"wood and lead, made of just those -
and it changed my life course"
said someone and I thought of a loaded gun
but it turned out to be a simple pencil,a lead'un.
Gun & Bullets and a pencil lead-
both of same material
yet so devastatingly different!
Tuesday, 30 June 2009
Sunday, 28 June 2009
ఇంకెపుడర్రా మీ రాకా?
తొలి సందెన భుజాల బరువై
మా క్షణాల పరువులెత్తించి
మలి సందెన మా బరువులు మోసే
చిరుబోయీ సమయమెపుడో?
తొలి సంజెల ఉషస్సు తానై
మా చీకట్ల తరిమేసి
వెన్నెల పావడ తను వేసే
పున్నమి తల్లీ ఘడియెపుడో?
ఎదురుచూపుల మూల్యం
బహు బాగా చెల్లించాం
ఇంకెపుడర్రా మీ రాకా
కళ్ళు కాయలు కాసినాకా ?
మా క్షణాల పరువులెత్తించి
మలి సందెన మా బరువులు మోసే
చిరుబోయీ సమయమెపుడో?
తొలి సంజెల ఉషస్సు తానై
మా చీకట్ల తరిమేసి
వెన్నెల పావడ తను వేసే
పున్నమి తల్లీ ఘడియెపుడో?
ఎదురుచూపుల మూల్యం
బహు బాగా చెల్లించాం
ఇంకెపుడర్రా మీ రాకా
కళ్ళు కాయలు కాసినాకా ?
Friday, 26 June 2009
పంచకళ్యాణి నా మనసు వాణి
భావమొకటీ చరణాకోలై
నింగికెగసీ ఝుమ్మని పాడి
తనను తాకిన రివ్వున సాగే
పంచకళ్యాణి నా మనసు వాణి
వర్ణాలన్నీ స్వరాలనన్నీ
తెగ పులిమేస్తూ తను కలబోస్తూ
కాలమెరుగని చిత్తరువేసే
నింగికెగసీ ఝుమ్మని పాడి
తనను తాకిన రివ్వున సాగే
పంచకళ్యాణి నా మనసు వాణి
వర్ణాలన్నీ స్వరాలనన్నీ
తెగ పులిమేస్తూ తను కలబోస్తూ
కాలమెరుగని చిత్తరువేసే
మది మెప్పించే దరువులకూగే పంచకళ్యాణి నా మనసు వాణి
అసలు స్వేచ్చనూ ప్రతిబింబిస్తూ
పిచ్చి పిచ్చిగా తెగ తిరిగేస్తూ
ఎపుడో ఎకడో తనంతట తానె
డస్సిపోయీ చివ్వున ఆగే
పంచకళ్యాణి నా మనసు వాణి
ఎలా కుదించటం
ఎలా వారించటం
కళ్ళెం లేని స్వారీ నాది
కుదరదు క్లుప్తత నవ్వినగాని!!
అసలు స్వేచ్చనూ ప్రతిబింబిస్తూ
పిచ్చి పిచ్చిగా తెగ తిరిగేస్తూ
ఎపుడో ఎకడో తనంతట తానె
డస్సిపోయీ చివ్వున ఆగే
పంచకళ్యాణి నా మనసు వాణి
ఎలా కుదించటం
ఎలా వారించటం
కళ్ళెం లేని స్వారీ నాది
కుదరదు క్లుప్తత నవ్వినగాని!!
Wednesday, 24 June 2009
ఎటెటో మళ్ళింది మనసు...A looooong winded philosophical discourse on the current blog wars
"చివరి మంచం మీద ఎవరదీ, కొత్తగా వచ్చినట్టుంది?" నాన్న నా బెడ్ దగ్గరకు వచ్చి భోజనం పెడుతూ అమ్మనడిగారు. "ఎవరో డాక్టర్ అట...ఆత్మహత్య చేసుకోటానికి ప్రయత్నిస్తే తీసుకొచ్చారు...ఇపుడు బావున్నాడు లెండి." అమ్మ జవాబు. "అదేమిటి డాక్టర్ అంటున్నావు, ఇలా ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో ఉంటున్నాడు మరి" నాన్న కుతూహలం. మేమున్నది ఎం ఎం టూ వార్డు, ఉస్మానియా ఆసుపత్రిలో. దాదాపు నా సహ రోగులంతా కింది తరగతి వాళ్ళే. అందుకే డాక్టర్ అనగానే నాన్నకు ఆశ్చర్యం వేసినట్టుంది.
"ఉన్న ఆస్తంతా పల్లెటూర్లో రోగులకు ఉచిత వైద్యం చేస్తూ, మందులూ ఉచితంగా ఇస్తూ తగలేసాడట. మొన్ననే చివరిగా ఉన్న స్కూటర్ కూడా అమ్మి మండులిప్పిచ్చాదట ఎవరికో. అప్పటినుంచి ఇంకా తానేమీ చేయలేకపోతున్నా ప్రజలకూ అంటూ ఆరాటమట. అది భరించలేక ఇవాళ పొద్దునే ఇన్సులిన్ ఎక్కించుకున్నాడట మహానుభావుడు. పెళ్ళాం పుస్త గట్టిగా ఉండబట్టి ఆమె చూసి తీస్కొచ్చింది...లేకుంటే వాళ్ళను గతి లేని వాళ్ళను చేసి వదిలి పోయేవాడు." అమ్మ చీదరింపు. "పిచ్చోడు...ఉన్న విద్యను సాకారం చేసుకోలేని వాడు" నాన్న తిరస్కారం.
