Monday, 30 March 2009

రసిక రాజ తగు ధారలు కావె?

ఈ కవితా పాటవం చూడండి. రసహృదయం ఉన్న వారందరూ మనసారా గ్రోలవల్సిందే గీతాగొవిందామృతం. 

పద్యాన్ని చూస్తుంటె ఎంత ఈర్ష్యగా ఉందో! ..........పూర్వ జన్మ సుకృత ఫలమది .. ......అంత కంటే ఇంకోటి కాదు......ఆ భావావేశంలో ..... 

జయదేవ భణితమిధమతి 
ప్రియమపి మత్సర మనమతి భీకర జ్వాలే
ణ యమ తపతి కవన పటవ
నయన మతిశయ మివ దర్శన వరే ప్రాప్త్యే!



కాస్త నా సొది ఆపి అసలు పద్యానికి వద్దాము...చూడండి
ఆవాసొ వినాయతే ప్రియ సఖిమాలాపి జాలాయతే
తాపోపి శ్వసితేన దావ దహన జ్వాల కలాపాయతే
సాపి తద్విరహేణ హంత! హరిణీ రూపాయతే హా! కథం
కందర్పోపి యమాయతే విరచయన్ శార్ధూల విక్రీడితం!


తాత్పర్యం! 
తన గృహము నిర్జన వనము కాగా వెలువడిన రాధ చెలులు మానవ వల బారిన పడెను.. అఘాయత్య నివారణార్థమై. యెలాగైతెనేమి వారి బారి తప్పించుకొని నిజ వన ప్రవేశము చెసిన రాధ అచత కూర్చుని దీర్ఘ నిట్టూర్పులూర్చ తను తాపమున...ఆ తను తాపమే దావానలమై వన దహనము సేయ ధగ్ధ వన మధ్యమున చిక్కిన హరిణి వొలె తప్పించుకో చూసిన ఆ రాధను ఈ సర్వావస్తల కర్తయైన ఆ మరుడే గాండ్రించు యమ రూప శార్ధూలమై వేటాడెను." అట....ఎంత హృద్యంగా ఉందో కదా?

మొత్తం పద్యానికి ప్రతిపదార్థాన్ని, సరైన తాత్పర్యాన్ని కింద ఉన్న లంకెల ద్వార చూడండి…..
http://www.andhrabharati.com/kIrtanalu/jayadEva/04.html
poem after the end of ashtapadi 8

http://www.geocities.com/giirvaani/gg/sarga4/gg_4_frame.htm
pratipadaartha taatparya of 4-3

Sunday, 29 March 2009

ఒక తప్పు జరిగితే విడిపోవటమేనా ?....ఆలోచించండి!

"చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు...దూరేవి.... అన్నట్టుంది వ్యవహారం" అంటూ నా సతీమణి ఎవరి పైనో విసుక్కుంటోంది...."ఎవరిని రా అలా విసుక్కుంటున్నావు" అడిగా తనను. "చూడు వీళ్ళు ...అదే లోక్ సత్తా వాళ్లు....వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో ఏమో No discrimination between people because of reason of birth అంటారు.....ఇపుడు ఎన్నికల సమయమ్లో ఏదో బిసి యునైటెడ్ ఫ్రంట్ అట....దానితో పొట్టు పెట్టుకుంటున్నారు...అలాగే ఏదో ముస్లిం ఫ్రంట్ తో కూడా బాగా కలిసి పని చేస్తున్నారట" అని నా భార్య ఫిర్యాదు.

"అవునా ఆ పొత్తుకు వివరణ ఇచ్చారా" నేను ఆదుర్దాగా ప్రశ్నించాను. అసలే ఈ మధ్యే లోక్సత్తా ఎన్నికల ప్రచారంలో ఉడతా భక్తిగా నా వంతు నేను చేస్తున్న కొత్త కార్యకర్తను. ఇంకో రెండో మూడో రోజుల్లో టెలీ కాన్వాసింగ్ కూడా చేయాలనుకుంటున్న సమయంలో ఈ గొడవేంటిరా బాబు...ప్రజలకు ఎం సమాధానం చెప్తాం అంటూ మధన పద సాగాను.

"ఆ ఇచ్చారు.......ఎన్నికల ప్రక్రియలో మందు, డబ్బు, ఇలాటివి వాడము అని చెప్పారట...విధానాలు కలుస్తున్నాయి కాబట్టి పొత్తు పెట్టుకున్నాము అని" లోక్ సత్తా వెబ్ సైట్ చూసి చెప్పింది తను.

"తప్పటడుగులు వేస్తున్నారేమో అని నాకు కూడా అనిపిస్తోందిరా....అవునూ కొంప తీసి మనం హిందువలము, ఎఫ్ సీస్ అయినందువలన మనం ఈ పొత్తును వ్యతిరేకించటం లేదు కదా? " అని తనను ప్రశ్నించాను.

