Monday, 31 January 2011

http://www.giirvaani.net/-మనస్సుమాంజలి



రెండున్నరేళ్ళ కిందట అష్టపదుల టీకా కోసం వెతుకుతున్న నాకు దొరికిన వెలలేని నిధిని మళ్ళీ ఒకసారి ఈవేళ  చూసుకుంటే పిల్లలు పెట్టిందని సంబరపడిపోతూ ఆ నిధిదాతకు కృతఙ్ఞతలు చెప్పుకుందామని వెళితే ఆయన శాశ్వతంగా దూరమయ్యారని తెలిసింది.

అందరికీ ఆయనను ఎరుకపరిచటం కంటే నేనింకేమీ చెయ్యలేకపోతున్నా.

హనుమంతురావుగారూ
పాదాభివందనాలు.


రామాయణము,
కుమారసంభవమూ
హరివంశమూ
రఘు వంశమూ
ఋతు సంహారమూ
భరత సావిత్రీ
శ్రీ కృష్ణ కర్ణామృతమూ
శ్రీ సీతా పరిణయ శ్లోక వ్యాఖ్య

ముఖ్యంగా నాకెంతో ఇష్టమయిన

గీతా గోవిందమూ

పదచ్చేద, టీకా, తాత్పర్య, గుణ విశేష వివరణ మొదలైన ఎన్నెన్నో విశేషాలతో అందించిన దేశిరాజు హనుమంతురావు గారికి నా మనస్సుమాంజలి.

http://www.giirvaani.net/


Friday, 28 January 2011

What does differentiate them then?

Harem knows no difference
betwixt priest and eunuch
grants both equal access
-to those in it
and to their innards.

Thursday, 27 January 2011

तू तो ऐसी ना बन.

 हर करतब कर चुके
हर कोशिश ना काम साकी
मुखोटा पार देखना
दुनिया जानी ही नही

जिस्म पहचान जो बनी
हम तडीपार हो गए साकी
दुनिया हमें ठुकराया
हमने उसे त्याग दी
किस कम्बखत को याद साकी

आदत से मजबूर थे
ढूंढते चल पड़े
आह्ट के पीट पीछे
कुत्ते बन हम साकी

इतनी सफर तै गयी
अब क्या शर्माना साकी
गली बदनाम ही सही
कली कुच्लाई तो भी
आह्ट जिसमे समाई
उसीके हम बेशक साकी

बेहोशी में भी भूले नहीं
पल भर के ही है ये अपनाई
ज़ालिम जिन्दगी कौनसी
जिन्दगी भर वफा वाली साकी

क्या पता इन वीरान हैरानी में ही
खामोश कुचली छिपी चीक इक मिले
मीरा की शुभ वाणी में जो हम कान्हा बने
उस बेज़ुबां की तलाश जारी साकी.

तू तो हमें बाते मत सूना
मैखाने नूर ए ज़ालिम
दलदली में बिसरी ही सही
अपनी खुशबू की कदर जान साकी.

రసాత్మకం - నిజసాక్షాత్కారం

ఎవరితోనో మాట్లాడుతూ "ఆలోచనలను రాకుండా ఆపలేను కదా" అని చెప్పటానికి సిరివెన్నెలకు చాతకాన్నవ్వాలని
స్వర్ణకమలంలోని ఒక డైలాగ్ గుర్తు చేసుకోబోతే రాలేదు. వెదుకుతూ పొతే శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వనంటూ ఒక పుష్పం గర్వంగా స్వాగతించింది. నువ్వు నాకు సుపరిచయమేలే అనుకుంటూనే మళ్ళీ స్నేహం చేశా. సరి కొత్త కోణంలో ఎంతటి మంత్రోపదేశం చేసిందో చూడండి.

నాకు చాలా ఇష్టం తను. అయినా తన పిలుపు నాకింతవరకూ చెవికెక్కలేదన్న నిజం ఇవాళ తనను నింపాదిగా పరికిస్తే కాని అర్థమవలేదు. కదిలిన మరుక్షణం ఉధృత కెరటమయ్యే భావుకతతో వచ్చిన బాధే ఇది అని అర్థమయ్యింది. ఎంతో అర్థమయినట్టనిపించింది తన ఆత్మ ఘోష. ఆ అవగతం నిజంగానే ఆనందపు గాలివాలై నడిపిస్తూ తన దగ్గరకు చేర్చుకుంది. కాని మళ్ళీ అదే తప్పిదనం.

