Friday, 26 June 2009

పంచకళ్యాణి నా మనసు వాణి

భావమొకటీ చరణాకోలై
నింగికెగసీ ఝుమ్మని పాడి
తనను తాకిన రివ్వున సాగే
పంచకళ్యాణి నా మనసు వాణి

వర్ణాలన్నీ స్వరాలనన్నీ
తెగ పులిమేస్తూ తను కలబోస్తూ
కాలమెరుగని చిత్తరువేసే
మది మెప్పించే దరువులకూగే పంచకళ్యాణి నా మనసు వాణి

అసలు స్వేచ్చనూ ప్రతిబింబిస్తూ
పిచ్చి పిచ్చిగా తెగ తిరిగేస్తూ
ఎపుడో ఎకడో తనంతట తానె
డస్సిపోయీ చివ్వున ఆగే
పంచకళ్యాణి నా మనసు వాణి

ఎలా కుదించటం
ఎలా వారించటం
కళ్ళెం లేని స్వారీ నాది
కుదరదు క్లుప్తత నవ్వినగాని!!

No comments:

Post a Comment