ఎన్నో ఏళ్ళనాటి నాన్న రాసిన కథ "ఎం ఎం టూ " గుర్తుకొచ్చింది, "హ్యుమానిటీ అండ్ హ్యూమనిజం" గురించి ఆలోచిస్తే. నిజమైన మానవతావాది అతను, అదే నిజమైన మానవతావాదం. మిగితాదంతా బూటకం అనిపించింది. వెంటనే ఇంకో ప్రశ్న...జవాబులేనిది..."అతనేక్కువ సేవ చేసాడా ప్రజలకు లేక డబ్బు ఇవ్వలేని వాళ్ళను పీడించక , ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుంటా, తన పబ్బం గడుపుతూ, ఇతులకు నిరంతర సేవ చేయగలిగిన ఇంకో డాక్టర్ ఎక్కువ సేవ చేసాడా...అసలైన మానవాతావాడి ఎవరు?" అన్నది.
బ్లాగ్లోకంలో మానవ నైజ ఋతు పవనాలు రేపుతున్న దుమార నేపథ్యంలో "అసలు ఎందుకీ అసమానతలు? అందరూ ఒక్కటిగా మనలేరా? అసలు కుల, మత, భాషా, దేశ, ప్రాంత, జాతి, అంతరాలు అసలు లేకుండా ఉండే పరిస్థితి వస్తుందా? అసలు మన అస్థిత్వం అంటే ఏమిటి" అన్న ఆలోచనలకూ, నా భార్యతో, నా మనసుతో జరిగిన సంవాదాలకూ సంభాషణా రూపమీ టపా....చవి చూడండి.
నేను (నే): ఏమేవ్ బ్లాగులో ఎప్పుడూ సీరియస్ విషయాలే అంటావు కదా చూడు మూడు నాలుగు రోజులుగా ఎంత చక్కని సరదా టపాలో అన్నాను కుల వివక్ష పై రేగుతున్న దుమారాన్ని తెల్పుతూ
ఆవిడ (ఆ): పాపం వాళ్ళంతా బాధ పడుతూ కొట్లాడుకున్తూంటే మీకు నవ్వులాటగా ఉందా?
నే: మరేం చేయమంటావు? ఇద్దరూ ఇద్దరినీ అనుకుంటున్నారు...ఇద్దరూ తమది తప్పని ఒప్పుకోరు. మధ్యలో "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అని తామూ "ఉన్నత విశ్వవిద్యాలయాల్లో" కూడా వాడుతాము అది తప్పు కాదు అంటూ ఒకరూ, "దళితవాదివి పో, రిజర్వేషన్ లో చదవటం గొప్ప కాదు పో " అంటూ ఇంకొందరూ తమ తమ వ్యక్తిత్వ విషయాల నుండి దారి మళ్ళి, సమూహాలను ఆడిపోసుకుంటున్నారు. వీళ్ళ మధ్య నలిగి పోతున్న మేము ఇలా మా బాధను సబ్లైము చేసుకుంటున్నాము
ఆ: గాడిద గుడ్డేం కాదు? అవునూ "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అంటే మీకెందుకంత అలక. అసలు నన్నడిగితే మీకు నిజంగా ఉందది, లేకుంటే మీ ఆర్కుట్ లో ఆ కుల సమూహ సభ్యత్వాలెందుకు?
నే: నువ్వూ అన్నావు...నేను బ్రాహ్మణ సంఘం లో ఉన్నాను కాని ఇతర కులాలు నచ్చావు సంఘాల్ల్లో లేదు కదా తప్పేంటి? నేను బ్రాహ్మనుడినే కదా?
ఆ: తప్పే. నిన్ను నువ్వు బ్రాహ్మణుడు అనుకో కాని అది ప్రత్యేకంగా ఎత్తి చూపాల్సిన అవసరం ఏమిటి?
నే: అంటే నా అస్తిత్వాన్ని చూపే ఏ చిహ్నం ధరించ కూడదంటావు?
ఆ: అవును అంతే
నే: అయితే గడపకు పసుపూ, నీ మెడలో మాంగల్యం, నీ నుదుటిన బొట్టూ, లక్ష్మీ నిలయం బోర్డూ ఇవన్నీ
ఆ: అవును..నిజంగా వివక్షలేకపోతే ఈ చిహ్నాలనవసరం
నే: అయితే ఇంటి పేర్లు ఏదయినా కూడా ఒకటేనా
ఆ: అవును
నే: అయితే రేపే నీ పాస్పోర్టులో మీ ఇంటి పేరు మార్చి నాది పెట్టేద్దాం.
ఆ: (మవునం)
నే: మన బేసిక్ అవసరాలు తీర్చుకుని మిగితా జీతమంతా మన ఊరిలో తిండి లేని వారికి పంచుదాం ప్రతి నెల
ఆ: (మవునం)
నే: సరే సరే....ఆచరణకు వద్దులే చర్చలకు మాత్రమె పరిమితం చేద్దాం.
ప్రతి విషయంలో ఆచరణలో ప్రతి ఒక్కరికీ వారి వారి పరిమితులుంటాయని నాకు తేల్సులే.