ఆ సంగతి నేనూ ఆలోచించాను..కాని కాదు...అనవసరంగా మనను మనం ఎందుకు అనుమానించుకోవాలి? ఇప్పుడు జేపిది ఏ కులమో తెలుసుకుని మీరు ఇక్కడ నుంచి ప్రచారం చెయ్యట్లేదు కదా...అలాగే ఆ సేర్లింగంపల్లి అభ్యర్థి కులం మీకు తెలుసనా, మన శ్రీ రాం కు తెలుసనా మనం ప్రచారం చేస్తున్నాము...అలా కాదు. ఈ పొత్తు లోక్ సత్తా మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది ఈ నిర్ణయం అందుకే ఆలోచిస్తున్నాము దాని గురించి" అంది స్థిరంగా.

"ఏమో...ఇపుడు నేను టెలీ కాన్వాసింగ్లో ప్రజలడిగితే ఏం చెప్పను నేను?" నాలో నేను అనుకుంటున్నట్టుగా పైకే అనేసాను.

"ఉన్నది చెప్పండి...ఈ పొత్తు తప్పని మీరూ అనుకుంటున్నారని...ఏదో ఒక ప్రత్యేకమైన ప్రజా గుంపు కోసం పనిచేయటం తప్పని, మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నారని....అందుకనే పార్టీ లోపల్నుంచే ఈ నిర్ణయం మార్చుకునే కృషి చేస్తున్నారని చెప్పండి...."

"మరయితే మనకు నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకు ఎందుకు ప్రచారం చేస్తున్నారు..మానేయోచ్చు కదా అనడిగితెనో?..... " నా అనుమానం.

"ప్రత్యామ్నాయమేది? ఇంతటి మంచి సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తూ సమాజ మార్పుకై నిజంగా కృషి చేసే ఇంకో పార్టీ ఏదో చూపమనండి. పైగా ఏదో ఒక వ్యవస్థ లేదా జీవన విధానం మార్చాలి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం సాధారణమే....అది సాకుగా చెప్పటం కాదు..ఒక ఫాక్ట్ అది...జరిగిన తప్పులను సరిదిద్దుకోవటమే కదా మన లోక్ సత్తా చెప్పే అంటే. కాబట్టి ఆ సెల్ఫ్ కరెక్షన్ అనేది లోక్ సత్తాలో కూడా జీర్ణించుకు పోయేందుకు మీ వంతు మీరు చేస్తారని చెప్పండి..." ధీమాగా ఎక్కడా తడబడకుండా చెప్పింది.

"ఏమోరా నాకు ఇంకా ఎందుకో అనుమానంగా ఉంది....అది జరుగుతుందా లేదా అని" పెదవి విరిచేసాను.

"జరగటానికి మీ వంతు కృషి చేయండి..తరవాత జరిగిందా అలేదా అని బాధ పడకుండా.....ఏ పర్యవసానం ఎదురైనా దాని గురించి ఆలోచించి అపుడు నిర్ణయం తీసుకోండి...అంటే కాని కృషి మాత్రం ఆపొద్దు....Courage of Convictionని మాత్రం కోల్పోవద్దు ఈ చిన్న చిన్న సంఘటనలతో....... మీతో మాట్లాడుతూ కూర్చుంటే వంటింట్లో కూర మాడుతున్నట్టుంది వస్తాను" అంటూ తుర్రుమంది. వంటింటి గుమ్మం పైన ఉన్న గీతోపదేశం చిత్రంలో అర్జనుడికి కనువిప్పు కలిగించిన కృష్ణుడిలా అనిపించింది నా పెళ్ళాం నాకు ...ఆ క్షణం.

Saturday, 28 March 2009

ఆ రాజకీయంలో ఏముంది...అందరూ దొంగలే!

నేను చెప్పాలనుకున్నది ఇందులో చెప్పేశారు..ఇది చదవండి!


http://maanasasanchara.blogspot.com/2009/03/blog-post.html


Wednesday, 25 March 2009

మరుగు దొడ్లా....... కలర్ టీవీలా?

ఈ వ్యాసం ఆంగ్లంలో

మీ ఆడవారు, పిల్లలు రోడ్డు మీద మల విసర్జన చేస్తున్నారా? చేయాల్సోస్తే సహించగలరా ?
మరి కోట్ల మంది భారతీయుల ఆ దుర్గతిని ఎందుకు సహిస్తున్నాము మనం?
కలర్ టీవీలు ముఖ్యమా మరుగు దొడ్లు ముఖ్యమా?

అన్నదాతలు రుణ మాఫీకై చేతులు జార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది?
సరైన అప్పు, విద్యుత్తు, నీరు, మార్కెట్టు, కిట్టుబాటు ధర ఉంటే అప్పు తీర్చలేని చేవ గలవారా మన అన్నదాతలు?
అంత ఆత్మాభిమానం లేనివారా మన అన్నదాతలు?


నెలకు రెండు వేల రూపాయల బిచ్చం కావాలా సొంత ఉపాధి కల్పించే విద్య కావాలా?
ఎంత కాలం ఇస్తారు బిచ్చం? ఆ తరువాత?
పేదరిక నిర్మూలనకు మార్గం కుటుంబానికి రెండు వేల రూపాయల బిచ్చమా లేక విద్యా?



మనని ఈ రాజకీయవాదులు గొర్రెలని ఎందుకనుకుంటున్నారు?
ఇప్పటివరకు మనకు ప్రత్యామనాయం లేదు కాబట్టి......

