Monday, 5 November 2012

An Enchanting Evening @ Wembley----Part 1



నాన్న  "సంగీతం నచ్చని వాడు రాక్షసుడు" అని అంటారు. "శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిః" అన్న ఆర్యోక్తి (అవునా? ఏదో పదం బావుందిగా) అన్న మాట గుర్తొచ్చింది నిన్న రసఝరిలో తేలుతూ. మా బ్రిటీష్ ఇండియన్ అసోసియెషన్ ఆఫ్ ఫిసీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (బాపియో ముద్దుగా) వార్షిక వేడుకలు ఈ వారాంతం వెంబ్లీ స్టేడియం లండన్లో జరిగాయి....అమ్మో, పాత్రికేయుల భాష వచ్చేస్తొంది మామూలుగా మాట్లాడేస్తా.....


ఏదో వీకెండ్ జరిగే సీ ఎం ఈ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) పది పాయింట్లు వస్తాయి, మైండ్ మాటర్స్ గురించి కొంచం బాకా ఊదుకోవచ్చు అన్న ఆశతో వెళ్లాను. డిన్నర్ టికెట్లు అసలు బుక్ చెయ్యాలా వద్దా అనుకుని సరే వెళ్దాంలే అనుకుని వెళ్ళా...చాలా ఎంజాయ్ చేసాను. Glad I had booked dinner tickets, it was the main thing that I enjoyed, better than being snapped with the not so sunny sunny 2011 conference though I did enjoy Imran khan's talk about shoukat khanum hospital a lot.



అసలు సీ ఎం యీ లేదు పాడూ లేదు, ముందు మాట్లాడుతున్న వారి గోల వారిదే, వెనకాల టేబిల్లో మా హడావుడి మాదే. ఙ్ఞాన వృధ్ధితో పెద్దగా తలేం పండలేదు కాని చివరి బెంచిల్లో ఉన్న  సౌలభ్యం మాత్రం బహు బాగా అర్థమయిపోయింది.






సాయంత్రం జీన్స్ మీది కోట్ విప్పావతల పారేసి టీషర్ట్ తగిలించుకుని పార్టీకి వెళ్ళా.


వెనకాల కాలంలో పూటకూళ్ళమ్మ రాగానే చల్ల పోసినట్టు వీరూ కడుపు నిండా కుడితి బానే ఏర్పాటు చేసారు. కాని మనకేం తోచి చస్తుంది అలాటి పార్టీలో...అయినా గిల్లుకోకుండా ఊరుకుంటామేమిటి? మధ్య మధ్యల్లో శాఖాహార మాంసాహార నముళ్ళు పట్టుకొస్తూ చుట్టూ తిరుగుతున్న అమ్మాయిని "ఇలా అందరికీ పట్టుకొచ్చి ఇవ్వాల్సిన పనేముంది అలా ఆ టేబిళ్ళ మీద పెట్టేయొచ్చు కదా" అని ఉచిత సలహా, అనవసర సానుభూతి పారేసా. సిన్సియర్గా "లేదండీ ఇలాగే తిరగాలి మేము" అంటూ మామూలుగ సమాధానమిచ్చింది ఆ అమ్మాయి. కొంచం బాధేసిన మాట నిజం. ఖాళీగా ఉన్న టేబిళ్ళపై (అవీ అనుకూలంగా టేబిళ్ళు మధ్య మధ్యలోనే అమర్చి ఉన్నాయి) పెట్టేసి కావల్సినప్పుడు, అయిపోయినప్పుడు నింపితే పోయేదిగా అని అనుకోకుండా ఉండలేకపొయింది మనసు. "రాజ్" గుర్తొచ్చింది ఎందుకో అలా యూనిఫార్మ్ వేసుకున్న వాళ్ళు తిరుగుతూ అందిస్తూంటే. సీన్ పండటానికి రూం బయట కూర్చుని ఒక తాడును లాగుతూ "పంకా చలావ్" అనరిస్తే తాటాకుల పంకాను తిప్పే ముసలాడు ఒక్కడు మాత్రం మిస్ అయిపోయాడు అనిపించింది.    

 
కొంచం సేపటికే బ్యాండ్ (మేళం కాదులెండి మ్యూజిక్ బ్యాండే) తయారయింది. కన్నడ, తమిళ, అరవం, మళYఆళం పాటలు పాడే ఓ మళయాళి అమ్మాయి సెనీతా మీనన్ అట, ఇద్దరు గాయకులు (డాక్టర్ సంజయ్ అనుకుంటా) ఇంకో వర్ధమాన గాయకుడూ లేడ్ సింగర్స్. కాపోతే చూడ్డానికి వర్ధమానంగానే ఉన్న ఆ గాయకుడిని "ఈయన ఎన్నో సీడీలోఒ క్యెసెట్లూ చేస్తున్న మంచి గాయకుడు" అని పరిచయం చేయటం నవ్వు తెప్పించింది. క్యెసెట్లకు పాడే ఆయన/పాడినతను "వర్ధమానమేమిటో".....హేవిటో!!!!

అవునూ సంగీతం, శిశుర్వేత్తి అని మొదలెట్టి ఏవేవిటో సుత్తేసేస్తున్నా కదా?
వస్తున్న వస్తున్నా.  కొంచం  ఓపిక పట్టండి మరి.

(సశేషం) 

No comments:

Post a Comment