Saturday, 21 March 2009

సమిష్ఠి కృషి బలమెంతో తెలుసా...... 2,51,67,824......అదీ కేవలం ఇరవయ్ ఆరు రోజుల్లో!

"నేను ఇక్కడ ఉండిపోయాను కాని లేకుంటే నా ..............." అనుకుంటున్నారా?
"ఇక్కడ నుంచి ఏమి చేయగలను?".............................నిస్పృహా?
"డబ్బులు పంపించటం మాత్రమె నేను చేయగలిగింది".....................అంటారా?



నిజమేనా?
ప్రవాసాంధ్రులం మనం ఏమీ చేయలేమా ?
డబ్బు కావాలి నిజమే కాని అదొక్కటేనా మనం చేయగలిగింది?


ఆ ఆ ............ టపాలు రాయటానికేం ........మేమూ రాస్తాము........ కాని వాటి వల్ల ఉపయోగం?
లోక్ సత్తా గురించి మేమూ అందరికీ చెపుతాం.................కానీ దాని వల్ల ఉపయోగం? అంటారా



ఒరేయ్ ఆ సినిమా చూడు...చాలా బావుంది, మళ్ళీ విశ్వనాథ్ తన టాలెంట్ చూపాడు అనో.......
అక్కా ..............ఆ హీరోయిన్ ఎంత సన్నగా అయినదనుకున్నావ్ అనో......
మామా........కత్తిలాటి సినిమా మామా......సూపర్ ఫిగర్లె హీరోయిన్ది అనో.....................


అని మన వాళ్లకు మనం చెపుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తామా? ఇలా చెప్పటం వలన సినిమా ఆడుతుందా, ప్రొడ్యూసర్ కి ఇంకా డబ్బులు వస్తాయా, హిరోయిన్కి ఇంకా చాన్సులు వస్తాయా అని ఆలోచిస్తామా? లేదే.......

మనసుకు నచ్చినది పది మందికి చెపుతాం...ఆ పది మందిలో ఒక్కరిని అది కదిలించగలిగినా అది ఓకేనే......

అలాగే ఇది కూడా......చెయ్యి, కమలం, సైకిలూ, కొడవలీ అన్నీ ప్రయత్నించాము కదా.......
త్రివర్ణ కండువా, పసుప్పచ్చ చొక్కా, బీజాక్షరాల పంచా, పాల పిట్ట జెండా, గులాబి తుండూ అన్నీ చూసాముగా.......
అన్నీ దొందూ దొందే అని తెలిపోయిందికడా..................


"కొత్త తరానికి కొత్త రాజకీయం" అంటూ వచ్చిన కొత్త రాజకీయవాదులను ఎందుకు ప్రోత్సహించకూడదు?

మనం మన ఆశుభ్రాన్ని కడగం.. సరే.....కడుగుతామని ముందుకు వచ్చిన వారిని ఎందుకు ప్రోత్సహించ కూడదు?


రండి

ఒకసారి లోక్ సత్తా గురించి ఆలోచిద్దాం





రండి


ఈ రోజు మన వంతు అరగంట లోక్ సత్తాకై కేటాయిద్దాం..........
ఈ రోజు మన వంతు రూపాయో....దాలరో...పౌండో.....లోక్ సత్తాకు విరాళంగా ఇద్దాం...............
ఈ రోజు మన వంతుగా ఒకరికి లోక్ సత్తా గురించి తెలియ చెపుదాం......
http://www.loksatta.org
http://www.loksatta.org/Contribute.php
http://www.loksatta.org/telltofriend.php


మర్చిపోకండి

ఏప్రిల్ పదహారున ఎన్నికలు మన రాష్ట్రంలో.......అంటే ఇంకా ఇరవయ్ ఆరు రోజులు.......

ఆ  నాటికి ఈ రోజుకొక మనిషి, అరగంట సమయమ, ఒక రూపాయి/డాలరు/పౌండు  ఎంతవుతుందో చూస్తారా?


  • 1
  • 2
  • 3
  • 6
  • 12
  • 24
  • 48
  • 96
  • 192
  • 384
  • 768
  • 1536
  • 3072
  • 6144
  • 12288
  • 24576
  • 49152
  • 98304
  • 196608
  • 393216
  • 786432
  • 1572864
  • 3145728
  • 6291456
  • 12583912
  • 2,51,67,824   ఇవాల్టి నుంచి మొదలెడితే ఇదీ మొత్తం సంఖ్య!
  • 5,03,35,648


  • ఆశ్చర్యంగా లేదూ? ఊహు.. లేదు........ సమిష్ఠి కృషికి ఉన్న బలమే అది....అంతే!





    No comments:

    Post a Comment