తన రూపం, ముగ్ధం, గళం, గాత్రం, చలనం, అన్నీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తే మళ్ళీ ఆత్మావలోకం హుళుక్కే.

ఆత్మావలోకాన్ని కోరుకున్న తను బాహ్య సౌందర్యారాధనకే పరిమితమైపోతున్న నన్ను చూసి చెమరిస్తే రాలినవిగా అనిపించాయి తన ఆత్మప్రకాశ మంత్రాలు...........తెల్లటి పుటపై నల్లటి అక్షరాల రూపంలో. ఆ శోకం నుంచి శ్లోకమైతే పుట్టలేదు కాని "సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ......" అంటూ పలికింది మాయా రూపమే కాని వాగ్దేవి కాదని తెలిసింది.

ఇంతకాలం "సత్యాన్వేషణలో వాగ్గేయకారులూ వాగర్ధాలను తోడు తీసుకునే నడిచారు కదా" నన్ను నేను  అని సమర్ధించుకునే వాడిని. నా స్నేహితుడు మోక్షానికి (వాడి ప్రకారం మోక్షమంటే నిర్మలమైన ఆనందం...The ultimate truth is that unblemished bliss అంటాడు) వెళ్ళే దారుల గురించి చర్చిస్తూ "సాధకుడు ఇంకా తన భావానురక్తిని విడువలేకపోతున్నాడు కాబట్టి భక్తియోగం మిగితా అన్నిటితో సమానమే కాని కొంచం తక్కువ సమానం..." అన్నప్పుడు చిన్నబుచ్చుకున్నా, అలా ఎందుకన్నాడో ఇవాళ అర్థమయింది.

తను బోధిస్తున్న ఈ జ్ఞానం మీకేమయినా ఎరుకవుతోందా?
ప్రయతించండి.

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా........ సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా... సిరిసిరిమువ్వా

సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 
యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా 
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 
నటనాంజలితో బ్రతుకును తరించానివ్వా....
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా 
మది కోరిన మధు సీమలు వరించి రావా 
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా

పడమర పడగలపై మెరిసే తారలకై 
రేయిని వారించకే సంధ్యా సుందరీ
పడమర పడగలపై మెరిసే తారలకై 
రేయిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై 
ధాత్రిని మురిపించే క్రాంతిని చిమ్మనీ 
తూరుపు వేదికపై వేకువ నర్తకివై 
ధాత్రిని మురిపించే క్రాంతిని చిమ్మనీ 

నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయ రవళి ఓంకారం కానీ........


శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా........ సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా... సిరిసిరిమువ్వా

సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 
యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా 
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 
నటనాంజలితో బ్రతుకును తరించానివ్వా....
సిరిసిరిమువ్వా, సిరిసిరి మువ్వా 

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడా
ఆ...ఆ...ఆ..అ...అ...ఆ
అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా 
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా 
ఆ..ఆ.ఆ.ఆ...ఆ..ఆ...
ప్రతిరోజోక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెరా గానం నీకు తోడుగా 

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా

చలిత చరన జలితం నీ సహజ విలాసం
చ్వలిత కిరణ కలితం నీ సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం...తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం...తిలకించిన రవి నయనం 
గగన సరసి హృదయంలో....వికసిత శతదళ శోభల సువర్ణ కమలం.

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితే తరగదు త్రోవా




నాలాగే మీరూ ఎక్కడో ఆగిపోతున్నారా?

స్వధర్మానికీ, పరధర్మానికీ నేను చెప్పుకున్న అన్వాయాన్ని దిద్దుకోటానికి అవకాశమిచ్చిన శంఖారావానికి  కృతఙ్ఞతలు.

Tuesday, 25 January 2011

Passed 5/5 modules in MBA.

