Sunday, 28 December 2008

5. స్వగతం --అవును నేను బ్రాహ్మణుడినే ... అది నా అస్తిత్వంలో భాగమే. Part-3

"కాదేమో రఘూ......నువ్వు ఉదహరించిన కులాలకు (విభజనలకు) చాతుర్వర్ణ కులాలకు తేడా ఉంది....ఎందుకంటే మన చాతుర్వర్ణ కులాలు మన మతంలో నుంచి పుట్టినవి కదా. నువ్వే చెప్పు ఎంత దారుణం శూద్రులు కాలి నుంచి పుట్టటం ఏమిటి......బ్రాహ్మణులు నోటి నుంచి లేదా తల నుంచి పుట్టటం ఏమిటి? ఎంత దారుణం? పునాడులలోనే ఇంత తేడా, వివక్ష, వ్యత్యాసం ఉంటే ఇంక సమానత ఎలా సాధ్యం?" మనోజ ప్రశ్నించింది.

 

"పోరబడుతున్నావు మనోజ. హిందూ సంస్కృతిలో చాతుర్వర్ణ వివక్షకు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, అవివక్షతకు, సమానతకు, మానవీయతకు అన్నీ ఉదాహరణలు ఉన్నాయి. చూసే వారు, వెతికే వారిని బట్టి ఉంటుంది మనం ఎం పట్టుకుంటాం మన సంస్కృతిలో అనేది. అయినా కాదంటావా..ఒకే..తప్పులను సరిదిద్దటానికి ప్రయత్నిద్దాం...అంతే కానీ అప్పుడు జరిగిన తప్పుకు, అదీ వేరే వారు.. ఎవరో పూర్వీకులు చేసిన దానికి ఇప్పుడు, వేరే వారికి శిక్ష వేస్తాం అనటం ఎంత వరకు సబబు? అలాగే చేస్తావా..పోనీ కనీసం ఆ రాజకీయ నాయకురాలిలాగా "మారో జూతే చార్" అనేది మా నియమం అని బాహాటంగా చెప్పుకోవాలి అంతే కాని ఎందుకీ హిపోక్రసీ?

 

ఒప్పుకుంటాను ఇంతకు ముందు మా కులాల వారు తమకు నచ్చినది వాడుకొని కుల వివక్షత చూపెట్టిన మాట నిజమే....అలాగని మాలోని వారు ఆ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారూ వేల వేలు. కాబట్టి సామాన్యీకరించటం () తప్పు. ఒక మనిషిని అతని గుణ గణాలను బట్టి గౌరవించాలనుకోవటం ఇప్పటి సామాజిక న్యాయం. కదా? కాబట్టి ఆ న్యాయం సమాజంలోని ప్రతీ ఒక్కరికీ చెల్లాలంటాను.

 

"...మాదిగ" ".....మాల" అన్న కుల పేర్లను ఆక్షేపించే దమ్ము లేని వారికి శర్మ, రెడ్డి, చౌదరి పేర్లను ఆక్షేపించే అవసరం, ధైర్యం ఎందుకు రావాలి? పైగా ఉట్టి కులం పేర్లు తీసేస్తే కులం పోతుందా? పోదు కదా. మరి కొన్ని కులాల వారి పేర్లనే ఎందుకు ఆక్షిపించాలి? ఆ కులం పేర్లు పెట్టుకోటానికి భయపడే పరిస్ధితులు ఎందుకు రావాలి?" "సరే నువ్వు చెప్పినది కొంత సమంజసంగా ఉన్నా....మొత్తానికి ఒప్పుకోలేక పోతున్నా

 

"ఇలా కులాల పేర్లని, కులాల సమూహాలని పెట్టుకోటంలో ఇంకో డేంజర్ కూడా ఉండి రఘు. నువ్వు పరిణితి చెందిన వాడివి, వివక్ష చూపవు....ఆ పేర్లు పెట్టుకొనేది నీ అస్థిత్వంలో ఒక భాగం అయినందుకే అని అంటావా...సరే ఒప్పున్నామనే అనుకో..... అందరూ అలా ఉండరు కదా...ఇలాటివి కొనసాగిచటం వలన వివక్ష చూపే వారికి పరోక్షంగా ఊత నిచ్చినట్టే కదా...కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత కోరికలు ఒదులుకోలేవా?" మనోజ ప్రశ్న.

