Wednesday, 16 December 2015

నవ్వొచ్చింది.


"శ్రధ్ధ పెట్టి" రాయటం లేదని నాపై తిరగబడుతుంటే నవ్వొస్తోంది.
నిజమే కదండి మరి?
ఇలా కూర్చో అని చక్కగా మాస్టారిలా చెపుతూ ఉంటే, ఆ వైపుకూ, ఈ వైపుకూ కోతిలా గంతులేస్తూ తనే కదా స్థిరత లేకుందా చేసేది.
తనే చేసి తనే నా చెవి మెలిపెడుతుంటే నవ్వు రాక మరేమిటి?
ఏమో మళ్ళీ తనే....ఆ చిన్నపిల్లలా కనపడే తనే....ఎంత విశ్వరూపం చూపెడుతుందో.
క్షణకాలమే కావచ్చు.....ధృతుడికీ, యశోదమ్మకూ అంతకంటే దక్కిందా ఏమిటీ నాకు తక్కువని చింతించటానికి.
చమక్కుమనే ఆ లిప్త ...లిప్తయినందుకేనేమో....ఎంత భద్రంగా దాచుకోవాలనిపిస్తుందో.


ఏమైనా సరే....మీ నలుగురిలోనూ...నువ్వంటేనే ఇష్టమే మనసా.

బుధ్ధి పట్టుబట్టి మరీ నీకూ, చిత్తాహంకారాలకూ రూపం లేకుండా చెయ ప్రయత్నిస్తోంది కదూ?

లయమయ్యాక, తను కూడా మీలో నిక్షిప్తమై, మరుగైపోయే ప్రయత్నమేనే అది పిచ్చి తల్లీ.

ఈ జన్మకవుతుందనే ఆశ, అవాలనే కోరికా ఏమీ లేవు.

అది నిర్లిప్తతో, అపనమ్మకమో, బధ్ధకమో...........తెలీదు.
వాటికే రంగు పులిమినా సమ్మతమే.

ఇప్పటి నేనంతే కద, అందులో జంకు దేనికి.



Tuesday, 15 December 2015

Random Ramblings

Earth's children...first novel of series written in 1980. About Cromagnon and Neandarthal's co existence....their pride and prejudices, their biases etc......set 30000 years ago.........and, so reflective of us in our NOW times........makes me wonder if Jean, the authoress actually wrote it keeping in mind our"timeless and eternal" "they and us" concepts. This led to the recent post about allegedly Goebbel's comments about how easy it is to incite majority of normal people to hatred and atrocities..."just give them someone to hate (i.e make them hate and fear "them" and fear for "us") he says.....................................and then think about the rise of BJP from 2 seats.................................and then think, if "we" are always made of "them" and "us".......................since cromagnon and neanderthal times...................so would be it in eons to come. Makes us realise the futility of everything, even "good things" for what is "good"? I grew up with values I cherish......only to see them shattered to millions of peaces of people close to my own heart...........I know of people who are very very kind courteous and generous human beings........but who follow the concepts I abhor to my core. If "goodness" is so fleeting that in a span of 20 years it changes from being THE value to that of a chetakaanitanam, if just because of what we read, hear and see makes us in believing in two opposite ends of spectrum so firmly and vehemently as being good.......what is the use of being good/thinking good/wanting good. ...........Makes one realize what people say about this world being a stage on which we are but bit players. MAKES ONES REALIZE THE FUTILITY OF IT ALL

Saturday, 12 December 2015

నా ఆత్మవి

చాలా రొజులయింది కదూ నిన్ను హత్తుకుని?
నిజమే ....అలిగే వెళ్ళిపోయాను.
నీ మీద అలిగి కాదు. నీ మీద ఉన్న నా మక్కువపై అలిగి.
ఎందుకో పిచ్చిగా అనిపించేది.
నా మనసులో మాట దాచుకోనివ్వవు, అంతా పరిచేస్తావలా
పైగా సమయం సందర్భం చూసుకోకుండా అల్లేసి నవ్వుల పాలు చేస్తావు
ఒకోసారి నీ ఉధృతిలో పడి....ఎందుకులే.

ఇప్పుడు నవ్వు వస్తోంది.
తొమ్మిది మందిలో ఒకర్తెను నెత్తికెక్కుంచుకుని, మిగితావారిని సవతులగా చూసే నాకు, అందరినీ నెత్తిన పెట్టుకుని సమానంగా, అదీ బహాటంగా సమానంగా చూస్తాననే నీ మంకుతనం కోపం తెప్పించటమే కాదు చిన్నతనమూ అనిపించేది.

