"చివరి మంచం మీద ఎవరదీ, కొత్తగా వచ్చినట్టుంది?" నాన్న నా బెడ్ దగ్గరకు వచ్చి భోజనం పెడుతూ అమ్మనడిగారు. "ఎవరో డాక్టర్ అట...ఆత్మహత్య చేసుకోటానికి ప్రయత్నిస్తే తీసుకొచ్చారు...ఇపుడు బావున్నాడు లెండి." అమ్మ జవాబు. "అదేమిటి డాక్టర్ అంటున్నావు, ఇలా ఉస్మానియా ఆసుపత్రిలో జనరల్ వార్డులో ఉంటున్నాడు మరి" నాన్న కుతూహలం. మేమున్నది ఎం ఎం టూ వార్డు, ఉస్మానియా ఆసుపత్రిలో. దాదాపు నా సహ రోగులంతా కింది తరగతి వాళ్ళే. అందుకే డాక్టర్ అనగానే నాన్నకు ఆశ్చర్యం వేసినట్టుంది.
"ఉన్న ఆస్తంతా పల్లెటూర్లో రోగులకు ఉచిత వైద్యం చేస్తూ, మందులూ ఉచితంగా ఇస్తూ తగలేసాడట. మొన్ననే చివరిగా ఉన్న స్కూటర్ కూడా అమ్మి మండులిప్పిచ్చాదట ఎవరికో. అప్పటినుంచి ఇంకా తానేమీ చేయలేకపోతున్నా ప్రజలకూ అంటూ ఆరాటమట. అది భరించలేక ఇవాళ పొద్దునే ఇన్సులిన్ ఎక్కించుకున్నాడట మహానుభావుడు. పెళ్ళాం పుస్త గట్టిగా ఉండబట్టి ఆమె చూసి తీస్కొచ్చింది...లేకుంటే వాళ్ళను గతి లేని వాళ్ళను చేసి వదిలి పోయేవాడు." అమ్మ చీదరింపు. "పిచ్చోడు...ఉన్న విద్యను సాకారం చేసుకోలేని వాడు" నాన్న తిరస్కారం.
ఎన్నో ఏళ్ళనాటి నాన్న రాసిన కథ "ఎం ఎం టూ " గుర్తుకొచ్చింది, "హ్యుమానిటీ అండ్ హ్యూమనిజం" గురించి ఆలోచిస్తే. నిజమైన మానవతావాది అతను, అదే నిజమైన మానవతావాదం. మిగితాదంతా బూటకం అనిపించింది. వెంటనే ఇంకో ప్రశ్న...జవాబులేనిది..."అతనేక్కువ సేవ చేసాడా ప్రజలకు లేక డబ్బు ఇవ్వలేని వాళ్ళను పీడించక , ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకుంటా, తన పబ్బం గడుపుతూ, ఇతులకు నిరంతర సేవ చేయగలిగిన ఇంకో డాక్టర్ ఎక్కువ సేవ చేసాడా...అసలైన మానవాతావాడి ఎవరు?" అన్నది.
బ్లాగ్లోకంలో మానవ నైజ ఋతు పవనాలు రేపుతున్న దుమార నేపథ్యంలో "అసలు ఎందుకీ అసమానతలు? అందరూ ఒక్కటిగా మనలేరా? అసలు కుల, మత, భాషా, దేశ, ప్రాంత, జాతి, అంతరాలు అసలు లేకుండా ఉండే పరిస్థితి వస్తుందా? అసలు మన అస్థిత్వం అంటే ఏమిటి" అన్న ఆలోచనలకూ, నా భార్యతో, నా మనసుతో జరిగిన సంవాదాలకూ సంభాషణా రూపమీ టపా....చవి చూడండి.
నేను (నే): ఏమేవ్ బ్లాగులో ఎప్పుడూ సీరియస్ విషయాలే అంటావు కదా చూడు మూడు నాలుగు రోజులుగా ఎంత చక్కని సరదా టపాలో అన్నాను కుల వివక్ష పై రేగుతున్న దుమారాన్ని తెల్పుతూ
ఆవిడ (ఆ): పాపం వాళ్ళంతా బాధ పడుతూ కొట్లాడుకున్తూంటే మీకు నవ్వులాటగా ఉందా?