 

"ఆ కాన్సెప్ట్ అందరూ ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటాను...అదే చిక్కు ....అందరేమో తమ తమ కుల వ్యక్తిత్వాలను, అస్థిత్వాలను వదలరు....బ్రాహ్మణులనేమో మీరు వదలాలి అంటారు..ఎందుకలా? సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తిగత శ్రేయస్సు వదులుకోవాలి అన్నది అందరూ ఒప్పుకుంటే...కుల ప్రాతి పదికన రిజర్వేషన్ లను తీసేయటానికి ఒప్పుకోవాలి.......అసలు కులము అనేది ఎక్కడా ప్రస్తావించ కూడదు అఫీషియల్ వాటిలో...ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరలాటప్పుడు నేనెందుకు ఒప్పుకోవాలి? " నా సమాధానం.

 

"అసలు భ్రాహ్మణత్వానికి నిర్వచనం తెలుసా నీకు? అసలు భ్రాహ్మణుడివా నువ్వు? అలా అయితే ఇంత అహం ఉండదు కదా నీకు? పూజలు, పునస్కారాలు, ఆచారాలు ఏమీ తెలీవు. పైగా ఆచార్యుడివి అసలే కాదు--- మరెందుకు నీకు, నీ పిల్లలకు ఈ పేర్లు?" నన్ను గెలిచానన్న ఆనందం మనోజ కళ్ళలో.

 

"వితండ వాదం ఆంటే ఇదే. వీర్రాజు అన్న పేర్లున్న వాళ్లందరూ వీరులు కాదు కదా. సార్థక నామదేయం అనేది ఇప్పటి వ్యవస్తలో కుదరనిది......అదే కావాలి అనుకుంటే అందరు అసార్తక నామదేయులు తమ పేర్లు మారుస్తున్నారా?

 

ఇకపోతే ఆచారాలు మొదలయినవి. ఎంతమంది క్రిస్మస్కు, రంజానుకు, శివరాత్రికి తమ తమ భగవంతులను చిత్త శుద్ధితో పూజిస్తున్నారు? ……ఎంత సేపు పూజిస్తున్నారు?...... ఒక్క క్షణం? నిముషం? ……మరయితే ఒక్క రోజంతా సెలువులు ఎందుకు? ఆ కొంత సమయం ఇస్తే సరిపోలా? ఒక "చిత్త సుద్దో మీటర్" కనిపెట్టి అందరిలో ఇంప్లాంట్ చేసి వారి సూచిక ప్రకారం వారికి సెలవులు ఇద్దాము సరేనా?" చాలా వెటకారం ధ్వనించింది నా కంఠంలో.

 

నువ్వెన్నయినా చెప్పు.....ఇప్పటి కాల మాన పరిస్థితులలో కులాలు పోవు. కాబట్టి నా కులం అనేది నా జన్మ హక్కు....నా అస్థిత్వంలో ఒక భాగం. అవును నేను బ్రాహ్మణుడినే ....నా పిల్లలకు ఆచార్యులు అన్న "తోక" తప్పనిసరిగా పెడుతాను. నన్ను, మా వాళ్ళను తప్పు చేస్తే ఈ సమాజం దండించాలి అంతే కాని మా పేర్లను, కులాన్ని బట్టి కాదు. అంతే." నా నిర్ణయం చెప్పి భోజనానికి పిలుస్తున్న భార్య కేకతో మనోజ దగ్గర శలవు తీసుకొని వచ్చేసా.

రెండవ భాగం

ఒకటవ భాగం


7 comments:

  1. భేషుగ్గా చెప్పారు. ఎవరి కోసమో మన అస్తిత్వాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? మీరన్నట్లు కుల వివక్ష రహిత సమాజాన్నే కోరుకుందాం కుల రహిత సమాజాన్ని కాదు.

    ReplyDelete
  2. ippudunna leda undaboye paristitulalo mi nanna gari nirnayame correct.mukyam ga govt sector lo peru lo mi caste teliyakapote bhujam mida cheyyi vesi tadumutaru tadu tagilite bpl ra ani vivksha modalu.yem pantulu ante norumusukuni cheppu anali ade yentoyi mala ano madiga ano chudandy office lo dharnalu atrocity cases.asalu nannadigite yenti pantulu ante atrocity case namodu cheyyali kulam peru to dushinchadany, yento na aranya rodana.