జీవితంలో ఇంత కష్టపడి రాసిన పరీక్షలు లేవనుకుంటా.

కష్టానికి ఫలితం దక్కింది.

మూడు పాసవుతాను అనుకున్నపుడు అయిదు పాసవుతే ఆ మజానే వేరు.

V happy

Just 3 more to go and then I can really say......"ఈ జన్మకీ పరీక్షలు చాలు"

"ఏమిటలా ఇంత వయసులో కూడా పరీక్ష పాసయ్యాను అని చిన్నపిల్లాడిలా గెంతులేస్తావు" అంటారా?
నా ఇష్టం!!!
:-) :-) :-)

Monday, 24 January 2011

तजुर्बे का ज्ञान!

हां कबूल है झोली भर अमीरी 
दर ब दर तर्जुबे-ज्ञान जो मिली
मिलाकते इश्क में जो खोते 
बे दुनिया गरीबी भा जाती  साकी.


కాశ్మీర నాటకానికి తెరెప్పుడో?


మనకున్నది మనం వదలం ఇది జగమెరిగిన రహస్యం
వాళ్ళకున్నది వాళ్లివ్వరు, మనం తీసుకోలేం...ఇదీ జగద్విదితమే.

కానీ ప్రతీ గణతంత్రానికీ ఈ నాటకమేమిటి?

ఇన్ని లక్షల కోట్ల ఖర్చు చేసి మనం కాపాడుకుంటున్న భూమిలో మన త్రివర్ణాన్ని రెపరెపలాడించుకోలేకపోవటం ఏమి ఖర్మ.

I only hope the government has some coherent long term plan in place and this restraint being forced on us is part of that big plan rather than just cowardice.

Not only justice, governance has to be seen as being done as well.

Mr PrimeMinister, I think you have a responsibility to us all there.

(BTW being a BJP baiter & hater, I would like to know how many times BJP did this when in power :-)


Friday, 21 January 2011

జాలం జాలం

అక్కడో మెరుపు ఇక్కడో తరక
ఏకతాటిన సంజాతలేకతమనుకోనా
అక్కడో ముక్క ఇక్కడో ముక్క
ధాటికి దర్పణం చెదిరిందనుకోనా

Sunday, 16 January 2011

కోనేటి రాయని చుట్టూ -౩ చేపల వేట

అనగనగా ఒక ఊరు.
ఆ ఊళ్ళో ఓ మూల ఓ కోనేరు
కోనేరు మధ్యలో గుడి


మన పిట్టల దోరేమో ఒక రోజు మనసు బాలేదని కోనేరు దగ్గరకెళ్ళి కూర్చున్నాడు
మనసు బాలేకపోతే దీర్ఘంగా ఆలోచించాలి కదా
పిట్టల దొరకేమో చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తె మనసు క్షణం కుదురుగా కూర్చోదాయే
 "నేను చికాగా ఉన్నా నేనిలాగే ధీ....ర్ఘంగా ఆలోచించాలి" అని అనుకుని వనచరవరాన్ని కట్టి పడేసే ప్రయత్నం
సడన్గా కలకలం




"ఏయ్ యారప్పా నీవు ఏన్ మాడ్తాయిదే ఇల్లి?" (ఏయ్ ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారిక్కడ?)
"ఇల్లే ఇర్తీవన్నా. ఎరగళు నోడ్తాయిదీవి"(ఇక్కడే ఉంటామన్నా. ఎర కోసం చూస్తున్నాం)
"ఎరగళా? అంతే ఏను? తోర్సీ." (ఎరగళా అంటే ఏమిటి చూపీ?)
"నోడన్నా......ఇదే ఎరగళు"



