Monday, 30 March 2009

రసిక రాజ తగు ధారలు కావె?

ఈ కవితా పాటవం చూడండి. రసహృదయం ఉన్న వారందరూ మనసారా గ్రోలవల్సిందే గీతాగొవిందామృతం. 

పద్యాన్ని చూస్తుంటె ఎంత ఈర్ష్యగా ఉందో! ..........పూర్వ జన్మ సుకృత ఫలమది .. ......అంత కంటే ఇంకోటి కాదు......ఆ భావావేశంలో ..... 

జయదేవ భణితమిధమతి 
ప్రియమపి మత్సర మనమతి భీకర జ్వాలే
ణ యమ తపతి కవన పటవ
నయన మతిశయ మివ దర్శన వరే ప్రాప్త్యే!



కాస్త నా సొది ఆపి అసలు పద్యానికి వద్దాము...చూడండి
ఆవాసొ వినాయతే ప్రియ సఖిమాలాపి జాలాయతే
తాపోపి శ్వసితేన దావ దహన జ్వాల కలాపాయతే
సాపి తద్విరహేణ హంత! హరిణీ రూపాయతే హా! కథం
కందర్పోపి యమాయతే విరచయన్ శార్ధూల విక్రీడితం!


తాత్పర్యం! 
తన గృహము నిర్జన వనము కాగా వెలువడిన రాధ చెలులు మానవ వల బారిన పడెను.. అఘాయత్య నివారణార్థమై. యెలాగైతెనేమి వారి బారి తప్పించుకొని నిజ వన ప్రవేశము చెసిన రాధ అచత కూర్చుని దీర్ఘ నిట్టూర్పులూర్చ తను తాపమున...ఆ తను తాపమే దావానలమై వన దహనము సేయ ధగ్ధ వన మధ్యమున చిక్కిన హరిణి వొలె తప్పించుకో చూసిన ఆ రాధను ఈ సర్వావస్తల కర్తయైన ఆ మరుడే గాండ్రించు యమ రూప శార్ధూలమై వేటాడెను." అట....ఎంత హృద్యంగా ఉందో కదా?

మొత్తం పద్యానికి ప్రతిపదార్థాన్ని, సరైన తాత్పర్యాన్ని కింద ఉన్న లంకెల ద్వార చూడండి…..
http://www.andhrabharati.com/kIrtanalu/jayadEva/04.html
poem after the end of ashtapadi 8

http://www.geocities.com/giirvaani/gg/sarga4/gg_4_frame.htm
pratipadaartha taatparya of 4-3

No comments:

Post a Comment