ప్రత్యామ్నాయం ఉండి కూడా గోర్రెలము ఎందుకవ్వాలి?

రండి గోర్రెలం కాదని నిరూపిద్దాం.....బుర్రతో ఆలోచించి ఓటు వేద్దాం!


లోక్ సత్తాకు ఓటు వేద్దాం......లోక్ సత్తాను గెలిపిద్దాం!

http://www.loksatta.org/tempimages/Lok-Satta-Party-50-guarantees.pdf 50 promises of lok satta

http://www.loksatta.org/ Lok Satta

http://www.loksatta.org/Contribute.php Donate to Lok Satta

http://www.loksatta.org/telltofriend.php Tell a friend

Private Toilets or Colour Tvs?...Dignity or Entertainment?

Telugu Version

Why slam “Slumdog Millionaiare” when we can not ensure a private toilet to every one?
Which is more important for citizens of India……free colour TVs or private toilets?????
What do we cherish more …entertainment or dignity & health?



What is more important…..”2000rs/pm/identified families” or “free education till 12th class?”
How long can a family survive on charity?
Is this the real way out of poverty for us proud Indians…EVER LASTING CHARITY?



Why do we need “Arogyasree” which insures only a selected few for mere 5 diseases when we can have “Arogyaraksha” which ensures universal health care?
Why do we need a scheme which covers only surgery costs when we can have “arogyaraksha” which will cover all costs for treating illnesses?



Why do we need a “loan waiver” if we can give “all our farmers access to credit” and “adequate market and value addition”?
Why do we think our farmers lack self respect that they do not want to repay their loans?



Why….why …why…..?


Why do the most political parties think we are all fools?
Is it because we are really fools?

No, it is because till now, there was no credible alternative.
But now there is!


Come, let us not prove to be fools when we have credible alternative.


Let’s vote with our minds rather than hearts
Let’s vote and support loksattaa……




50 guarantees of loksattaa
http://www.loksatta.org/images/50_Guarantees.pdf

Loksatta
http://www.loksatta.org/

Donate to loksatta
http://www.loksatta.org/Contribute.php

Tuesday, 24 March 2009

Youth Politics Corruption

Telugu Version

Are Indians corrupt by nature?
If we are not then why do we see so much corruption?
Why do we not see so much corruption in some countries?

How can we as youth, play a role, in day to day improvement of politics in India?

What should be my attitude towards Telangana issue?

Why is it important for us to make sure Lok Satta wins some seats in this elections, inspite of knowing they will not be able to form a government of their own?


Have you ever had these thoughts in your mind?
I bet you sure would have had them…..after all we are all SOCIAL ANIMALS.


Want to know what is loksatta’s take on these ?



Youth-1
http://www.youtube.com/watch?v=eW8lZ2vOdcE
Youth-2
http://www.youtube.com/watch?v=7nOXriLOwic&feature=related
Youth-3
http://www.youtube.com/watch?v=eYJE0R64ehw&feature=related



Do not stop there…………..start doing something


Start telling one person per day about Lok Sattaa…..ask them to do the same

Start donating one rupee/£/$ per day to Lok Sattaa….


Start thinking about Lok satta’s stance on one issue per day………….



Do you know how much Lok Satta will have at the end of the next 24 days if we do this?
Take a look….

1. • 1………………………………………15/4/9
2. • 2
3. • 3
4. • 6
5. • 12
6. • 24
7. • 48
8. • 96
9. • 192
10. • 384
11. • 768
12. • 1536
13. • 3072
14. • 6144
15. • 12288………………………………………..01/4/9
16. • 24576
17. • 49152
18. • 98304
19. • 196608
20. • 393216
21. • 786432
22. • 1572864
23. • 31,45,728……………….24/3/9


YES, its literally thirty one lakhs…….forty five thousand…..seven hundred and twenty eight!



Start Thinking and Start acting……………………………..

అవినీతి..యూత్...మొదలయినవి!

ఈ టపాకు ఆంగ్ల అనువాదం ఇక్కడ.

మన భారత దేశంలో ఇంత అవినీతి ఎందుకు చూస్తున్నాము?
మనం భారతీయులం మిగితా వారి కంటే ఎక్కువ అవినీతిపరులమా?
వేరే కొన్ని దేశాలలో ఇంత అవినీతి ఎందుకు చూడము మనం?


ఇవాల్టి మన యూత్ (నువ్వు యూత్ ఎంట్రా అంటారా...మీ ఇష్టం:-) మన దేశపు రాజకీయాన్ని బాగు చేయాలంటే రోజువారీగా ఏమి చెయ్యాలి?

తెలంగాణా విషయం పై నా అభిప్రాయం ఏమయి ఉంటె ఎక్కువ మందికి మేలు జరుగుతుంది?

లోక్ సత్తా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన స్థానాలు ఈ ఎన్నికలలో గేలువలేదనే సత్యమ తెలిసి కూడా నేను ఎందుకు దాని కోసం కృషి చేయాలి?

ఇలాటి ఆలోచనలు ఎపుడయినా మీ మదిలో వచ్చాయా?

తప్పక వచ్చే ఉంటాయి...

