Thursday, 19 March 2009

అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది!

రాజాకీయాలు కుళ్ళి పోతున్నాయి అని రోజూ వాపోతుంటారా?....
రాజకీయవేత్తలందరూ దొంగలే అని నిరుత్సాహ పడుతుంటారా...
కొత్త నీరు రావాలి అని లెక్చర్లు దంచుతుంటారా?.......
డ్రాయింగ్ రూముల్లో గంటల తరబడి రాజకీయాల పై చర్చిస్తుంటారా?......


అయితే మరి ఆ అవకాశం వస్తే ...
ఆ కొత్త నీరు వస్తే ...
నిస్వార్థ రాజకీయాలు తేవాలని చూసే వారు వస్తే .........

వారికి మనం ఎలా సహాయ పడగలం?
ఏం చేయగలం?
నా వంతు నేనూ చేస్తాను కాని ఎం చేయాలి అనుకుంటునారా?.......................

రోజుకో మనిషికి లోక్ సత్తా గురించి చెప్పండి......
వారినీ ఇంకో మనిషికి రోజుకు ఒక సారి చెప్పమనండి......
రోజుకో రూపాయో....పౌండో...డాలరో వారికి విరాళం ఇవ్వండి........

ఇక చూసుకోండి......

ఏప్రిల్ పదహారున ఎన్నికలు.....అంటే ......ఇంకా ఇరవై ఏడు రోజులు.......

మీరే చూడండి.......మీ రోజుకొక మనిషి ఫార్ములాతో ఎంతమందిని జాగృతం చేస్తారో....

  1. 1 15/4/9
  2. 2 14/4/9
  3. 3 13/4/9
  4. 6 12/4/9
  5. 12 11/4/9
  6. 24 10/4/9
  7. 48 09/4/9
  8. 96 08/4/9
  9. 192 07/4/9
  10. 384 06/4/9
  11. 768 05/4/9
  12. 1536 04/4/9
  13. 3072 03/4/9
  14. 6144 02/4/9
  15. 12288 01/4/9
  16. 24576 31/3/9
  17. 49152 30/3/9
  18. 98304 29/3/9
  19. 196608 28/3/9
  20. 393216 27/3/9
  21. 786432 26/3/9
  22. 1572864 25/3/9
  23. 3145728 24/3/9
  24. 6291456 23/3/9
  25. 12583912 22/3/9
  26. 25167824 21/3/9
  27. 5,03,35,648 20/3/9

అవును.....అక్షరాలా....అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది మందిని....


రోజుకొక రూపాయిస్తే ?.............. అయిదు కోట్లా..మూడు లక్షలా....ముప్పయి అయిదు వేలా....ఆరువందలా ....నలభై ఎనిమిది రూపాయలు..... అదే డాలర్లూ...పౌండ్లూ అయితే? మీరే లేక్కలేస్కోండి.......



దీనికి మీరు ఖర్చు పెట్టేది?

రోజుకు అరగంట సమయం....మొత్తం.......పదమూడున్నర గంటలు.......
రోజుకు ఒక రూపాయి ధనం...మొత్తం.......ఇరవయ్ మూడు రూపాయలు......


చేయగలరా?

మీ వంతు చేయగలరా?

చేస్తారా?

మీ వంతు చేస్తారా?


నవభారత నిర్మాణానికి నేను సైతం, నేను సైతం అంటూ గళం కలుపుతారా?


మీ చేతిల్లో ఉంది మీ భవిత.......





1 comment: