
ఎండ మాడుస్తోంది
కాళ్ళు చుఱ్ఱుమంటున్నాయి
గొంతు పిడుచకట్టుకుపోయింది
పొట్టక్కరుచుకున్న పిల్ల బరువయ్ పోతోంది
చుట్టూ అర్థం కాని కట్టడాలు
కన్ను పొడుచుకున్న ఎక్కడా నీటి ఛుక్క లెదు
ఎంతొ ఎత్తున ఎదో అర్థం కాని పరికరం
నొటినుండి టపుక్కు టపుక్కుమని నీటి చుక్కలుమ్ముతూ
గంటకో రెందు గంటలకో....
ఈ ఎండలొ...ఎలాగయినా....
కాళ్ళు మాడ్చుకుంటూ అయినా సరే
నిల్చుందామంటే........
నిముష నిముషానికో భీకరమయిన సకిలింపుతో
రాకాసి గుఱ్ఱాలు రావటం
దాని కడుపులో నుంచి ఆ వింత జంతువులు
మందలు మందలు దిగటం
అదేం మాయో ఏమో!
మేమెంత ప్రయత్నించినా రాని నీరు
అవి ముందరి కాళ్ళతొ ఇలా అనగానే వస్తాయి
మాయదారి దేవుడికి కూడా మేమంటే కసే!
ధైర్యమున్న నా తోటి వారు
తోకాడిస్తూ మా నాట్యం చేస్తే
కొన్ని జంతువులు కొంత నీరు పోస్తాయి
ఆ వింత జంతువుల్లొ కొన్ని మంచివే!
కాని నేనెట్లా వాటి దగ్గరకు పొయేది?
మొన్నే కదా నా చెల్లి కొడుకుని
నీటి ఆశ చూపి లాక్కెళ్ళాయవి
నా చిట్టి కన్న లెనిదే నేనెట్టా బతికేది?
అందుకే దూరంగా ఉన్నా
నిలబడి చూస్తున్నా
తోక నిటారుగ నిల్పి
పరుగుకు సిధ్ధంగా ఉన్నా
దాహంతో చస్తా కాని
నిన్నొదలను కణ్ణా
అనుకుంతూ బిడ్డను
గట్టిగా గుండెలకొత్తుకున్నా!
Pic copyrights belong to http://english.ohmynews.com/articleview/article_view.asp?menu=c10400&no=366191&rel_no=3
No comments:
Post a Comment