ఆ: ఇక నా దగ్గర ఇలాటి చర్చలు తేకండి (నిష్క్రమణం)
మనసు (మ): ఎందుకంత సంతోషం...తను చేసిన పనే, ఆ పలాయన మంత్రమే, ఒకప్పుడు నీ స్నేహితుడు నీతి ప్రకారం నడిచే విధానాల గురించి ఇరువై నల్లుగ్గంతలు చెబుతూ ఉంటె వద్దని వారించిన నువ్వూ, అదే చేసావని తెలీదా
నే: అవును నిజమే (లెంపలేసుకుంటూ)
మ: సరే నేనడుగుతున్నాను చెప్పు ఎందుకు నువ్వు ఇంతవరకు ఆ కుల సమూహాల నుంచి బయట పడలేదు?
నే: నువ్వూ అదే ప్రశ్నా? నీకు తెలీదు నేను అసలు కుల వివక్ష చూపానని నాకు నచ్చిన విషయాలు అక్కడ నేర్చుకుంటున్నాను అంతే అని?
మ: అదే విధంగా నువ్వు చదివినట్టు just the process of identification with any group provokes diffferential behaviour immediataly ...as proved very well by psychologists .....అన్నది ఎందుకు మర్చిపోతున్నావు?
నే: మర్చిపోవట్లేదు కాని నేనెందుకు...లేదా బ్రాహ్మణులు మాత్రమె ఎందుకు... తమ "సమూహ అస్థిత్వాన్ని" వదలాలి? మిగితా వారు తమ ఆత్మాభిమాన ప్రవర్ధమాన కారణంగా తమ కులాలను కొత్తగా ఇంటి పేర్లుగా పెట్టుకున్తున్నప్పుడు నేనే/మేము ఒక్కళ్ళమే ఎందుకు చేయాలి? మిగితా వారందరూ రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన తీసుకుంటా తమ కుల అస్థిత్వాలను పదిల పరుచుకుంటూ పెంపు చేసుకుంటూ ఉన్నప్పుడు నేనెందుకు త్యాగం చేయాలి?
మ: మరైతే ఇలాగే తరతరాలుగా అంతరాల తారతమ్యంతో ఇలానే మగ్గుతూ ఉంటారా?
నే: అంతరాలు సమసి పోతాయని నీకు నిజంగా ఆశ ఉందా?
మ: ఎందుకు సమసి పోవు అందరూ కృషి చేస్తే?
నే: "అందరూ" కృషి చేస్తారా?
మ: చేయరని అనుమానమా?
నే: అనుమానం కాదు "నమ్మకం "...."చేయరని".
మనిషెంత సాంఘిక జంతువైనా జంతువే.
survive,sire and satiate ఈ మూడే పరమావదులు మనిషికి there maybe exceptions but they are what they are, exceptions.
ఎన్ని సాంఘిక న్యాయాల సంకెళ్ళు తగిలించినా....the games to maximise self survival, siring and satiating will go on.....even after being taught that working together will ensure greater good for the most, majority will work for themselves to ensure thier chance of maximising the 3Ss.
మనుషులను క్లోన్ చేసి సమాన శారీరిక, మానసిక, సామ్స్కారిక, ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థాయిల్లో అందరినీ సమానంగా నిలబెట్ట గలిగితే తప్ప.....
ఈ అంతరాలు అనేవి తప్పవు....ఒకప్పుడు రంగు, పుట్టుక తారతమ్యాలు, ఇప్పుఉడు కుల, ఆర్ధిక తారతమ్యాలు, రేపు ఎవరు చూడొచ్చారు?.....it may be the % of genetic purity in you or may be your IQ ponts to nth decimal.....whatever basis it may be,humans will allways find ways to divide themselves...they may all be united for short periods or soem may be united for long...but it si not possible for them all to be united for eternity. That concept of humanism is utopian.
మ: చాలా దారుణంగా ఉంది నీ ఆలోచన ...అంతే మనుషులకిక ఇదే గతా?
And this so callled REALISM or FATALISM, is it not an easy way out?
Talking of things in broad perspective absolves you of the responsibility of the effort to make it right...does it not smack of ESCAPISM?
నే: ఎవరు చెప్పారు దీర్ఘకాలిక దృష్టి వల్ల అందరికీ పలాయన వాదం బలపడుతుందని?
ఈ దీర్ఘదృష్టి వలన అబ్బేది పలాయనవాదమో లేక తామరాకు తనమో (EQUANIMITY) అనేది వారి వారి మీద ఉంటుంది.
మ: అయితే అంతరాలు సమసిపోవని మనం మన కృషి ఆపెస్తామా?
నే: ఎవరన్నారా మాట? కృషి జరగాల్సిందే జరిగి తీరుతుంది కూడా.
మ: మరి సమస్యేమిటి ఇక్కడ?
నే: ఇక్కడ సమస్యంతా మనలా పనిలేక ఇలా ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ వల్లే
మ: don't joke, i am serious
నే: I am deadly serius ఇక్కడ తప్పేంటంటే ఇలా వచ్చిన చిన్న చిన్న ఒడిదుడుకులను ఓ...అనుకుంటూ పెద్దవిగా చేసుకుని నానా హంగామా చేసుకునే మనదే తప్పు. ఒకరు "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అని అంటే నీకు కాలటమే ఇక్కడ తప్పు ఇక్కడ ఇన్ని గంటలు వ్యర్థం చేసాను అనుకోవటమే నీ తప్పు .