"ఓ ఇవా. ఏను మాడ్తీయి మీను ఇడుకొండు? తిమ్బోదా"
(ఓ ఇవా. (పిట్టల దొరకు బాగా పరిచయం లెండి. ప్రాణాలు రక్షిస్తాము అని శపధం చేసేందుకు ఎన్నిలాటి ప్రాణుల్ని చెండాడాడో  జువాలజీ క్లాసులో ). చేపలు పట్టి ఏం చేస్తారు? తింటారా?)
"ఇల్లన్నా.  మణిగ తోగొండి హోగీ నీరల్లి హాక్తీవి" (లేదన్నా ఇంటికి తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాము)
"ఓరి మీ అసాధ్యం కూలా. నా చెవిలో రఫ్లీసియా ఉన్న సంగతి మీకెలా తెలుసురా?" (ఇక్కడ thought bubble ఊహించేసుకోండి)-(పిట్టల దొర బోటనీ పరిజ్ఞానం-రఫ్లీసియా ప్రపంచంలోకెల్లా పెద్ద పువ్వు!)
"అన్నా సొలప ఎరగళు హాకి కొడన్నా" (అన్నా కొంచం ఎర ఎక్కించి పెట్టన్నా)
అంతే మరి. పని పాట లేకుండా చెరువు గట్ల మీద కూర్చుంటే, మంచిగా మాట్లాడితే ఎంత పిట్టల దోరైనా......
"కొడి" (ఇవ్వు)
"తొగో...చందాగిదియా" (తీసికో. సరిగ్గా ఎక్కించానా?)
"చందాగిదే. ఓయ్ అల్లి నింద నడి. అదు నన్ జాగా" (బావుంది. ఓయ్ అక్కడనుంచి నడు. అది నా ప్లేస్)

దేవుని కొలనులో కూడా fishing reservation permit కొట్టేసిన ఈ మహానుభావుణ్ణి అందరికీ పరిచయం చెయ్యాల్సిందే
(మళ్ళీ ఒక thought bubble ఇక్కడ, ప్రతీ సారి చెప్పాలా...ఇదే లాస్ట్ టైం-ఆహనంగా పిట్టల దొర మనసు)

"నీవేల్లారు ఫోటో తోగొంతీని పోజ్ కొడి" (మీ అందరి ఫోటోలు తీసుకుంటా పోజ్ ఇవ్వండి)
"అంగే తొగో అన్నా" (అలాగే తీసుకో అన్నా....ఇవ్విధంబుగా నా దేవుడు వరంబొసంగగా )

క్లిక్
Permit Holder 1 with Fishing gear

క్లిక్ క్లిక్
Permit Holder 2 using the fishing gear


"అన్నా నోడి, మీను సిక్కిత్తు." (అన్నా చూడు చేప చిక్కుకుంది)
క్లిక్ క్లిక్ క్లిక్
"ఇరో. అంగ మాడుబాడ. నాను తెగితీని నోడు మీనున" (ఆగ్రా. అలా కాదు నేను తీస్తానాగు. ఎలా తియ్యాలో నేర్చుకో)

"నిన్గేనేనో. ననగా సిక్కిత్తు నోడు మీను" (నీకేనేన్టోయ్? నాకూ పడింది చూడు చేప)

ఓహో....వీళ్ళల్లో కూడా గ్రూపులున్నాయనమాట
"భంగిమా...." అంటూ కమల్ కు అరిచినట్టు నాకూ ఎవరన్నా "thought bubble....." అని అరిచే వాళ్ళుంటే బావుండు.
ఇదీ ధాట్ బబ్బులే...పిట్టలదొరది


"పాప. అంగ మాడ్బోదో. మీనుగ సులాగత్త. అదూ ఇదు దేవురి నీరు"
(పాపం అలా పట్టకండి చేపకు నొప్పవుతుంది పైగా ఇది దేవుని కొలను)

మా నాయనే, మా బాబే
నువ్వొక్కడివే లేవెంటానుకుంటున్నా ఎక్కడున్నావయ్యా ఆత్మారామా రా ముందుకొచ్చి పోజివ్వు
ఓర్నీ అసాధ్యం కూలా నువ్వా. ఇంతవరకు వేట ఎంజాయ్ చేసి ఇప్పుడు నీతులు చెపుతున్నావా.
ఏం నాయనా నీ దగ్గర తాడూ హుక్కూ  లేవా? అదా నీ కుళ్ళుపోతుతనం?