కానీ నేస్తం,
ఎక్కడికి పోతావులే
నువ్వు నన్నొదిలేసినా
నేను నిన్నొదిలితేగా 
నువ్వు నాకుండకుండాపోటానికంటూ
నువ్వెక్కడో మిగిలిపోయావనేది
ఎప్పుడో ఓ అరలిప్త
మనసు మకిలి ఏ అనుభూతి కెరటానికో ఒకింత తుడుచుకుపోయిన ఆ అరలిప్త
నీ దర్శనమయేది.

నవ్వకు మరలా
ఆ క్షణకాలపు నగ్నత్వానికే భయపడి ....
ఉక్రోషంతో మనసుకింకెంతో మకిలంటించుకుని....
మరీ ముసుగేసేవాడినికదా?
నాకూ నవ్వొస్తోందిలే నవ్వేయ్ పర్లేదు

నీకోటి తెలుసా
నువ్వు లేవనీ, చేసే పనిలోనే, తరిచే ఆరడిలోనే....
మోక్షాన్ని వెతుక్కుంటూ...పునాదినే పోగొట్టుకున్నా అనుకుంటూ కూడా గడిపా.
స్ఫందన కెరటమోటి సుతారంగా స్పృశించింది.

అంతే
నీ విశ్వరూపం నాలో
ఎంత కనపడిందనీ?
దానికి ప్రతిగా
మూల పారేసిన నిన్ను తుడిచి
ప్రాణస్ఫందన సిరాగా నింపి
ఇదిగో ఇలా నిన్ను వాడుకోవటమే, వాడటమే
కదూ నీకు పునర్జన్మ?
మూలపడి మూత పడిన పాళివి కాదమ్మా
మూలవిరాట్టువి,


Thursday, 19 November 2015

బతికున్నానోచ్!!!

ఎడారనుకున్నాను.
అవిరై పొయిందనుకున్నాను.
పదఘట్టనల మర్ధనతో
కాలపు కోరలలో మార్గాయసంతో
నూకలైపోయాయనుకున్నాను.
చిన్ని మేఘపు లాలన
నెమ్మదిగా నుదురు చుంబిస్తే
శ్రావణమైపోయాను.

https://www.youtube.com/watch?v=j_vXcGp_yRA

Saturday, 1 August 2015

వెతుక్కోగలిగితే


ఆశక్తి ఉంటే
అసందర్భాల్లోనూ
గులకలనుంచి రత్నాల్వేరొచ్చు.
అసలీ యాదృచ్చికాలింతేనేమో
అలా మెరిసి ఇలా మాయమవుతూ
తమ విలువను చాటుతూ
"లేకుంటే మరి
రోజూ మెరిసే
నభో వజ్రానికేమి విలువిస్తున్నారూ......."
దీర్ఘాలు తీస్తూ...
యాదృచ్చిక రత్నమా
వెచ్చతనానికి
కృతఙ్ఞతలు.
నిద్రలో రూపాన్నే కావొచ్చు
బ్రతికే ఈ క్షణం
మాయే కావొచ్చు
కానీ.......

మనదేరా హంత కులం

కడుపు నిండిన వాడ
నాకేమి హక్కు
రక్తపుటన్నము కాని
బలికూడు కాని
ఆకటికేది తేడా?
Is it really for hunger that we have choosen?
I don't think so.
I think we chose
for our greed, not for need.
దేశమాతనొగ్గినిల్లరికపుటల్లుడా
కూకులాడక గమ్మునూరుకోర
పదుగురాడిన మాట
పాటియై ధర జెల్ల
రాచమొనరింప బాధ యేల
Power, is best used, projected.
ఎవనికెఱుకిది
రామరాజ్యమో
రావణకాష్టమో
కాని
ఏదో మొదలయ్యింది
అనే గుండె కొట్టుకొంటోంది
చత్ నొర్ముయ్.
మునుపు చూడలేద మారణకాండం
కమలమొక్కటేన రుధిర వర్ణం
కుర్చీలాటలో సర్వమత సామరస్యం
భగభగల హొమంలో కాలేదా హవిస్యం