    ReplyDelete
  3. a genuine introspection.
    plain and whole hearted thoughts.

    i appreciate the version.

    all answers are embedded in the post itself. (cleverly)

    with best wishes

    ReplyDelete
  4. కులం పేరుతో తిడితే తప్పు చట్టపరంగా చర్య. మరి అది అన్ని కులాలకూ వర్తించాలి కదా? కాని అది తమ హాక్కు అన్నట్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కులాలు, ఇతరకులాల వారిని తిట్టడం వీధిన పడటం చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదేమి. సామాజిక న్యాయం మాట్లాడే మన నాయకులకు ఇదేమి పట్టదు శాస్త్రి, రెడ్డి, రాజు తొకలంటూనే యాదవ్, మాదిగ అని పెట్టుకునే వాళ్ళకు మరి అవి ఈకలా లేక తోకలా అన్నది అందరూ ఆలోచించాలి. ప్రతిభ ప్రాతిపదికగా ఉంటే ఈ కులాల గొడవ ఉండదు కదా! అది మాత్రం కుదరదు. ప్రతిభ లేకున్నా పట్టం మత్రం కావాలి. ఇంజినీరింగ్ సీట్లు చూడండి, వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా సీటు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ మాత్రం మార్కులు లేక సీట్లు మిగిలి పోతాయి. ఇక్కడ తిండికి లెకున్నా అగ్రవర్ణం పేరుతో ఏ సౌఖ్యానికి నోచుకోని అభాగ్యులు ఎవరికి కనిపించరు, వాళ్ళ వర్ణం తప్ప.
    తక్కువఘ చూస్తున్నారు అంటూనే కులాన్ని వదులుకొరు. ఇప్పుడిలా పేరు చివర కులం చేర్చుకోవడం వాళ్ళూ చెస్తున్నారు. తమకులం తాక్కువది కాదు అన్నప్పుడు ఈ ప్రత్యేక రాయితీలు, రిజర్వేషన్లూ అవసరమా! పోటీ పడలి, ప్రతిభ చూపాలి, గెలుచుకోవాలి. అంతే కాని ప్రతిభ లేకున్నా పట్టం కోరుకుని ఏ కొంప కూల్చాలని?
    మీ ఆవేదనలో అర్దం ఉంది. కాని ధైర్యంగా నిజాయితీగా నిజం మాట్లాడలేని బృహన్నలు మన నాయక సోదరులు.

    ReplyDelete
  5. కులం పేరుతో తిడితే తప్పు చట్టపరంగా చర్య. మరి అది అన్ని కులాలకూ వర్తించాలి కదా? కాని అది తమ హాక్కు అన్నట్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కులాలు, ఇతరకులాల వారిని తిట్టడం వీధిన పడటం చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదేమి. సామాజిక న్యాయం మాట్లాడే మన నాయకులకు ఇదేమి పట్టదు శాస్త్రి, రెడ్డి, రాజు తొకలంటూనే యాదవ్, మాదిగ అని పెట్టుకునే వాళ్ళకు మరి అవి ఈకలా లేక తోకలా అన్నది అందరూ ఆలోచించాలి. ప్రతిభ ప్రాతిపదికగా ఉంటే ఈ కులాల గొడవ ఉండదు కదా! అది మాత్రం కుదరదు. ప్రతిభ లేకున్నా పట్టం మత్రం కావాలి. ఇంజినీరింగ్ సీట్లు చూడండి, వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా సీటు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ మాత్రం మార్కులు లేక సీట్లు మిగిలి పోతాయి. ఇక్కడ తిండికి లెకున్నా అగ్రవర్ణం పేరుతో ఏ సౌఖ్యానికి నోచుకోని అభాగ్యులు ఎవరికి కనిపించరు, వాళ్ళ వర్ణం తప్ప.
    తక్కువఘ చూస్తున్నారు అంటూనే కులాన్ని వదులుకొరు. ఇప్పుడిలా పేరు చివర కులం చేర్చుకోవడం వాళ్ళూ చెస్తున్నారు. తమకులం తాక్కువది కాదు అన్నప్పుడు ఈ ప్రత్యేక రాయితీలు, రిజర్వేషన్లూ అవసరమా! పోటీ పడలి, ప్రతిభ చూపాలి, గెలుచుకోవాలి. అంతే కాని ప్రతిభ లేకున్నా పట్టం కోరుకుని ఏ కొంప కూల్చాలని?
    మీ ఆవేదనలో అర్దం ఉంది. కాని ధైర్యంగా నిజాయితీగా నిజం మాట్లాడలేని బృహన్నలు మన నాయక సోదరులు.

