Friday, 30 November 2012

:0

ప్రవృత్తి అని ఎంతో గొప్పగా నన్ను నేను పరిచయం చేసుకునే వాడిని భావుకుడనంటూ. ప్ర+వృత్తి అంతే విశేషమైన వృత్తి అంటే చాలా వృత్తులలో ఒకటి కాపోతే కొంచం గొప్పది మాత్రమే అన్న విషయం అర్థం అయేసరికి ఒసూరుమనిపించింది. అందులోనూ వృత్తులు అనే వాటికి ఆధ్యాత్మిక అర్థం తెలిసే సరికి ఇంకానూ. మన మనసుకు ఉన్న వివిధ వృత్తులు/పనులు అంటూ వివరణ చదివే సరికి.

ఈ మధ్య ఇంకోటి అర్థమయి బాధపెడుతోంది. మనం ఏది చేసినా మన మన ఉపాదులను బట్టే చేస్తాము.....అంటే మన గొప్పతనమంతా ఆక్సిడెంట్ ఆఫ్ బర్త్ వలనో, మనం పుట్టి పెరిగిన వాతావరణాల వలన కలిగిన ప్రేరణల కారణాల వలనో మనకు వచ్చినవే అని అర్థం అయ్యేసరికి అసలు ఎంత నిరుత్సాహమనిపిస్తుందో.

ఇవన్నీ రాస్తుంటే గురువుగారు "నేనెవరు" అన్నది ఆలొచించుకో అన్న మాట ఇంకా పొడిచింది. సత్య శోధన అంటూ ఓ గొప్పలు చెప్పుకున్నందుకు, ఏదో మహాత్ములను చూసి మనమూ వాతలు పెట్టుకున్నామనుకుందామనుకున్నదుకూ.....ఊ, మంచి శాస్తే.

మొత్తానికి అర్థం అవుతున్నది ఏమిటంటే, ఇక్కడ ఏమేమొ జరిగితే బాధ, కోపం, ఫ్రస్టేషన్ సతాయిస్తున్నది ఎవరిని? బయట ఆటో వాడితోనూ, ఇంట్లో సభ్యులతోనూ ఎలా ప్రవర్తించాలి? నాకున్న రాగ ధ్వేషాల బట్టి ప్రవర్తించాలా? లేకుంటే ధర్మం ప్రకారం సమాజ శ్రేయస్సు కోసమే ప్రవర్తించాలా? వీటిని, ఈ భాధ్యతలను ఏకతాటిపై నడిపే సమ్యమనం .....ఎప్పటికొచ్చేనో? అబ్బ!

ధర్మో రక్షతి రక్షితః అనే వారు ఆ రక్షితః స్టేజి వచ్చేసరికి మనం ఎంతగా వైయుక్తికంగా క్షతులమవుతామో చెప్పరెందుకు?

ఇంకోటి ధర్మమే కాదు, దేనికైనా సరే ఒట్టి ఙ్ఞానమే కాదు అనుష్ఠానం కూద




No comments:

Post a Comment