"అవునంగే అన్తానన్నా. ఇదు నోడి" (వాడలాగే అంటాడు అన్నా. ఇది చూడు)

"యారో అల్లి. ఎన్ మాడ్తాఇదే అల్లి " దూరం నుండి ఘర్జన (ఎవర్రా అది ఏం చేస్తున్నారక్కడ)

"ఎనిల్ల స్వామి, హోగీ, చిక్కుడుగురు" (ఏమి లెదు స్వామి. పోనీ చిన్నపిల్లలు)
అంటున్న పే......ద్ద వాళ్ళేవరా ఇక్కాడా?

"నడ్తీరా ఇల్లా. నాను బర్లా?" (కడుల్తారా లేదా ఇక్కడనుంచి. నేను రానా?)
"అరేయ్. హోగోణ బారో". (ఒరేయ్ పోదాం పదన్డ్రా)


"నీనేదో మీనున నీరుదల్లి ఇదితీవి..అదూ ఇదూ అన్దీయి. మణిగ హోగోష్టు కాలగ అదు సత్తోగత్తల్లా?"
(నువ్వేదో చెప్పాను ఇంటికి తీసుకెళ్ళి నీటిలో పెడతాము, అదీ ఇదీ అన్నావు. ఇంటికేల్లెలోగా అది చచ్చిపోతుందిగా)

"ఇల్లన్నా. కవర్ తన్దీవల్లా. నోడి" (లేదన్నా కవర్ తెచ్చాముగా చూడు)


ఓహ్....మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకాలా పిట్టల దొరకు.
"ఒందు లాస్ట్ ఫోటో. మీనుదు. తోర్సి." (ఆఖరి ఫోటో  తీసుకుంటా చేపది చూపీ)

"హోగీ బర్తీవన్నా. బై."
"వెల్లోస్తామంటూ" వెళ్ళిపోయిన పిట్టలదొర చేపల వేట ఫ్రెండ్స్ వీళ్ళే.





Really enjoyed the fishing. Thanks a lot friends.

Friday, 14 January 2011

Software recommendation needed

I need a software to convert my English PDF or WORD documents into mp3 audio
Freeware is better but pay I will if I must :-(
Willing to pay if the features are much better than freeware 
Any recommendations please?

తెలుగు బ్లాగ్లోకం మొత్తం బ్రహ్మీల మయమే కదా. 
ఆ మాత్రం మాట సహాయం చేయ్యకపోతారా అని ఆశ :-)



Wednesday, 12 January 2011

రఘురామా!


జనావళి సన్నుతి స్వనమూ 
కాంచన ప్రతిమ ధగధగలూ
ఎడబాయని ధర్మదేవత కరస్పర్శ
పలుమాటలకు తావివ్వని న్యాయదేవత చలవ 
తర్కవేఙ్ఞి నిరవధిక సంవాద భరిత మనము 
రాజ్యలక్ష్మి భారమున సొలిసిన తనువూ 
జితేంద్రియములై  సేవ  సలప 
సీతమ్మ తల్లి వియోగము    
నీకేపాటిలే.   


Sunday, 9 January 2011

What if I was a Gujarati?


"Much however I accept that a bit of Hindu fundamentalism is necessary to counterbalance the Muslim fundamentalism in India, I would never support, vote or talk in favour of BJP, the political and public face of Hindu fundamentalism" has been my Bheeshma prathigna since 1992.

Then comes this blue blooded RSS goon onto my consciousness, responsible, in my judgement, by both commission and omission, I tell myself, for offering up my country's secular fabric in the ashes of a burnt bogey. (Pseudo secularism they call it...ha ha.) I hate this man and start loosing friends because I oppose their demi god in arguments.I grin and bear the loss of these "friends". I push him out of my consciousness.

But, accept I have to, that this goon does not give me any peace. Not by notoreity but by his administrative ability.

If, as this report says, he is able to achieve 9% agricultural growth in Gujarat...........I have to salute him.
http://www.rediff.com/business/report/modi-unfolds-tricolour-plans-for-gujarat-at-pbd/20110109.htm

So, here comes my problem


వీడిని క్షమించేసేయ్యాలా?