    ReplyDelete
  6. కులం గురించి మాట్లాడితే కత్తి మహేష్ కుమార్ కంటే ఎక్కువ ఎవరూ ఉలిక్కి పడరు. హిందువులు-బ్రాహ్మణులు మొదలయినవి చెప్తే అంతెత్తున లేస్తావు ఎందుకు మహేశా? నీ బ్లాగ్ లో కుల వ్యవస్థ గురించి చెప్పావు. కదా. నిజాయతీగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు:
    1) నువ్వు నీ కులాన్ని ఎక్కడయినా better oppurtunities కోసం ఉపయోగించుకున్నావా? అంటే, నీ ఉద్యోగం లో etc
    2) నీ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లలో ఎక్కడా కులం అన్న చోట 'ఏదీ కాదు ' అని రాయించావా?

    ReplyDelete
  7. అయ్యో, ఈ టపా చదివిన మొదట్లోనే కామెంటుదామని మర్చిపొయా! ఈ టపా లలో మీ వ్యాఖ్యలు, కొన్ని పాయింట్లు ఇలా ఉన్నాయి.

    1) "ఇది అంతా మొదలయింది పిల్లలకు ఏం పేరు పెట్టాలా అని నేను, శ్రీమతీ ఆలోచిస్తుంటే...నాకేమో నాన్న సమాజానికి భయపడి నాకు పెట్టని ఆచార్యులు అన్న ఇంటి పేరు నా పిల్లలకు పెట్టాలని కోరిక. తనకేమో అది ఇష్టం లేదు. దాని మీద చిన్న వాదన. చివరికి మీకు కుల వివక్ష ఎక్కువ అందుకే అలా పెట్టాలనుకుంటున్నారు అనేసి వెళ్లిపోయింది."

    2) "...మాదిగ" ".....మాల" అన్న కుల పేర్లను ఆక్షేపించే దమ్ము లేని వారికి శర్మ, రెడ్డి, చౌదరి పేర్లను ఆక్షేపించే అవసరం, ధైర్యం ఎందుకు రావాలి?

    వీటిని బట్టీ నాకు అర్ధం అయింది ఏంటంటే దళితులు వాళ్ళ కులం పేరు చివర్లో పెట్టుకుంటే (ఉదా!! మందకృష్ణ మాదిగ) లేని తప్పు అగ్రవర్ణాలు పెట్టుకుంటే కుల దురహంకారంగానో,వివక్ష గానో ఎందుకు అనిపిస్తుంది అనేది మీ ప్రశ్న గా భావిస్తున్న.

    కానీ మీ వాదన మొదలైన కోర్ లోనే ఒక లోపం ఉంది. మంద క్రిష్ణ తన పేరు చివర మాదిగ అని చేర్చుకొవటానికి ఒక కారణం ఉంది. అది వాళ్ళ ఆత్మ గౌరవం కోసం. అప్పటివరకు మాదిగలుగా చెప్పుకోటానికి చిన్నతనం గా భావించే ఆత్మ న్యూనత నుండి తన జాతి వారిని అదొక ఆత్మ గౌరవం అనే భావన క్రియేట్ చెయ్యటం కోసం. ఇంకా చెప్పాలంటే మీరు మీ కులం పేర్లని చూసి గర్విస్తున్నట్లే మేమూ మాదిగలుగా చెప్పుకోటానికి గర్విస్తున్నాం అని అగ్రవర్ణాల వారికి తెలియచెయ్యటం కోసమే. అంతేగాని వివక్ష చూపటం కోసం కాదు. అయినా ఇప్పటికీ ఎంతమంది అలా పెట్టుకుంటున్నారు అగ్రవర్ణాల వారితో పోల్చితే??

    మొత్తంగా ఇది మీ పూర్తి వాదనకి రివర్స్ కోణం. అంటే, మొదట కులం పేర్లు గొప్పగానో, ఆచారంగానో,పెట్టుకోవటం అగ్రవర్ణాల నించే మొదలయ్యింది. దాన్ని దళితులు ఆత్మ గౌరవం కోసమే మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా అనే ఆక్షేపణలో నిజం లేదనిపిస్తుంది.

    ఇక కుల రహిత సమాజం కాదు కుల వివక్ష రహిత సమాజం కోసం పాటు పడదాం అనే మీ ఆలోచనతో 100% ఏకీభవిస్తున్నా.

    ReplyDelete