Tuesday, 24 March 2009

అవినీతి..యూత్...మొదలయినవి!

ఈ టపాకు ఆంగ్ల అనువాదం ఇక్కడ.

మన భారత దేశంలో ఇంత అవినీతి ఎందుకు చూస్తున్నాము?
మనం భారతీయులం మిగితా వారి కంటే ఎక్కువ అవినీతిపరులమా?
వేరే కొన్ని దేశాలలో ఇంత అవినీతి ఎందుకు చూడము మనం?


ఇవాల్టి మన యూత్ (నువ్వు యూత్ ఎంట్రా అంటారా...మీ ఇష్టం:-) మన దేశపు రాజకీయాన్ని బాగు చేయాలంటే రోజువారీగా ఏమి చెయ్యాలి?

తెలంగాణా విషయం పై నా అభిప్రాయం ఏమయి ఉంటె ఎక్కువ మందికి మేలు జరుగుతుంది?

లోక్ సత్తా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన స్థానాలు ఈ ఎన్నికలలో గేలువలేదనే సత్యమ తెలిసి కూడా నేను ఎందుకు దాని కోసం కృషి చేయాలి?

ఇలాటి ఆలోచనలు ఎపుడయినా మీ మదిలో వచ్చాయా?

తప్పక వచ్చే ఉంటాయి...

మరి ఇలాటి ప్రశ్నలకు లోక్ సత్తా సమాధానమేమిటి అని తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉందా?

అయితే ఇవి చూడండి...
మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం


చూసి.....ఊరుకోకండి.....ఆచరణలో చూపండి.

రోజుకొక్కటి చొప్పున లోక్ సత్తా చెప్పే విషయాల గురించి ఆలోచించండి.....
రోజుకొక మనిషికి లోక్ సత్తా గురించి తెలియ చేయండి......వారినీ అదే పని చేయమనండి.
రోజుకొక రూపాయి చొప్పున లోక్ సత్తాకు విరాళంగా ఇవ్వండి....


ఇలా చేస్తే..........ఇరవయ్ మూడు రోజుల్లో....అంటే మన రాష్ట్రంలో ఎన్నికల ముందు రోజు వరకు....ఎంత మందిని జాగృతం చేయగలరో తెలుసా? ఎంత విరాళం లోక్సత్తాకు చేరుతుందో తెలుసా? మీరే చూడండి.....

1. • 1………………………………………15/4/9
2. • 2
3. • 3
4. • 6
5. • 12
6. • 24
7. • 48
8. • 96
9. • 192
10. • 384
11. • 768
12. • 1536
13. • 3072
14. • 6144
15. • 12288………………………………………..01/4/9
16. • 24576
17. • 49152
18. • 98304
19. • 196608
20. • 393216
21. • 786432
22. • 1572864
23. • 31,45,728……………….24/3/9

అవును...అక్షరాలా.....ముప్పయ్ ఒక్క లక్షలా....నలభై అయిదు వేలా.....ఏడు వందల ఇరవయ్ ఎనిమిది.....

No comments:

Post a Comment