నీకు నీ మీద నమ్మకం ఉన్నప్పుడు...నీవేలాంటి వాడివో నీకు తెలిసినపుడు... You do not care emotionally
if you know your true self...and if it is right...you do not get emotional if your self identity does not match with your social identity.....you do not get upset...you recognise the fact that your social and self idnetities do not match and hence try and rectify it...
You act to rectify the defect but you do not get emotional.
సమాప్తం
Interesting thoughts
Mintzberg Games
http://changingminds.org/explanations/behaviors/games/mintzberg_game.htm
Collective vs Individual games - The Zero sum game
http://en.wikipedia.org/wiki/Zero-sum
Robber's cave experiments...Group Identity and Discrimination
http://www.age-of-the-sage.org/psychology/social/sherif_robbers_cave_experiment.html

Tuesday, 23 June 2009
ట్రావెలాగ్-2 స్లం డాగంటే సిగ్గెందుకు?

ఒంటరి పట్టాలు, పట్టాలు మధ్య
చిన్న పొట్లాం, పోట్లాంలో విస్తరాకు
విస్తరాకులో వదిలేసిన ఇడ్లీ ముక్క
విస్తరాకు చుట్టూ విసర్జితాలు......
చుట్టూ ఉన్న మనుషుల పట్టింపు లేదు
వెనుక బండి వస్తుందన్న భయమే లేదు
అర్జునుడిలా దృష్టంతా ఆ ఇడ్లీ ముక్క మీదే
దాన్ని పొట్టలోకి తోయడమే ధ్యేయం
ధ్యేయం సాధించిన కలియుగ విజయుడు
గుర్తించాడప్పుడు తా మనిషన్న నిజం
పక్కనున్న కుక్కతో పోటీ పడ్డ విషయం
పక్క చూపులు చూస్తూ కనుమరుగయాడు
డోకొచ్చినంత పనయింది చూస్తున్న మాకు
"డబ్బిచ్చినా తీసుకోరు" ఎవరివో మాటలు
ఎక్కడ చూపులు కలుపుతాడో అని
కింది చూపులు మావి కూడా....
"మానవత్వం" దిగంబరత్వాన్ని చూడలేక
శిఖండులెవరూ ఈ సమాజంలో?
చూస్తున్న వారా? మాటలన్న వారా?
డబ్బుండీ ఇవ్వని వారా?
లేక ఆ పార్థుడేనా ?.......
ఉన్నట్టుండీ హోరు....
"జయహో జయహో ..." అంటూ!
కన్నెత్తి చూస్తె గత ఎన్నికల పోస్టరు
"ఇండియా షైనింగ్" అంటూ!!
చిన్న పొట్లాం, పోట్లాంలో విస్తరాకు
విస్తరాకులో వదిలేసిన ఇడ్లీ ముక్క
విస్తరాకు చుట్టూ విసర్జితాలు......
చుట్టూ ఉన్న మనుషుల పట్టింపు లేదు
వెనుక బండి వస్తుందన్న భయమే లేదు
అర్జునుడిలా దృష్టంతా ఆ ఇడ్లీ ముక్క మీదే
దాన్ని పొట్టలోకి తోయడమే ధ్యేయం
ధ్యేయం సాధించిన కలియుగ విజయుడు
గుర్తించాడప్పుడు తా మనిషన్న నిజం
పక్కనున్న కుక్కతో పోటీ పడ్డ విషయం
పక్క చూపులు చూస్తూ కనుమరుగయాడు
డోకొచ్చినంత పనయింది చూస్తున్న మాకు
"డబ్బిచ్చినా తీసుకోరు" ఎవరివో మాటలు
ఎక్కడ చూపులు కలుపుతాడో అని
కింది చూపులు మావి కూడా....
"మానవత్వం" దిగంబరత్వాన్ని చూడలేక
శిఖండులెవరూ ఈ సమాజంలో?
చూస్తున్న వారా? మాటలన్న వారా?
డబ్బుండీ ఇవ్వని వారా?
లేక ఆ పార్థుడేనా ?.......
ఉన్నట్టుండీ హోరు....
"జయహో జయహో ..." అంటూ!
కన్నెత్తి చూస్తె గత ఎన్నికల పోస్టరు
"ఇండియా షైనింగ్" అంటూ!!
All rights of the image to those mentioned in http://vickyroyphotography.com/work/selected-works/. Used non commercially without permission.
Monday, 22 June 2009
ట్రావెలాగ్-1 నిన్నొదలను కణ్ణా!

ఎండ మాడుస్తోంది
కాళ్ళు చుఱ్ఱుమంటున్నాయి
గొంతు పిడుచకట్టుకుపోయింది
పొట్టక్కరుచుకున్న పిల్ల బరువయ్ పోతోంది
చుట్టూ అర్థం కాని కట్టడాలు
కన్ను పొడుచుకున్న ఎక్కడా నీటి ఛుక్క లెదు
ఎంతొ ఎత్తున ఎదో అర్థం కాని పరికరం
నొటినుండి టపుక్కు టపుక్కుమని నీటి చుక్కలుమ్ముతూ
గంటకో రెందు గంటలకో....
ఈ ఎండలొ...ఎలాగయినా....
కాళ్ళు మాడ్చుకుంటూ అయినా సరే
నిల్చుందామంటే........
నిముష నిముషానికో భీకరమయిన సకిలింపుతో
రాకాసి గుఱ్ఱాలు రావటం
దాని కడుపులో నుంచి ఆ వింత జంతువులు
మందలు మందలు దిగటం
అదేం మాయో ఏమో!
మేమెంత ప్రయత్నించినా రాని నీరు
అవి ముందరి కాళ్ళతొ ఇలా అనగానే వస్తాయి
మాయదారి దేవుడికి కూడా మేమంటే కసే!
ధైర్యమున్న నా తోటి వారు
తోకాడిస్తూ మా నాట్యం చేస్తే
కొన్ని జంతువులు కొంత నీరు పోస్తాయి
ఆ వింత జంతువుల్లొ కొన్ని మంచివే!
కాని నేనెట్లా వాటి దగ్గరకు పొయేది?
మొన్నే కదా నా చెల్లి కొడుకుని
నీటి ఆశ చూపి లాక్కెళ్ళాయవి
నా చిట్టి కన్న లెనిదే నేనెట్టా బతికేది?
అందుకే దూరంగా ఉన్నా
నిలబడి చూస్తున్నా
తోక నిటారుగ నిల్పి
పరుగుకు సిధ్ధంగా ఉన్నా
దాహంతో చస్తా కాని
నిన్నొదలను కణ్ణా
అనుకుంతూ బిడ్డను
గట్టిగా గుండెలకొత్తుకున్నా!
Pic copyrights belong to http://english.ohmynews.com/articleview/article_view.asp?menu=c10400&no=366191&rel_no=3
Sunday, 21 June 2009
నేనంటే నేనే! (My Take on Identity)
"బ్రాహ్మణుడిని నేను" నేను అని అనుకోటం తప్పా?
"బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" ని ఆడిపోసుకుంటే నాకెందుకు బాధ?
అసలు........
"నేను" అంటే ఏమిటి?
నా అస్థిత్వం ఏమిటి?
నేనంటే నా శరీరం
నేనంటే నా మనసు
నేనంటే నా సంస్కారం
నేనంటే నా ప్రవర్తన
నేనంటే నా ఆశయాలు
నేనంటే నా గతం
నేనంటే నా మతం
నేనంటే నా కులం
నేనంటే నా కుటుంబం
నేనంటే నా రాష్ట్రం
నేనంటే నా దేశం
నేనంటే ఇలాతలం
నేనంటే సౌరకుటుంబం
నేనంటే మానవతం
నేనంటే పురుషజం
నేనంటే కవిత్వం
నేనంటే భావుకత్వం
నేనంటే సున్నితం
నేనంటే భాద్యత
నేనంటే వ్రుత్తి
నేనంటే ప్రవృత్తి
నేనంటే సామాజికత
నేనొక కొడుకు
నేనొక అన్న
నేనొక భర్త
నేనొక భవితవ్యం
నేనొక ప్రస్తుతం
నేనొక జ్ఞాపకం
నేనొక గతం
నేనొక చరిత్రం
నేనొక పిపీలకం
అయినా ......
నేనొక పచ్చి నిజం!!!
అయితే....
నేనొకొక్కప్పుడు ఒకోటి
నేనొకోసారి అన్నీ
నేనింకోసారి కొన్నే
నేనేసారి ఒకోతో
నేనెందుకు అన్నీనో
నేనేపాటి కొన్నో
నేనే నిర్ణయం చేసేది
అంటే....
నేనంటే నిర్ణయం నాదే
నేనంటే నేనే
మరి........
నేనేంటో నాకు తెలిసినపుడు
నేనేంటో నేనే నిర్ణయించేప్పుడు
నేనంటే వేరెవరో చెప్పేదెందుకు?
నేనంటే వారెవరు తెలిపేందుకు?
అహం బ్రహ్మస్మి కాదయా
అహం అహంస్మి
నేనంటే నేనే!

Blogs with Telugu Song Lyrics
గీతకుసుమార్చన చేసే వీరందరికీ అభినందనలు.
New Telugu Song Lyrics
http://updatedhitsongs.blogspot.com/
మై న్యూ తెలుగు సాంగ్స్
General
సరిగమలు గలగలలు
తెలుగు పాటలు
స్వరాభిషేకం
గీతలహరి
గీతాంజలి
గీతాలు
భావలహరి
నచ్చిన తెలుగు టలు
సిరిమల్లెలు
మోహన రాగాలు
ఆణిముత్యాలు
భక్తి కుసుమం
మధుర గీతాలు
యుగళ గీతాలు
devotional
ముత్యాల పల్లకి
classical
స్వరగీతిక
telugu good lyrics
చిమట మ్యూజిక్
మన ఘంటసాల
చిత్ర గీత సాహిత్యము
అన్నమాచర్య సంకీర్తనలు
చివరివి అందించిన గద్దె స్వరూప్ గారి బ్లాగు టపా ఇక్కడ
last updated on 16/7/11

Saturday, 20 June 2009
క్షణికావేశాలయితేనేం?