నే: మరేం చేయమంటావు? ఇద్దరూ ఇద్దరినీ అనుకుంటున్నారు...ఇద్దరూ తమది తప్పని ఒప్పుకోరు. మధ్యలో "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అని తామూ "ఉన్నత విశ్వవిద్యాలయాల్లో" కూడా వాడుతాము అది తప్పు కాదు అంటూ ఒకరూ, "దళితవాదివి పో, రిజర్వేషన్ లో చదవటం గొప్ప కాదు పో " అంటూ ఇంకొందరూ తమ తమ వ్యక్తిత్వ విషయాల నుండి దారి మళ్ళి, సమూహాలను ఆడిపోసుకుంటున్నారు. వీళ్ళ మధ్య నలిగి పోతున్న మేము ఇలా మా బాధను సబ్లైము చేసుకుంటున్నాము
ఆ: గాడిద గుడ్డేం కాదు? అవునూ "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అంటే మీకెందుకంత అలక. అసలు నన్నడిగితే మీకు నిజంగా ఉందది, లేకుంటే మీ ఆర్కుట్ లో ఆ కుల సమూహ సభ్యత్వాలెందుకు?
నే: నువ్వూ అన్నావు...నేను బ్రాహ్మణ సంఘం లో ఉన్నాను కాని ఇతర కులాలు నచ్చావు సంఘాల్ల్లో లేదు కదా తప్పేంటి? నేను బ్రాహ్మనుడినే కదా?
ఆ: తప్పే. నిన్ను నువ్వు బ్రాహ్మణుడు అనుకో కాని అది ప్రత్యేకంగా ఎత్తి చూపాల్సిన అవసరం ఏమిటి?
నే: అంటే నా అస్తిత్వాన్ని చూపే ఏ చిహ్నం ధరించ కూడదంటావు?
ఆ: అవును అంతే
నే: అయితే గడపకు పసుపూ, నీ మెడలో మాంగల్యం, నీ నుదుటిన బొట్టూ, లక్ష్మీ నిలయం బోర్డూ ఇవన్నీ
ఆ: అవును..నిజంగా వివక్షలేకపోతే ఈ చిహ్నాలనవసరం
నే: అయితే ఇంటి పేర్లు ఏదయినా కూడా ఒకటేనా
ఆ: అవును
నే: అయితే రేపే నీ పాస్పోర్టులో మీ ఇంటి పేరు మార్చి నాది పెట్టేద్దాం.
ఆ: (మవునం)
నే: మన బేసిక్ అవసరాలు తీర్చుకుని మిగితా జీతమంతా మన ఊరిలో తిండి లేని వారికి పంచుదాం ప్రతి నెల
ఆ: (మవునం)
నే: సరే సరే....ఆచరణకు వద్దులే చర్చలకు మాత్రమె పరిమితం చేద్దాం.
ప్రతి విషయంలో ఆచరణలో ప్రతి ఒక్కరికీ వారి వారి పరిమితులుంటాయని నాకు తేల్సులే.
ఆ: ఇక నా దగ్గర ఇలాటి చర్చలు తేకండి (నిష్క్రమణం)
మనసు (మ): ఎందుకంత సంతోషం...తను చేసిన పనే, ఆ పలాయన మంత్రమే, ఒకప్పుడు నీ స్నేహితుడు నీతి ప్రకారం నడిచే విధానాల గురించి ఇరువై నల్లుగ్గంతలు చెబుతూ ఉంటె వద్దని వారించిన నువ్వూ, అదే చేసావని తెలీదా
నే: అవును నిజమే (లెంపలేసుకుంటూ)
మ: సరే నేనడుగుతున్నాను చెప్పు ఎందుకు నువ్వు ఇంతవరకు ఆ కుల సమూహాల నుంచి బయట పడలేదు?
నే: నువ్వూ అదే ప్రశ్నా? నీకు తెలీదు నేను అసలు కుల వివక్ష చూపానని నాకు నచ్చిన విషయాలు అక్కడ నేర్చుకుంటున్నాను అంతే అని?
మ: అదే విధంగా నువ్వు చదివినట్టు just the process of identification with any group provokes diffferential behaviour immediataly ...as proved very well by psychologists .....అన్నది ఎందుకు మర్చిపోతున్నావు?
నే: మర్చిపోవట్లేదు కాని నేనెందుకు...లేదా బ్రాహ్మణులు మాత్రమె ఎందుకు... తమ "సమూహ అస్థిత్వాన్ని" వదలాలి? మిగితా వారు తమ ఆత్మాభిమాన ప్రవర్ధమాన కారణంగా తమ కులాలను కొత్తగా ఇంటి పేర్లుగా పెట్టుకున్తున్నప్పుడు నేనే/మేము ఒక్కళ్ళమే ఎందుకు చేయాలి? మిగితా వారందరూ రిజర్వేషన్లు కుల ప్రాతిపదికన తీసుకుంటా తమ కుల అస్థిత్వాలను పదిల పరుచుకుంటూ పెంపు చేసుకుంటూ ఉన్నప్పుడు నేనెందుకు త్యాగం చేయాలి?