మరి ఇలాటి ప్రశ్నలకు లోక్ సత్తా సమాధానమేమిటి అని తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా?

అయితే ఇవి చూడండి...
మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం


చూసి.....ఊరుకోకండి.....ఆచరణలో చూపండి.

రోజుకొక్కటి చొప్పున లోక్ సత్తా చెప్పే విషయాల గురించి ఆలోచించండి.....
రోజుకొక మనిషికి లోక్ సత్తా గురించి తెలియ చేయండి......వారినీ అదే పని చేయమనండి.
రోజుకొక రూపాయి చొప్పున లోక్ సత్తాకు విరాళంగా ఇవ్వండి....


ఇలా చేస్తే..........ఇరవయ్ మూడు రోజుల్లో....అంటే మన రాష్ట్రంలో ఎన్నికల ముందు రోజు వరకు....ఎంత మందిని జాగృతం చేయగలరో తెలుసా? ఎంత విరాళం లోక్సత్తాకు చేరుతుందో తెలుసా? మీరే చూడండి.....

1. • 1………………………………………15/4/9
2. • 2
3. • 3
4. • 6
5. • 12
6. • 24
7. • 48
8. • 96
9. • 192
10. • 384
11. • 768
12. • 1536
13. • 3072
14. • 6144
15. • 12288………………………………………..01/4/9
16. • 24576
17. • 49152
18. • 98304
19. • 196608
20. • 393216
21. • 786432
22. • 1572864
23. • 31,45,728……………….24/3/9

అవును...అక్షరాలా.....ముప్పయ్ ఒక్క లక్షలా....నలభై అయిదు వేలా.....ఏడు వందల ఇరవయ్ ఎనిమిది.....

Monday, 23 March 2009

రాజకీయం - ప్రభుత

ఈ వ్యాసం ఆంగ్లంలో

రాజకీయం నేరస్తుల ఆట స్థలం ఎందుకవుతోంది?
రాజకీయ నేరస్తులు జబ్బా లేక జబ్బు యొక్క గుణమా?
రాజకీయం నేర పూరితమవుతుందని తెలిసినా ఎందుకు ఆపలేకపోతున్నాము?
రాజకీయపు రంగు ఏదైనా మన పరిస్థితి ఒకేలా ఎందుకుంటోంది?


ఎపుడైనా ఆలోచించారా?
ఏమైనా సమాధానం తట్టిందా?
మీకు తట్టిన సమాధానంలో "ప్రభుత - రాజకీయం - అకౌంటబిలిటీ - మన భాద్యత" అన్న పదాలు ఉన్నాయా?


ఒక నిపుణుడి ఆలోచనా విధానం ఇక్కడ చూడండి........
ఆయన ఆలోచననూ మీకుగా మీరు తర్కించుకోండి.........
తార్కీకమైన ఆలోచనా విధానం మొదలెడదాం............

http://www.youtube.com/watch?v=3MPl-ayS-7E&feature=related

http://www.youtube.com/watch?v=YK8jJUHIHLs&feature=related

http://www.youtube.com/watch?v=7DlmmVoZQBg&feature=related

http://www.youtube.com/watch?v=DwYcPgHVVgs&feature=related

http://www.youtube.com/watch?v=rdAUMg7rxAY&feature=related

http://www.youtube.com/watch?v=RxTWQs2pAEk&feature=related



ఇది ఒక వ్యక్తి వ్యక్తి పూజ కాదు.................
ఇది ఒక పార్టీపై గుడ్డి నమ్మకం కాదు............


మన రాజకీయ ప్రభుత్వ రంగాలను మార్చుకొనే మన ప్రయత్నం మాత్రమే


మన రాష్ట్రంలో ఎన్నికలు 24 రోజుల్లో ఉన్నాయి
అంతలోనే ఏమి చెయ్యగలం అనుకుంటున్నారా? పొరబడుతున్నారు......


రోజుకోక్కరికి లోక్ సత్తా గురించి చెప్పండి
వారినీ రోజుకొకసారి అలాగే చేయమనండి....
రోజుకొక్క రూపాయి/డాలరు/పౌండు లోక్సత్తాకు విరాళమివ్వండి....

24 నాలుగు రోజుల్లో ఎంతవుతుందో చూస్తారా?
· 1………………………………………15/4/9
· 2
· 3
· 6
· 12
· 24
· 48
· 96
· 192
· 384
· 768
· 1536
· 3072
· 6144
· 12288……………………………………..01/4/9
· 24576
· 49152
· 98304
· 196608
· 393216
· 786432
· 1572864
· 3145728
· 62,91,456…………………………………….23/3/9


అవును....అక్షరాలా అరవై రెండు లక్షలా......తొంభయ్ ఒక్క వేలా.....నాలుగు వందల యాభయ్యారు రూపాయలు....


మీ వంతు మీరూ చేస్తారు...ఇవాళే!

Politics & Governance




Ever wonder why criminals like Pappu Yaadav, Arun gavli, Shaabuddin get elected ?

Ever wonder why criminalisation of politics occurs?

Ever wonder why criminalisation of politics is not being rooted out?

Ever wonder why the situation is the same whoever comes to power?




How we ever spared a few minutes about pondering these?

Did we find come to any decisions about factors responsible for these?