మిణుక్కుమనే మిణుగురులై
తళుక్కుమనే తారకలై
చమక్కుమనే తటిల్లతలై
క్షణం మెరిసి మాయమౌతాయి
తిరిగి చూద్దామంటే
ఛాయా రూపామే తప్ప
కంటికి కనపడని హొయలవి
తళుక్కు మిణుక్కు చమక్కులవి
పొనీ....మరిచిపొదామంటే
మిణుక్కుల మధ్యనంతా చీకటి
తళుక్కులొనే జీవితం
చమక్కులొనే సార్ధకం
అవగతమవుతుంది నాకు
ఈ చిరు వెలుగుల చీకటిలొనె
జీవితమంతా చదువుతున్నాను
ఈ మసక వెలుతురులన్నీ
ఙ్ఞానోదయం చేస్తున్నాయి
అందుకే గురుదక్షిణగా
వాటినమరం చేస్తున్నా
పదిలపరుస్తున్న ఆ భావమాలికే
నా ఈ సాహితీ యానమంతా
కవిత కవితనొక్కటిగా చూస్తే
క్షణ భావావేశమే గోచరం
భావ విస్తృతి లోపస్ఫష్ఠం
అంతర్లీనమైన సూత్రంతో చూసావో
అసంఖ్యాక భావోత్పల సమాహారం
ఆద్యంత రహితానంత భావసారం.
తళుక్కుమనే తారకలై
చమక్కుమనే తటిల్లతలై
క్షణం మెరిసి మాయమౌతాయి
తిరిగి చూద్దామంటే
ఛాయా రూపామే తప్ప
కంటికి కనపడని హొయలవి
తళుక్కు మిణుక్కు చమక్కులవి
పొనీ....మరిచిపొదామంటే
మిణుక్కుల మధ్యనంతా చీకటి
తళుక్కులొనే జీవితం
చమక్కులొనే సార్ధకం
అవగతమవుతుంది నాకు
ఈ చిరు వెలుగుల చీకటిలొనె
జీవితమంతా చదువుతున్నాను
ఈ మసక వెలుతురులన్నీ
ఙ్ఞానోదయం చేస్తున్నాయి
అందుకే గురుదక్షిణగా
వాటినమరం చేస్తున్నా
పదిలపరుస్తున్న ఆ భావమాలికే
నా ఈ సాహితీ యానమంతా
కవిత కవితనొక్కటిగా చూస్తే
క్షణ భావావేశమే గోచరం
భావ విస్తృతి లోపస్ఫష్ఠం
అంతర్లీనమైన సూత్రంతో చూసావో
అసంఖ్యాక భావోత్పల సమాహారం
ఆద్యంత రహితానంత భావసారం.
Wednesday, 17 June 2009
స్వేచ్చా గానము-2
నవ్వి పొదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెరుపు?
కల విహంగముల పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధుర గానమున
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
మొయిలు దోనేలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరుపుని మెరిసి
పాడుచు చిన్కునై పడిపోదు నిలకు
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు తేలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
శీకరంబుల తోడ చిరుమీల తోడ
నవమౌక్తికమ్ములతో నాట్యము లాడి
జలధి గర్భంములోపల మునిగిపోదు
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
పరువెత్తి పరువెత్తి పవనుడి తోడ
తరుశాఖ దూరి పత్రముల జేరి
ప్రణయ రహస్యాలను పల్కుచు నుందు;
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
అలరు పదంటి చక్కిలిగింత నెట్టి
విరిచేడె పులకింప సరసను బాడి
మరియొక్క నన తోడ మంతనం బాడి
వేరొక్క సుమ కాంత వ్రీడ బో గొట్టి
క్రోందేనె సోనల గ్రోలి సోలుటకు
పూవు పూవునకు పోవుచుందు
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
పక్షి నయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను
మదుపు మయ్యేడ చందమామ నయ్యెదను
మేఘ మయ్యేడ వింత మెరుపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాత నయ్యెద కొండవాగు నయ్యెదను
పాత నయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఏలోకో ఎప్పుడో యెటులనో గాని
మాయ మయ్యేడ నేను మారి పొయ్యెదను
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెరుపు?
కవిత్వం సుద్ధ దండగ, అందులోనూ భావ కవిత్వం నిష్ప్రయోజనం అంటూ రాస్తూ ఈ కృష్ణ శాస్త్రి గీతాన్ని మదికి తెచ్చిన పర్ణశాల మహేష్ గారికి థాంక్స్. అందరు చదివి ఆనందిస్తారని ఇలా...........

బ్రౌణ్యం - చౌర్యం !
నా భావానికీ
నాకున్న భాషకూ
సామ్యం కుదరక
బ్రౌణ్యం వెదుక
జెల్లకాయ కొట్టింది.....అహం!
నాకు రానిది ఇతరుల నేర్వ
నేరమేమున్నదే?
అ ఆ ల పాపడు
పెద్దల నేర్చిన
పదములూ చౌర్యమే?
నాకున్న భాషకూ
సామ్యం కుదరక
బ్రౌణ్యం వెదుక
జెల్లకాయ కొట్టింది.....అహం!
నాకు రానిది ఇతరుల నేర్వ
నేరమేమున్నదే?
అ ఆ ల పాపడు
పెద్దల నేర్చిన
పదములూ చౌర్యమే?
Sunday, 14 June 2009
Faith's a gift am yet to receive
Been searching for you, long
or signs to say you exist, atleast
for most of what I do or beleive
seems linked to you, somehow, somwhere
Goodness, humanity , parents, generous
Idols, values, teachers, kindness
so many forms, so many releifs
to me you seem to thrive on beleifs
If then, belief or faith, is you
what makes someone the vessel
to be gifted this something special?
born with or earned, I wonder about it often.
Some, being born with the puprose
seems unfair to the other -
what's his fault, the faithless one
cursed to be rudderless, even before birth
Some say beleive first
and then shall you see him
Is blind faith the very basis
of truth, your existence? - I hope not.