ఒకప్పుడు శైవం వైష్ణవం
నేడేమో ఇస్లాం హైందవం
సూత్రధారులనంటావేరా బుధ్ధి శూన్యం
మేల్కుని తోలుబొమ్మలైన మనమేగ హంతకులం
మనమేరా ఆ హంతకులం
మనమేరా అగంతకులం
మనమేరా హంతకులం
మనదేరా హంత కులం

అంతే మరి

పలకా బలపం
మరకలు చేయటానికే 
అ ఆలు మరచితే అంతే మరి

కాశీ

కాశీ
వదిలేసిన ఇష్టాలకు
తెగ మరిగావు కదూ?
అయినా
ఇష్టమయిన వారి కోసం
ఇష్టమైన వాటి కోసం
మాత్రమే
వదిలేసినవి కదూ
ఇంతవరకూ నీ మృష్టాన్నం?
కొంచమాగు.......
7.
The Religion of an Atheist - 7 మంత్రము
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152910233549250?pnref=story

6.
The Religion of an Atheist - 6 Evidence Base or Proof in Practice
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152781787764250

5.
The Religion of an Atheist – 5 Narcisstic, Masochistic, Dissocial & Perfectionistic Sadhakas
https://www.facebook.com/raghavendra.bethamcharla/posts/10152739256734250?pnref=story

రంగులీకలొద్దా

రంగులీకలొద్దా 
కమ్మని గొంతు కావాలా
అయినా ఇదెక్కడి చోద్యమో
ఈకలు వట్టి ఆకర్షణా?
కమ్మని గొంతేమో .....
వ్యక్తిత్వమా?
రెండూ పుటుక భిక్షలే
రెంటికీ జరా మరణాలూను 
మరొకదానిపై అసహ్యం
ఇంకోటంటే ఇష్టం!!!

कब रंगे कौन जाने

कब रंगे कौन जाने
बेरंगी दर्पण जो दिखलाई
होश तब आ बैठी साकी

Sunday, 19 July 2015

నేనెవరు - 1


నిన్నటి పునాదిపై
రేపటి భవంతికై
నేటి సున్నమూ ఇటుకలే నేను
ఈదురుగాలి నిన్నటి పునాదుల ప్రశ్నిస్తే
పై వాడి మేస్త్రీలూ కూలీలొచ్చి
భవంతినే మార్చేస్తుంటే
నన్ను నేనే కోల్పోతుంటే
నేనిచ్చే నీడలో
నా చాటున చెలిమితో
పెరుగుతున్న రేపటి తరాలు
నా అస్థిత్వానికి అసంపూర్ణ ప్రతిరూపాలు
ఇటుకనవటం నా నిర్ణయమేమీ కాదు
ఆశపడటంలోనూ ..ఏమో నాదెంత భాద్యతో
మలచబడటం మార్చబడటం 
కొండంతవటం కొలవబడటం....
తామరాకునవటం లక్ష్యమే
చినుకురాలినప్పటి ఉలికిపాటూ
అదీ మజిలినే
అదీ సత్యమే
అదీ నేనే

Sunday, 28 June 2015

I see a mom

I see a mom
newly pregnant
and with a pram
and a tiny tot too
nicely decked out 
in the mild summer Sun!

I see a mom
safe in her momship
with a smile playing
on her heavy lip

watch her tiny tot
play in the mud 
that she is fascinated by
dig deep into the earth
with her fingers bare
measure out the tiny clods
that her weeny strength fare

I see a mom
with no cares in the world
with nothing to hurry her along
allow her tiny tot
linger along the path
stare at a flower
on the untrodden path
tiny but white 
oh so beautiful
know not what goes on
in the tiny tot's tabula rasa

But oh what a sight
to see the mom
allow herself and hers
the luxury of all
a moment of reflection
a moment of unhastened pure joy

Out comes a sigh
at the ecstacy of it all.
no regrets at snapping this moment
on my heart's canvas
forever and forever.