Did words like “Politics – Governance – Accountability – NGO’s role –Our role- Decentralisation of governance and power” come into your thoughts?



Start the process of thinking……………….
Start it by watching an expert speaking about “Politics & Governance” ……
Then start the process of critical thinking by critiquing his thoughts……………..


http://www.youtube.com/watch?v=3MPl-ayS-7E&feature=related
http://www.youtube.com/watch?v=YK8jJUHIHLs&feature=related
http://www.youtube.com/watch?v=7DlmmVoZQBg&feature=related
http://www.youtube.com/watch?v=DwYcPgHVVgs&feature=related
http://www.youtube.com/watch?v=rdAUMg7rxAY&feature=related
http://www.youtube.com/watch?v=RxTWQs2pAEk&feature=related




This is NOT about personal worship………………..
This is NOT about blind followers……………..


LOKSATTA is all about CRITICAL THINKING
LOKSATTA is about CHANGE IN GOVERNANCE AND POLITICS



Know about LOKSATTA…………………
Think about LOKSATTA…………………
Talk to others about LOKSATTA…………………..
Donate to LOKSATTA……………………




Elections in AP are only 24 DAYS away………………..




ONLY 24 DAYS? .....Think again…………………

If you talk to one person per day about lok satta.....
If you ask that one person to do the same……………….
If you donate a rupee/£/$ to loksattaa……………..



Look at what we can achieve!

1. • 1………………………………………15/4/9
2. • 2
3. • 3
4. • 6
5. • 12
6. • 24
7. • 48
8. • 96
9. • 192
10. • 384
11. • 768
12. • 1536
13. • 3072
14. • 6144
15. • 12288………………………………………..01/4/9
16. • 24576
17. • 49152
18. • 98304
19. • 196608
20. • 393216
21. • 786432
22. • 1572864
23. • 3145728
24. • 62,91,456…………………………………….23/3/9



Yes, IT IS 62 lakhs, 91 thousand, 456 persons
Yes, IT IS 62 laksh, 91 thousand, 456 rupees/£/$




So,
Can you spend 12 hours of your time in the next 24 days for this?
Can you spend 24 rupees from your own pocket towards this?


Choice is yours…………….All yours!



Sunday, 22 March 2009

మనకు ఎలాంటి నాయకులు కావాలి?...............

అరవై లక్షల పనిదినాలు ప్రతి సంవత్సరం కోల్పోతున్న జబ్బులలో ఒక శాతం జబ్బుల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే వాళ్లా?    part 1 part 2 part 3 part 4


ఎం ఎం ఆర్ వాక్సీనుని "ఇంకా రీసెర్చిలో అది ప్రూవ్ కాలేదు" అనే వాళ్లా?   part 1 part 2 part 3 part 4


కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వమే విడుదల చేసిన నివేదికను ఆధారం చేసుకోకుండా, రాజకీయ లబ్ది కోసం వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని కేవలం మూడున్నర వేల ఆపరేషన్లపై ఖర్చు పెట్టడానికి వెనుకాడని వాళ్ళా?
part 1 part 2 part 3 part 4

ఆ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి చేసిన మూడున్నర వేల ఆపరేషన్లలో ఎన్ని ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగాయో చెప్పలేని వాళ్లా?
part 1 part 2 part 3 part 4


వీళ్ళా మననాయకులు, ఆరోగ్య మంత్రులూ, ప్రతి పక్షాలూను?


మీరు నిర్ణయించుకోండి ఎవరు కావాలో మన నేతలు....
మీరు నిర్ణయించుకోండి ఎవరు కావాలో మన మంత్రులు....
మీరు నిర్ణయించుకోండి ఎవరు కావాలో మన గళ ప్రతిధ్వనులు.....



నేను చెప్పానని కాదు.....మీరు చూడండి  part 1 part 2 part 3 part 4
ఆయన చెప్పారని కాదు...మీరు చదవండి National Commission for Macro-economics and Health Report
వాళ్ళు చెప్పారని కాదు....మీరు ఆలోచించండి

చూసి, చదివి, ఆలోచించి...ఆగిపోకండి...అమలుపరచండి.....


ఎలా అంటారా?

  • రోజుకొక్కరికి లోక్సత్తా గురించి చెప్పండి.....
  • వారినీ రోజుకోకరికి చెప్పమనండి లోక్ సత్తా గూర్చి......
  • రోజుకొక రూపాయో...డాలరో....పౌండో....లోక్ సత్తాకు విరాళం ఇవ్వండి
  • రోజుకొక అరగంట లోక్ సత్తా కై కేటాయించండి.....

మన రాష్ట్రంలో ఇంకో ఇరవయ్ అయిదు రోజుల్లో ఎన్నికలు.......ఇలా ఈ ఇరవయ్ అయిదు రోజులు చేస్తే.....
మీరే చూడండి ఎంత మందిని జాగృతం చేయగలమో.........


