Sunday, 29 March 2009

ఒక తప్పు జరిగితే విడిపోవటమేనా ?....ఆలోచించండి!

"చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు...దూరేవి.... అన్నట్టుంది వ్యవహారం" అంటూ నా సతీమణి ఎవరి పైనో విసుక్కుంటోంది...."ఎవరిని రా అలా విసుక్కుంటున్నావు" అడిగా తనను. "చూడు వీళ్ళు ...అదే లోక్ సత్తా వాళ్లు....వాళ్ళ పార్టీ రాజ్యాంగంలో ఏమో No discrimination between people because of reason of birth అంటారు.....ఇపుడు ఎన్నికల సమయమ్లో ఏదో బిసి యునైటెడ్ ఫ్రంట్ అట....దానితో పొట్టు పెట్టుకుంటున్నారు...అలాగే ఏదో ముస్లిం ఫ్రంట్ తో కూడా బాగా కలిసి పని చేస్తున్నారట" అని నా భార్య ఫిర్యాదు.

"అవునా ఆ పొత్తుకు వివరణ ఇచ్చారా" నేను ఆదుర్దాగా ప్రశ్నించాను. అసలే ఈ మధ్యే లోక్సత్తా ఎన్నికల ప్రచారంలో ఉడతా భక్తిగా నా వంతు నేను చేస్తున్న కొత్త కార్యకర్తను. ఇంకో రెండో మూడో రోజుల్లో టెలీ కాన్వాసింగ్ కూడా చేయాలనుకుంటున్న సమయంలో ఈ గొడవేంటిరా బాబు...ప్రజలకు ఎం సమాధానం చెప్తాం అంటూ మధన పద సాగాను.

"ఆ ఇచ్చారు.......ఎన్నికల ప్రక్రియలో మందు, డబ్బు, ఇలాటివి వాడము అని చెప్పారట...విధానాలు కలుస్తున్నాయి కాబట్టి పొత్తు పెట్టుకున్నాము అని" లోక్ సత్తా వెబ్ సైట్ చూసి చెప్పింది తను.

"తప్పటడుగులు వేస్తున్నారేమో అని నాకు కూడా అనిపిస్తోందిరా....అవునూ కొంప తీసి మనం హిందువలము, ఎఫ్ సీస్ అయినందువలన మనం ఈ పొత్తును వ్యతిరేకించటం లేదు కదా? " అని తనను ప్రశ్నించాను.

ఆ సంగతి నేనూ ఆలోచించాను..కాని కాదు...అనవసరంగా మనను మనం ఎందుకు అనుమానించుకోవాలి? ఇప్పుడు జేపిది ఏ కులమో తెలుసుకుని మీరు ఇక్కడ నుంచి ప్రచారం చెయ్యట్లేదు కదా...అలాగే ఆ సేర్లింగంపల్లి అభ్యర్థి కులం మీకు తెలుసనా, మన శ్రీ రాం కు తెలుసనా మనం ప్రచారం చేస్తున్నాము...అలా కాదు. ఈ పొత్తు లోక్ సత్తా మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది ఈ నిర్ణయం అందుకే ఆలోచిస్తున్నాము దాని గురించి" అంది స్థిరంగా.

"ఏమో...ఇపుడు నేను టెలీ కాన్వాసింగ్లో ప్రజలడిగితే ఏం చెప్పను నేను?" నాలో నేను అనుకుంటున్నట్టుగా పైకే అనేసాను.

"ఉన్నది చెప్పండి...ఈ పొత్తు తప్పని మీరూ అనుకుంటున్నారని...ఏదో ఒక ప్రత్యేకమైన ప్రజా గుంపు కోసం పనిచేయటం తప్పని, మౌళిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని అనుకుంటున్నారని....అందుకనే పార్టీ లోపల్నుంచే ఈ నిర్ణయం మార్చుకునే కృషి చేస్తున్నారని చెప్పండి...."

"మరయితే మనకు నచ్చని నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకు ఎందుకు ప్రచారం చేస్తున్నారు..మానేయోచ్చు కదా అనడిగితెనో?..... " నా అనుమానం.

"ప్రత్యామ్నాయమేది? ఇంతటి మంచి సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తూ సమాజ మార్పుకై నిజంగా కృషి చేసే ఇంకో పార్టీ ఏదో చూపమనండి. పైగా ఏదో ఒక వ్యవస్థ లేదా జీవన విధానం మార్చాలి ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం సాధారణమే....అది సాకుగా చెప్పటం కాదు..ఒక ఫాక్ట్ అది...జరిగిన తప్పులను సరిదిద్దుకోవటమే కదా మన లోక్ సత్తా చెప్పే అంటే. కాబట్టి ఆ సెల్ఫ్ కరెక్షన్ అనేది లోక్ సత్తాలో కూడా జీర్ణించుకు పోయేందుకు మీ వంతు మీరు చేస్తారని చెప్పండి..." ధీమాగా ఎక్కడా తడబడకుండా చెప్పింది.

"ఏమోరా నాకు ఇంకా ఎందుకో అనుమానంగా ఉంది....అది జరుగుతుందా లేదా అని" పెదవి విరిచేసాను.

"జరగటానికి మీ వంతు కృషి చేయండి..తరవాత జరిగిందా అలేదా అని బాధ పడకుండా.....ఏ పర్యవసానం ఎదురైనా దాని గురించి ఆలోచించి అపుడు నిర్ణయం తీసుకోండి...అంటే కాని కృషి మాత్రం ఆపొద్దు....Courage of Convictionని మాత్రం కోల్పోవద్దు ఈ చిన్న చిన్న సంఘటనలతో....... మీతో మాట్లాడుతూ కూర్చుంటే వంటింట్లో కూర మాడుతున్నట్టుంది వస్తాను" అంటూ తుర్రుమంది. వంటింటి గుమ్మం పైన ఉన్న గీతోపదేశం చిత్రంలో అర్జనుడికి కనువిప్పు కలిగించిన కృష్ణుడిలా అనిపించింది నా పెళ్ళాం నాకు ...ఆ క్షణం.

2 comments: