మీ లోకంతో పనేమీ నాకు
నా దారిన ముళ్ళే కొనకు
చూసే మనసు బట్టి కాని
పురుషునికి చెలినివ్వని లోకమేది?
కోడి కూతెట్టంగానే ఉష సుప్రభాతం
గూటికింకా చేర లేదనే సాంధ్య తాపం
నీరెండన సుతారంగా తాకుతూ
యువర్స్ ఆర్ మైననే అరుణ కైపు
దూరంగా బిక్కుబిక్కుమంటూ
ఇష్టం తెలిపే తారింకో టైపు
పగలు భానురేఖ జోడు
రేయేమో చంద్రిక తోడు
జోడు మద్దెల మేళం భేషనేలా
చుట్టూ.. ప్రత్యణువులోనూ.. మాధురేగా.
గీత , లయ, సంగీత, భావన
ఎంతమందనీ మనకపుడు,
కల ఊహ మానస
ఎన్ని రూపులనీ నిషావిలా.
నిజం చెపుతున్నా
లోకమంతా స్త్రీనే నాకు:-)
stree ni soundarya murthiga chudatanni madamani ela anagalam? madamante vere vuntundi lendi. kavita bagundi
ReplyDelete--vijaya
నాకు కూడా..
ReplyDeleteసౌదర్యాన్ని ఆస్వాదించని వారు మనిషిగా బ్రతకలేరేమో