  1. ·  1………………………………………15/4/9
  2. ·  2
  3. ·  3
  4. ·  6
  5. ·  12
  6. ·  24
  7. ·  48
  8. ·  96
  9. ·  192
  10. ·  384
  11. ·  768
  12. ·  1536
  13. ·  3072
  14. ·  6144
  15. ·  12288………………………………………..01/4/9     
  16. ·  24576
  17. ·  49152
  18. ·  98304
  19. ·  196608
  20. ·  393216
  21. ·  786432
  22. ·  1572864
  23. ·  3145728
  24. ·  6291456
  25. ·  12583912……………………………….22/4/9                         

             


అక్షరాలా ఒక కోటీ ...ఇరవయ్ అయిదు లక్షలా......ఎనభై మూడు వేలా ......తొమ్మిది వందల పన్నెండు మందిని.....

చేద్దామా? చేద్దాం రండి!

Saturday, 21 March 2009

సమిష్ఠి కృషి బలమెంతో తెలుసా...... 2,51,67,824......అదీ కేవలం ఇరవయ్ ఆరు రోజుల్లో!

"నేను ఇక్కడ ఉండిపోయాను కాని లేకుంటే నా ..............." అనుకుంటున్నారా?
"ఇక్కడ నుంచి ఏమి చేయగలను?".............................నిస్పృహా?
"డబ్బులు పంపించటం మాత్రమె నేను చేయగలిగింది".....................అంటారా?



నిజమేనా?
ప్రవాసాంధ్రులం మనం ఏమీ చేయలేమా ?
డబ్బు కావాలి నిజమే కాని అదొక్కటేనా మనం చేయగలిగింది?


ఆ ఆ ............ టపాలు రాయటానికేం ........మేమూ రాస్తాము........ కాని వాటి వల్ల ఉపయోగం?
లోక్ సత్తా గురించి మేమూ అందరికీ చెపుతాం.................కానీ దాని వల్ల ఉపయోగం? అంటారా



ఒరేయ్ ఆ సినిమా చూడు...చాలా బావుంది, మళ్ళీ విశ్వనాథ్ తన టాలెంట్ చూపాడు అనో.......
అక్కా ..............ఆ హీరోయిన్ ఎంత సన్నగా అయినదనుకున్నావ్ అనో......
మామా........కత్తిలాటి సినిమా మామా......సూపర్ ఫిగర్లె హీరోయిన్ది అనో.....................


అని మన వాళ్లకు మనం చెపుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తామా? ఇలా చెప్పటం వలన సినిమా ఆడుతుందా, ప్రొడ్యూసర్ కి ఇంకా డబ్బులు వస్తాయా, హిరోయిన్కి ఇంకా చాన్సులు వస్తాయా అని ఆలోచిస్తామా? లేదే.......

మనసుకు నచ్చినది పది మందికి చెపుతాం...ఆ పది మందిలో ఒక్కరిని అది కదిలించగలిగినా అది ఓకేనే......

అలాగే ఇది కూడా......చెయ్యి, కమలం, సైకిలూ, కొడవలీ అన్నీ ప్రయత్నించాము కదా.......
త్రివర్ణ కండువా, పసుప్పచ్చ చొక్కా, బీజాక్షరాల పంచా, పాల పిట్ట జెండా, గులాబి తుండూ అన్నీ చూసాముగా.......
అన్నీ దొందూ దొందే అని తెలిపోయిందికడా..................


"కొత్త తరానికి కొత్త రాజకీయం" అంటూ వచ్చిన కొత్త రాజకీయవాదులను ఎందుకు ప్రోత్సహించకూడదు?

మనం మన ఆశుభ్రాన్ని కడగం.. సరే.....కడుగుతామని ముందుకు వచ్చిన వారిని ఎందుకు ప్రోత్సహించ కూడదు?


రండి

ఒకసారి లోక్ సత్తా గురించి ఆలోచిద్దాం





రండి


ఈ రోజు మన వంతు అరగంట లోక్ సత్తాకై కేటాయిద్దాం..........
ఈ రోజు మన వంతు రూపాయో....దాలరో...పౌండో.....లోక్ సత్తాకు విరాళంగా ఇద్దాం...............
ఈ రోజు మన వంతుగా ఒకరికి లోక్ సత్తా గురించి తెలియ చెపుదాం......
http://www.loksatta.org
http://www.loksatta.org/Contribute.php
http://www.loksatta.org/telltofriend.php


మర్చిపోకండి

ఏప్రిల్ పదహారున ఎన్నికలు మన రాష్ట్రంలో.......అంటే ఇంకా ఇరవయ్ ఆరు రోజులు.......

ఆ  నాటికి ఈ రోజుకొక మనిషి, అరగంట సమయమ, ఒక రూపాయి/డాలరు/పౌండు  ఎంతవుతుందో చూస్తారా?


  • 1
  • 2
  • 3
  • 6
  • 12
  • 24
  • 48
  • 96
  • 192
  • 384
  • 768
  • 1536
  • 3072
  • 6144
  • 12288
  • 24576
  • 49152
  • 98304
  • 196608
  • 393216
  • 786432
  • 1572864
  • 3145728
  • 6291456
  • 12583912
  • 2,51,67,824   ఇవాల్టి నుంచి మొదలెడితే ఇదీ మొత్తం సంఖ్య!
  • 5,03,35,648


  • ఆశ్చర్యంగా లేదూ? ఊహు.. లేదు........ సమిష్ఠి కృషికి ఉన్న బలమే అది....అంతే!





    Friday, 20 March 2009

    5,03,35,648........Every Little counts!

    Do you cry that politics are dirty?............................
    Are you one of those who say there should be new breed of politicians?..
    Do you spend hours discussing the corrupt politics of today?...................




    are you the one who thinks...."if only I could do something for this?"................
    are you the one who thinks......"if only I could change this in some little way?".
    do you think it is everybody's job to change politics?.......................................



    if there is a chance to do all this...... will you be the one to put up your hand?
    DO YOU HAVE IT IN YOU TO DO WHAT IT TAKES?
    then this is your chance........................GRAB IT.




    Elections in AP start from 16th April...that's just 27 days away......think thats too small a time to "Bring the second indipendence to India"?.......................


    Think again........................


    Tell one person about Loksatta every day.......................
    Ask them to do the same every day............. 
    Donate one Rs (or 1 £ or 1$) to Loksattaa every day.....................
     

    Take a look at what you can achieve in 27 days........................

    1. 1
    2. 2
    3. 3
    4. 6
    5. 12
    6. 24
    7. 48
    8. 96
    9. 192
    10. 384
    11. 768
    12. 1536
    13. 3072
    14. 6144
    15. 12288
    16. 24576
    17. 49152
    18. 98304
    19. 196608
    20. 393216
    21. 786432
    22. 1572864
    23. 3145728
    24. 6291456
    25. 12583912
    26. 25167824
    27. 5,03,35,648

    Yes...it is Five crores, three lakhs, thirty five thousand, six hundred and forty eight .....literally!


    Incredible...............isn't it? That's the power of the average person.................


    Look at what you spend on it 


    half an hour a day...............totals thirteen and half hours of your time 
    one rupee (or $ or £) a day...............totals 27 rupees form your pocket (or $27 or £27)



    That totals to........... Yes...it is Five crores, three lakhs, thirty five thousand, six hundred and forty eight .....literally!



    Still think you can not change these dirty politicians?

    Still think one is a small number?

    Still think 27days are not enough?



    Think again!



     


     




    Thursday, 19 March 2009

    అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది!

    రాజాకీయాలు కుళ్ళి పోతున్నాయి అని రోజూ వాపోతుంటారా?....
    రాజకీయవేత్తలందరూ దొంగలే అని నిరుత్సాహ పడుతుంటారా...
    కొత్త నీరు రావాలి అని లెక్చర్లు దంచుతుంటారా?.......
    డ్రాయింగ్ రూముల్లో గంటల తరబడి రాజకీయాల పై చర్చిస్తుంటారా?......


    అయితే మరి ఆ అవకాశం వస్తే ...
    ఆ కొత్త నీరు వస్తే ...
    నిస్వార్థ రాజకీయాలు తేవాలని చూసే వారు వస్తే .........

    వారికి మనం ఎలా సహాయ పడగలం?
    ఏం చేయగలం?
    నా వంతు నేనూ చేస్తాను కాని ఎం చేయాలి అనుకుంటునారా?.......................

    రోజుకో మనిషికి లోక్ సత్తా గురించి చెప్పండి......
    వారినీ ఇంకో మనిషికి రోజుకు ఒక సారి చెప్పమనండి......
    రోజుకో రూపాయో....పౌండో...డాలరో వారికి విరాళం ఇవ్వండి........

    ఇక చూసుకోండి......

    ఏప్రిల్ పదహారున ఎన్నికలు.....అంటే ......ఇంకా ఇరవై ఏడు రోజులు.......

    మీరే చూడండి.......మీ రోజుకొక మనిషి ఫార్ములాతో ఎంతమందిని జాగృతం చేస్తారో....

    1. 1 15/4/9
    2. 2 14/4/9
    3. 3 13/4/9
    4. 6 12/4/9
    5. 12 11/4/9
    6. 24 10/4/9
    7. 48 09/4/9
    8. 96 08/4/9
    9. 192 07/4/9
    10. 384 06/4/9
    11. 768 05/4/9
    12. 1536 04/4/9
    13. 3072 03/4/9
    14. 6144 02/4/9
    15. 12288 01/4/9
    16. 24576 31/3/9
    17. 49152 30/3/9
    18. 98304 29/3/9
    19. 196608 28/3/9
    20. 393216 27/3/9
    21. 786432 26/3/9
    22. 1572864 25/3/9
    23. 3145728 24/3/9
    24. 6291456 23/3/9
    25. 12583912 22/3/9
    26. 25167824 21/3/9
    27. 5,03,35,648 20/3/9

    అవును.....అక్షరాలా....అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది మందిని....


    రోజుకొక రూపాయిస్తే ?.............. అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది రూపాయలు..... అదే డాలర్లూ...పౌండ్లూ అయితే? మీరే లేక్కలేస్కోండి.......



    దీనికి మీరు ఖర్చు పెట్టేది?

    రోజుకు అరగంట సమయం....మొత్తం.......పదమూడున్నర గంటలు.......
    రోజుకు ఒక రూపాయి ధనం...మొత్తం.......ఇరవయ్ మూడు రూపాయలు......


    చేయగలరా?

    మీ వంతు చేయగలరా?