Wednesday, 18 March 2015

ప్రియమైన పాపా

ప్రియమైన పాపా
అదిగో అదే వద్దన్నది 
నువ్వెంత పే.....ద్ద దానివైనా
మాకింకా పాపవే
మాకు కాదు నాకు మాత్రమే
ఆ హక్కు లేదాంటావా?
శిరోధార్యమే.
మొన్న బయటపడ్డ లేఖలు
అవును.
నా అస్థిత్వమే
ఇప్పటికీను
గడిచిపోయిన మైలు రాళ్ళూ అని మభ్యపరచను
అవును
నన్ను కొంత అక్కడ వదిలేసుకున్నాను
ఆ శూన్యాన్ని ఆ లేఖలతో పూరించుకున్నాను
అవును
పూరించుకున్నాను
పూర్ణమయ్యాను.
ఇది నీకు "అర్థం" అవకూడదని
ఆ బ్రహ్మాన్ని కోరుకుంటాను
పరిపూర్ణ అవగతం అనుభవానుగామి కాబట్టి
ఎప్పటికీ నీ దృష్టిలో
మీకు ద్రోహిగానే మిగిలిపోవాలని కోరుకుంటూ
నీ
నాన్న

Tuesday, 3 March 2015

కృష్ణా పరాయినయిపోతున్నానురా

కృష్ణా
ఎపుడూ అనిపించలేదా
ఒక్కరు
ఒక్కరే ఒక్కరు
నీకు ప్రీతి కలిగే వారు
ఉండుంటే బావుంటుందని
అవునేమోలే అదే యోగమంటేనేమో
జగత్తంతా ద్వైతమే అయినప్పుడు
ఒకరూ ఎనిమిది మందీ పదహారు వేలమందీ
తేడాలెక్కడ కదా?

నాకింకా ఆ అద్వైతం అలవడలేదయ్య

ఊహలంటున్నారు
ఫాంటసీ బ్రతుకంటున్నారు
పిరికివాడినంటున్నారు


చివరికి
ఓ గాటిన కట్టేస్తున్నారు

ఒకరిని ప్రెమించగలగటం
కోరుకోకుండా వారికే అంకితం అవటం
ఆడతనమేనేమో!!!
అయితే నేను ఆడతనాన్ని అంగీకరిస్తున్నా
అవును నేను సగం ఆడదానినే

కృష్ణా
పరాయినయిపోతున్నానురా
కృష్ణా
పరాయినయిపోతున్నాను

Friday, 27 February 2015

ఓ తటిల్లతై

 నా బుఱ్ఱ నిజంగా ట్యూబ్ లైటే.
 
హరి గుడ్డివాడవటం ఎంత పాత్రోచితమో ఇవాళ తట్టింది!!!
 
మెరిసే తారల, విరిసే పూవుల
వసంత మాసపు, తొలకరి మెఘపు
ప్రాణానికీ ప్రానికీ 
గానానికీ గాత్రానికీ 
జీవ నాదానికి ప్రాణ స్ఫందనకూ
 
రూప గుణ విశేషణాల తారతమ్యం ఉండదని

చెప్పే అద్భుతమైన అద్వైతానుభూతి 

మరోసారి
ఇవాళ!!!

ఓ తటిల్లతై.
 

Thursday, 19 February 2015

అప్రయత్నపు ఝడివాన

నిండుగా సంపూర్ణంగా
కళకళలాడుతూ
నా దృక్కోణమే కావచ్చు
నీ మచ్చలు కనపడకపోవటానికి కారణం
అయినా నిండు జాబిల్లివి
మనసులో ఎప్పటికీ

కృష్ణపక్షాలూ
అమావాస్యలూ
కళల పెరుగూ తరుగూ
"దల"లెన్నో ఉన్న కాల సర్పమూ
అన్నీ "అవగతమే"


అయినా
ఎందుకో మానస సరోవరంలో
అలలొస్తూనే ఉంటాయి
చిత్రమేమో తెలుసా
పున్నమికి కాదు వాటి ఉధృతి
అమవసికే.

*****
ఎందుకో
ఆకాశంబు నుండి, శంబుని శిరంబు నుండి....
గుర్తొస్తోంది.

*****
తండ్రి స్థాయి.
గర్వంగా ఉంది కూడా.




Saturday, 31 January 2015

నా రంగేదో తేల్చటం

ప్రయాణం ఒకటిగానే మొదలయింది
మధ్యలో స్ఫటికమో కటకమయింది
స్ఫటికపు రంగూ లక్షణం
నా చేతిల్లో ఏముందీ?
పరావర్తనం చెంది విడిపోయి
నా మీద పడ్ద కిరణం 
నా రంగేదో తేల్చటం......

Tuesday, 13 January 2015

ముమ్మాటికీ సీతమ్మొక్కతే!

చందన చర్చితమో
భగభగలానలమో
గుండంలో మండింది
ఒక్క సీతమ్మే!!!
అంతె
సీతమ్మొక్కతే!!
ముమ్మాటికీ సీతమ్మొక్కతే!