నాన్న చిన్నప్పుడు ఒక కథ చెపుతూ "ముదుసలినైతి, చేవ చచ్చె, నఖముల వాడి తగ్గె, పండ్లూడిపోయే.....ఎవో కందమూలములు తింటూ గడుపుచుంటి. నీ వంటి ఉత్తమునకు హేమ కంకణ దానమిచ్చిన సద్గతులట" అంటూ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. కథ ఇక్కడ 

ఎంతో ముందు చూపుతో భరతమనే ఉత్తమునకు ఈ ఇంక్లూసివ్ గ్రోత్ అనే హేమ కంకణముల ఆశ చూపుతోందా ఈ మృగం?

నిజంగా చారలు పోయెనా?

మనసు మాత్రం "చారలు పోకుంటే మాత్రమేం ఘన గుర్జరీ జాతి ప్రజల నేటి సంక్షేమం ఆ యాగబలి ఫలితమే అని ఎందుకు అనుకోరాదు" అని ప్రశ్నిస్తుంటే రాబోయే కాలానికే జవాబిచ్చే అవకాశం ఇవ్వటం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోతున్నాను.

I hope this development does not turn out to be the patient ploy of this not so old wily animal to take over entire India and then show its true spots. I really hope it has turned over a new page.

Thursday, 6 January 2011

Proud to be an Indian....However "backward" we may be.

""

"మన దేశం ఇంకో రెండొందల ఏళ్లు తీసుకుంటుంది ఈ దేశం స్థితికి రావటానికి. మన దేశం చాలా వెనకపడి ఉంది "
ఎప్పుడూ వినే మాటలే. ఇంకా ఆవేశం బ్రతికుంది అనుకోలా. 

"ఏ విధంగా మన దేశం వెనకపడింది?" అడక్కుండా ఉండలేకపోయ్యాను.

"ప్రతీ మనిషికి తను చెయ్యాలనుకున్నది చేసే అవకాశం, అది చేస్తే సమాజ ధిక్కారం లేకపోవటం లేవు మన దేశంలో. గెస్, లెస్బియన్స్ ఇలా ఎంత మంది మన సమాజంలో వారి వారి అభిప్రాయాలను గౌరవించి తిరస్కారం లేకుండా బ్రతకగలుగుతున్నారు?"

"అదే...వ్యక్తిగత స్వేచ్చే.....అడ్వాన్స్ద్ అని ఎందుకనుకోవాలి?"

"ప్రతీ మనిషికి తాను చెయ్యాలనుకున్నది చేయ్యటంలోనే ఆనందం ఉంది. ఆ ఆనందం, స్వేచ్చ ఇచ్చిన నాడే అది పురోగమనమవుతుంది."

"అన్నది ఇప్పటి పాశ్చాత్య ఆలోచన...దాన్ని వేరే దేశం ఎందుకు పాటించాలి?"

"ఎందుకంటే మన దేశం ఇప్పుడు గ్లోబల్ సిటిజన్ కాబట్టి తాను గ్లోబల్గా ఉండాలంటే మెజారిటీని అంగీకరించాలి అంతే."

"మెజారిటీ అంటే  సంఖ్యా బలమేనా?"

"అవును"

"అయితే ఈ ఆలోచనా ధోరణి ప్రపంచంలో మెజారిటీ ఎలా అయ్యింది? ప్రపంచ జనాభాలో చైనా, భారత ఉప ఖండం, ఆఫ్రికా....ఈ మూడు సంస్కృతులను కలిపి చూడండి...వీటిని మించిన సంఖ్యా బలం ఎవ్వరికుంది? మరి ఆ సంఖ్యా బలం ప్రకారం ఇలా విచ్చల విడి వ్యక్తిగత స్వేచ్చ మెజారిటీ అభిప్రాయం కాదె"

"ఆ.....కాని ఈ దేశాలన్నీ చదువు లేని దేశాలు. చదువుకున్న జనం వ్యక్తిగత స్వేచ్చను కోరుకుంటారు. కాబట్టి చదువుకున్న సభ్య సమాజాలయిన ఈ దేశాలు ఏది ఒప్పుకుంటే అదే మెజారిటీ...సంఖ్యా బలం లేకపోయినా".......బుర్ర గోక్కుంటూ కొంచం ఆలోచించి వచ్చిన మాట 

"I have heard these before.......in accounts of christians civilizing Pagans.....saying that you are not civilized because you are not "Educated". Hence our efforts to civilize you"....so were lost many civilisations, cultures, religions which were flourishing before. So you mean to say we are uncivilized because the majority of Africans, Indian sub-continent and chinese are not "Educated" in western sense?