Or ....
You just a figment of imagination?
some pathetic excuse for ourselves?
a vaguely understood fear of unknown?
a superb conjurence, masking the ultimate truth?
a figment of imagination
a doll made of straw
made up by a listless one
exploted by the clever'un
is that whay you may be?
Are you the sorry excuse
for all our follies and misdeeds?
a soothing balm to the unlucky many
eyesores of the winners few, in the lottery of birth.
the great fear of unknown
of what lies beyond our grasp
we tend not to adjust with our ignorance
but give it ur name and rever it to the last?
Finally, unable to bear the truth
that life is but a crawl to death
and we the weaklings, need you to mask it
lest we give up and meet it pre-time?
Oh GOD, what a vex you are!
sometimes wish I were a pedant
confident in whatever my beleif
and never seeing the other side
But I am what I am -a seeker,
with warts and all, but still a seeker
Come to terms with you, in my life,
I will for sure, before it is all up.
(Many thanks to "Robert Langdon" for the Title line and the train of thought it raised and Parnasala Mahesh for bringing the scene to notice)

Saturday, 13 June 2009
ఓ పెద్ద వ్యసనం!
పర్యాయ పదాలు
పద చిత్రాలూ
అలంకారాలు
చిత్ర పదాలూ
అన్నీ ..నాకొచ్చినవన్నీ
చూపాలనే తాపత్రయంలో
భావవిస్తృతి లేక చేంతాడయినా
పద్యాల కనటం ఆపలేకపోతున్నా
కుచేల సంతానం కన్న కటికుడిలా!
కవితా....నిన్ననుభవించటమే కాదు
ప్రసవించటం కూడా ఓ పెద్ద వ్యసనమే!
పద చిత్రాలూ
అలంకారాలు
చిత్ర పదాలూ
అన్నీ ..నాకొచ్చినవన్నీ
చూపాలనే తాపత్రయంలో
భావవిస్తృతి లేక చేంతాడయినా
పద్యాల కనటం ఆపలేకపోతున్నా
కుచేల సంతానం కన్న కటికుడిలా!
కవితా....నిన్ననుభవించటమే కాదు
ప్రసవించటం కూడా ఓ పెద్ద వ్యసనమే!
Tuesday, 9 June 2009
My confused "ism"
రాజా వారి రాచవీధిలో
ఉమ్మున దుమ్మున తిండిని వెదికే
బిచ్చగత్తెనూ పోటీ కుక్కను
చూసనిపిస్తుంది అభివృద్దేదని
సాఫ్టువేర్లూ ఎన్నారైలూ
ఆశపోతులై భూమిని కుమ్మా
ధరలు మెరుపులై నింగిన మెరయ
చతికిలబడ్డా చూపులడగవె
నవభారత మెరుపులివాయని
తళుకు బెళుకుల తాజ్ మహళ్ళూ
లెక్కకు మించిన ధరవీ దార్లూ
"లక్షకే" వచ్చే కార్లొక వైపు
కూటికోసమై సంతతి అమ్మకాలూ
"కిలో బియ్యం రెండ్రూపయలకా
సస్టైనబిలిటీ లేదనే" వాళ్ళూ
వరుసగా పది రోజులుపవాసం చాలు
లోక సత్తాకెందుకు పట్టం రాదో తెలిసేందుకు
రేపటి మా బిడ్డల తరమెవ్వడు చూసాడోయ్
బిడ్డల భవితవ్యం తినే గద్దలమేలేవోయ్
అవును...నేటి ఆకలి, నేటి గూడు, నేటి రోగం
ఇవే మా ఇజం, మతం...వాటికే మా "మత్ దానం"
కలకత్తాలో కమ్మ్యూనిస్టులు
ఇంతకాలం రాజ్యమేలెం చేసారని అరిచేవాడా
ఆ రాష్ట్రం "ఏం ఏం ఆర" లూ, "ఐ ఏం ఆర" లూ
మన రాష్ట్రంలో అవే గణాంకాలూ
కనపడలేదా తేడాలూ
అభివృద్ధి అంటే
సాఫ్ట్ వేర్లూ చాంద్రాయనాలూ కావు!
"సర్వ"జన సుఖజీవన పయనాలే
అభివృద్ది అసలైన సూచకాలు.
As a result of a discussion with few of my friends regarding the role of communists in general and in WB in particualr, vis -a- vis DEVELOPMENT, the following stats were an eye opener for me. Though I do acknowldge the following
ఇజాల రణంలో, విప్లవ వ్రణంలో
ఊపిరాడక మునకలు వేసే
అభాగ్యునే నేనయితే
ఈ గణాంకాలు, ఈ అభివృద్దులూ
నా ఊపిరికి ప్రాణం పోసేవి కావు.
But still.....................................the stats do make a compelling reading
Wb AP
Population 7.8% Indians 7.41%
Rural 57,748,946 55,401,067
Urban 22,427,251 20,808,940
Area km squared 88,752 275,045
Density/kmsq 903 277
sdp(70-71)(1) ~65 ~55 State Domestic product (SDP)
Sdp(00-01)(2) ~65 ~68
Sdp growth rates 3decades(3)3.1, 4.1, 6.8 3.5, 6.5, 5.5
Misuse of Bpl cards (4) 30.5% 63%
Availability of BPL to poor 52.7% (5-page9) ?????
