మిణుక్కుమనే మిణుగురులై
తళుక్కుమనే తారకలై
చమక్కుమనే తటిల్లతలై
క్షణం మెరిసి మాయమౌతాయి
తిరిగి చూద్దామంటే
ఛాయా రూపామే తప్ప
కంటికి కనపడని హొయలవి
తళుక్కు మిణుక్కు చమక్కులవి
పొనీ....మరిచిపొదామంటే
మిణుక్కుల మధ్యనంతా చీకటి
తళుక్కులొనే జీవితం
చమక్కులొనే సార్ధకం
అవగతమవుతుంది నాకు
ఈ చిరు వెలుగుల చీకటిలొనె
జీవితమంతా చదువుతున్నాను
ఈ మసక వెలుతురులన్నీ
ఙ్ఞానోదయం చేస్తున్నాయి
అందుకే గురుదక్షిణగా
వాటినమరం చేస్తున్నా
పదిలపరుస్తున్న ఆ భావమాలికే
నా ఈ సాహితీ యానమంతా
కవిత కవితనొక్కటిగా చూస్తే
క్షణ భావావేశమే గోచరం
భావ విస్తృతి లోపస్ఫష్ఠం
అంతర్లీనమైన సూత్రంతో చూసావో
అసంఖ్యాక భావోత్పల సమాహారం
ఆద్యంత రహితానంత భావసారం.
హను మిత్రమా
ReplyDeleteమెచ్చినందుకు థాంక్స్
పదిలపరుస్తున్న ఆ భావమాలికే
ReplyDeleteనా ఈ సాహితీ యానమంతా
మీ సాహితీయానం బావుందండీ..
నచ్చినందుకు థాంక్స్ జ్యోతిర్మయి గారు.
ReplyDelete