"అవును".

"Don't you think the individual freedom has gone to the other extremes in your so called advanced civilisations?"

"లేదు."

"నీ తండ్రి ఎవ్వరో చెప్పుకోలేని దురదృష్టం, నీ పిల్లడు స్కూల్లో ఎప్పుడు మత్తు పదార్థాలకు అలవాటు పడతాడో తెలియని దిగజారుడుతనం, ఎంత గతి తప్పుతున్నా నీ స్వంత పిల్లలల మీదకు పోలీసు కంప్లైంట్ ఇవ్వగాలవే కాని తల్దంద్రులుగా భాద్యత నిర్వహించలేకపోవటం.....ఇవన్నీ?"

"now you are generalising the few percentage of misfits that you see to the whole population here. In this country you are not looked down because of who you are."

"ఒక విధంగా నువ్వన్నట్టు సామాన్యీకరించటం తప్పే. కాని . బస్సులో, నా మీద, ఒక డాక్టర్ మీద, తిన్న ఆపిల్ ముక్కల తుక్కులను విసిరి నా పక్క నుంచి లేచి వెళ్ళిపోతూ I don't want to get diseases from you" అంటూ చీత్కరింబడినపుడు ఇది గుర్తు రాలేదులే. పదేళ్ళ పిల్లలు కాదు ఆ మాటలు అంటున్నది వాళ్ళు ఇంట్లో  పెద్ద వాళ్ళు అలా అనుకునేది. covert racismఅనుకున్న నాది   జేనేరలైసెషన్లే. అది తప్పంటున్నావు, Tell me one thing do you really think that the exclusive white neghbourhood that you live in, the neghbourhood that you chose to be away from "the bloody indian ghettos we all asians create" as your wife put it so elegantly, do you really think that you are welcomed whole heartedly there? ఆవేశాన్ని ఆపుకోలేక హద్దులు మీరి అతిధ్యం ఇచ్చిన వారినే దూషిస్తున్నాను అన్నది ఒక పక్క అర్థమవుతూనే ఉన్నా ఆపుకోలేకపోయ్యాను.

"అలా కాదు ఎక్కడైనా సమాజంలో తప్పులు ఉంటాయి." 

"ఇది నిజమయిన పాయింట్. సో నీ వ్యవస్థలో తప్పొప్పులు ఉన్నాయి, ఉంటాయి మాలోనూ ఉన్నాయి ఉంటాయి. 
మరి ఒక వ్యవస్థ వెనుకబడి ఉంది అని ఎలా అంటావు?".....................


చర్చ అక్కడితో ఆగిపోయింది నా ఆవేశం హద్దు మీరుతోంది అని గమనించిన ఇంటి ఆడపడుచులు టాపిక్ డైవర్ట్ చెయ్యటంతో.


why do "educated" people, stick to one point of view always?

Why is it that people ignore longitudinal view for sake of cross sectional view?

why does it escape us that the pendulum always keep swinging and that one angle of the pendulum is no superior than any other angle of the pendulum?  




Pic from http://t2.gstatic.com/images?q=tbn:ANd9GcSIl2vt_m-TQkVTZwC4fshJcgNyzN8DqmNKFKuGCwQEiOIbAd33

Tuesday, 4 January 2011

इतनी बेवफा हम नहीं.

गले लगने की ख्वाईश
करे जो दिलो जान से पूरी
उन्हें दूर करने की कोशिश 
मैखाने की शान  नहीं साकी

खो ने दे इनकें बाहों में
बची यही इक मध् होशी
पथरीली ठंडक ही सही 
अन्दर की चिंगारी बुझे,शायद, साकी.

कायर कहो, लाचार कहो
नाम जितने भी दो बदनाम साकी
उनकी आख़री निशाँ के शान से 
मुह मोड़ ले, इतनी बेवफा हम नहीं.