Malnutrition rates (6) china<7%>42%
Global hunger index(7) china 7.07 India 23.70
Indian State hunger index (8) 22.2(alarming) 19.5 serius
Slum population(14) 4.1 million 5.2 million
Literacy rate(12) 57.7 44.1
M:Female literacy(12) 67.8:46.6 55.1:32.7
MMR(9) china 56 india 407-540 (Maternal Mortality rates)
MMR 194 (10) 195(11)
IMR-2005(13) 38 57 (Infant Mortality rates)
unEmployement (15) >national avg ~ national avg
1. http://www.macroscan.com/fet/aug03/chart/SDP/Chart2.gif
2. http://www.macroscan.com/fet/aug03/chart/SDP/Chart5.gif
3. http://www.macroscan.com/fet/aug03/fet100803SDP_1.htm
4. http://www.expressindia.com/latest-news/BPL-cards-reach-nonpoor-families-skip-some-of-the-really-poor/345326/
5. http://www.scribd.com/doc/12834375/Transforming-West-Bengal-An-Indicus-Whitepaper
6. http://www.nytimes.com/2009/03/13/world/asia/13malnutrition.html
7. http://www.ifpri.org/PUBS/cp/ghi08.asp
8. http://www.ifpri.org/pubs/cp/ishi08.asp
9. http://www.indiatogether.org/2005/nov/hlt-steepmmr.htm
10. http://mohfw.nic.in/NRHM/State%20Files/wb.htm
fig in health indicators
11. http://mohfw.nic.in/NRHM/State%20Files/ap.htm
fig in health indicators
12. http://www.education.nic.in/cd50years/g/Z/7G/0Z7G0501.htm
13. http://pib.nic.in/release/release.asp?relid=30306
14http://censusindia.gov.in/Data_Products/Data_Highlights/Data_Highlights_link/metadata_highlights.pdf
15. http://www.isid.ac.in/~bharat/Doc/Unemployment2_w.pdf

Friday, 5 June 2009
An ode to an Accident.
It all boils down to you
all my merits, all my warts
what I am today; and also,
what I would have been.
Enjoying the mild english breeze
or dying in the Indian summer heat
alone and weak, but on a palatial bed
or dying of age and hunger on a road
oh what fun it would have been
to be the party patriarch's son
and not one of the thousands
to toil away under the sun
you make or break
with that shake of your finger
do you realise the power you wield
in what you do, my dear?
we start off from the dot numbered one
and connect the rest,all on our own-we feel
how many of us are wise enough,
that the dots were numbered for us.
Using a palet of colours
we paint our own landscape
Alas! do we ever realise, your choice-
on our palet, sets the scene?
We build our own homes, its true
for we plan, we align and toil
but forget we all do
where comes the bricks and the soil
I could have been screaming murder
not talking of sacrifices to the greater cause
I could have been scraping dung for food
than joke about shitting habits of famine hit
And yet, inspite of all this
when I pause-I choose to run and not bother
the maker and breaker, the nurture and nature
of all around me, in my own ignorance i forget thee.
Let me take a bow and doff my cap
I do acknowledge u oh supreme thee
An accident called birth, for you I clap.
out of my bonnet, now thats over, you annoying bee!

Monday, 1 June 2009
Ballet of Speech
జీవనాదానికి తాళం వేసే
ఉసురులకే కొత్త జీవం పోసి
మాంసఖండాలే వెదురు బద్దలుగ
పోరంబోకు గాలిని వేణుగానం చేసి
చీల్చి చెండాడే దంతాలు
నైజం మరచి సాయం చేయగ
అధరువులనెరిగినధరములు
కొత్త దరువుల భాగ్యం కూర్చగ
అంగిటకు ముంగిట
కంఠమే నేపథ్యమీయగ
చపల జిహ్వయే స్థిరత నేర్చి
మెలికలు తిరిగే నాట్యం చేసి
మనసున కలిగే భావ హేలకు
ముచ్చట గొలిపే అభినయ భాగ్యం
సంఘజీవిత పునాది వేసే
భాషను కూర్చీ, రాతను మార్చిన
మనిషీ .......ఓ మనిషీ
నీ జన్మ అమోఘమోయి.
Oh! the very life
breathing a perfect beat
rising from the depths of gullet
squeezing through fleshy reeds
changing their usual route
supported by the fiersome teeth
lithesome tongue teaching it a step or two
a strange bounce in its steps
from the tough palet's kinship
out of the bellows called lips
forming the very life of human society
It is the ballet of speech.
గొంతుకిచ్చిన నేపథ్యంలో
మాంస వేణువుసురులూదగ
అంగిట ముంగిట దంతాధరముల
పక్క వాద్యముల సాయములోన
భావహేలకు భాష్యం చెపుతూ
నాలిక చేసే అభినయమే
మాటంటాం మనం.
ఈ మాటల విన్యాస కేళిలో చిత్రాలెన్నో
ఒక్కో భంగిమకూ నిర్దుష్ట నామం అక్షర రూపం
అనంత ముద్రమాలికలకు పదమంటూ స్ఫష్ట భావం
ముద్రమాలికల చిత్రమేలనం వాక్యం
ఏమి చెప్పేది ఎలా చెప్పేది
మానవ మేధెలా తిప్పితే
అలా ఆడే తోలుబోమ్మలా
ఎన్నో హోయలోలికించే
నృత్య ప్రదర్శననే భాషంటాం మనం.

Subscribe to:
Comments (Atom)