మ: మరైతే ఇలాగే తరతరాలుగా అంతరాల తారతమ్యంతో ఇలానే మగ్గుతూ ఉంటారా?
నే: అంతరాలు సమసి పోతాయని నీకు నిజంగా ఆశ ఉందా?
మ: ఎందుకు సమసి పోవు అందరూ కృషి చేస్తే?
నే: "అందరూ" కృషి చేస్తారా?
మ: చేయరని అనుమానమా?
నే: అనుమానం కాదు "నమ్మకం "...."చేయరని".
మనిషెంత సాంఘిక జంతువైనా జంతువే.
survive,sire and satiate ఈ మూడే పరమావదులు మనిషికి there maybe exceptions but they are what they are, exceptions.
ఎన్ని సాంఘిక న్యాయాల సంకెళ్ళు తగిలించినా....the games to maximise self survival, siring and satiating will go on.....even after being taught that working together will ensure greater good for the most, majority will work for themselves to ensure thier chance of maximising the 3Ss.
మనుషులను క్లోన్ చేసి సమాన శారీరిక, మానసిక, సామ్స్కారిక, ఆర్ధిక, సామాజిక, రాజకీయ స్థాయిల్లో అందరినీ సమానంగా నిలబెట్ట గలిగితే తప్ప.....
ఈ అంతరాలు అనేవి తప్పవు....ఒకప్పుడు రంగు, పుట్టుక తారతమ్యాలు, ఇప్పుఉడు కుల, ఆర్ధిక తారతమ్యాలు, రేపు ఎవరు చూడొచ్చారు?.....it may be the % of genetic purity in you or may be your IQ ponts to nth decimal.....whatever basis it may be,humans will allways find ways to divide themselves...they may all be united for short periods or soem may be united for long...but it si not possible for them all to be united for eternity. That concept of humanism is utopian.
మ: చాలా దారుణంగా ఉంది నీ ఆలోచన ...అంతే మనుషులకిక ఇదే గతా?
And this so callled REALISM or FATALISM, is it not an easy way out?
Talking of things in broad perspective absolves you of the responsibility of the effort to make it right...does it not smack of ESCAPISM?
నే: ఎవరు చెప్పారు దీర్ఘకాలిక దృష్టి వల్ల అందరికీ పలాయన వాదం బలపడుతుందని?
ఈ దీర్ఘదృష్టి వలన అబ్బేది పలాయనవాదమో లేక తామరాకు తనమో (EQUANIMITY) అనేది వారి వారి మీద ఉంటుంది.
మ: అయితే అంతరాలు సమసిపోవని మనం మన కృషి ఆపెస్తామా?
నే: ఎవరన్నారా మాట? కృషి జరగాల్సిందే జరిగి తీరుతుంది కూడా.
మ: మరి సమస్యేమిటి ఇక్కడ?
నే: ఇక్కడ సమస్యంతా మనలా పనిలేక ఇలా ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళ వల్లే
మ: don't joke, i am serious
నే: I am deadly serius ఇక్కడ తప్పేంటంటే ఇలా వచ్చిన చిన్న చిన్న ఒడిదుడుకులను ఓ...అనుకుంటూ పెద్దవిగా చేసుకుని నానా హంగామా చేసుకునే మనదే తప్పు. ఒకరు "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" అని అంటే నీకు కాలటమే ఇక్కడ తప్పు ఇక్కడ ఇన్ని గంటలు వ్యర్థం చేసాను అనుకోవటమే నీ తప్పు .
నీకు నీ మీద నమ్మకం ఉన్నప్పుడు...నీవేలాంటి వాడివో నీకు తెలిసినపుడు... You do not care emotionally
if you know your true self...and if it is right...you do not get emotional if your self identity does not match with your social identity.....you do not get upset...you recognise the fact that your social and self idnetities do not match and hence try and rectify it...
You act to rectify the defect but you do not get emotional.
సమాప్తం
Interesting thoughts
Mintzberg Games
http://changingminds.org/explanations/behaviors/games/mintzberg_game.htm
Collective vs Individual games - The Zero sum game
http://en.wikipedia.org/wiki/Zero-sum
Robber's cave experiments...Group Identity and Discrimination
http://www.age-of-the-sage.org/psychology/social/sherif_robbers_cave_experiment.html
No comments:
Post a Comment