శారదా ఉపాసన
మేల్కొనె నీ పదంబు మనమునన్జను భావుకతన్తెలుప, నే
పల్కెడు నీ రసంబునను పెన్మునిగిన్కవితల దొంతరు
ల్లెల్లను నీ పదాంబుజములన్చవి జూడ తపించు లేత పూ
వల్లరు లీ నిజాంతరము విడ్వను జూడకు మీవు శారదా
పద విభజన
మేల్కొనెన్ ఈ పదంబు మనమునన్ జానూ భావుకతన్ తెలుప, నే
పల్కెడు, నీ రసంబునను పెను మునిగిన, కవితల దొంతరు/లు
ఎల్లను నీ పదాంబుజములను చవి చూడ తపించు లేత పూ
వల్లరుల్. ఈ నిజాన్తరము విడ్వను జూడకుము ఈవు శారదా.
ఛందస్సు
ఉత్పలమాల
భ ర న భ భ ర వ
UII UIU III UII UII UIU IU
మొత్తం అక్షరాలు =20
యతి స్థానం =10
మొదటి రెండు పాదములలో యతి, చివరి రెండు పాదములలో ప్రాస తప్పింది కదా, గమనించగలరు
ReplyDelete