    చేస్తారా?

    మీ వంతు చేస్తారా?


    నవభారత నిర్మాణానికి నేను సైతం, నేను సైతం అంటూ గళం కలుపుతారా?


    మీ చేతిల్లో ఉంది మీ భవిత.......





    Friday, 13 March 2009

    సీత నవ్వుకు వేయి కారణాలు.....

    అందరున్న వేళ,

    ఉత్సాహమురకలేయ,
    జాలువారె మాట- 
    స్ఫందిన మనసులా ...... 

    "చూసానీవేళ
    అద్భుత దృశ్యమిలా...... 
    సన్నని పరదా మాటున
    దాగిన అందమిల మిల.


    గుండ్రంగా, తెల్లగా .... 
    మధ్యనుండిన 
    మచ్చలెవా? అనిపించేలా... 
    అందంగా మిల మిలా.....

    అర్థమయిందిలా..... 
    కనీ కనపడనిదే
    నిజమైన అందమెలా
    అయిందనే విషయమంతా"


    సాగుతున్న రసఝరిలొ
    పానకంలో పుడకలా 
    వినపడింది చిన్నగా 
    "వెధవ, నీ కళ్లు పేలా "

    ఎవరాయని చూడగా .......
    కాన వచ్చే"ఘన" చందనాంగన.
    సర్దుకుంటూ పయ్యెద, 
    నా వంక కోపంగా చూడగా.


    గతుక్కుమని చూపులు తిప్పానా......
    కాన వచ్చేనింకో ఇందువదన.
    "నాకు మచ్చల్లేవు చూసుకో" అన్నట్టు 
    తప్పిస్తూ తన మేలి ముసుగు కొంత. 

    ఇంతలొ ఫక్కుమని నవ్వు విన
    చూసానటు పక్కన-
    ఓ కోమల కమల నయన
    చల్లని చిరునవ్వున.

    "ఎందుకా నవ్వ"ని నేననగా 
    పక్కకు జరిగి చూపే గగనమలా....
    జలతారు పరదా జరిపి 
    మేడ మీది కిటికీగుండా.

    "మేఘము కప్పిన చందమామ- 
    మీరు చేసిన ఆ వర్ణనంత,
    అవునా?" అంటూ కోయిల స్వరాన
    అసలు గుట్టు విప్పెనిలా. 


    చల్లని పిల్లతెమ్మెరకో...
    చక్కని చుక్క నవ్వుకో...
    ఎందుకో తెలీదు కాని,
    శరీరమంతా చిన్న పులకింత. 

    "అవున"ని తల ఊపి
    ముందుకు కదిలినా.... 
    రమణీయ సంఘటనంతా 
    మదిన పదిల పరిచినా.


    ఎపుడో రాసుకున్న ఈ కవిత నా బ్లాగులో పెట్టానో లేదో గుర్తులేదు....అన్నీ వెతికే ఓపికలేక పెట్టేస్తున్నా.....పునరావృతమయితే క్షమించండి.

    Monday, 9 March 2009

    నీతోనెట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా............

    మనసంతా పుట్టింటీ గాలైందీ
    కాలేమొ క్షణమూ నిల్వాకుందీ
    ఇంటీకాడా నన్నొగ్గెసీ వొస్తేనూ
    మామా నీకూ ఫున్యామైతాదీ
    గొలా బెట్టిందీ - ముల్లే సర్దిందీ
    నీవే గాదే పిల్లా, నీవే గాదే పిల్లా


    పుట్టిల్లేమొ కోసూల దూరం
    మెట్టింటేమొ పనులా భారం
    నన్నాడా ఒగ్గేసీ చప్పూనా రా మామా
    నిన్నాడా కట్టెసీ పెట్టము రా మామా
    సెవిలో దూరేసీ గొలా సేసిందీ
    నీవే గాదే పిల్లా, నీవే గాదే పిల్లా


    నువ్వాడా నేనీడా
    పైరూ కాడా గొడ్డూనైపొతీ
    గూడూ కాడా వొంటీగాన్నైతీ
    వొంటీగాన్నైతీ సావూ నాకితీ
    తొటీగాల్లా కాడా నానలసైపొతీ
    నీతోనెట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా


    ఆగాలేకా నేనూ నక్కీ మీవూరొస్తే
    ఇరుగమ్మా పొరుగమ్మా ముసిముసీ నవ్వూలాయే
    నిలువాలేకా నేనూ నిన్నట్టా సూస్తూంటే
    కన్నుల్లో నీరేందే, మాటైనా రాదేందే
    నీతోనెట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా


    ఏటేటే... ఏటేటే....
    మల్లోసారి తిరిగీ నీవే సెప్రాదే
    నాకేమొ నీ మీదా పేమే లేదంటావే
    నిన్నీడా ఒగ్గేసీ నేనాడా కులికేనంటావే
    పేముంటే ఏనాడొ కబురెట్టే వాడీనా
    ఆడాల్లా మాటాలూ అవి బ్రెమ్మా రాతాలు
    నిజమేనే పిల్లా ............ఇపుడే నేర్సానే పిల్లా,
    నీతోనెట్టేటే పిల్లా, పానాలు తీస్తావు ఇల్లా!