Rainbow Raagas
Being touted as the biggest Indian  band in the UK. The best thing I liked about this band was that the tabla player was superb. So, superb, that.............for the first time in my life...........I asked for something from the singing band. I asked for a tabla encore with the bol, which came unexpectedly as an interlude in one the songs......pch, are bhay e koyee lead singer ke liye whitney Houstan kaa gaane ke liye pharmaayish hai kyaa? Naa yaar they did not do the tabla encore with the bol. But I did enjoy the 30 seconds of pure rhythms cought in the midst of an ocean of drums and vocal dominance......I enjoyed it a lot.




The guy on the left with the tablas is the lucky guy who got my written appreciation. Everybody loves appreciation right? You should have seen the light in his eyes when I gave the pharmaish.......chalo ik kaa din to bana diye :)

See the big traditional drum at the back? They came down the stage and played them, for a racy urdu song..... felt so much like dancing on the dance floor that three of us consultants, two of them being very serius ones were swaying on our dinner chairs so much that our table mates were asking us why we were not on the dance floor :)........... You and me on the dance floor vinod singervelu!!!!!? what say? :)






              This and this another song which always make me forget myself and set my foot tapping.












 

An Enchanting Evening @ Wembley----Part 1



నాన్న  "సంగీతం నచ్చని వాడు రాక్షసుడు" అని అంటారు. "శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిః" అన్న ఆర్యోక్తి (అవునా? ఏదో పదం బావుందిగా) అన్న మాట గుర్తొచ్చింది నిన్న రసఝరిలో తేలుతూ. మా బ్రిటీష్ ఇండియన్ అసోసియెషన్ ఆఫ్ ఫిసీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (బాపియో ముద్దుగా) వార్షిక వేడుకలు ఈ వారాంతం వెంబ్లీ స్టేడియం లండన్లో జరిగాయి....అమ్మో, పాత్రికేయుల భాష వచ్చేస్తొంది మామూలుగా మాట్లాడేస్తా.....


ఏదో వీకెండ్ జరిగే సీ ఎం ఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) పది పాయింట్లు వస్తాయి, మైండ్ మాటర్స్ గురించి కొంచం బాకా ఊదుకోవచ్చు అన్న ఆశతో వెళ్లాను. డిన్నర్ టికెట్లు అసలు బుక్ చెయ్యాలా వద్దా అనుకుని సరే వెళ్దాంలే అనుకుని వెళ్ళా...చాలా ఎంజాయ్ చేసాను. Glad I had booked dinner tickets, it was the main thing that I enjoyed, better than being snapped with the not so sunny sunny 2011 conference though I did enjoy Imran khan's talk about shoukat khanum hospital a lot.



అసలు సీ ఎం యీ లేదు పాడూ లేదు, ముందు మాట్లాడుతున్న వారి గోల వారిదే, వెనకాల టేబిల్లో మా హడావుడి మాదే. ఙ్ఞాన వృధ్ధితో పెద్దగా తలేం పండలేదు కాని చివరి బెంచిల్లో ఉన్న  సౌలభ్యం మాత్రం బహు బాగా అర్థమయిపోయింది.






సాయంత్రం జీన్స్ మీది కోట్ విప్పావతల పారేసి టీషర్ట్ తగిలించుకుని పార్టీకి వెళ్ళా.


వెనకాల కాలంలో పూటకూళ్ళమ్మ రాగానే చల్ల పోసినట్టు వీరూ కడుపు నిండా కుడితి బానే ఏర్పాటు చేసారు. కాని మనకేం తోచి చస్తుంది అలాటి పార్టీలో...అయినా గిల్లుకోకుండా ఊరుకుంటామేమిటి? మధ్య మధ్యల్లో శాఖాహార మాంసాహార నముళ్ళు పట్టుకొస్తూ చుట్టూ తిరుగుతున్న అమ్మాయిని "ఇలా అందరికీ పట్టుకొచ్చి ఇవ్వాల్సిన పనేముంది అలా ఆ టేబిళ్ళ మీద పెట్టేయొచ్చు కదా" అని ఉచిత సలహా, అనవసర సానుభూతి పారేసా. సిన్సియర్గా "లేదండీ ఇలాగే తిరగాలి మేము" అంటూ మామూలుగ సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. కొంచం బాధేసిన మాట నిజం. ఖాళీగా ఉన్న టేబిళ్ళపై (అవీ అనుకూలంగా టేబిళ్ళు మధ్య మధ్యలోనే అమర్చి ఉన్నాయి) పెట్టేసి కావల్సినప్పుడు, అయిపోయినప్పుడు నింపితే పోయేదిగా అని అనుకోకుండా ఉండలేకపొయింది మనసు. "రాజ్" గుర్తొచ్చింది ఎందుకో అలా యూనిఫార్మ్ వేసుకున్న వాళ్ళు తిరుగుతూ అందిస్తూంటే. సీన్ పండటానికి రూం బయట కూర్చుని ఒక తాడును లాగుతూ "పంకా చలావ్" అనరిస్తే తాటాకుల పంకాను తిప్పే ముసలాడు ఒక్కడు మాత్రం మిస్ అయిపోయాడు అనిపించింది.    

 
కొంచం సేపటికే బ్యాండ్ (మేళం కాదులెండి మ్యూజిక్ బ్యాండే) తయారయింది. కన్నడ, తమిళ, అరవం, మళYఆళం పాటలు పాడే ఓ మళయాళి అమ్మాయి సెనీతా మీనన్ అట, ఇద్దరు గాయకులు (డాక్టర్ సంజయ్ అనుకుంటా) ఇంకో వర్ధమాన గాయకుడూ లేడ్ సింగర్స్. కాపోతే చూడ్డానికి వర్ధమానంగానే ఉన్న ఆ గాయకుడిని "ఈయన ఎన్నో సీడీలోఒ క్యెసెట్లూ చేస్తున్న మంచి గాయకుడు" అని పరిచయం చేయటం నవ్వు తెప్పించింది. క్యెసెట్లకు పాడే ఆయన/పాడినతను "వర్ధమానమేమిటో".....హేవిటో!!!!

అవునూ సంగీతం, శిశుర్వేత్తి అని మొదలెట్టి ఏవేవిటో సుత్తేసేస్తున్నా కదా?
వస్తున్న వస్తున్నా.  కొంచం  ఓపిక పట్టండి మరి.

(సశేషం)